టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో ఈసారి పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ఒక్క ప్లేయర్‌ను చూసే అవకాశం లేకుండా పోయింది.
యూఎస్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీ
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో ఈసారి పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ఒక్క ప్లేయర్‌ను చూసే అవకాశం లేకుండా పోయింది. క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో బరిలోకి దిగిన నలుగురు భారత ఆటగాళ్లు రెండో రౌండ్‌ను దాటి ముందుకెళ్లలేకపోయారు. సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, సాకేత్ మైనేని, యూకీ బాంబ్రీ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించగా... రామ్‌కుమార్ రామనాథన్ రెండో రౌండ్‌లో ఓడిపోయాడు. శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌లో రామ్‌కుమార్ 3-6, 6-2, 6-7 (4/7)తో ఫకుండో బాగ్నిస్ (అర్జెంటీనా) చేతిలో ఓటమి చవిచూశాడు.