Ramkumar
-
సెమీస్‌లో సాకేత్–రామ్ జోడీ
బెంగళూరు: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ... బెంగళూరు ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్ జంట 6–3, 6–3తో హైనెక్ బార్టన్ (చెక్ రిపబ్లిక్)–ఎరిక్ వాన్‌షెల్‌బోయిమ్ (ఉక్రెయిన్) జోడీపై గెలిచింది. 55 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్ తమ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో అనిరుధ్ చంద్రశేఖర్ (భారత్)–రే హో (చైనీస్ తైపీ) 7–6 (7/5), 7–5తో ప్రజ్వల్ దేవ్–ఆర్యన్ షా (భారత్)లపై, సిద్ధాంత్–పరీక్షిత్ సొమాని (భారత్) 7–5, 6–0తో బెర్నాడ్ టామిక్ (ఆ్రస్టేలియా)–నికోలస్ మెజియా (కొలంబియా)లపై, బ్లేక్ బేల్డన్–మాథ్యూ రోమియోస్ (ఆ్రస్టేలియా) 6–2, 6–4తో ఆదిల్ కల్యాణ్‌పూర్–కరణ్ సింగ్ (భారత్)లపై గెలుపొంది సెమీఫైనల్లోకి ప్రవేశించారు. -
పోరాడి ఓడిన మానస్, కరణ్..
బెంగళూరు: ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన మానస్ ధామ్నె, రామ్‌కుమార్ రామనాథన్... ‘క్వాలిఫ యర్’ హోదాలో అడుగు పెట్టిన కరణ్ సింగ్... బెంగళూరు ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో తొలి రౌండ్‌ను దాటలేకపోయారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మానస్ ధామ్నె 3–6, 6–3, 6–7 (3/7)తో పీటర్ బార్ బిర్యుకోవ్ (రష్యా) చేతిలో... కరణ్ సింగ్ 4–6, 6–4, 6–7 (3/7)తో జురిజ్ రొడియోనోవ్ (ఆ్రస్టియా) చేతిలో... రామ్‌కుమార్ రామనాథన్ 6–7 (3/7), 5–7తో షింటారో మొచిజుకి (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయారు.బిర్యుకోవ్‌తో 1 గంట 51 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 17 ఏళ్ల మానస్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. అయితే టైబ్రేక్‌లో మానస్ తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. రొడియోనోవ్తో 1 గంట 57 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కరణ్ 11 ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నిర్ణాయక టైబ్రేక్‌లో కరణ్ ఒత్తిడికి లోనై ఓటమి పాలయ్యాడు. షింటారోతో 1 గంట 48 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రామ్ 14 ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. -
ఫైనల్లో సాకేత్–రామ్ జోడీ
చెన్నై: కొత్త ఏడాదిలో ఆడుతున్న మూడో టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు మాజీ సభ్యుడు సాకేత్ మైనేని(Saket Myneni) టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌తో జత కట్టిన సాకేత్ చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి సెమీఫైనల్లో మూడో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ సాకేత్–రామ్‌కుమార్ (భారత్) ద్వయం 7–6 (7/5), 7–6 (10/8)తో టాప్ సీడ్ రే హో (చైనీస్ తైపీ)–మాథ్యూ క్రిస్టోఫర్ రోమియోస్ (ఆ్రస్టేలియా) జోడీపై సంచలన విజయం సాధించింది. 98 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్ ఐదు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. రెండు జోడీలు తమ సర్వీస్‌లను రెండేసి సార్లు కోల్పోయాయి. అయితే టైబ్రేక్‌లో మాత్రం సాకేత్–రామ్ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో షింటారో మొచిజుకి–కైటో యుసుగి (జపాన్) జోడీతో సాకేత్–రామ్ ద్వయం తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో మొచిజుకి–యుసుగి జంట 4–6, 6–4, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ జీవన్ నెడుంజెళియన్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జోడీపై గెలిచింది. -
భారత్ 0 స్వీడన్ 2
స్టాక్‌హోమ్: డేవిస్‌కప్ టీమ్ టెన్నిస్ టోర్నీ వరల్డ్ గ్రూప్–1లో భాగంగా స్వీడన్ జట్టుతో శనివారం మొదలైన మ్యాచ్‌లో తొలి రోజు భారత్‌కు నిరాశ ఎదురైంది. ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ భారత క్రీడాకారులకు ఓటమి ఎదురైంది. 2–0తో ఆధిక్యంలోకి వెళ్లిన స్వీడన్ నేడు జరిగే ఒక డబుల్స్ మ్యాచ్, రెండు రివర్స్ సింగిల్స్‌లలో ఒక విజయం సాధిస్తే గెలుపును ఖరారు చేసుకుంటుంది. వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు కూడా అర్హత సాధిస్తుంది. తొలి సింగిల్స్‌లో ‘డబుల్స్ స్పెషలిస్ట్’ శ్రీరామ్ బాలాజీ 4–6, 2–6తో ప్రపంచ 238వ ర్యాంకర్ ఇలియాస్ యెమెర్ చేతిలో ఓడిపోగా... రెండో సింగిల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్ 3–6, 3–6తో లియో బోర్గ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ వెన్నునొప్పితో స్వీడన్‌తో పోరు నుంచి వైదొలిగాడు. దాంతో సుమిత్ స్థానంలో శ్రీరామ్‌ను ఆడించాల్సి వచ్చింది. నేడు జరిగే మూడు మ్యాచ్‌ల్లో భారత్ గెలిస్తేనే వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు అర్హత పొందుతుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి... ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందడం రెండుసార్లు (2010లో బ్రెజిల్‌పై, 2018లో చైనాపై) మాత్రమే జరిగింది. -
సాకేత్–రామ్‌కుమార్ జోడీకి టైటిల్
ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ స్టార్, భారత డేవిస్‌కప్ ప్లేయర్ సాకేత్ మైనేని ఖాతాలో 16వ ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ చేరింది. రామ్‌కుమార్ రామనాథన్‌తో జోడీ కట్టిన సాకేత్ చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నమెంట్లో డబుల్స్ విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ జంట 3–6, 6–3, 10–5తో భారత్‌కే చెందిన రిత్విక్ చౌదరి– నిక్కీ పునాచా ద్వయంపై గెలుపొందింది. సాకేత్ జోడీ ఒక ఏస్ సంధించగా, 2 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ఆఖరిదాకా పోరాడిన రిత్విక్–నిక్కీ జంట 2 ఏస్‌లు సంధించి ఒకసారి డబుల్ ఫాల్ట్ చేసింది. మరో వైపు ఇదే టోర్నీ సింగిల్స్‌లో భారత స్టార్ ప్లేయర్ సుమిత్ నగాల్ టైటిల్ పోరుకు అర్హత సంపాదించాడు. సెమీఫైనల్లో 26 ఏళ్ల నగాల్ 6–3, 6–4తో చెక్ రిపబ్లిక్కు చెందిన డలిబర్ విర్సినాపై విజయం సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో సుమిత్... ఇటలీ ఆటగాడు లుకా నర్డితో తలపడతాడు. మరో సెమీస్‌లో లుకా నర్డి 6–4, 4–6, 7–6 (8/6)తో చున్ సిన్ సెంగ్ (చైనీస్ తైపీ)పై చెమటోడ్చి నెగ్గాడు. -
రష్మిక జోడీకి డబుల్స్ టైటిల్... సింగిల్స్ చాంపియన్ రామ్‌కుమార్
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో భారత క్రీడాకారులు రాణించారు. అహ్మదాబాద్‌లో జరిగిన వరల్డ్ టెన్నిస్ టూర్ టో ర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక భారత్‌కే చెందిన వైదేహితో కలిసి టైటిల్ సొంతం చేసుకుంది. డబుల్స్ ఫైనల్లో రష్మిక –వైదేహి ద్వయం 6–1, 6–2తో సోహా సాదిక్–ఆకాంక్ష (భారత్) జోడీపై గెలిచింది. 55 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రష్మిక జోడీ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. సింగిల్స్ విభాగంలో రష్మిక పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. మరోవైపు కర్ణాటకలోని గుల్బర్గాలో జరిగిన ఐటీఎఫ్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ విజేతగా అవతరించాడు. ఫైనల్లో రామ్‌కుమార్ 6–2, 6–1తో డేవిడ్ పిచ్లార్ (ఆ్రస్టియా)పై నెగ్గాడు. రెండు నెలల వ్యవధిలో రామ్‌కుమార్‌కిది మూడో ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. -
సాకేత్ జోడీకి పతకం ఖాయం
ఆసియా క్రీడల టెన్నిస్‌లో బుధవారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో సుమిత్ నగాల్, మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–1, 7–6 (10/8)తో జిజెన్ జాంగ్–యిబింగ్ వు (చైనా) జంటను ఓడించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్‌కిది ఆసియా క్రీడల్లో మూడో పతకం కానుంది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో సాకేత్ పురుషుల డబుల్స్‌లో రజతం, మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణం సాధించాడు. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సుమిత్ నగాల్ 7–6 (7/3), 1–6, 2–6తో టాప్ సీడ్ జిజెన్ జాంగ్ (చైనా) చేతిలో, అంకిత రైనా 6–3, 4–6, 4–6తో హరూకా కాజి (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయారు. -
నటుడు ప్రభు ఇంట ఆస్తి వివాదం.. కోర్టును ఆశ్రయించిన తోబుట్టువులు
ప్రముఖ నటుడు ప్రభు తమని మోసం చేశాడంటూ ఆయన తోబుట్టువులు కోర్టును ఆశ్రయించారు. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండ మోసం చేశారని ఆరోపిస్తూ ప్రభు, ఆయన సోదరుడు రామ్‌కుమార్‌లపై వారిద్దరి సోదరిమణులు శాంతి, రజ్వీలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా నటుడు ప్రభు, నిర్మాత రామ్‌కుమార్‌లు దిగ్గజ నటుడు, నడిగర్ తిలకం శివాజీ గణేశన్ కుమారులనే సంగతి తెలిసిందే. వీరితో పాటు ఆయనకు శాంతి, రజ్వీ కూమార్తెలు కూడా ఉన్నారు. అయితే శివాజి గణేశన్ చనిపోయిన 20 ఏళ్లకు ఆయన కుటుంబంలో ఆస్తి వివాదం నెలకొంది. దీంతో ఇది కాస్తా కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండా తమ సోదరులైన ప్రభు, రామ్‌కుమార్‌లు మోసం చేశారని ఆరోపిస్తూ శాంతి, రజ్వీలు మద్రాస్ హైకోర్టులో పటిషన్ దాఖలు చేశారు. తండ్రి మరణం తర్వాత 271 కోట్ల రూపాయల ఆస్తిని సరిగ పంచలేదని, తమని మోసం చేసి పూర్తి ఆస్తిని తమ సోదరులిద్దరే కాజేశారని వారు పటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు తమకు తెలియకుండ ఆస్తులను కూడా విక్రయించారని, ఆ ప్రక్రియ చెల్లదని ప్రకటించాలని వారు కోర్టును కోరారు. అదే విధంగా వెయ్యి తులాల బంగారు నగలు, 500 కిలోల వెండి వస్తువులను ప్రభు , రామ్ కుమార్ అపహరించడమే కాకుండా శాంతి థీయేటర్లో ఉన్న రూ. 82 కోట్ల విలువైన వాటాను రహస్యంగా వారిద్దరి పేరిట మార్చుకున్నట్లు వారు ఆరోపించారు. తమ తండ్రి రాసినట్లు చెబుతున్న వీలునామా నకిలీదని.. జనరల్ పవర్ ఆఫ్ ఆటార్నీపై సంతకం తీసుకుని తమని మోసం చేశారని వారు తెలిపారు. ఈ కేసులో నటుడు ప్రభు, నిర్మాత రామ్కుమార్ల పేర్లను మాత్రమ కాకుండా వారి కుమారులైన విక్రమ్ ప్రభు, దష్యంత్‌లను కూడా ప్రతివాదులుగా చేర్చి పిటిషన్లో వారి పేర్లను పేర్కొన్నారు. చదవండి: తంతడి బీచ్‌లో నాగచైతన్య సందడి నటి సాయి పల్లవికి హైకోర్టులో ఎదురుదెబ్బ -
భళా బోపన్న... అడిలైడ్ ఓపెన్ డబుల్స్ టైటిల్ సొంతం
అడిలైడ్: నాలుగు పదుల వయసు దాటినా తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపిస్తూ భారత వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన కెరీర్లో 20వ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన అడిలైడ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో రోహన్ బోపన్న–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జంట చాంపియన్‌గా నిలిచింది. 81 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ బోపన్న–రామ్‌కుమార్ ద్వయం 7–6 (8/6), 6–1తో టాప్ సీడ్ మార్సెలో మెలో (బ్రెజిల్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీపై సంచలన విజయం సాధించింది. బెంగళూరుకు చెందిన 41 ఏళ్ల బోపన్న కెరీర్లో ఇది 20వ డబుల్స్ టైటిల్. 2020లో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)తో కలసి దోహా ఓపెన్ టైటిల్ సాధించాక బోపన్న ఖాతాలో చేరిన మరో టైటిల్ ఇదే కావడం విశేషం. మరోవైపు చెన్నైకి చెందిన 27 ఏళ్ల రామ్‌కుమార్ కెరీర్లో ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్లో బోపన్న–రామ్‌కుమార్ కలసి ఆడటం ఇదే ప్రథమం. 55 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను నిలబెట్టుకున్నాయి. దాంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో భారత జోడీ పైచేయి సాధించి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో మాత్రం భారత జంట ఆధిపత్యం కనబరిచింది. రెండుసార్లు ప్రత్యర్థి జోడీ సర్వీస్‌లను బ్రేక్ చేసి తమ సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. విజేతగా నిలిచిన బోపన్న–రామ్‌కుమార్ జంటకు 18,700 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 13 లక్షల 89 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. నేడు మొదలయ్యే అడిలైడ్ ఓపెన్–2 టోర్నీలో రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్)తో కలసి బోపన్న బరిలో దిగుతుండగా... మరోవైపు రామ్‌కుమార్‌తోపాటు భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్, యూకీ బాంబ్రీ మెల్బోర్న్లో జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడనున్నారు. చదవండి: సాయిప్రణీత్‌కు కరోనా పాజిటివ్ -
రెండో రౌండ్లో ప్రజ్నేశ్
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం చేయగా... రామ్‌కుమార్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా కూడా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రజ్నేశ్ 6–2, 6–4తో హ్యారీ బుర్చియెర్ (ఆ్రస్టేలియా)పై గెలుపొందగా... రామ్‌కుమార్ 6–4, 4–6, 1–6తో ఫెడెరికో కొరియా (అర్జెంటీనా) చేతిలో ఓడిపోయాడు. అంకిత రైనా 2–6, 6–7 (2/7)తో విక్టోరియా తొమోవా (బల్గేరియా) చేతిలో పరాజయం పాలైంది. -
ఇద్దరూ చేతులెత్తేశారు
కోల్‌కతా: భారత టెన్నిస్ బృందం వ్యూహం పని చేయలేదు. క్లే, హార్డ్ కోర్టులపై అద్భుతంగా ఆడే ఇటలీ ఆటగాళ్లకు అంతగా అలవాటు లేని పచ్చిక కోర్టులను మ్యాచ్‌ల కోసం ఎంచుకున్నా మనకు కలిసి రాలేదు. డేవిస్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ భారత ఆటగాళ్లకు ఓటమి తప్పలేదు. రామ్‌కుమార్ రామనాథన్ 71 నిమిషాల్లో ఆండ్రియా సెప్పి చేతిలో... ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 57 నిమిషాల్లో మాటియో బెరెటిని చేతిలో ఓడిపోయారు. ఫలితంగా తొలి రోజే ఇటలీ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. నేడు జరిగే డబుల్స్, రెండు రివర్స్ సింగిల్స్‌లలో ఒక దాంట్లోనైనా నెగ్గితే ఇటలీ ఈ ఏడాది నవంబర్‌లో జరిగే డేవిస్ కప్ ఫైనల్స్ టోర్నీకి బెర్త్ ఖాయం చేసుకుంటుంది. ఆతిథ్య భారత్ మాత్రం ఫైనల్స్‌కు చేరాలంటే మూడు మ్యాచ్‌ల్లోనూ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. తొలి సింగిల్స్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్ ఆండ్రియా సెప్పి 6–4, 6–2తో ప్రపంచ 129వ ర్యాంకర్ రామ్‌కుమార్‌ను ఓడించి ఇటలీకి 1–0 ఆధిక్యాన్ని అందించాడు. రామ్‌కుమార్ ఎనిమిది ఏస్‌లు సంధించినా, ఆరు డబుల్ ఫాల్ట్‌లు కూడా చేశాడు. నెట్ వద్దకు 24సార్లు దూసుకొచ్చిన రామ్‌కుమార్ ఆరుసార్లు మాత్రమే పాయింట్లు గెలిచాడు. 25 అనవసర తప్పిదాలు చేసిన అతను సెప్పి సర్వీస్‌ను బ్రేక్ చేసేందుకు రెండుసార్లు అవకాశాలు సృష్టించుకున్నా వాటిని సద్వినియోగం చేసుకోలేదు. మరోవైపు సెప్పి మూడుసార్లు రామ్‌కుమార్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. రెండో సింగిల్స్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 102వ ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 4–6, 3–6తో ప్రపంచ 50వ ర్యాంకర్, డేవిస్ కప్‌లో తొలిసారి ఆడుతున్న మాటియో బెరెటిని చేతిలో ఓటమి చవిచూశాడు. ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో ఆడిన ప్రజ్నేశ్ డేవిస్ కప్‌లో మాత్రం తడబడ్డాడు. మ్యాచ్ మొత్తం లో ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయిన ప్రజ్నేశ్ ప్రత్యర్థి సర్వీస్‌లో ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశాన్ని దక్కించుకోలేదు. అయితే.. ప్రజ్నేశ్ తన సర్వీస్‌ను మాత్రం మూడుసార్లు కోల్పోయాడు. ‘నేడు జరిగే మూడు మ్యాచ్‌లపై దృష్టి సారిస్తాం. ఈ మూడింట్లో గెలిస్తేనే ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధిస్తామన్న సంగతి తెలుసు. ఇటలీలాంటి మేటి జట్టుతో ఆడే సమయంలో అందివచ్చిన అవకాశా లను అనుకూలంగా మల్చుకోవాలి. అలా చేయకపోతే మూల్యం చెల్లించుకుంటాం. భారత ఆటగాళ్ల విషయంలో అదే జరిగింది’ అని భారత నాన్ ప్లే యింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి వ్యాఖ్యానించాడు. -
రామ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
-
హగ్ ఇస్తుంటే కంగారుపడ్డాడు
ఈ రోజుల్లో యువతీ యువకులు అభినందించుకోవడంలో భాగంగా కౌగిలించుకోవడం సర్వసాధారణమైన విషయం. ఇక సినీరంగంలో అయితే చెప్పనక్కర్లేదు. అయితే అలా ఇక హీరోయిన్ దర్శకుడికి హగ్ ఇస్తుంటే ఆయన కంగారు పడి తప్పించుకున్నాడు. ఇంతకీ ఆ హీరోయిన్, దర్శకుడు ఎవరనేగా మీ ఆసక్తి. అది సంచలన నటి అమలాపాల్, యువ దర్శకుడు రామ్‌కుమార్. ఈ దర్శకుడి చిత్రం రాక్షసన్‌లో నటి అమలాపాల్ హీరోయిన్గా నటించింది. ఇటీవల జరిగిన ఈ చిత్ర సక్సెస్ మీట్లో తాను దర్శకుడికి హగ్ ఇవ్వబోతే ఆయన కంగారు పడి తప్పించుకున్నారని నటి అమలాపాల్ స్వయంగా చెప్పింది. దీని గురించి ఈ అమ్మడు చెబుతూ 'దర్శకుడు రామ్ చాలా మంచి వ్యక్తి. అంతే కాదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. రాక్షసన్ చిత్రం కోసం చాలా కష్టపడ్డాం. చిత్ర షూటింగ్ పూర్తి కాగానే హమ్మయ్య పూర్తి అయ్యింది అని సంతోషంతో దర్శకుడు రామ్‌కుమార్‌ను హగ్ చేసుకోబోయాను. ఆయన కాస్త కంగారు పడి వెనక్కు వెళ్లారు. ఆయన ముండాసిపట్టి చిత్రం సక్సెస్ తరువాతనే పెళ్లి చేసుకోవలసింది. ఈ రాక్షసన్ చిత్రం తరువాత ఆయనకు పిల్ల దొరకడం కష్టమే అంటూ నవ్వుతూ సెటైర్ వేసింది. నిజంగా రామ్ చాలా మంచి వ్యక్తి. ఆయనకు త్వరలోనే మంచి జీవిత భాగస్వామి లభిస్తుందని భావిస్తున్నాను. రాక్షసన్ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇకపోతే ఇప్పుడు మీటూ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిజానికి దీని గురించి ట్వీట్ చేసిన మొదటి వ్వక్తిని నేనే. గత ఫిబ్రవరిలో లైంగికవేధింపులు ఎదురైనప్పుడు నేను మీటూ అని ట్వీట్ చేశాను. ఆ తరువాతే మీటూ అంతర్జాతీయంగా పాచుర్యం అయ్యింది. మీటూ అనేది ఒక మంచి విషయం. ఇది ఇంకా విస్తరించాలి. 18 ఏళ్ల వయసులోనే ఈ రంగంలోకి వచ్చాను. నటించడానికి వచ్చినప్పుడే ప్రముఖ నటిని కావాలని అనుకున్నాను. అయితే ఆ పేరు తెచ్చుకోవడానికి 8 ఏళ్లు పట్టింది. మంచి నటిగా పేరు తెచ్చుకోవడమే నాకు ఇష్టం. ఇకపై నటనకు బ్రేక్ ఇవ్వను. చిత్రపరిశ్రమనే నాకు తల్లి. చిత్రాలను ఆస్వాదిస్తూ నటిస్తా' అని పేర్కొంది. -
రెండో రౌండ్లో యూకీ, రామ్‌కుమార్
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్ శుభారంభం చేశారు. మెల్బోర్న్లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో యూకీ 1–6, 6–3, 6–4తో బ్రాడ్లీ షునెర్ (కెనడా)పై, రామ్‌కుమార్ 6–7 (8/10), 7–6 (7/3), 6–2తో బ్రాడ్లీ క్లాన్ (అమెరికా)పై గెలిచారు. భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 6–1, 1–6, 2–6తో తొబియాస్ కామ్‌కే (జర్మనీ) చేతిలో... సుమీత్ నాగల్ 6–7 (5/7), 6–3, 3–6తో గియానెస్సి (ఇటలీ) చేతిలో ఓడిపోయారు. -
రామ్‌కుమార్ శుభారంభం
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో భారత ఆశాకిరణం రామ్‌కుమార్ రామనాథన్ శుభారంభం చేశాడు. 148వ ర్యాంకర్ రామ్‌కుమార్ తొలి రౌండ్లో 7–6 (7/4), 6–2తో తనకన్నా మెరుగైన కార్బలెస్ బయెనా (స్పెయిన్; 106వ ర్యాంకు)ను కంగుతినిపించాడు. మంగళవారం జరిగే రెండో రౌండ్లో అతనికి క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు. ప్రపంచ ఆరో ర్యాంకర్, టోర్నీ ఫేవరెట్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)తో రామ్‌కుమార్ తలపడనున్నాడు. డబుల్స్‌లో హైదరాబాద్ ఆటగాడు విష్ణువర్ధన్ జోడీకి తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ పొందిన విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ జోడీ 6–3, 6–7 (6/8), 6–10తో అదిల్ షమస్దిన్(కెనడా)–నీల్ స్కప్‌స్కీ (అమెరికా) జంట చేతిలో ఓడింది. -
సింగిల్స్‌లో జిగేల్
అలవోకగా నెగ్గిన యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ భారత్‌కు 2–0 ఆధిక్యం న్యూజిలాండ్‌తో డేవిస్ కప్ మ్యాచ్ ఎలాంటి సంచలనాలు చోటు చేసుకోలేదు. అంతా ఏకపక్షమే. సొంతగడ్డపై భారత టెన్నిస్ ఆటగాళ్లు మరోసారి మెరిశారు. ఫలితంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 పోటీలో మొదటిరోజే భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లోనూ గెలిస్తే భారత్ విజయం ఖాయమవుతుంది. అపుణే: పూర్తిస్థాయి ఫిట్నెస్ సంతరించుచున్న యూకీ బాంబ్రీ... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రామ్‌కుమార్ రామనాథన్ డేవిస్‌కప్‌లో భారత్‌కు శుభారంభాన్ని ఇచ్చారు. న్యూజిలాండ్‌తో శుక్రవారం మొదలైన ఆసియా ఓసియానియా గ్రూప్–1 తొలి రౌండ్లో భాగంగా తొలి రోజు శుక్రవారం జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లు జయభేరి మోగించారు. తొలి సింగిల్స్‌లో యూకీ 6–4, 6–4, 6–3తో ఫిన్ టియర్నీపై గెలుపొందగా... రెండో సింగిల్స్‌లో రామ్‌కుమార్ 6–3, 6–4, 6–3తో జోస్ స్థాతమ్‌ను ఓడించాడు. ఈ విజయాలతో భారత్ 2–0తో ఆధిక్యాన్ని సంపాదించింది. శనివారం డబుల్స్ మ్యాచ్‌లో లియాండర్ పేస్–విష్ణువర్ధన్ జంట బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గితే భారత్ ఏప్రిల్‌లో ఆసియా ఓసియానియా రెండో రౌండ్ పోటీలకు అర్హత పొందుతుంది. ఫిన్ టియర్నీతో 3 గంటల 14 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో యూకీ ఆరంభంలో 1–3తో వెనుకబడ్డాడు. అయితే వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి 5–3తో ఆధిక్యంలోకి వచ్చాడు. తొమ్మిదో గేమ్‌లో టియర్నీ సర్వీస్ నిలబెట్టుకోగా, పదో గేమ్‌లో యూకీ తన సర్వీస్‌ను కాపాడుకొని తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్ మొదట్లో యూకీ మళ్లీ తడబడి వెంటనే పుంజుకున్నాడు. మూడో సెట్లో టియర్నీ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసిన యూకీ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో యూకీ ఐదు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. మరోవైపు జోస్ స్థాతమ్‌తో గంటా 52 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రామ్‌కుమార్ ఏకంగా 15 ఏస్‌లు సంధించాడు. అయితే సర్వీస్‌లో కాస్త తడబడి ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. కానీ తన సర్వీస్‌లో ఒక్క బ్రేక్ పాయింట్ కూడా ఇవ్వని రామ్... ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసి తన డేవిస్ కప్ కెరీర్లో రెండో విజయాన్ని నమోదు చేసుకున్నాడు. -
దుబాయ్‌లో మన అరుదైన నోటు
ఒకప్పుడు భారత్‌లో రూ. పదివేలు నోటు కూడా చలామణిలో ఉండేది. 1978లో అప్పటి జనతా ప్రభుత్వం ఈ నోటును రద్దుచేసింది. తాజాగా మోదీ ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు చేసిన నేపథ్యంలో దుబాయ్‌లో ఇప్పుడు ఈ పెద్దనోటు హల్చల్ చేస్తోంది. దుబాయ్‌లో నివసిస్తున్న భారత సంతతి వాసి రామ్‌కుమార్ ప్రస్తుతం ఈ పదివేల నోటును ప్రదర్శనకు పెట్టారు. వృత్తిరీత్య న్యూమిస్మేటిస్ట్ (అరుదైన కరెన్సీ, నాణెల సేకరణకర్త) అయిన ఆయన గత ఏడాది భారత్‌లో ఓ కలెక్టర్ వద్ద నుంచి ఈ అరుదైన నోటును సేకరించినట్టు తెలిపారు. 1978లో భారత రిజర్వు బ్యాంకు పదివేల నోట్లను రద్దుచేసేనాటికి కేవలం 346 నోట్లు మాత్రమే చలామణిలో ఉండేవి. అందులో పదివేల నోట్లు పదిమాత్రం ఆర్బీఐకి చేరలేదు. ప్రస్తుతం ఇవి అరుదైన జ్ఞాపకాలు మిగిలిపోగా.. అందులో దుబాయ్‌లో దర్శనమిచ్చే ఏకైక పదివేల నోటు ఇదేనని రామ్‌కుమార్ తెలిపారు. పదివేల నోటును సేకరించాలన్న కల తనకు ఎప్పటి నుంచో ఉండేదని, అతికష్టం మీద భారత్‌లో ఓ కలెక్టర్ నుంచి దీనిని సేకరించానని, దీని ప్రస్తుత విలువ ఎంత అంటే తాను ఇప్పుడు చెప్పలేనని ఆయన పేర్కొన్నారు. -
నెగటివ్‌గా రాయకండి ప్లీజ్
దయచేసి చిత్రాల గురించి నెగిటివ్‌గా రాయకండి అంటూ సీనియర్ నటుడు, నడిగర్ తిలకం శివాజీగణేశన్ వారసుడు ప్రభు మీడియాకు విజ్ఞప్తి చేశారు. బుధవారం పత్రికల వారితో ముచ్చటించిన ఆయన ప్రస్తుతం చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు మీకు తెలియనివి కాదని, సినిమాను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని పేర్కొన్నారు. ప్రేక్షకులు సినిమాలు చూడడానికి థియేటర్లకు రావడమే కష్టం అయిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా విమర్శలు రాసేటప్పుడు నెగిటివ్‌గా రాయరాదని విన్నవించారు. విమర్శలు చేయండి తప్పొప్పులను రాయండి కానీ చిత్రం చెత్తగా ఉంది లాంటి పదాలు చేర్చడం వల్ల ప్రేక్షకులు థియేటర్ల వైపే రావడం లేదన్నారు. ఈ తరం నటీనటులు, సాంకేతికవర్గం మంచి చిత్రాలు చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. పత్రికల వారితో తనకున్న అనుబంధంతో ఈ సూచన చేస్తున్నానని పేర్కొన్నారు. ఇక తాను ప్రస్తుతం నటించడం తగ్గించుకున్నానని, మంచి పాత్రలు అనిపిస్తే చేయడానికి అంగీకరిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం తన అన్నయ్య కొడుకు దుశ్యంత్ రామ్‌కుమార్ నిర్మాతగా మారి ఈశన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న మీన్‌కొళంబుం మణ్ పానైయం చిత్రంలో మాత్రమే నటిస్తున్నానని, ఇందులో నటుడు కమలహాసన్ అతిథి పాత్రలో కనిపించనున్నారని తెలిపారు. తన కొడుకు విక్రమ్ ప్రభు నటించిన వీరశివాజీ నవంబర్ తొలివారంలో విడుదల కానుందని తెలిపారు. తదుపరి సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ముడిచూడ మన్నన్ చిత్రంతో పాటు, తను నిర్మాతగా మారి ఫస్ట్ ఆర్టిస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న నెరుప్పుడా చిత్రంలోనూ నటిస్తున్నారని తెలిపారు.ఈ సమావేశంలో నటుడు విక్రమ్‌ప్రభు, రామ్‌కుమార్ పాల్గొన్నారు. -
హిందూధర్మంపై దాడులు అరికట్టాలి
రాజమహేంద్రవరం కల్చరల్ : హిందూధర్మంపై బహుముఖ దాడులు జరుగుతున్నాయని, వాటిని అరికట్టకపోతే హిందువుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని సమరసత సేవా ఫౌండేష¯ŒS ప్రాంత కార్యదర్శి రాంకుమార్ అన్నారు. సమరసత ఫౌండేషన్ జిల్లాశాఖ, సామాజిక సమరసత వేదిక, వికాస తరంగిణి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రాజమహేంద్రవరంలోని రామానుజ కూటమిలో జిల్లాస్థాయి సదస్సు జరిగింది. రాం కుమార్ మాట్లాడుతూ అన్ని మండలాలలో ’ధర్మరక్షక్’ కార్యకర్తలను నియమిస్తామని, దేవాలయాలు ధర్మప్రచార కేంద్రాలుగా పనిచేయడానికి కృషి చేస్తామన్నారు. ప్రతి పల్లెలో, దళిత, గిరిజన వాడల్లో ఆలయాలు, భజన మందిరాలు నిర్మించుకోవాలని, భజన సంకీర్తన గురువులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి హిందువు తన ఇంటిపై హనుమద్ధ్వజం ఎగురవేయాలన్నారు. సమరసత ఫౌండేష¯ŒS ద్వారా జరిగే ఈ మహోద్యమంలో ప్రతిహిందువు భాగస్వామి కావాలని, ఫౌండేష¯ŒS ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. వివరాలకు హిందూ హెల్ప్‌లై¯ŒS టోల్‌ఫ్రీ నంబరు 1800 599 2399ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ప్రాంత సంయోజక్ శ్యాం ప్రసాద్, జిల్లా ధర్మ ప్రచారక్ కర్?ర శ్రీనివాసరావు, బండ్ల శంకర్ పాల్గొన్నారు. -
నిఘా నీడలో పోస్టుమార్టం
సాక్షి, చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్ మృతదేహానికి ఎట్టకేలకు శనివారం పోస్టుమార్టం జరిగింది. ఈ ప్రక్రియ ఐదుగురు వైద్యులతో కూడిన బృందం తో పాటు తిరువళ్లూరు మెజిస్ట్రేట్ తమిళ్ సెల్వి సమక్షంలో జరిగింది. పూర్తిగా వీడియో చిత్రీకరణ చేశారు. ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసులో నిందితుడిగా పట్టుబడ్డ రామ్‌కుమార్ గత నెల పుళల్ కేంద్ర కారాగారంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, తనయుడి మృతిలో అనుమానం ఉందంటూ రామ్‌కుమార్ తండ్రి పరమశివం కోర్టు మెట్లు ఎక్కడంతో పోస్టుమార్టం వాయిదా పడుతూ వచ్చింది. దీంతో మృత దేహాన్ని చెన్నై రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పది రోజులకు పైగా ఉంచాల్సి వచ్చింది. ఎట్టకేలకు పరమశివం తరఫు వాదనల్ని కోర్టు పక్కన పెట్టడంతో పోస్టుమార్టం నిర్వహణకు తగ్గ చర్యలు చేపట్టారు. కోర్టు ఆదేశాల మేరకు ఐదుగురు వైద్యులతో కూడిన బృందం రంగంలోకి దిగింది. ఆ మేరకు శనివారం నిఘా నీడలో రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. నిఘానీడలో: రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహణ సమాచారంతో అందరి దృష్టి రాయపేట ప్రభుత్వ ఆసుపత్రి మీద పడింది. దీంతో ఆ పరిసరాల్లో క ట్టుదిట్టమైన భ ద్రతా ఏర్పాట్లు చేశారు. పది గంటల సమయంలో తిరువళ్లువర్ మెజిస్ట్రేట్ తమిళ్ సెల్వం సమక్షంలో రామ్‌కుమార్ మృతదేహాన్ని పరమశివం గుర్తించారు. ఈ సమయంలో వీసీకే నేత తిరుమావళవన్, న్యాయవాది రామ్రాజ్ అక్కడే ఉన్నారు. తదుపరి మెజిస్ట్రేట్ సమక్షంలో మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. గొంతు, చాతి మీద గాయాలు ఉండడాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నివేదికలో ఆ గాయాలకు గల కారణాలను ప్రత్యేకంగా పరిశీలించే విధంగా వైద్య బృందానికి ఆదేశాల్ని మెజిస్ట్రేట్ జారీ చేశారు. పదిన్నర గంటల సమయంలో ఎయిమ్స్ వైద్యుడు డాక్టర్ కదిర్ కె.గుప్తా, రాయపేట, కీల్పాకం, స్టాన్లీ ఆసుపత్రులు వైద్యులు వినోద్, సెల్వకుమార్, మణి గండన్, రాజులతో కూడిన బృందం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. గంటన్నర పాటు సాగిన ఈ ప్రక్రియను రెండు కెమెరాల ద్వారా పూర్తిగా వీడియో చిత్రీకరించారు. వాగ్వివాదం: మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ముందుగా వైద్యులతో రామ్‌కుమార్ తరఫు న్యాయవాదులు వాగ్యుద్దానికి దిగారు. కోర్టు తమకు కల్పించిన అవకాశం మేరకు పోస్టుమార్టం నివేదిక నకలు, వీడియో దృశ్యాలు, ఫొటోలను తమకు పోస్టుమార్టం పూర్తయిన గంటన్నరలోపు ఇవ్వాల్సిందిగా వైద్యులకు సూచించారు. ఇందుకు వైద్య బృందం నిరాకరించడంతో వాగ్యుద్ధం చోటు చేసుకుంది. చివరకు వీసీకే నేత తిరుమావళవన్ జోక్యం చేసుకుని, రాత్రిలోపు తమకు సమర్పించాలని సూచించారు. లేని పక్షంలో మృతదేహాన్ని తీసుకోబోమని స్పష్టం చేశారు. అవసరం అయితే, రీ పోస్టుమార్టం చేయొచ్చని సూచించారు. తమకు అన్ని ప్రక్రియల్ని త్వరితగతిన ముగించి నకలు పత్రాలను చేతికిచ్చినప్పుడే మృతదేహానికి తీసుకుంటామని తేల్చారు. దీంతో పోస్టుమార్టం అనంతరం మృతదేహం మళ్లీ మార్చురీకి పరిమితమైంది. -
ఒకటిలోగా పోస్టుమార్టం నిర్వహించండి
టీనగర్: స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్‌కుమార్ మృతదేహం పోస్టుమార్టం అక్టోబరు ఒకటవ తేదీలోగా నిర్వహించి, ఈనెల 30వ తేదీ వరకు మృతదేహాన్ని భద్రపరచాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. స్వాతి హత్య కేసులో అరెస్టయి పుళల్ జైల్లో ఉంచిన రామ్‌కుమార్ ఈనెల 18న విద్యుత్ వైరును కొరికి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే. అతని మృతదేహానికి ఆరు రోజులుగా పోస్టుమార్టం నిర్వహించకుండా రాయపేట ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ఇలావుండగా రామ్‌కుమార్ మృతిపై అనుమానం ఉన్నట్లు, పోస్టుమార్టంలో తమ తరఫు వైద్యుని అనుమంతించాలని కోరుతూ రామ్‌కుమార్ తండ్రి పరమశివన్ దాఖలు చేసిన కేసులో ముగ్గురు న్యాయమూర్తులు విభిన్నంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఉత్తర్వుల్లో పోస్టుమార్టంకు నలుగురు ప్రభుత్వ వైద్యులు, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఒకరిని నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇందులో రామ్‌కుమార్ తండ్రి తరఫు కోర్కెను ముగ్గురు న్యాయమూర్తుల తీర్పులో నెరవేరని కారణంగా శుక్రవారం ఐదుగురు న్యాయమూర్తులు ఈ కేసును విచారించాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి విన్నవించారు. ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు న్యాయమూర్తుల ఉత్తర్వుల తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. అంతవరకు పోస్టుమార్టంను నిలిపివేయాలని రామ్‌కుమార్ తరఫు వాదనను ముందుంచారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి బదులిస్తూ ఇదివరకే కేసులో ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తులను సంప్రదించాల్సిందిగా సూచించారు. దీంతో రామ్‌కుమార్ తండ్రి తరషు లాయర్లు న్యాయమూర్తి కృపాకరన్‌కు అప్పీల్ చేశారు. ఆ సమయంలో రామ్‌కుమార్ తరఫున ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులపై నమ్మకం లేదని తెలిపారు. అందుకు న్యాయమూర్తి అనేక కేసుల్లో ఎయిమ్స్ వైద్యులు వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన విషయం మరువలేమని తెలిపారు. అనంతరం ఆయన జోక్యం చేసుకుంటూ ఈ కేసులో రాజకీయ పక్షాలు తలదూర్చుతున్నాయని, ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు. అనంతరం రామ్‌కుమార్ తండ్రి వద్ద అభిప్రాయాన్ని సేకరించేందుకు పిలిపించారు. అందుకు శంకరసుబ్బు తమరు అతని కోసమే వాదిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం తరఫున ఏ సమాధానం ఇస్తున్నారని ప్రశ్నించారు. అందుకు ప్రభుత్వ న్యాయవాది బదులిస్తూ రాయపేట ప్రభుత్వ ఆస్పత్రిలో రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం చేయనందున మిగతా పోస్టుమార్టం పనులు స్తంభించిపోయినట్లు పేర్కొన్నారు. ఇదివరకే రామ్‌కుమార్ తండ్రి తరపు ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించడాన్ని, అందుకాయన సుప్రీంకోర్టును సంప్రదించాల్సిందిగా సూచించినట్లు పేర్కొన్నారు. దీన్ని విన్న న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తిని కలిసి తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలిపారు. తర్వాత ఆయన ప్రధాన న్యాయమూర్తితో సమాలోచన జరిపిన రామ్‌కుమార్ మృతదేహాన్ని ఈ నెల 30వ తేదీ వరకు మార్చురీలో భద్రపరచాలని, అక్టోబర్ ఒకటవ తేదీలోగా పోస్టుమార్టం చేయాలని ఉత్తర్వులిచ్చారు. -
పోస్టుమార్టంకు అనుమతి
ప్రైవేటు వైద్యుడికి అనుమతి నిరాకరణ ఎయిమ్స్ వైద్యుడ్ని నియమించుకోవచ్చు హైకోర్టు ఆదేశం సాక్షి, చెన్నై : రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు తగ్గ అనుమతిని మద్రాసు హైకోర్టు జారీ చేసింది. అయితే, రామ్‌కుమార్ తండ్రి పరమశివం విజ్ఞప్తిని కోర్టు తోసి పుచ్చింది. ఈనెల 27లోపు పోస్టుమార్టం నిర్వహించే విధంగా గురువారం న్యాయమూర్తి కృపాకరణ్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్ పుళల్ కేంద్ర కారాగారంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇది ముమ్మాటికి హత్యేనంటూ రామ్‌కమార్ తండ్రి పరమ శివం, న్యాయవాది రామరాజ్ ఆరోపించే పనిలో పడ్డారు. అలాగే, పోస్టుమార్టం ప్రైవేటు వైద్యుడి పర్యవేక్షణలో నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని, కేసు విచారణ సీబీఐకు అప్పగించాలని పట్టుబడుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణ సమయంలో ఇద్దరు న్యాయమూర్తుల మధ్య వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం కావడంతో చివరకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌కు మార్చారు. ఆ మేరకు న్యాయమూర్తి కృపాకరణ్ నేతృత్వంలోని బెంచ్ గురువారం పిటిషన్‌ను విచారించింది. వాదన అనంతరం ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడ్ని అనుమతించబోమని బెంచ్ స్పష్టం చేసింది. అయితే, ఢిల్లీ ఎయిమ్స్ ఆసుప్రతి వైద్యుడి పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించుకోవచ్చని సూచించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నలుగురు, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుడితో కలిసి పోస్టుమార్టంను ఈనెల 27లోపు నిర్వహించాలని, ఈ ప్రక్రియ పూర్తిగా వీడియో చిత్రీకరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, దీనిని పిటిషనర్ వ్యతిరేకిస్తూ శుక్రవారం అప్పీలుకు వెళ్లేందుకు నిర్ణయించారు. ఇదిలా ఉండగా, టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ మీడియాతో మాట్లాడుతూ రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం జరపడంలో జరుగుతున్న జాప్యం, ఈ మరణం వెనుక మిస్టరీని బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆందోళనకు నిర్ణయించామని ప్రకటించారు. -
రామ్‌కుమార్ ఆత్మహత్యపై అన్నీ శేష ప్రశ్నలే!
చెన్నై: ఇన్ఫోసిస్ టెకీ ఎస్ స్వాతి హత్య కేసులో అరెస్టైయిన అనుమానితుడు రామ్‌కుమార్ ఆత్మహత్య కేసులో ఈరోజుకీ అన్నీ అనుమానాలే. ముందుగా అస్వస్థతో బాధపడుతున్న రామ్‌కుమార్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లామని స్వయంగా రామ్‌కుమార్ తరఫున కేసును వాదిస్తున్న న్యాయవాది ఎస్పీ రామరాజుకు తెలిపిన పోలీసు అధికారులు. తర్వాత మాటమార్చి జైలులోనే లైవ్ ఎలక్ట్రిసిటీ వైర్లను కొరకి ఆత్మహత్య చేసుకున్నడని చెప్పారు. మాట మార్చిన విషయం రామరాజు తాను పోలీసులతో జరిపిన సంభాషణలను రికార్డు చేయడం ద్వారా తేటతెల్లమైంది. రామ్‌కుమార్ గదిలో ఏ విద్యుత్ తీగలు లేవుగదా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, చెన్నై నగరంలోని పుజాల్ కేంద్ర కారాగారం-2లోని డెస్పెన్సరి వార్డు వద్ద గోడకు కరెంట్ వైర్లను కొరకడం వల్లన చనిపోయాడని ఓ జైలు పోలీసు అధికారి తెలిపారు. రామ్‌కుమార్ విద్యుత్ షాక్‌తో ఆత్మహత్య చేసుకున్నాడని జైలు అధికారులు చెబుతున్నప్పటికీ ప్రత్యక్షంగా ఆ సంఘటనను చూసిన వారు ఎవరూ లేకపోవడం ఒక ప్రశ్నయితే, జైలు గదిలో ఉండాల్సిన రామ్‌కుమార్ బయటకు ఎలా వచ్చాడన్న ప్రశ్న మరొకటైతే, ఒంటరిగా ఎలా వచ్చాడన్నది ఆన్సర్‌లేని ఇంకో ప్రశ్న. యాభై పడకలతో అత్యాధునిక వైద్య సౌకర్యాలు కలిగిన ఆస్పత్రి జైలులోనే ఉండగా, 20 కిలో మీటర్ల దూరంలోవున్న రోయపేటలోని ఆస్పత్రికి రామ్‌కుమార్‌ను ఎందుకు తీసుకెళ్లారన్నది అంతుచిక్కని అసలు ప్రశ్న. రామ్‌కుమార్‌పై చార్జిషీటు దాఖలు చేసి ఇప్పటికే 85 రోజులు గడచి పోయాయి. ఈ వారమే ఆయన బెయిల్‌పై విచారణ జరుగనుంది. చార్జిషీటు దాఖలై 90 రోజులు దాటితే నిందితుడికి బెయిల్ రావడం దాదాపు ఖాయం. బెయిలు వచ్చే ముందు రామ్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడుతాడా? అన్నది మరో ప్రశ్న. నిందితుడికి సూసైడల్ టెండెన్సీ ఉందని, తాము అరెస్ట్ చేయడానికి వెళ్లినప్పుడు కూడా నిందితుడు బ్లేడుతో గొంతు కోసుకునేందుకు ప్రయత్నించాడని పోలీసులు చెబుతున్నారు. అదే నిజమైతే 2011లో జాతీయ మానవ హక్కుల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సూసైడల్ టెండెన్సీ ఉన్న నిందితుడిని లేదా దోషిని గదిలో ఒంటరిగా ఉంచరాదు. అలాంటి వారిపై సీసీటీవీ కెమేరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగాలి. ప్రతి, పదిహేను నిమిషాలకు భౌతికంగా వారిని తనిఖీ చేయాలి. ఈ చర్యలు తీసుకొని ఉంటే రామ్‌కుమార్ హత్య లేదా ఆత్మహత్య జరిగి ఉండేది కాదు. గతంలో ఇదే జైలులో యాభై ఆత్మహత్యలు చోటుచేసుకోవడంతో కోర్టుల ఆదేశం మేరకు ఆత్మహత్యలకు ఆస్కారం లేకుండా పలు చర్యలు తీసుకున్నారు. అయినా ఆత్మ‘హత్య’ జరిగింది ఎలా?2006లోనే ప్రారంభమైన ఈ ఆధునిక భవంతిలో గోడల అంతర్భాగం నుంచే కరెంటు వైర్లు వెళుతున్నప్పుడు అవి గోడల బయటకు ఎలా వచ్చాయి? తాను అసలు స్వాతిని హత్య చేయలేదని, తాను అమాయకుడినని, పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించలేదని, నేరం ఒప్పుకోకపోతే బ్లేడ్‌తో గొంతుకోసి చంపేస్తామని పోలీసులే తనను బెదిరించారని నిందితుడు రామ్‌కుమార్ తన న్యాయవాది రామరాజు ద్వారా తమిళ టీవీ న్యూస్ ఛానల్ ‘పుతియా తలైమురై’కి ఇచ్చిన లిఖితపూర్వక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ ఇంటర్వ్యూను ఆ ఛానల్ సోమవారం నాడు ప్రసారం చేసింది. టెకీ హత్య కేసులో నిందితుడైన రామ్‌కుమార్ ఆత్మహత్యకు రాష్ర్ట ప్రభుత్వమే బాధ్యత వహించి సీబీఐ ద్వారా దర్యాప్తు జరిపించాలని అతిపెద్ద దళిత పార్టీ అయిన ‘విద్యుతలై చిరుతలైగల్ కట్చీ’ వ్యవస్థాపక నాయకుడు తోల్ తిరుమవలవన్, డీఎంకే నాయకుడు స్టాలిన్, పౌర హక్కుల ప్రజా సంఘం ప్రధాన కార్యదర్శి వి. సురేశ్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు. జూలై 24వ తేదీన నంగమ్బాకమ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న టెకీ స్వాతీని కొడవలతో గొంతుకోసి హత్య చేశారు. అంతపెద్ద రైల్లే స్టేషన్లో కూడా సీసీటీవీ కెమేరాలు లేవు. సమీపంలోని చూలైమేడు జనావాస ప్రాంతంలోని సీసీటీవీ కెమేరాలో రామ్‌కుమార్ పరుగెత్తడాన్ని గమనించిన పోలీసులు, అతడే కొన్ని రోజులుగా తమ కూతురు వెంటబడుతున్నారనే స్వాతి తల్లిదండ్రులు తెలపడంతో అతడే హంతకుడిగా భావించి పోలీసులు ఆయన్ని జూలై ఒకటవ తేదీన అరెస్ట్ చేశారు. స్వాతి వెంటపడుతున్న మాత్రాన రామ్‌కుమార్ ఆమెను చంపాడన్న నిర్ధారణకు రాలేము. హత్య జరిగిన రోజున రైల్లే స్టేషన్‌కు సమీపాన కనిపించాడన్న కారణంగా అనుమానించవచ్చుగానీ, నిర్ధారించలేం. అలా అని చంపలేదని కూడా భావించలేం. హత్యా ప్రాంతంలో దొరికిన వేలు ముద్రలు లాంటి తదితర ప్రత్యక్ష సాక్షాధారాలను సేకరించి కోర్టు ముందు దోషిని నిరూపించాల్సిందే. అప్పటివరకు ఇది దళిత, అగ్రవర్ణాల మధ్య సున్నితమైన సమస్యగానే మిగిలిపోతుంది. -
పోలీసు మెడకు రామ్‌కుమార్ ఉచ్చు
సాక్షి ప్రతినిధి, చెన్నై: జూన్ 24వ తేదీన నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో స్వాతి దారుణహత్య, తిరునెల్వేలీలో నిందితుడు రామ్‌కుమార్ అరెస్ట్, అతను అసలైన నిందితుడు కాదనే వాదనలు ఇలా ఈ కేసులో ప్రతి అడుగు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. క్రైం సినిమాను తలపించే రీతిలో మూడు నెలలుగా సాగుతున్న ఈ కేసు నిందితుడు రామ్‌కుమార్ ఆత్మహత్యతో సరికొత్త మలుపు తిరిగింది. జైలులోని కరెంటు వైరును నోటితో కొరికి బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసు వర్గాల కథనం. వేలాది మంది ఖైదీలు, వందలాది మంది జైలు సిబ్బంది గస్తీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఒక ఖైదీ అంత సులువుగా కరెంటువైరు కొరికి ఉంటాడని, ఒక ఖైదీ ఇంత దారుణానికి పాల్పడుతుంటే సిబ్బంది ఏమి చేస్తున్నట్లు అనే అనుమానాలు తలెత్తాయి. రామ్‌కుమార్‌ది ఆత్మహత్య కాదు, హత్య అని అతని తండ్రి పరమశివం తదితరులు ఆరోపిస్తున్నారు. తన కుమారుడిని పథకం ప్రకారం హతమార్చారని పరమశివం ఆరోపిస్తున్నారు. రామ్‌కుమార్ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని, అప్పటి వరకు మృతదేహాన్ని తీసుకునేది లేదని ఆయన అన్నారు. రామ్‌కుమార్ నిందితుడే కాదని మరో ప్రచారం సాగుతున్న తరుణంలో అనుమానాస్పద స్థితిలో అతను అంతం కావడంతో స్వాతి హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. రామ్‌కుమార్ మరణంపై ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించడంతో పోలీసు శాఖ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోస్టుమార్టంపై హైకోర్టు స్టే రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టంపై హైకోర్టు సోమవారం స్టే విధించింది. రామ్‌కుమార్ మృతదేహాన్ని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఆదివారం సాయంత్రమే చేర్చినా హై కోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది. రాయపేట ఆసుపత్రి చుట్టూ పెద్ద ఎత్తున ఆదివారం అర్ధరాత్రి వరకు రామ్‌కుమార్ బంధువులు, సానుభూతిపరులు చుట్టుముట్టి ఉండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసు బందోబస్తు పెట్టారు. రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు ప్రత్యేకంగా వైద్యబృందాన్ని నియమించారు. ఈ బృందం సోమవారం ఉదయం పోస్టుమార్టం చేయాల్సి ఉండగా రామ్‌కుమార్ న్యాయవాదులు రామ్రాజ్, విజయేంద్రన్ హైకోర్టును ఆశ్రయించారు. రామ్‌కుమార్ మృతిపై అనుమానాలు ఉన్నందున పోస్టుమార్టంపై నిషేధం విధించాలని, ఈ కేసును అత్యవసర కేసుగా స్వీకరించాలని కోరారు. అయితే అత్యవసర కేసుగా తీసుకోవడం కుదరదని న్యాయమూర్తులు నిరాకరించారు. వీరు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పూర్తయ్యేవరకు పోస్టుమార్టంను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వ న్యాయవాది హామీ ఇవ్వడంతో ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తులు... రామ్‌కుమార్ న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగిసేవరకు పోస్టుమార్టంపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్షాల భగ్గు స్వాతి హత్యకేసులో నిందితుడు రామ్‌కుమార్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి సోమవారం డిమాండ్ చేశారు. ఎండీఎంకే అధినేత వైగో, పీఎంకే అధ్యక్షుడు రాందాస్, వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్, డీఎండీకే మహిళా విభాగం కార్యదర్శి ప్రేమలత తదితరులు ఈ అంశంపై గళమెత్తారు. రామ్‌కుమార్ మరణం వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి రావాలని వారు డిమాండ్ చేశారు. పుళల్ జైలు వద్ద సోమవారం విపక్ష పార్టీలు ఆందోళన, ముట్టడి కార్యక్రమాలు నిర్వహించి నిరసన ప్రకటించాయి. అలాగే రామ్‌కుమార్ సొంతూరు సెంగోట్టై సమీపం మీనాక్షిపురంలో అతని బంధుమిత్రులు సోమవారం ఆందోళన జరిపారు. ఈ సందర్భంగా మూడు ప్రభుత్వ బస్సులు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. న్యాయవిచారణ ప్రారంభం రామ్‌కుమార్‌ది సహజమరణం కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ కారణంగా ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. తిరువళ్లూరు కోర్టు న్యాయమూర్తి తమిళ్‌సెల్వి సోమవారం ఉదయం 9.20 గంటలకు రాయపేట ఆసుపత్రికి వచ్చారు. రామ్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించారు. అతని శరీరంపై ఉన్న గాయాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స చేసిన డాక్టర్లను విచారించి అక్కడి నుంచి పుళల్ జైలుకు చేరుకున్నారు. రామ్‌కుమార్ ఉన్న గది, కరెంటువైరు కొరికిన ప్రాంతాన్ని పరిశీలించి జైలు అధికారులను విచారించారు. -
రామ్‌కుమార్ శవపరీక్షకు స్పెషల్ టీమ్
చెన్నై : ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో ప్రధాన నిందితుడు రామ్‌కుమార్ మరణంపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. డాక్టర్లు, నిపుణులతో నలుగురు సభ్యుల టీమ్‌ను ఏర్పాటుచేసి రామ్‌కుమార్ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. రిమాండ్ ఖైదీగా ఉన్న రామ్‌కుమార్ పుళల్ జైళ్లో ఆదివారం బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఇది కచ్చితంగా హత్యేనని, కేసును ముగించేందుకు పోలీసులు పన్నిన పన్నాగంగా అతడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. రామ్‌కుమార్ మరణంపై ఆయన సోదరుడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో, కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. విద్యుత్ వైర్‌ను కొరికి పట్టుకోవడంతో రామ్‌కుమార్ షాక్‌కు గురై చనిపోయినట్టు జైళ్లు శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే జైళ్ల శాఖ వర్గాల వాదనలు పలు అనుమానాలు దారితీస్తున్నాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే ఈ జైళ్లులో రామ్‌కుమార్ ఈ ప్రయత్నం ఎలా చేశాడని పలువురు ప్రశ్నిస్తున్నారు. చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో ఇటీవల ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి దారుణ హత్యకు గురైంది. సీసీటీవీ పుటేజీ ఆధారితంగా రామ్‌కుమార్‌ను జూలైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సెమీఫైనల్లో రామ్‌కుమార్
బింగ్హమ్టన్ (యూఎస్ఏ): ఏటీపీ యూఎస్ చాలెంజర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత ఆటగాడు రామ్ కుమార్ రామనాథన్ సెమీఫైనల్స్‌కు చేరుకున్నాడు. శనివారం హోరాహోరీగా జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 7-6 (5), 6-7 (3), 6-2తో బ్రిడన్ క్లెవిన్ (బ్రిటన్)పై విజయం సాధించాడు. ఆదివారం జరిగే సెమీస్‌లో రామ్ కుమార్... అమెరికాకు చెందిన మిచెల్ క్రూజర్‌తో తలపడతాడు. మరో క్వార్టర్స్‌లో క్రూజర్ 6-3, 7-6 (6)తో హిరోకి మారియా (జపాన్)పై నెగ్గి సెమీస్‌కు అర్హత సాధించాడు. -
స్వాతిని నేనొక్కడే హత్య చేశా
రామ్‌కుమార్ సంచలన వాంగ్మూలం కేకే.నగర్: ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతిని హత్య చేసింది తానొక్కడినేనని ఇందులో మరెవరికీ సంబంధం లేదని హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్ సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో చూలైమేడుకు చెందిన మహిళా ఇంజినీర్ స్వాతి గత నెల 24వ తేదీ హత్యకు గురైన సంఘటన తెలిసిందే. ఈ హత్యకు కారణమైన సెంగోట్టై సమీపంలో గల మీనాక్షిపురానికి చెందిన రామ్‌కుమార్ (24)ను అరెస్టు చేసి జైలులో ఉంచారు. రామ్‌కుమార్‌ను పోలీసులు కస్టడీలో ఉంచి మూడు రోజులు విచారణ జరపటానికి ఎగ్మూర్ కోర్టు అనుమతి ఇచ్చింది. గత 13వ తేదీ బుధవారం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు విచారణ జరిపారు. స్వాతితో ఎలా పరిచయం ఏర్పడింది?, ఆమెను హత్య చేయడానికి వేరే ఎవరైనా సహాయం చేశారా? వంటి పలు రకాల ప్రశ్నలు వేశారు. ఆ సమయంలో అతడిచ్చిన వాంగ్మూలంలోని వివరాలు ఇలా ఉన్నాయి. ఫేస్బుక్ ద్వారా స్వాతి తనకు పరిచయమైందని, ఆమెపై ప్రేమతో నేరుగా చూడడానికి చెన్నైకు వచ్చినట్లు తెలిపాడు. తన రూపాన్ని చూసి స్వాతి అసహ్యంచుకుని అవమానంగా మాట్లాడిందని, నా ప్రేమను నిరాకరించడమే కాకుండా నన్ను, నా కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడడంతో ఈ హత్య చేసినట్లు రామ్‌కుమార్ ఒప్పుకున్నాడు. స్వాతిని బెదిరించాలని కత్తితో వచ్చానని ఆమె నన్ను అసహ్యంగా తిట్టడంతో భరించలేక హత్య చేశానని ఇందులో మరెవరికీ సంబంధం లేదని రామ్‌కుమార్ తెలిపాడు. రామ్‌కుమార్ వద్ద పోలీసులు విచారణ శుక్రవారంతో పూర్తికావడంతో ఎగ్మూర్ నేర విభాగ న్యాయస్థానంలోని న్యాయమూర్తి గోపీనాథ్ సమక్షంలో పోలీసులు అతడిని హాజరు పరిచారు. అతడు ఇచ్చిన వాంగ్మూలాన్ని, వీడియో సీడీని న్యాయమూర్తికి సమర్పించారు. న్యాయమూర్తి గోపీనాథ్ రామ్‌కుమార్ వద్ద సుమారు అరగంట సేపు ప్రత్యేకంగా విచారణ జరిపారు. అనంతరం అతడిని గట్టి బందోబస్తు నడుమ పుళల్ జైలులో నిర్బంధించారు. -
సగర్వంగా.. తిరంగా..
డేవిస్ కప్ ప్లే ఆఫ్‌కు భారత్ * కొరియాపై 3-0తో గెలుపు * పేస్-బోపన్న అలవోక విజయం చండీగఢ్: భారత డేవిస్‌కప్ జట్టు వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. ఆసియా ఓసియానియా గ్రూప్-1 పోరులో భారత్ 3-0తో కొరియాపై విజయం సాధించింది. తొలి రోజు రెండు సింగిల్స్‌లో రామ్‌కుమార్, సాకేత్ విజయం సాధించగా... శనివారం జరిగిన డబుల్స్ పోరులో లియాండర్ పేస్ - రోహన్ బోపన్న జోడి 6-3, 6-4, 6-4తో కొరియా జోడీ హంగ్ చుంగ్ - సియోంగ్ చాన్ హంగ్‌లపై గెలిచి విజయాన్ని పూర్తి చేసింది. ఆదివారం నామమాత్రపు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. తడబాటు లేకుండా... అనుభవం, నైపుణ్యంతో భారత జోడీ డబుల్స్ మ్యాచ్‌లో చెలరేగి ఆడింది. గంటా 41 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో పేస్ ద్వయం మంచి సమన్వయంతో ఆడారు. మేఘావృతమైన వాతావరణం, ప్రత్యర్థుల అనుభవలేమిని ఆసరాగా చేసుకున్న బోపన్న గంటకు 200 కి.మీ.ల వేగంతో సర్వీస్‌లు చేశాడు. పేస్ అద్భుతమైన వ్యాలీలతో ఆకట్టుకున్నాడు. తొలి గేమ్‌లో బోపన్న రెండు డబుల్ ఫాల్ట్‌లు చేయడం, మూడోసెట్లో పేస్ ఒకసారి సర్వీస్ చేజార్చుకోవడం మినహా భారత్ జోడి ఎక్కడా ఇబ్బందిపడలేదు. మ్యాచ్ మొత్తంలో ఈ ఇద్దరు తమ సర్వీస్‌ల్లో కేవలం 17 పాయింట్లు మాత్రమే కోల్పోయారు. మూడో సెట్లో కాస్త అలసత్వం చూపిన ఇద్దరు 10 పాయింట్లు చేజార్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో బోపన్న 9, పేస్ 3 ఏస్‌లు సంధించారు. తొలిసెట్ ఎనిమిదో గేమ్‌లో హంగ్ సర్వీస్‌ను పేస్ వ్యాలీ విన్నర్‌తో బ్రేక్ చేశాడు. దీంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాతి గేమ్‌లో అద్భుతమైన ఏస్‌తో సెట్‌ను చేజిక్కించుకున్నాడు. రెండోసెట్ మూడో గేమ్‌లో మళ్లీ హంగ్ సర్వీస్‌ను పేస్ బ్రేక్ చేశాడు. వేగంగా పరుగెత్తుతూ సంధించిన లో వ్యాలీని ప్రత్యర్థులు అందుకోలేకపోయారు. స్వల్ప ఆధిక్యాన్ని చివరి వరకు కొనసాగిస్తూ భారత్ రెండోసెట్‌ను సొంతం చేసుకుంది. ఇక మూడోసెట్ తొలి గేమ్‌లోనే చుంగ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి బోపన్న జంట ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో గేమ్‌లో బోపన్న బ్రేక్ పాయింట్‌ను కాపాడుకున్నా... ఆరో గేమ్‌లో పేస్ సర్వీస్ కోల్పోయాడు. చివరకు పదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు. మా ఇద్దరి మధ్య సమన్వయం బాగా కుదిరింది. అదే లేకపోతే ఇలాంటి విజయాలు సాధించడం కష్టం. ఈ మ్యాచ్‌లో మేం పెద్దగా కష్టపడలేదు. మా బలం మేరకు మాత్రమే ఆడాం. తక్కువ స్థాయి ప్రత్యర్థులు ఎదురైనప్పుడు ఎలా ఆడాలో తెలుసు కాబట్టి ఎక్కడా ఇబ్బంది పడలేదు. - బోపన్న మేం బాగా ఆడాం. మూడు సెట్లలోనే మ్యాచ్ గెలిచాం. ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైనా.. మా సత్తాను మరింత చూపెట్టేవాళ్లం. కుడి, ఎడమ మేళవింపు ఎప్పుడైనా ఇబ్బందిగానే ఉంటుంది. చుంగ్ మంచి కోణాల్లో షాట్లు కొట్టాడు. హంగ్ కాస్త స్లో. సింగిల్స్‌లో మా వాళ్లు బాగా ఆడారు. కొరియాపై 3-0తో గెలవడమంటే అంత సులువుకాదు. - పేస్ -
రామ్‌కుమారే నిందితుడు
చెన్నై: గత నెల 24వ తేదీన చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో స్వాతి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్యకేసును చేధించే క్రమంలో సీసీ టీవీ ఫుటేజీలో ఒక యువకుడు ప్లాట్‌ఫారంపై ఆందోళనగా పరుగులు పెట్టడం, పక్కవీధిలో నింపాదిగా నడిచివెళ్లడం వంటి దృశ్యాలు పోలీసులకు లభ్యమయ్యాయి. వీటి ఆధారంగా తిరునెల్వేలికి చెందిన రామ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు చుట్టుముట్టగానే బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రామ్‌కుమార్ అక్కడి పోలీసుల వద్ద తన నేరాన్ని అంగీకరించాడు. అయితే చికిత్స కోసం చెన్నై రాయపేట ఆసుపత్రిలో చేరగానే మాటమార్చాడు. అసలు నేరస్తుడిని కాపాడేందుకు పోలీసులు తనను అనవసరంగా హత్యకేసులో ఇరికించారని, పోలీసులతో వచ్చినవారే తన గొంతు కోశారని వాదించాడు. అలాగే రామ్‌కుమార్ తండ్రి సైతం తన కుమారుడు నిర్దోషి అని చెప్పుకున్నాడు. ఈ కేసు విచారణ పలు మలుపులు తిరుగుతూ కులం రంగు పులుముకుంది. దీంతో ఇంతకూ స్వాతి హత్యకేసులో నిందితుడు ఎవరు అనే అయోమయం నెలకొంది.ఈ దశలో నిందితుడిని గుర్తించేందుకు ప్రత్యక్ష సాక్షులను మంగళవారం పుళల్‌జైలుకు తీసుకెళ్లారు. ఎగ్మూరు కోర్టు న్యాయమూర్తి శంకర్ సమక్షంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గుర్తింపు కార్యక్రమం సాగింది. పుళల్ జైల్లోని ఇతర హంతకులతోపాటూ రామ్‌కుమార్‌ను నిలబెట్టారు. హత్యను ప్రత్యక్షంగా చూసిన పెట్టెల అంగడి యజమాని శివకుమార్, స్వాతి తండ్రి గోపాలకృష్ణన్ తదితరులు రామ్‌కుమార్‌ను గుర్తించారు. -
రామ్‌కుమార్‌ను ఇరికించారు
ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో రామ్‌కుమార్‌ను ఇరికించినట్టుందని ఆయన తరఫు న్యాయవాది రామరాజ్ వ్యాఖ్యానించారు. రామ్‌కుమార్ నిర్దోషి అంటూ వకాల్తా పుచ్చుకున్నారు. కేసు విచారణ సీబీఐకు అప్పగించాలని పట్టుబడుతూ రామ్‌కుమార్ తండ్రి పరమశివం చెన్నై హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నాల్లో పడ్డారు. స్వాతిని హతమార్చింది రామ్‌కుమార్ అన్నది నిర్ధారించుకునేందుకు తగ్గట్టుగా పుళల్ చెరలో మంగళవారం ఐడెండిఫికేషన్ జరగనుంది. * రామ్‌కుమార్ తరఫు వకాల్తా పుచ్చుకున్న న్యాయవాది రామ్రాజ్ వ్యాఖ్య * ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసును వెంటనే సీబీఐకు అప్పగించాలని డిమాండ్ * దీనిపై కోర్టుకు వెళ్లనున్న నిందితుడి తండ్రి పరమశివం * నేడు పుళల్‌లో ఐడెంటిఫికేషన్ సాక్షి, చెన్నై: గత నెల నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి దారుణ హత్యకు గురైన విష యం తెలిసిందే. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు నిఘా నేత్రాల సాయంతో నిందితుడ్ని ఎట్టకేలకు గుర్తించారు. తిరునల్వేలి జిల్లా సెంగోట్టై సమీపంలోని మీనాక్షి పురానికి చెందిన రామ్‌కుమార్‌ను హంతకుడిగా తేల్చి అరెస్టు చేశారు. సినీ ఫక్కీలో సాగిన ఈ అరెస్టు పర్వంతో పుళల్ జైల్లో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రామ్‌కుమార్ ఉన్నాడు. అరెస్టు క్రమంలో గొంతు కోసుకున్న దృష్ట్యా అతడిపై పోలీసు వర్గాలు నిఘా పెట్టాయి. అయితే రామ్‌కుమార్‌కు స్వాతి హత్యకేసుతో సంబంధం లేదని, కేసును ముగించేందుకు పనిగట్టుకుని అరెస్టు చేశారన్న ఆరోపణలు మొదలయ్యాయి. రామ్‌కుమార్‌కు అనుకూలంగా తొలుత కృష్ణమూర్తి అనే న్యాయవాది ముందుకు వచ్చినట్టు వచ్చి, వెనక్కు తగ్గారు. తదుపరి రామరాజ్ అనే న్యా యవాది వకాల్తా పుచ్చుకున్నారు. సోమవారం రామ్‌కుమార్‌ను రామరాజ్ నేతృత్వంలోని న్యాయవాద బృం దం కలిసినట్టు సమాచారం. రామ్‌కుమార్ బెయిల్ విషయంపై కేసు విచారణను ముందుకు తీసుకెళ్లేందుకు సమావేశమైనట్టు తెలిసింది. ఈ సందర్భంగా న్యాయవాది రామరాజ్ మాట్లాడుతూ కేసును త్వరితగతిన ముగించడం కోసం అమాయకుడైన రామ్‌కుమార్‌ను ఇరికించారని మీడియా ముందు వ్యాఖ్యానించారు. తన కుమారుడ్ని అన్యాయంగా అరెస్టు చేశారని, కేసు విచారణ సీబీఐకు అప్పగించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించేందుకు రామ్‌కుమార్ తండ్రి పరమశివం సిద్ధం అయ్యారు. న్యాయవాదుల బృందంతో సంప్రదింపుల్లో పడ్డారు. తన కుమారుడు అమాయకుడు అని, తప్పకుండా బయటకు వస్తాడంటూ రామ్‌కుమార్ తల్లి పుష్పం వ్యాఖ్యానించారు. ఐడెంటిఫికేషన్: స్వాతి హత్యకేసులో పట్టుబడ్డ రామ్‌కుమార్‌ను గుర్తించేందుకు ఐడెంటిఫికేషన్‌కు చర్యలు తీసుకున్నారు. తొలుత హత్యను చూసినట్టు ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరకు ధైర్యం చేసి పలువురు ముందుకు వచ్చారు. వీరిని పుళల్ జైలుకు తీసుకెళ్లి రామ్‌కుమార్‌ను గుర్తించేందుకు చర్యలు తీసుకున్నారు. మంగళవారం న్యాయమూర్తి సమక్షంలో పుళల్ జైల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. తదుపరి రామ్‌కుమార్‌ను కస్టడీకి తీసుకునేందుకు తగ్గ పిటిషన్‌ను నగర పోలీసులు కోర్టులో దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. -
రామ్ కుమార్‌కు ఝలక్
చెన్నై: ఇన్ఫోసిస్ స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్‌కుమార్‌కు అతని న్యాయవాది కృష్ణమూర్తి ఝలక్ ఇచ్చారు. కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. గత నెల 24వ తేదీన చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యోదంతం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిందితుడు రామ్‌కుమార్‌ను పోలీసులు ఈనెల 1వ తేదీన తిరునెల్వేలీలోని అతని ఇంటిలో అరెస్ట్ చేశారు. హత్యకేసుతోపాటూ పోలీసులు పట్టుకునే సమయంలో గొంతు కోసుకున్నందున ఆత్మహత్యాయత్నం కేసును కూడా రామ్‌కుమార్‌పై నమోదు చేశారు. తన ప్రేమను నిరాకరించినందుకే స్వాతిని హతమార్చినట్లు తిరునెల్వేలీలో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రామ్‌కుమార్ అంగీకరించినట్లు చెన్నై పోలీస్ కమిషనర్ టీకే రాజేంద్రన్ మీడియా సమావేశంలో ప్రకటించారు. చెన్నై రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామ్‌కుమార్ వద్ద న్యాయమూర్తి స్వయంగా వచ్చి విచారించి ఈనెల 18వ తేదీ వరకు రిమాండ్ విధించారు. రామ్‌కుమార్ న్యాయవాది మహేంద్రన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ దశలో స్వాతి హత్యతో తనకు ఎంటువంటి సంబంధం లేదని అకస్మాత్తుగా ఫ్లేటు ఫిరాయించాడు. అసలు నిందితుడిని రక్షించేందుకు తనపై హత్యకేసు బనాయించారని బెయిల్ పిటిషన్లో రామ్‌కుమార్ వాదించాడు. పిటిషన్ దారుని అనుమతి లేకుండానే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని ప్రభుత్వ న్యాయవాది ఎమ్ఎల్ జగన్ బుధవారం నాటి విచారణ సమయంలో కోర్టుకు విన్నవించాడు. అయితే రామ్‌కుమార్ తరపు మరో న్యాయవాది కృష్ణమూర్తి మాట్లాడుతూ పిటిషన్‌దారుని అనుమతితోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని బదులిచ్చాడు. ఇదిలా ఉండగా రామ్‌కుమార్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న మహిళా న్యాయవాదులు మూకుమ్మడిగా కోర్టుకు వచ్చి బెయిల్ మంజూరు చేయరాదని న్యాయమూర్తికి విన్నవించుకున్నారు. దీంతో ఈ కేసు విచారణ ఈనెల 15వ తేదీకి వాయిదాపడింది. రామ్‌కుమార్ పట్ల ప్రజలంతా ముక్తకంఠంతో నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో అతనికి అండగా ఇద్దరు న్యాయవాదులు నిలబడటం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. తప్పుకున్న కృష్ణమూర్తి: స్వాతిని తానే హత్య చేసినట్లు మొదట అంగీకరించి మళ్లీ నిరాకరించిన రామ్‌కుమార్ అదే తీరులో తన న్యాయవాది కృష్ణమూర్తి చేతిలో కంగుతిన్నాడు. బుధవారం పూర్తిగా రామ్‌కుమార్‌కు బాసటగా నిలిచిన కృష్ణమూర్తి నిన్న ఉదయం అకస్మాత్తుగా తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. రామ్‌కుమార్ కేసు వాదన నుంచి తప్పుకుంటున్నట్లుగా ఫేస్బుక్ ద్వారా ప్రకటించారు. యువ న్యాయవాదులకు తర్ఫీదు ఇచ్చేందుకు మాత్రమే తాను న్యాయస్థానాలకు హాజరవుతున్నానని, తన నుంచి సుమారు 400 మంది యువ న్యాయవాదులు పని నేర్చుకుంటున్నారని ఆయన తెలిపారు. స్వాతి హత్యకేసులో నిందితుడైన రామ్‌కుమార్ తరఫున తాను నేరుగా నియమించిన న్యాయవాదిని కాదని, మరో యువ న్యాయవాది విజ్ఞప్తి మేరకు వాదించేందుకు వచ్చానని వివరించారు. అయితే రామ్‌కుమార్ జామీను పిటిషన్ వ్యహారంలో తనను తప్పుగా చిత్రీకరించారని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కోర్టులో వాదిస్తున్నానని, నిందితుడు రామ్‌కుమార్ సైతం అదే కేటగిరికి చెందిన వాడు కావడంతో వాదించానని వివరించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తాను, తన జూనియర్ సైతం రామ్‌కుమార్ కేసు నుండి తప్పుకుంటున్నట్లు కృష్ణమూర్తి స్పష్టం చేశారు. కేసును విచారిస్తున్న పోలీసులకు రామ్‌కుమార్ ఝలక్ ఇవ్వగా, రామ్‌కుమార్‌కు న్యాయవాది ఝలక్ ఇచ్చారు. -
నేను అమాయకుడిని..
స్వాతి హత్యతో సంబంధం లేదు ప్లేటు ఫిరాయించిన నిందితుడు రామ్‌కుమార్ సాక్షి ప్రతినిధి, చెన్నై : ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతి హత్యతో తనకు సంబంధంలేదంటూ నిందితుడు రామ్‌కుమార్ చెన్నై సెషన్స్‌కోర్టులో మంగళవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. గత నెల 24న చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో స్వాతి హత్యకు గురికాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా రామ్‌కుమార్‌ను నిందితుడిగా భావిస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు. స్వాతిని హత్య చేసినట్లు పోలీసుల వద్ద అంగీకరించిన రామ్‌కుమార్, అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించాడు. తాను అమాయకుడినని, గొంతుకోసుకున్న మాట కూడా నిజం కాదని, నిజమైన నిందితుడిని కాపాడేందుకు తనను బలిచేస్తున్నార ని పిటిషన్లో పేర్కొన్నాడు. -
స్వాతి హత్య వెనుక ముగ్గురున్నారా?
చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో ప్రధాన నిందితుడు రామ్ కుమార్ ని అరెస్టు చేసి కేసు అంతు తేల్చామని పోలీసులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుండగా.. అసలైన ప్రశ్నలు వాటి వెనుక అనుమానాలు మాత్రమే అలాగే ఉండిపోయాయి. ఆ ప్రశ్నలకు పోలీసులు కూడా సమాధానాలు చెప్పకుండా దాట వేస్తున్నారు. మీడియా అడుగుతున్న ప్రశ్నలు, ప్రత్యక్ష సాక్షి, నిందితుడి వాంగ్మూలం ప్రకారం ఈ కేసులో ముగ్గురు వ్యక్తులకు ఈ కేసులో భాగస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోంది. తనకు 50 గజాల దూరంలోనే స్వాతి హత్య జరిగిందని, తాను ప్రత్యక్షంగా ఆ వ్యక్తిని చూశానని సెల్వం అనే ఓ ప్రొఫెసర్ వాంగ్మూలం ఇచ్చాడు. అయితే, ఆరోజు స్వాతిని చెంపదెబ్బ కొట్టిన వ్యక్తిని చూశానని, అతడు.. ప్రస్తుతం అరెస్టు అయిన వ్యక్తి ఒకటి కాదని అన్నారు. అయితే, మరి చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి ఎవరు? అనే ప్రశ్నకు పోలీసుల వద్ద సమాధానం లేదు. స్పందించేందుకు నిరాకరించారు. అలాగే, రామ్ కుమార్ తోపాటు రూమ్ మేట్ గా ఉన్న ఓ సంస్థ సెక్యూరిటీ గార్డు నటేశాన్ కనిపించకుండా పోయాడు. దీనిపై ప్రశ్నించగా అతడు పరారీలో ఉన్నట్లు చెప్తున్నారు. అయితే, పోలీసుల అదుపులోనే ఉన్నట్లు, ఈ హత్య కేసులో అతడే ప్రధాన సాక్షి అని తెలుస్తోంది. ఒక వేళ నటేశాన్ కు ఈ హత్య విషయం ముందే తెలియకుంటే పోలీసులకు ఆ సమాచారం ఎందుకు ఇవ్వలేదని, నిందితుడి కోసం తొలుత పోలీసులు గడపగడప తిరిగి అడిగినా ఎందుకు అతడు వివరాలు అందించలేదని మరో ప్రశ్న తలెత్తుతోంది. సూర్య ప్రకాశ్ అనే వ్యక్తి ద్వారా స్వాతి తనకు పరిచయం అయిందని, తన కోసం సూర్య ప్రకాశ్ మధ్యవర్తిగా ఉన్నాడని పోలీసులకు చెప్పాడు. అయితే, వాస్తవానికి రామ్ కుమార్ ప్రెండ్స్ లిస్ట్ లో సూర్య ప్రకాశ్ అనే వ్యక్తి లేడు. అసలు ఇంతకీ ఆ సూర్య ప్రకాశ్ అనే వ్యక్తి ఎవరు? అతడు అసలు ఉన్నాడా లేడా అనే విషయం పోలీసులు ఎందుకు విచారణ చేయడం లేదని మరి కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి స్వాతి హత్య చిక్కుముడులు ఇంకా వీడనట్లేనని చెప్పవచ్చు. -
కొండముచ్చు అన్నందుకే స్వాతిని చంపా
విచారణ వేగవంతం * కొండముచ్చు అన్నందుకే చంపా * దేవరాజన్ బృందంతో నిందితుడు * తల్లి, సోదరి వద్ద కూడా విచారణ * మీనాక్షిపురం ఇంట్లో తనిఖీలు సాక్షి, చెన్నై: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్‌ను పాళయం కోట్టై ఆసుపత్రి నుంచి చెన్నైకు తరలించారు. కట్టుదిట్టమైన భద్రత నడమ ప్రత్యేక అంబులెన్స్‌లో ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తరలించారు. కాగా తన ప్రేమను తిరస్కరించడమే కాకుండా, కొండముచ్చు(దేవాంగు) వలే ఉన్నావని పదేపదే హేళన చేయడంతో తనలో ఉన్మాది బయటకు వచ్చినట్టు దేవరాజన్ నేతృత్వంలోని విచారణ బృందం ఎదుట రామ్‌కుమార్ వాంగ్ములం ఇచ్చాడు. ఇక, ఆత్మహత్యాయత్నం కేసును నమోదు చేసిన సెంగోట్టై పోలీసులు మీనాక్షిపురంలోని రామ్‌కుమార్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ప్రేమోన్మాదంతో స్వాతిని హతమార్చిన నిందితుడు రామ్‌కుమార్ ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటపడింది. ఈ కేసును విచారిస్తున్న ఐపీఎస్ అధికారి దేవరాజన్ నేతృత్వంలోని బృందం శనివారం రాత్రంతా పాళయం కోట్టై ప్రభుత్వ ఆసుపత్రిలో తిష్ట వేసింది. ఆసుపత్రి పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా అక్కడికి వచ్చే వాళ్లు ప్రతి ఒక్క రినీ తనిఖీల అనంతరం అనుమతించారు. రామ్‌కుమార్‌కు ఆస్పత్రి తరఫున బ్రెడ్, పాలు మాత్రం అందించారు. రాత్రంతా ఈ బృందం జరిపిన విచారణలో తనలోని ప్రేమికుడు, ఉన్మాది గురించి రామ్‌కుమార్ వివరించాడు. ఫేస్బుక్ ద్వారా స్వాతితో ఏర్పడ్డ పరిచయం, ఆమె కోసమే చెన్నై వచ్చినట్టుగా పేర్కొన్నాడు. తాను ప్రేమించమని ఒత్తిడి తెచ్చినప్పుడల్లా స్వాతి చీదరించుకునేదని పేర్కొన్నాడు. అయితే, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకపోవడంతో తన మీద ఆమెకు ప్రేమ ఉందని భావించినట్టు, అందుకే పదే పదే వెంటబడ్డట్టూ వివరించాడు. అదే సమయంలో తన ప్రేమకు మధ్యవర్తి ఓ మిత్రుడు వ్యవహరించినట్టు రామ్‌కుమార్ పేర్కొనడంతో అతగాడి కోసం విచారణ మొదలెట్టారు. చివరకు తనను తిరస్కరించిన స్వాతి కొండముచ్చు వలే ఉన్నావని పదే పదే వ్యాఖ్యానించడంతో తనలో ఉన్మాది బయటకు వచ్చాడని, మీనాక్షిపురానికి వచ్చి సమీపంలోని ఓ తోటలో అరటి గెలలు కోయడానికి ఉంచిన కత్తిని రహస్యంగా తీసుకుని చెన్నైకు వెళ్లినట్టు వాంగ్మూలం ఇచ్చాడు. ఆ రోజు ఆమెను హత్య చేయాలన్న ఉద్దేశం తనకు లేదు అని, ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నించానని, అయితే, ఆమె మాటలు ఉన్మాదిని చేసినట్టు, హంతుకుడిగా మార్చేసినట్టు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. నుంగంబాక్కం స్టేషన్ నుంచి మేన్షనుకు రాగానే టీవీల్లో స్వాతి మృతి చెందినట్టు వచ్చిన వార్తతో అక్కడి నుంచి ఉడాయించి మీనాక్షిపురం చేరుకున్నట్టు వివరించాడు. రెండ్రోజులు బయటకు వెళ్లనప్పటికీ, తర్వాత మేకల మందల్ని తోలుకుని బయటకు వెళ్లినట్టు, క్రమంగా ఈ హత్య కేసు విచారణ గురించి పత్రికలు, టీవీల్లో తెలుసుకుంటూ వచ్చానని పేర్కొన్నాడు. తన ఇంటికి మఫ్టీలో మహిళా కానిస్టేబుల్ వెళ్లినప్పుడే పోలీసులు తనను సమీపించినట్టే అని భావించి ఆత్మహత్యాయత్నం చేసినట్టు వాంగ్మూలం ఇచ్చినట్టే మీడియాల్లో సమాచారాలు వెలువడుతుండడం గమనార్హం. ఇక, ప్రేమోన్మాది మీద సెంగోట్టై పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసును నమోదు చేసి, అతడి ఇంట్లో తనిఖీలు చేశారు. అక్కడ రక్తపు మరకతో ఉన్న చొక్కా, స్వాతి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అలాగే, స్వాతిని హతమార్చిన విషయం ముందుగా తమకు తెలియదని రామ్‌కుమార్ తల్లి పుష్ప పోలీసులు వద్ద స్పష్టం చేశారు. తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు, ఫేస్బుక్ పరిచయం గురించి తమకు తెలియదంటూ రామ్‌కుమార్‌తో సన్నిహితంగా ఉండే మీనాక్షిపురం మిత్రులు తెలియజేయడం గమనార్హం. అయితే, అవసరం మేరకు తప్ప, ఎవరితోనూ పెద్దగా మాట్లాడడని, అలాంటి వాడా, ఇలా అన్న విషయాన్ని జీర్ణించుకోలేకున్నామని వ్యాఖ్యానిస్తున్నారు. చెన్నైకి రామ్‌కుమార్: రాత్రంతా సాగిన విచారణతో ఆదివారం ఉదయం రామ్‌కుమార్‌కు వైద్య పరీక్షల్ని అందించారు. కొంత మేరకు కోలుకున్న దృష్ట్యా, ఇక, చెన్నైకు తీసుకెళ్లవచ్చని వైద్యులు సూచించారు. దీంతో ప్రత్యేక అంబులెన్స్, వైద్యబృందం, ముందు రెండు, వెనుక రెండు పోలీసు వాహనాలను సిద్ధం చేసి భద్రత నడమ చెన్నైకు తరలించే ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం చెన్నైకు తరలించే ప్రయత్నం చేసినా, అక్కడి కోర్టు న్యాయమూర్తి సెలవు మీద వెళ్లి ఉండడంతో సమస్యలు తప్పనట్టు సమాచారం. చెన్నైకు రామ్‌కుమార్‌ను తరలించే క్రమంలో అతడ్ని చూసేందుకు జనం పెద్ద ఎత్తున ఆసుపత్రి ఆవరణలో చుట్టుముట్టడంతో కాసేపు ఉత్కంఠ నెలకొంది. చివరకు న్యాయ పర సమస్యల్ని అధిగమించి, గట్టి భద్రత నడమ సరిగ్గా ఐదు గంటల సమయంలో అంబులెన్స్ పాళయం కోట్టై ఆసుపత్రి నుంచి జాతీయ రహదారి గుండా చెన్నై వైపుగా దూసుకెళ్లింది. ఆరు వందల కి.మీ దూరం పయనం కాబట్టి, సోమవారం వేకువ జామున చెన్నైకు చేరుకోనున్నారు. నేరుగా రామ్‌కుమార్‌ను రాయపేట ఆసుపత్రికి తరలించనున్నారు. అక్కడ ప్రత్యేక వార్డులో వైద్య చికిత్సలు అందించి, వైద్యుల సలహా మేరకు తదుపరి విచారణను వేగవంతం చేయనున్నారు. ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనలు స్వాతి హత్యతో సమాప్తం కావాలని, మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే, రామ్‌కుమార్ కఠినంగా శిక్షించబడాలని స్వాతి చిన్నాన్న గోవిందరాజన్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అలాగే, స్వాతి స్నేహితుడు మహ్మద్ బిలాల్ సిద్ధిక్ పేర్కొంటూ, వేధింపుల విషయాన్ని స్వాతి ఎవరి దృష్టికైనా తీసుకొచ్చి ఉంటే, ఇంత అనర్ధం జరిగి ఉండేది కాదు అని వ్యాఖ్యానించాడు. స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం, ఏ సమస్యనైనా నేరుగా ఢీకొట్టే ధైర్యం, శక్తి ఆమెకు ఉండబట్టే ఎవరి దృష్టికి తీసుకు రాలేదని పేర్కొంటూ, నిందితుడు కఠినంగా శిక్షించ బడాలని విన్నవించాడు. ఇళ్ల వద్ద నిఘా..నిఘా నేత్రాల మీద ప్రస్తుతం అందరి దృష్టి మళ్లింది. స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్‌ను గుర్తించడంలో నిఘా నేత్రాలు ఎంతగానో దోహదపడ్డాయి. రైల్వే స్టేషన్లలో నిఘా నేత్రాలు కన్పించనప్పటికీ, నుంగబాక్కం రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా నిందితుడు ఉడాయిస్తుండడాన్ని బందించింది. ఇది పోలీసుల విచారణకు ఎంతగానో దోహదపడింది. ఈ పరిస్థితుల్లో తమ ఇళ్ల వద్ద నిఘా నేత్రాల ఏర్పాటు మీద జనం దృష్టి పెట్టారు. సొంత ఇళ్లు కల్గిన వాళ్లతో పాటు అపార్ట్మెంట్స్, పలు ప్రాంతాల్లోని దుకాణాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు మీద ఆయా యజమానులు దృష్టి పెట్టి ఉండడం విశేషం. ఇందుకు తగ్గట్టుగా సీసీ కెమెరాల విక్రయ ఏజెన్సీలు రంగంలోకి దిగి ఉండడం గమనార్హం. -
నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని..
చీకొట్టింది, చీదరించుకుంది స్వాతి హత్యకేసులో నిందితుడు రామ్‌కుమార్ వాంగ్మూలం ప్రేమించాల్సిందిగా స్వాతిని ఎంతగానో బతిమలాడాను, చీదరించుకుంది, చీకొట్టింది, అందుకే హతమార్చానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిందితుడు రామ్‌కుమార్ చెప్పాడు. సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి (24)ని దారుణంగా హత్యచేసిన రామ్‌కుమార్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులను చూడగా నే బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ప్రాథమిక చికిత్స ప్రారంభించి గొంతుకు 18 కుట్లు వేయడం ద్వారా పోలీసులు రామ్‌కుమార్ ప్రాణాలు కాపాడగలిగారు. కొద్దిగా కోలుకున్న తరువాత తిరునెల్వేలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు అతని నుంచి వాంగ్మూలం సేకరించారు. ఈ సందర్భంగా స్వాతిని తాను హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్యకు దారితీసిన పరిస్థితులను వివరించాడు. అతను చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరునెల్వేలిలోని ఐన్‌స్టీన్ ఇంజనీరింగ్ కళాశాలలో గత ఏడాది మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయాల్సి ఉండగా నాలుగు బ్యాక్‌లాగ్స్ నిలిచిపోయాయి. మూడు నెలల క్రితం ఉద్యోగాన్వేషణలో చెన్నైకి చేరుకున్నాను. చూలైమేడు సౌరాష్ట్రా నగర్‌లోని ఏఎస్ మేన్షన్‌లో నివాసం ఏర్పాటు చేసుకుని సమీపంలోని ఒక వస్త్రదుకాణంలో గుమాస్తాగా చేరాను. అక్కడి సమీపంలో నివసించే స్వాతి ప్రతిరోజూ నేను నివసించే మేన్షన్ మీదుగానే వెళ్లేది. నేను మెకానికల్ ఇంజనీరునని, నెలకు రూ.లక్ష జీతానికి పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాను. ప్రతిరోజూ మాటలు కలపడం ప్రారంభించాను. ఈ దశలో నేను ఇంజనీరును కాదని, ఒక వస్త్రదుకాణంలో గుమాస్తా అని స్వాతి తెలుసుకుని దూరం పెట్టడం ప్రారంభించింది. స్వాతిపై ప్రేమను పెంచుకున్న తాను అనేక సార్లు ఆమె వెంటపడి చెప్పడం ప్రారంభించాను. తనపై కోపంతో కసిరికొట్టింది. వెంటపడవద్దని బెదిరిం చింది. ప్రతిరోజూ తండ్రిని వెంటపెట్టుకుని రైల్వేస్టేషన్‌కు వెళుతూ నేను మాట్లాడే అవకాశమే లేకుండా చేసింది. స్వాతితో కలిసి ఉన్న జీవితా న్ని ఊహించుకున్నా, ఆమె లేని జీవితం వృథాఅని బాధపడ్డాను. ఇలా ఎడబాటుకు లోనైస్థితి లో నాకు దక్కని స్వాతి ఎవ్వరీ దక్కకూడదని భావించాను. స్వాతిని చంపేయాలని నిర్ణయిం చుకుని పుస్తకాల మాటున కత్తిపెట్టుకుని రెండురోజులు వెంటపడ్డాను. మూడోరోజైన గత నెల 24వ తేదీన ప్రేమించాలంటూ ప్లాట్‌ఫారంపైనే చివరిసారిగా బతిమాలాడాను. అయితే యథాప్రకారం చీకొట్టడంతో ఆగ్రహంతో హతమార్చానని రామ్‌కుమార్ అంగీకరించాడు. పూర్తిస్థాయి విచారణ కోసం రామ్‌కుమార్‌ను రెండు రోజుల్లో చెన్నైకి తీసుకురానున్నారు. -
టెకీ స్వాతి హత్యకేసులో నిందితుడి అరెస్ట్
చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరునల్వేలిలో తలదాచుకుంటున్న రామ్‌కుమార్‌ను శుక్రవారం అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను గమనించిన నిందితుడు తన వద్ద ఉన్న బ్లేడుతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే అతన్ని తిరునల్వేలి ఆస్పత్రికి తరలించారు. తిరునల్వేలి చెందిన రామ్‌కుమార్ ఇంజినీరింగ్ ముగించుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో చెన్నైకు వచ్చినట్లు గుర్తించారు. స్వాతి నివాసం ఉండే ప్రాంతంలోనే రామ్ హాస్టల్లో ఉంటున్నాడు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గత నెల 24న చెన్నైలోని నుంగంబాకం రైల్వే స్టేషన్లో స్వాతిని అత్యంత దారుణంగా నరికి చంపిన విషయం తెలిసిందే. -
ఇనుపరాడ్డుతో సైకో వీరంగం
అడ్డగుట్ట (హైదరాబాద్): తుకారాంగేట్‌లో ఓ సైకో వీరంగం సృష్టించాడు. కనిపించిన వారిపై ఇనుపరాడ్డుతో దాడికి దిగాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నేపాల్‌కు చెందిన ఐతే రామ్‌కుమార్(46) సికింద్రాబాద్‌లో నివాసముంటున్నాడు. ఆదివారం రాత్రి అతిగా మద్యం సేవించిన రామ్‌కుమార్ సమీపంలో ఉన్న నలుగురిపై దాడి చేశాడు. అదే విధంగా ఇనుపరాడ్డు పట్టుకొని పలువురు స్థానికులపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడితో సునీల్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో సైకో రామ్కమార్కు కూడా పలు గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న తుకారాంగేట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆ సైకోను అదుపులోకి తీసుకున్నారు. -
కొన్నిగంటల్లో పెళ్లి.. టెకీ ఆత్మహత్య!
చెన్నై: మరికొన్ని గంటల్లోనే ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పెళ్లి.. కానీ ఇంతలోనే అతడు శవమై కనిపించాడు. ఈ సంఘటన తమిళనాడులోని సేలంలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడుకు చెందిన రామ్ కుమార్ అనే యువకుడు బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. అయితే మరో మూడు రోజుల్లో వివాహం ఉండగా నిన్న బెంగళూరు నుంచి తమిళనాడులోని తన స్వగ్రామం వడుకపట్టికి బయలుదేరాడు. ఇంటికి వస్తున్నానని చెప్పిన కుమారుడు ఎంతకు రాకపోవడంతో ఇంజినీర్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్నిగంటల్లోనే పోలీసులు రామ్ కుమార్ జాడను గుర్తించారు. హంకగిరి గ్రామంలో ఓ బావిలో శవమై తేలాడని పోలీసులు వెల్లడించారు. శుక్రవారం అతని పెళ్లి ఉండగా ఈ సమయంలో చనిపోవడంతో ఇది ఆత్మహత్య అని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టనున్నట్లు వివరించారు. -
క్వార్టర్స్‌లో రామ్‌కుమార్
చెన్నై: భారత యువ టెన్నిస్ ఆటగాడు రామ్‌కుమార్ చెన్నై ఓపెన్‌లో నిలకడైన ప్రదర్శనతో దూసుకెళుతున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో తను 3-6, 6-4, 6-4తో కుద్రయెత్సేవ్ (రష్యా)పై గెలిచి క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టాడు. ఏటీపీ టూర్ ఈవెంట్లో రామ్‌కుమార్ క్వార్టర్స్‌కు చేరడం ఇదే తొలిసారి. గత సీజన్ చివర్లో రెండు ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టైటిల్స్ సాధించిన రామ్‌కుమార్ వరుసగా 12 మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తూ వస్తున్నాడు. పురుషుల డబుల్స్‌లోనూ తను శ్రీరామ్ బాలాజీతో కలిసి క్వార్టర్స్‌కు చేరిన విషయం తెలిసిందే. కుద్రయెత్సేవ్తో పోరులో తొలిసెట్లో పేలవంగా ఆడిన రామ్‌కుమార్ రెండో సెట్లో పుంజుకున్నాడు. 3-3తో పాయింట్లు సమానంగా ఉన్న దశలో 23 షాట్ల పాటు సుదీర్ఘ ర్యాలీ సాగింది. పట్టువదలకుండా ఆడి 4-3 ఆధిక్యం సాధించి మరో రెండు గేమ్‌లను కూడా గెలుచుకుని సెట్ సాధించాడు. అదే జోరులో మూడో సెట్లోనూ గెలిచి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. క్వార్టర్స్‌లో రామ్‌కుమార్, అల్జాజ్ను ఎదుర్కోనున్నాడు. టోర్నీ నుంచి తప్పుకున్న పేస్ తన డబుల్స్ సహచరుడు మార్సెల్ గ్రనోలెర్స్ (స్పెయిన్) అనారోగ్యం కారణంగా భారత టెన్నిస్ దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్ చెన్నై ఓపెన్ నుంచి తప్పుకున్నాడు. గురువారం ఈ జోడి క్వార్టర్స్ ఆడాల్సింది. ‘చాలా నిరాశగా ఉంది. భారత అభిమానుల ముందు ఆడలేకపోతున్నాను’ అని పేస్ అన్నాడు. -
రామ్‌కుమార్ పరాజయం
యూఎస్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీ న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో ఈసారి పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ఒక్క ప్లేయర్‌ను చూసే అవకాశం లేకుండా పోయింది. క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో బరిలోకి దిగిన నలుగురు భారత ఆటగాళ్లు రెండో రౌండ్‌ను దాటి ముందుకెళ్లలేకపోయారు. సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, సాకేత్ మైనేని, యూకీ బాంబ్రీ తొలి రౌండ్లోనే నిష్ర్కమించగా... రామ్‌కుమార్ రామనాథన్ రెండో రౌండ్లో ఓడిపోయాడు. శుక్రవారం జరిగిన రెండో రౌండ్లో రామ్‌కుమార్ 3-6, 6-2, 6-7 (4/7)తో ఫకుండో బాగ్నిస్ (అర్జెంటీనా) చేతిలో ఓటమి చవిచూశాడు. -
ఆపరేషన్ ‘ఔటర్’
జవహర్‌నగర్, గబ్బిలాలపేట, నందమూరినగర్‌లో ఇంటింటి తనిఖీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు సోదాలు అదుపులో 10 మంది అనుమానితులు, 40 వాహనాల స్వాధీనం జవహర్‌నగర్: నగర శివారులపై సైబరాబాద్ పోలీసులు డేగకన్ను వేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక క్రైం అదనపు డీసీపీ జి.జానకీషర్మిల ఆధ్వర్యంలో మల్కాజిగిరి డీసీపీ కోటేశ్వర్రావ్, ఏసీపీలు ప్రకాశ్‌రావ్, రామ్‌కుమార్‌లతో పాటు 30 మంది ఇన్స్పెక్టర్లు, 30 మంది సబ్ఇన్స్పెక్టర్లు, 240 మంది కానిస్టేబుళ్లు జవహర్‌నగర్‌లోని గబ్బిలాలపేట, నందమూరినగర్ కాలనీలలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సోదాలు చేస్తున్నంత సేపు బస్తీలలోకి, బయటకు ఎవరిని అనుమతించకుండా రెక్కీ నిర్వహించారు. బస్తీలలోని ప్రతీ ఇల్లు ముఖ్యంగా అనుమానం ఉన్న నేరగాళ్ల నివాసాల్లో సోదాలు చేశారు. హైదరాబాద్‌ను నేరరహితంగా తీర్చిదిద్దాలని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు నగర శివారుల్లో సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి నగరంలో దోపిడీ,దొంగతనాలకు పాల్పడిన నేరగాళ్లు శివార్లలో తలదాచుకునే అవకాశం ఉండడంతో ఈ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహించారు. కొందరికి భయం... మరికొందరి హర్షం ఆకస్మికంగా పోలీసులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించడంతో కొందరు బయాందోళనలు చెందగా, మరి కొందరు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛందంగా మహిళలు బయటికి వచ్చి సెర్చ్ ఆపరేషన్ కోసం వచ్చిన అదనపు డీసీపీ జానకీషర్మిలతో తమ కష్టాలను స్వయంగా చెప్పుకున్నారు. కాలనీలలో బెల్టు షాపులు ఉండడం వల్ల వీధుల్లో తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జవహర్‌నగర్ ఎస్ఐ రాములును పిలిపించి పేదల కాలనీలలో మరింత రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కొనసాగిన సోదాల్లో మొత్తం 1000 ఇళ్లను పైగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఒక పాత నేరస్తుడు ,10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 32 బైక్‌లు,6 ఆటోలు,2 కార్లను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. నేరగాళ్ల ఏరివేతే లక్ష్యం : జి.జానకీషర్మిల అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, నేరగాళ్ల ఏరివేతే లక్ష్యంగా పనిచేస్తామని క్రైం అదనపు డీసీపీ జానకీషర్మిల పేర్కొన్నారు. నగర శివారు ప్రాంతాల్లోని నేరస్తులపై డేగకన్ను పెట్టామన్నారు. ప్రజలకు ఎలాంటి అనుమానం వచ్చినా 100 నెంబర్‌కు ఫోన్ చేస్తే క్షణాల్లో పోలీసులు చేరుకుంటారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. -
క్వార్టర్స్‌లో రామ్‌కుమార్ జోడి
చెన్నై: సింగిల్స్ తొలి రౌండ్లో సోమ్‌దేవ్ దేవ్వర్మన్పై సంచలన విజయం సాధించిన భారత యువతార రామ్‌కుమార్ రామనాథన్ డబుల్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. సహచరుడు శ్రీరామ్ బాలాజీతో కలిసి బరిలోకి దిగిన రామ్‌కుమార్ చెన్నై ఓపెన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో రామ్‌కుమార్-శ్రీరామ్ బాలాజీ జంట 7-5, 6-3తో స్కాట్ లిప్స్కీ-రాజీవ్ రామ్ (అమెరికా) జోడిపై గెలిచింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట ఏడు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి జంట సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు రెండో సీడ్ లియాండర్ పేస్ (భారత్)-ఫాబియో ఫాగ్నిని (ఇటలీ) జంట గాయం కారణంగా చివరి నిమిషంలో వైదొలిగింది. వావ్రింకా ముందంజ పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో వావ్రింకా 6-3, 6-1తో బెంజిమిన్ బెకర్ (జర్మనీ)పై గెలిచాడు. డూడీ సెలా (ఇజ్రాయెల్)తో జరిగిన మరో మ్యాచ్‌లో రెండో సీడ్ యూజ్నీ (రష్యా) 1-3తో వెనుకంజలో ఉన్నపుడు కడుపు నొప్పి కారణంగా వైదొలిగాడు. -
మరో విజయంతో మెయిన్ ‘డ్రా’లోకి...
చెన్నై: భారత ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్ చెన్నై ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’ అవకాశాల్ని సజీవంగా ఉంచుకున్నాడు. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో అతను 6-3, 7-5తో రష్యాకు చెందిన ఎల్గిన్‌ను కంగుతినిపించాడు. సోమవారం జరిగే చివరి క్వాలిఫయింగ్‌లో రామ్‌కుమార్... గొంబోజ్ (స్లోవేకియా)పై గెలిస్తే మెయిన్ డ్రాకు అర్హత సంపాదిస్తాడు. కాగా భారత్‌కు చెందిన మరో యువ ఆటగాడు సనమ్ సింగ్ రెండో రౌండ్లో నిష్ర్కమించాడు. డెన్మార్క్‌కు చెందిన ఫ్రెడెరిక్ నీల్సన్ 7-5, 7-5తో సనమ్ సింగ్‌పై చెమటోడ్చి నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో హెన్రీ లాక్సోనెన్ (స్విట్జర్లాండ్) 7-5, 6-4తో గొ సొయెడా (జపాన్)పై గెలుపొందగా, నార్బెర్ట్ గొంబోజ్ (స్లోవేకియా) 2-6, 6-1, 6-4తో డూసాన్ లాజోవిక్ (సెర్బియా)ను ఓడించాడు. రాజీవ్ రామ్ (అమెరికా) 1-6, 6-3, 5-7తో ఫిలిప్ ఓస్వాల్డ్ (ఆస్ట్రియా) చేతిలో కంగుతినగా, అల్బొట్ (మాల్డొవా) 7-6 (7/2), 6-3తో జె జెంగ్ (చైనా)పై విజయం సాధించాడు. కుడ్రియత్సెవ్ (రష్యా) 7-6 (7/9), 6-3తో కచనోవ్ (రష్యా)పై నెగ్గాడు. నేటి నుంచి మెయిన్ డ్రా: చెన్నై ఓపెన్ మెయిన్ డ్రా ఈవెంట్ సోమవారం మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్ యువ ఆటగాడు సాకేత్ మైనేని- కారెన్ కచనోవ్ (రష్యా) డబుల్స్ మ్యాచ్‌తో మెయిన్ డ్రా పోటీలు ఆరంభమవుతాయి. సాయంత్రం సెంటర్ కోర్టులో జరిగే మ్యాచ్‌లో భారత్-రష్యా జోడి... కెరెనో బూస్టా-అల్బెర్ట్ రెమోజ్ (స్పెయిన్) ద్వయంతో తలపడుతుంది. సింగిల్స్‌లో యెన్ సూన్ లూ (చైనీస్ తైపీ)తో టిమ్ స్మిజెక్ (అమెరికా); జిరి వెసెలీ (చెక్ రిపబ్లిక్)తో జీవన్ నెదుచెజియాన్ (భారత్), లుకాస్ లాకో (స్లోవేకియా)తో డూడి సెలా (ఇజ్రాయెల్) తలపడతారు. -
సోనియా బర్త్‌డే... ‘అనంత’లో బ్లాక్‌డే
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు కారణమైన సోనియాగాంధీ జన్మదినం(9వ తేదీ)ను బ్లాక్‌డేగా పరిగణించి, జిల్లా బంద్ చేపట్టాలని ‘అనంత’ సంయుక్త కార్యాచరణ వేదిక (సంయుక్త జేఏసీ) నిర్ణయించింది. సోమవారం విద్రోహదినంగా పాటిస్తూ అన్ని ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలతో కలిసి నల్లజెండాలు, బ్యాడ్జీలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చింది. శనివారం సాయంత్రం నగరంలోని మేడా కన్వెన్షన్ హాలులో న్యాయవాదుల జేఏసీ నేతలు కొత్త విశ్వనాథ్‌రెడ్డి, రామ్‌కుమార్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ ఉద్యోగ సంఘాల జేఏసీలు, యువ, కుల సంఘాలు, పొలిటికల్, నాన్‌పొలిటికల్ జేఏసీల నేతలు హాజరయ్యారు. బంద్ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చిన నాటి నుంచి 130 రోజులుగా జిల్లాలో అన్ని వర్గాలు చేస్తున్న ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ... కీలకమైన ఈ పరిస్థితుల్లో మరింత ఉధృతం చేసి ఉద్యమ సెగను ఢిల్లీకి తాకించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బంద్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని సంకల్పించారు. ఉద్యమం చివరిఘట్టంలో ఉన్నందున కలసివచ్చే రాజకీయ పార్టీలు, నాయకులను ఆహ్వానించాలని నిర్ణయించారు. జెండా, అజెండాలు పక్కనపెట్టి అన్ని పార్టీలు కలసిరావాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉద్యమాన్ని అణచివేసే దిశగా పోలీసు యంత్రాంగం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని పలువురు నాయకులు విమర్శించారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వసతి గృహం, ఎస్కేయూ విద్యార్థులను నిర్బంధించడం తగదన్నారు. 2009 డిసెంబర్ 9న ప్రకటన తరువాత సమైక్యవాదులందరూ ఏకతాటిపై ఉద్యమించడంతో ఆ ప్రకటన వెనక్కు తీసుకున్నారని గుర్తు చేశారు. అలాంటి ఉద్యమం మరోసారి అవసరమన్నారు. రాయల తెలంగాణ లేదా మరో ప్రతిపాదన లేకుండా సమైక్యాంధ్ర నినాదంతోనే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. సమావేశంలో వివిధ జేఏసీల నాయకులు బోరంపల్లి ఆంజనేయులు, మునిరత్నం శ్రీనివాసులు, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, కృష్ణవేణి, యు.రాజేశ్వరి, దేవళ్ల మురళీ, సగర శ్రీకాంత్, వశికేరి శివ, బీఎస్ఎన్ఎల్ రాజశేఖర్‌రెడ్డి, రామకృష్ణ, జగదీష్, మేడా రమణ, హెచ్ఎన్ఎస్ఎస్ మనోహరరెడ్డి, రేణుకాదేవి, శ్రీధర్, వాసుప్రకాశ్, మహబూబ్‌బాషా, శివప్రకాశ్, ఎస్వీ సత్యనారాయణగుప్తా, ప్రతాప్, కుసుమ పుల్లారెడ్డి, సత్యనారాయణ, రామకృష్ణ, జేబీ సురేష్, నాగరాజు, ముక్తియార్ పాల్గొన్నారు.