తాష్కెంట్ చాలెంజర్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్‌లో యూకీ బాంబ్రీ–దివిజ్ శరణ్ (భారత్) జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–దివిజ్ జంట 3–6, 7–5, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో గిలెర్మో గార్సియా లోపెజ్–ఎన్రిక్ లోపెజ్ పెరెజ్ (స్పెయిన్) జోడీపై గెలిచింది. ఈ సీజన్‌లో ఏడు టోర్నీలు ఆడిన యూకీకిదే తొలి డబుల్స్ ఫైనల్ కాగా... దివిజ్‌కు రెండో ఫైనల్.
Comments
Please login to add a commentAdd a comment