నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని..
చీకొట్టింది, చీదరించుకుంది
స్వాతి హత్యకేసులో నిందితుడు రామ్‌కుమార్ వాంగ్మూలం
ప్రేమించాల్సిందిగా స్వాతిని ఎంతగానో బతిమలాడాను, చీదరించుకుంది, చీకొట్టింది, అందుకే హతమార్చానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిందితుడు రామ్‌కుమార్ చెప్పాడు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి (24)ని దారుణంగా హత్యచేసిన రామ్‌కుమార్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులను చూడగా నే బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ప్రాథమిక చికిత్స ప్రారంభించి గొంతుకు 18 కుట్లు వేయడం ద్వారా పోలీసులు రామ్‌కుమార్ ప్రాణాలు కాపాడగలిగారు.
కొద్దిగా కోలుకున్న తరువాత తిరునెల్వేలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు అతని నుంచి వాంగ్మూలం సేకరించారు. ఈ సందర్భంగా స్వాతిని తాను హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్యకు దారితీసిన పరిస్థితులను వివరించాడు. అతను చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరునెల్వేలిలోని ఐన్‌స్టీన్ ఇంజనీరింగ్ కళాశాలలో గత ఏడాది మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయాల్సి ఉండగా నాలుగు బ్యాక్‌లాగ్స్ నిలిచిపోయాయి.
మూడు నెలల క్రితం ఉద్యోగాన్వేషణలో చెన్నైకి చేరుకున్నాను. చూలైమేడు సౌరాష్ట్రా నగర్‌లోని ఏఎస్ మేన్షన్‌లో నివాసం ఏర్పాటు చేసుకుని సమీపంలోని ఒక వస్త్రదుకాణంలో గుమాస్తాగా చేరాను. అక్కడి సమీపంలో నివసించే స్వాతి ప్రతిరోజూ నేను నివసించే మేన్షన్ మీదుగానే వెళ్లేది. నేను మెకానికల్ ఇంజనీరునని, నెలకు రూ.లక్ష జీతానికి పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాను. ప్రతిరోజూ మాటలు కలపడం ప్రారంభించాను.
ఈ దశలో నేను ఇంజనీరును కాదని, ఒక వస్త్రదుకాణంలో గుమాస్తా అని స్వాతి తెలుసుకుని దూరం పెట్టడం ప్రారంభించింది. స్వాతిపై ప్రేమను పెంచుకున్న తాను అనేక సార్లు ఆమె వెంటపడి చెప్పడం ప్రారంభించాను. తనపై కోపంతో కసిరికొట్టింది. వెంటపడవద్దని బెదిరిం చింది. ప్రతిరోజూ తండ్రిని వెంటపెట్టుకుని రైల్వేస్టేషన్‌కు వెళుతూ నేను మాట్లాడే అవకాశమే లేకుండా చేసింది. స్వాతితో కలిసి ఉన్న జీవితా న్ని ఊహించుకున్నా, ఆమె లేని జీవితం వృథాఅని బాధపడ్డాను.
ఇలా ఎడబాటుకు లోనైస్థితి లో నాకు దక్కని స్వాతి ఎవ్వరీ దక్కకూడదని భావించాను. స్వాతిని చంపేయాలని నిర్ణయిం చుకుని పుస్తకాల మాటున కత్తిపెట్టుకుని రెండురోజులు వెంటపడ్డాను. మూడోరోజైన గత నెల 24వ తేదీన ప్రేమించాలంటూ ప్లాట్‌ఫారంపైనే చివరిసారిగా బతిమాలాడాను. అయితే యథాప్రకారం చీకొట్టడంతో ఆగ్రహంతో హతమార్చానని రామ్‌కుమార్ అంగీకరించాడు. పూర్తిస్థాయి విచారణ కోసం రామ్‌కుమార్‌ను రెండు రోజుల్లో చెన్నైకి తీసుకురానున్నారు.