ఒకప్పుడు భారత్‌లో రూ. పదివేలు నోటు కూడా చలామణిలో ఉండేది. 1978లో అప్పటి జనతా ప్రభుత్వం ఈ నోటును రద్దుచేసింది. తాజాగా మోదీ ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు చేసిన నేపథ్యంలో దుబాయ్‌లో ఇప్పుడు ఈ పెద్దనోటు హల్‌చల్ చేస్తోంది. దుబాయ్‌లో నివసిస్తున్న భారత సంతతి వాసి రామ్‌కుమార్ ప్రస్తుతం ఈ పదివేల నోటును ప్రదర్శనకు పెట్టారు. వృత్తిరీత్య న్యూమిస్‌మేటిస్ట్ (అరుదైన కరెన్సీ, నాణెల సేకరణకర్త) అయిన ఆయన గత ఏడాది భారత్‌లో ఓ కలెక్టర్ వద్ద నుంచి ఈ అరుదైన నోటును సేకరించినట్టు తెలిపారు.
1978లో భారత రిజర్వు బ్యాంకు పదివేల నోట్లను రద్దుచేసేనాటికి కేవలం 346 నోట్లు మాత్రమే చలామణిలో ఉండేవి. అందులో పదివేల నోట్లు పదిమాత్రం ఆర్బీఐకి చేరలేదు. ప్రస్తుతం ఇవి అరుదైన జ్ఞాపకాలు మిగిలిపోగా.. అందులో దుబాయ్‌లో దర్శనమిచ్చే ఏకైక పదివేల నోటు ఇదేనని రామ్‌కుమార్ తెలిపారు. పదివేల నోటును సేకరించాలన్న కల తనకు ఎప్పటి నుంచో ఉండేదని, అతికష్టం మీద భారత్‌లో ఓ కలెక్టర్ నుంచి దీనిని సేకరించానని, దీని ప్రస్తుత విలువ ఎంత అంటే తాను ఇప్పుడు చెప్పలేనని ఆయన పేర్కొన్నారు.
దేశం కాని దేశంలో మన అరుదైన నోటు!
Published Wed, Dec 21 2016 8:44 AM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM
Advertisement