
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ఆటగాడు యూకీ బాంబ్రీ రెండేళ్ల రెండు నెలల తర్వాత ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్–100లోకి వచ్చాడు. తైపీ చాలెంజర్ టైటిల్ నెగ్గిన అతడు ఏకంగా 22 స్థానాలు ఎగబాకి 83వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. తనకిదే కెరీర్ అత్యుత్తమం. ఇదిలాగే కొనసాగితే బాంబ్రీ... ఏటీపీ 1000 మాస్టర్స్ సిరీస్ టోర్నీలకు నేరుగా అర్హత సాధిస్తాడు. యూకీ మూడేళ్ల క్రితమే టాప్–100లోకి వచ్చినప్పటికీ గాయాల కారణంగా దానిని నిలబెట్టు కోలేకపోయాడు.
తాజా ర్యాంక్‌పై మాట్లాడుతూ ‘ఇదింకా ప్రారంభమే. చాలా దూరం పయనించాల్సి ఉంది. సవాళ్లను ఎదుర్కోవడం పైనే నా దృష్టి. టాప్–50 ర్యాంక్ గురించి ఆలోచించడం లేదు’ అని అన్నాడు. మరోవైపు బాంబ్రీ డేవిస్ కప్ సహచరుడు రామ్‌కుమార్ 17 స్థానాలు మెరుగుపర్చుకుని 116వ ర్యాంక్‌లో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment