
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులు యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్ శుభారంభం చేశారు. మెల్‌బోర్న్‌లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో యూకీ 1–6, 6–3, 6–4తో బ్రాడ్లీ షునెర్ (కెనడా)పై, రామ్‌కుమార్ 6–7 (8/10), 7–6 (7/3), 6–2తో బ్రాడ్లీ క్లాన్ (అమెరికా)పై గెలిచారు.
భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 6–1, 1–6, 2–6తో తొబియాస్ కామ్కే (జర్మనీ) చేతిలో... సుమీత్ నాగల్ 6–7 (5/7), 6–3, 3–6తో గియానెస్సి (ఇటలీ) చేతిలో ఓడిపోయారు.