రామ్కుమార్ శవపరీక్షకు స్పెషల్ టీమ్
రామ్కుమార్ శవపరీక్షకు స్పెషల్ టీమ్
Published Mon, Sep 19 2016 5:48 PM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
చెన్నై : ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో ప్రధాన నిందితుడు రామ్కుమార్ మరణంపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. డాక్టర్లు, నిపుణులతో నలుగురు సభ్యుల టీమ్ను ఏర్పాటుచేసి రామ్కుమార్ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. రిమాండ్ ఖైదీగా ఉన్న రామ్కుమార్ పుళల్ జైళ్లో ఆదివారం బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఇది కచ్చితంగా హత్యేనని, కేసును ముగించేందుకు పోలీసులు పన్నిన పన్నాగంగా అతడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
రామ్కుమార్ మరణంపై ఆయన సోదరుడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో, కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. విద్యుత్ వైర్ను కొరికి పట్టుకోవడంతో రామ్కుమార్ షాక్కు గురై చనిపోయినట్టు జైళ్లు శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే జైళ్ల శాఖ వర్గాల వాదనలు పలు అనుమానాలు దారితీస్తున్నాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే ఈ జైళ్లులో రామ్కుమార్ ఈ ప్రయత్నం ఎలా చేశాడని పలువురు ప్రశ్నిస్తున్నారు. చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో ఇటీవల ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి దారుణ హత్యకు గురైంది. సీసీటీవీ పుటేజీ ఆధారితంగా రామ్కుమార్ను జూలైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Advertisement