Infosys employee
-
వర్క్ ఫ్రమ్ ఆఫీస్.. మరో ఎత్తు వేసిన ఇన్ఫోసిస్!
దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పించడానికి మరో ఎత్తు వేసినట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్-ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ENG-IoT) ప్రాజెక్ట్‌లలో పనిచేసే ఉద్యోగులకు 'ఇన్-పర్సన్ కొల్లాబ్ వీక్స్'ని అమలు చేస్తోంది. తాము సమీక్షించిన ఇన్ఫోసిస్ ఉద్యోగుల ఈమెయిల్స్ ఉటంకిస్తూ ఎకనామిక్స్ టైమ్స్ ఈమేరకు పేర్కొంది. వీటి ప్రకారం.. తమకు కేటాయించిన వారాల్లో ఉద్యోగులు వారి సంబంధిత క్యాంపస్‌లలో హాజరు కావాలి. ఆఫీస్ నుంచి పనిచేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి త్రైమాసికంలో ఉద్యోగులకు నిర్దిష్ట వారాలను నిర్దేశిస్తుంది. గత ఏడాది నవంబర్‌లో ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వర్క్ పాలసీ ప్రకారం, ఇన్ఫోసిస్ ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు లేదా త్రైమాసికానికి 30 రోజులు ఆఫీస్ నుంచి పని చేయాలి. ఈ హైబ్రిడ్ వర్క్ అప్రోచ్ ద్వారా టీమ్ వర్క్, ఉత్పాదకతను పెంపొందించడం ఇన్ఫోసిస్ లక్ష్యం. బేస్ లొకేషన్లకు దూరంగా ఉన్న ఉద్యోగులు ఈ వారాల్లో డెవలప్మెంట్ సెంటర్లకు తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని కంపెనీ కోరింది. కొల్లాబ్ వీక్స్‌లో పాల్గొనే ఉద్యోగుల ఖచ్చితమైన సంఖ్య ఇంకా నిర్ణయించలేదని, ప్రతి త్రైమాసికానికి కనీసం ఆరు వారాలు ఆఫీస్ నుంచి పని చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ విధానాన్ని ఈ త్రైమాసికం నుంచి అమలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ నిర్దేశిత వారాలలో ఆఫీస్ నుంచి పనిచేసే ఉద్యోగులకు వారికి అనువైన రోజులను ఎంచుకోవడంలో సౌలభ్యాన్ని కంపెనీ అందిస్తోంది. 10 రోజుల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిబంధనపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, క్యాంపస్ హాజరును పెంచాలని ఇన్ఫోసిస్ చూస్తోంది. -
ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను!.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి 'యాన్ అన్‌కామన్ లవ్: ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి' బుక్ ఆవిష్కరించిన తరువాత, సంస్థలో చాలా మంది ఉద్యోగులకు తగినన్ని రివార్డ్ ఇవ్వలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేశారు. సంస్థ ఉన్నతికి ఉద్యోగుల సహకారం ప్రధానమని వెల్లడించారు. ఇన్ఫోసిస్ సంస్థ ఉన్నతికి ఉద్యోగులు చాలా కష్టపడుతున్నారని, వీరికి కంపెనీ కో-ఫౌండర్లకు ఇచ్చినంత స్టాక్‌ను ఇవ్వలేకపోయానని చింతించారు. ఉద్యోగులు కూడా సంస్థ వల్ల ప్రయోజనాలను పొందాలని, నేను కోరుకుంటున్నానని నారాయణ మూర్తి కోరారు. వారానికి 85 నుంచి 90 గంటలు 1981లో పూణేలో ప్రారంభమైన ఇన్ఫోసిస్ ప్రధాన కార్యాలయం ఇప్పుడు బెంగళూరులో ఉంది. నాతో (నారాయణ మూర్తి) పాటు, నందన్ నీలేకని, క్రిస్ గోపాలకృష్ణన్, శిబులాల్, కే దినేష్, ఎన్రాఎస్ ఘవన్, అశోక్ అరోరా సంస్థ ఏర్పాటుకు సహకరించారు. ప్రారంభంలో నేను వారానికి 85 నుంచి 90 గంటలు పనిచేశానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: ఒక్క రోజులోనే రూ.57 వేల కోట్లు మటాష్.. అయినా ఆవిడే ప్రపంచంలో రిచెస్ట్! టాయిలెట్స్ శుభ్రం చేయడంపై నారాయణమూర్తి వ్యాఖ్యలు ఇటీవల నారాయణ మూర్తి తన టాయిలెట్లను శుభ్రం చేయడం గురించి, ఎందుకు శుభ్రం చేయాలనే విషయాలను వెల్లడిస్తూ.. నా పిల్లలకు కూడా మన టాయిలెట్లను మనమే శుభ్రం చేసుకోవాలని, సమాజంలో ఎవరూ తక్కువ కాదని చెప్పినట్లు తెలిపారు. చాలామంది ధనవంతుల పిల్లలు ఇప్పటికి కూడా టాయిలెట్లను శిబిరం చేసుకోవడం మన పనికాదని భావిస్తారని అది కరెక్ట్ కాదని అన్నారు. -
రామ్‌కుమార్ ఆత్మహత్య
ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్ ఆదివా రం ఆత్మహత్య చేసుకున్నాడు. రిమాండ్ ఖైదీగా పుళల్ జైల్లో ఉన్న రామ్‌కుమార్ విద్యుత్ వైరును కొరికి మరీ బలవన్మరణానికి పాల్పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఇది ముమ్మాటికీ హత్యేనని, కేసు ను ముగించేందుకు పోలీసులు పన్నిన పన్నాగంగా అతడి కుటుంబీ కులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో స్వాతి హత్య కేసు విచారణ ఇక ముగిసినట్టే అన్నది స్పష్టం అవుతోంది. సాక్షి, చెన్నై: చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో ఇటీవల ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును చేదించేందుకు పోలీసులు తీవ్రంగా కుస్తీలు పట్టారు. చివరకు తిరునల్వేలి జిల్లా సెంగోట్టై సమీపంలోని మీనాక్షిపురంలో నక్కి ఉన్న నిందితుడ్ని పట్టుకున్నారు. తాము పట్టుకునే క్రమంలో నిందితుడు రామ్‌కుమార్ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్టు పోలీసులు తెర మీదకు తెచ్చిన వాదనను అతడి కుటుంబీకులు తీవ్రంగా ఖండించే పనిలో పడ్డారు. పోలీసులే బలవంతంగా గొంతు కోసి, తమ వాడ్ని అన్యాయంగా కేసులో ఇరికించారని ఆరోపించే పనిలో పడ్డారు. అలాగే, కేసును సీబీఐకి అప్పగించాలని పట్టుబడుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరి కొద్ది రోజుల్లో స్వాతి హత్య కేసుకు సంబంధించిన చార్జ్ షీట్‌ను కోర్టులో పోలీసులు దాఖలు చేయాల్సి ఉంది. అదే సమయంలో రామ్‌కుమార్ నిందితుడు అన్నది నిరూపించేందుకు తగ్గ ఆధారాల సేకరణ పోలీసులకు తలకు మించిన భారంగా మారిందన్న సంకేతాలు వెలువడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో రామ్‌కుమార్ పుళల్ కేంద్ర కారాగారంలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అయితే, అతడు ఆత్మహత్య చేసుకోలేదని, హతమార్చబడ్డాడన్న అనుమానాలతో ఆరోపణలు గుప్పించే వాళ్లు ఉండడం గమనార్హం. రామ్‌కుమార్ ఆత్మహత్య : పుళల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రామ్‌కుమార్ ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మరణించాడు. అయితే, రామ్‌కుమార్ ఎలా ఆత్మహత్య చేసుకున్నాడన్న వివరాలు తొలుత బయటకు రాలేదు. మీడియాల్లో రామ్‌కుమార్ ఆత్మహత్య వార్త హల్చల్ సృష్టించడంతో జైళ్ల శాఖ వర్గాలు స్పందించాయి. సాయంత్రం 4.45 గంటల సమయంలో టీ తాగినానంతరం నీళ్లు కోసం వెళ్లిన రామ్‌కుమార్ వంట గది వద్ద ఉన్న స్విచ్ బోర్డుకు వెళ్తున్న విద్యుత్ వైర్‌ను కొరికి తెంచినట్టు వివరించారు. ఆ వైర్‌ను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురైనట్టు ప్రకటించారు. హుటాహుటిన తాము ఆసుపత్రికి తరలించామని వివరించారు. అయితే, జైళ్ల శాఖ వర్గాల వాదనలు అనుమానాలకు దారి తీసి ఉన్నాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే పుళల్‌లో రామ్‌కుమార్ ఎలా ఈ ప్రయత్నం చేసి ఉంటాడని ప్రశ్నించే వాళ్లూ ఉన్నారు. ఇక, రామ్‌కుమార్ మృతదేహాన్ని రాయపేట మార్చురీకి తరలించిన సమాచారంతో అతడి న్యాయవాది రామ్రాజ్ పరుగులు తీశారు. శనివారం రామ్‌కుమార్‌ను తాను కలిసినట్టు, ఆరోగ్యంగా అతడు ఉన్నట్టు, ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కాని వ్యక్తిగానే కన్పించినట్టు ఆయన పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకునేంత మానసిక స్థితిలో అతడు లేదు అని ఆయన వాదిస్తుండడం అనుమానాలకు బలం చేకూరి ఉన్నాయి. అతడు మరణించిన సమాచారం కనీసం తనకు కూడా పోలీసులు చెప్పలేదని పేర్కొన్నారు. రామ్‌కుమార్ బంధువు సెల్వం మాట్లాడుతూ తమ వాడి మృత దేహాన్ని చూడడానికి కూడా తనను పోలీసులు అనుమతించడం లేదని కన్నీటి పర్యంతం అయ్యారు. హత్యగా ఆరోపణ: రామ్‌కుమార్ మరణించిన సమాచారం తమకు అధికారికంగా అందలేదని, మీడియాల్లో వచ్చిన వార్తల ద్వారానే తెలిసిందని అతడి తండ్రి పరమ శివం ఆవేదన వ్యక్తం చేశారు. తమ వాడు ఈ కేసులో నిర్దోషి అని, అతడ్ని అన్యాయంగా ఇరికించడమే కాకుండా, ఆధారాలు లభించక ఇప్పుడు హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. రామ్‌కుమార్ మరణ సమాచారంతో మీనాక్షిపురంలో ఉద్రిక్తత నెల కొంది. మీనాక్షిపురం, పన్పోలి, సెంగోటైై్ట్టవడకరై పరిసరాల్లో రామ్‌కుమార్ సామాజిక వర్గం అత్యధికంగా ఉండడంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. విచారణను సీబీఐకి అప్పగించినప్పుడే, స్వాతి హత్యకేసుతో పాటు రామ్‌కుమార్ కేసులోనూ దోషులు బయట పడతారని వీసీకే నేత తిరుమావళవన్ పేర్కొన్నారు. రామ్‌కుమార్ మరణంతో ఇక స్వాతి హత్య కేసు విచారణ ముగిసినట్టేనా అన్న ప్రశ్న బయలు దేరింది. -
స్వాతి హత్య కేసు అడ్డం తిరుగుతున్నదా?
సాక్షి, చెన్నై : ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో రామ్‌కుమార్‌ను రక్షించేందుకు తగ్గ వ్యూహ రచనల్లో నిందితుడి తరఫు న్యాయవాదులు నిమగ్నమైనట్టుంది. మీనాక్షి పురం గ్రామం అంతా రామ్‌కుమార్ వెంట ఉన్నట్టుగా చాటేపనిలో పడ్డట్టుంది. అరెస్టు జరిగిన రోజున రామ్‌కుమార్ గొంతును బలవంతంగానే కోసినట్టు ఆరోపిస్తూ, తెన్కాశి ఇన్స్పెక్టర్ బాలమురుగన్ బృందాన్ని కోర్టుకు లాగేం దుకు సిద్ధమయ్యారు. ఇందుకు తగ్గట్టుగా పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేరింది. అయితే, రామ్‌కుమార్ దోషి అని నిరూపించేందుకు తగ్గ ఆధారాల అన్వేషణను విచారణ బృందం వేగవంతం చేసింది. చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో గత నెల ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి దారు ణ హత్యకు గురైన విషయం తెలిసిందే. నిందితుడి గుర్తింపులో తీవ్ర కష్టాలు పడ్డ చెన్నై పోలీసులు చివరకు తిరునల్వేలి జిల్లా సెంగోట్టై సమీపంలోని మీనాక్షిపురానికి చెందిన రామ్‌కుమార్ హంతకుడిగా గుర్తిం చారు. తాము పట్టుకునే క్రమంలో నింది తుడు గొంతు కోసుకున్నట్టుగా పోలీసులు వాదించడమే కాదు, కేసూ పెట్టారు. నింది తుడు రామ్‌కుమార్ అన్నది తేలినా, సాక్ష్యాల సేకరణకు మరింత కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి. ఈ సమయంలో రామ్‌కుమార్ నిందితుడు కాదు అని, అమాయకుడని, ఎవర్నో రక్షించే యత్నంలో రామ్‌కుమార్‌ను బలిపశువు చేశారన్న ఆరోపణలు బయలు దేరాయి. ప్రధానంగా రామ్‌కుమార్ కుటుంబీకులు, మీనాక్షి పురం వాసు లు అయితే, రామ్‌కుమార్‌ను వెనకేసుకు వచ్చే రీతిలో వ్యవహరిస్తుండడం, అదే సమయంలో పలువురు న్యాయవాదులు రంగంలోకి దిగడం చోటుచేసుకున్నాయి. రామ్‌కుమార్ అమాయకుడిగా చాటేందు కు ఈ న్యాయవాదులు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారని చెప్పవచ్చు. ఈ పరిస్థితు ల్లో రామ్‌కుమార్ తండ్రి పరమశివం ద్వా రా ఆ రోజు రాత్రి ఏమి జరిగిందో...! అని వివరిస్తూ గొంతు కోసుకోలేదు...గొంతు కోశారు...అని చాటే రీతిలో సెంగోట్టై పోలీ సు స్టేషన్లో కేసు పెట్టించే పనిలో పడ్డారు. గొంతు కోశారు: బుధవారం రామ్‌కుమార్ తండ్రి పరమశివం సెంగోట్టై పోలీసు స్టేష న్లో ఓ ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఫిర్యాదును తీసుకునేందుకు స్టేషన్ సిబ్బంది నిరాకరించారు. చివరకు రామ్‌కుమార్‌గా అండగా ఉన్న న్యాయవాదులు రామరాజ్, రవికుమార్, మారికుట్టిలతో కలిసి పోలీసుస్టేషన్‌కు పరమశివం చేరుకున్నారు. ఇన్స్పెక్టర్ ప్రతాపన్లేని దృష్ట్యా, ఆయన వచ్చే వరకు వేచి ఉండక తప్పలేదు. ఇన్స్పెక్టర్ రాగానే, ఫిర్యాదును అందజేశారు. దానిని పరిశీలించిన ఇన్ స్పెక్టర్ ప్రతాపన్ పదిహేను రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి పంపించారు. అయితే, ఆ ఫిర్యాదులో గొంతు కోశారు అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించి ఉండడం గమనార్హం. తాను బీఎస్ఎన్ఎల్ లైన్మెన్గా పనిచేస్తున్నానని ఫిర్యాదులో పరమశివం గుర్తు చేశారు. తన కుమారుడు బీఈ చదివినట్టు, కొన్ని సబ్జెక్టులు తప్పినందున చెన్నైలో పనిచేస్తూ, చదువుకుంటూ వచ్చినట్టు వివరించారు.గత నెల 25న చెన్నై నుంచి రామ్‌కుమార్ తన ఇంటికి వచ్చాడని వివరిస్తూ, ఈనెల ఒకటో తేదీన అర్ధరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు మఫ్టీలో తన ఇంటి తలుపును కొట్టినట్టు పేర్కొన్నారు. తలుపుతీయగానే, తాము పోలీసుల మని పేర్కొంటూ లోనికి వచ్చే యత్నం చేశారని, అప్పటికే, వెనుక వైపు నుంచి మరో ఇద్దరు పోలీసులు పరుగున వచ్చి రామ్‌కుమార్ గొంతు కోసుకుని ఉన్నట్టుగా చెప్పడంతో ఆందోళనకు గురైనట్టే వివరించారు. వెనుక వైపు వెళ్లి చూడగా రక్తపు మడుగులో తన కుమారుడు ఉండడంతో కేకులు పెట్టానని, ఆ శబ్దానికి ఇరుగు పొరుగు వారు పరుగులు తీయడంతో, తెన్కాశి ఇన్స్పెక్టర్ బాల మురుగన్ తన సిబ్బందిని అరుస్తూ, రామ్‌కుమార్‌ను బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించి తీసుకెళ్లారని వివరించారు. అయితే, రామ్‌కుమార్ గొంతు కోసుకోలేదని, బలవంతంగా తెన్కాశి ఇన్స్పెక్టర్ బాల మురుగన్ కోసి నాటకం రచించారని ఆరోపించారు. బాలమురుగ న్‌తో పాటు, తన ఇంటికి వచ్చిన వారందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని విన్నవించారు. మీడియాతో న్యాయవాదులు, రామ్‌కుమార్ తండ్రి మాట్లాడుతూ పథకం ప్రకారం పోలీసులు విచారణ సాగించారని ఆరోపించారు. పథకం ప్రకారం రామ్‌కుమార్‌ను ఇరికించడంతో పాటు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి ఉన్నారని వివరించారు. మరో వైపు దోషిగా నిరూపించేందుకు తగ్గ ఆధారాల అన్వేషణలో విచారణ బృందం పరుగులు తీస్తున్నది. -
ప్రేమోన్మాదంతో స్వాతి ప్రాణాలు తీసిన మృగాడు
ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. మొత్తం పోలీస్‌శాఖను పరుగులు పెట్టించిన నిందితుడు రామ్‌కుమార్ తిరునెల్వేలి జిల్లాలోని అతని ఇంట్లో దాక్కుని ఉండగా శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆస్పత్రిలో చేర్పించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై శివారు పనూరులోని ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి (24) గత నెల 24వ తేదీ ఉదయం 6.30 గంటలకు నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో హత్యకు గురైన సంగతి పాఠకులకు విదితమే. నుంగంబాక్కం రైల్వే బుకింగ్ కమర్షియల్ మేనేజర్ రఘుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎగ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకే సవాల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది. విచారణను వేగవంతం చేయడంలో భాగంగా కేసు దర్యాప్తు బాధ్యతను గత నెల 27వ తేదీన చెన్నై పోలీస్ కమిషనర్‌కు అప్పగించబడింది. సుమారు పదికిపైగా ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుడి వేటలో పడ్డాయి. రాష్ట్రం నలుమూలలా పరుగులు పెట్టా శయి. స్వాతి పనిచేసిన బెంగళూరు కార్యాలయం ఉద్యోగులను విచారించాయి. స్వాతి నివాసం ఉంటున్న చెన్నైలోని చూలైమేడు, ఉద్యోగం చేస్తున్న మహేంద్రా గోల్డ్ సిటీ పరిసరాలు, తోటి ఉద్యోగులు, స్నేహితులు, బంధువులు, ఇరుగూపొరుగూ ఇలా ఎవ్వరినీ విడిచిపెట్టకుండా విచారణ సాగించారు. సుమారు ఐదు చోట్ల నుంచి సీసీ టీవీ కెమెరాల పుటేజీని సేకరించి పరిశీలించారు. హత్యచేసి పారిపోతున్నట్లుగా ఉండిన సీసీ టీవీల నుంచి సేకరించిన వీడియోలతో కేసు కొద్దిగా ముం దుకు సాగినా నిందితుడు పలానా అని తెలిసినా ఆచూకీ చిక్కకపోవడంతో పోలీసులు బిక్కచచ్చిపోయారు. సినీ పక్కీలో చిక్కాడిలా: నిందితుడి ఊహాచిత్రాన్ని తయారుచేసిన పోలీసులు చివరకు సినీ పక్కీలో వ్యూహం పన్ని నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడి ఫోటోలను చూపుతూ చెన్నై నగరం, శివార్లలోని హాస్టళ్లు, మేన్షన్లను తనిఖీ చేశారు. హత్య జరిగిన రోజు నుంచి ప్రతిరోజూ కేసు విచారణను ఛేదించుకుంటూ వచ్చారు. స్వాతి ఇంటికి సమీపంలో అనేక మేన్షన్‌లు ఉండగా వాటన్నిటిపైనా నిందితుడి ఫొటోను అతికించారు. దీంతో ఏఎస్ మేన్షన్‌లో నివసించే ఒక యువకుడు నిందితుడి ఫొటోను గు ర్తించి స్వాతి హత్య జరిగిన రోజు నుంచి ఇతను కని పించడం లేదని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మేన్షన్ వాచ్‌మన్‌ను విచారించగా ఓ మోస్తరు గుర్తుపట్టినట్లు తెలిపాడు. మేన్షన్కు అమర్చిన సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా హత్య జరిగిన రోజున వేసుకున్న దుస్తులతో అతను తిరిగిన వీడియో రికార్డయింది. దీంతో అనుమానం బలపడిన పోలీసులు నిందితుడు బస చేసిన రూము తాళాలు పగులగొట్టి సూట్‌కేసులు తనిఖీ చేయగా హత్య చేసినపుడు వేసుకున్న దుస్తులు రక్తపు మరకలతో దొరికాయి. దీంతో అతడే నిందితుడని మరింతగా నిర్దార ణ అయింది. ఇదిలా ఉండగా క్లోనింగ్ ద్వారా డూప్లికేట్ సిమ్‌కార్డును సిద్ధం చేసుకున్న పోలీసులకు నిందితుడు రామ్‌కుమార్ శుక్రవారం సాయంత్రం తన సెల్‌ఫోన్ ఆన్‌చేసి వాట్సాప్‌ల ద్వారా స్నేహితులతో మాట్లాడాడు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రామ్‌కుమార్ ఎక్కడ ఉన్నది పోలీసులకు తెలిసిపోయింది. తిరునెల్వేలి జిల్లా చెంగోట్టైకి సమీపం మీనాక్షిపురం అంబేద్కర్ నగర్ చెందిన పరమశివన్ అనే వ్యక్తి కుమారుడు రామ్‌కుమార్‌ను హంతకుడిగా ఈనెల 1వ తేదీన నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని తిరునెల్వేలి జిల్లా ఎస్పీ విక్రమన్‌కు చెన్నై నుంచి ప్రత్యేక పోలీసులు శుక్రవారం రాత్రి 11 గంటలకు సమాచారం ఇచ్చారు. తిరునెల్వేలి పోలీసులు మారు వేషం వేసుకుని శుక్రవారం రాత్రి మీనాక్షిపురంలో తిరిగి నిందితుడు ఇంట్లో ఉన్నట్లు ఖరారు చేసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల తరువాత రామ్‌కుమార్ ఇంటిని చుట్టుముట్టారు. పోలీసుల రాకను గ్రహించిన అతని తాత వెంటనే కేకలు వేసి ఇంట్లోని వ్యక్తులను అప్రమత్తం చేశాడు. ఇంటి వెలుపల ఉన్న పశువుల కొట్టంలో పడుకుని ఉన్న రామ్‌కుమార్ పోలీసులను చూడగానే షేవింగ్ చేసుకునే బ్లేడుతో గొంతుకోసుకున్నాడు. సరిగ్గా అప్పుడే రామ్‌కుమార్‌ను సమీపించిన పోలీసులు వెంటనే తిరునెల్వేలిఆసుపత్రిలో చేర్పించగా గొంతుపై 18 కుట్లు వేశారు. అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. -
నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని..
చీకొట్టింది, చీదరించుకుంది స్వాతి హత్యకేసులో నిందితుడు రామ్‌కుమార్ వాంగ్మూలం ప్రేమించాల్సిందిగా స్వాతిని ఎంతగానో బతిమలాడాను, చీదరించుకుంది, చీకొట్టింది, అందుకే హతమార్చానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిందితుడు రామ్‌కుమార్ చెప్పాడు. సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి (24)ని దారుణంగా హత్యచేసిన రామ్‌కుమార్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులను చూడగా నే బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ప్రాథమిక చికిత్స ప్రారంభించి గొంతుకు 18 కుట్లు వేయడం ద్వారా పోలీసులు రామ్‌కుమార్ ప్రాణాలు కాపాడగలిగారు. కొద్దిగా కోలుకున్న తరువాత తిరునెల్వేలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు అతని నుంచి వాంగ్మూలం సేకరించారు. ఈ సందర్భంగా స్వాతిని తాను హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్యకు దారితీసిన పరిస్థితులను వివరించాడు. అతను చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరునెల్వేలిలోని ఐన్‌స్టీన్ ఇంజనీరింగ్ కళాశాలలో గత ఏడాది మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయాల్సి ఉండగా నాలుగు బ్యాక్‌లాగ్స్ నిలిచిపోయాయి. మూడు నెలల క్రితం ఉద్యోగాన్వేషణలో చెన్నైకి చేరుకున్నాను. చూలైమేడు సౌరాష్ట్రా నగర్‌లోని ఏఎస్ మేన్షన్‌లో నివాసం ఏర్పాటు చేసుకుని సమీపంలోని ఒక వస్త్రదుకాణంలో గుమాస్తాగా చేరాను. అక్కడి సమీపంలో నివసించే స్వాతి ప్రతిరోజూ నేను నివసించే మేన్షన్ మీదుగానే వెళ్లేది. నేను మెకానికల్ ఇంజనీరునని, నెలకు రూ.లక్ష జీతానికి పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాను. ప్రతిరోజూ మాటలు కలపడం ప్రారంభించాను. ఈ దశలో నేను ఇంజనీరును కాదని, ఒక వస్త్రదుకాణంలో గుమాస్తా అని స్వాతి తెలుసుకుని దూరం పెట్టడం ప్రారంభించింది. స్వాతిపై ప్రేమను పెంచుకున్న తాను అనేక సార్లు ఆమె వెంటపడి చెప్పడం ప్రారంభించాను. తనపై కోపంతో కసిరికొట్టింది. వెంటపడవద్దని బెదిరిం చింది. ప్రతిరోజూ తండ్రిని వెంటపెట్టుకుని రైల్వేస్టేషన్‌కు వెళుతూ నేను మాట్లాడే అవకాశమే లేకుండా చేసింది. స్వాతితో కలిసి ఉన్న జీవితా న్ని ఊహించుకున్నా, ఆమె లేని జీవితం వృథాఅని బాధపడ్డాను. ఇలా ఎడబాటుకు లోనైస్థితి లో నాకు దక్కని స్వాతి ఎవ్వరీ దక్కకూడదని భావించాను. స్వాతిని చంపేయాలని నిర్ణయిం చుకుని పుస్తకాల మాటున కత్తిపెట్టుకుని రెండురోజులు వెంటపడ్డాను. మూడోరోజైన గత నెల 24వ తేదీన ప్రేమించాలంటూ ప్లాట్‌ఫారంపైనే చివరిసారిగా బతిమాలాడాను. అయితే యథాప్రకారం చీకొట్టడంతో ఆగ్రహంతో హతమార్చానని రామ్‌కుమార్ అంగీకరించాడు. పూర్తిస్థాయి విచారణ కోసం రామ్‌కుమార్‌ను రెండు రోజుల్లో చెన్నైకి తీసుకురానున్నారు. -
‘నాకు బతకాలని లేదు.. ’
♦ సూసైడ్ నోట్ రాసి ఇన్ఫోసిస్ ఉద్యోగి బలవన్మరణం ♦ ఘట్కేసర్ మండలం సంస్కృతి టౌన్షిప్లో ఘటన ఘట్కేసర్: ఇన్ఫోసిస్ ఉద్యోగి ఒకరు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్ కోల్‌కతాకు చెందిన రోషన్‌కుమార్ చౌదరి(23) మండలంలోని సంస్కృతి టౌన్‌షిప్‌లోని సీ2 బ్లాక్‌లోని 401 నంబర్ ఫ్లాట్‌లో ఈఏడాది ఫిబ్రవరి నుంచి అద్దెకుంటున్నాడు. సమీపంలోని ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం ఉదయం సదరు బ్లాక్ వద్ద కాపలాదారుగా పనిచేస్తున్న అజయ్‌కుమార్ ఫ్లాట్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతున్న రోషన్‌కుమార్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. రోషన్‌కుమార్ మంగళవారం రాత్రి ఉరివేసుకొని చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.‘నాకు బతకాలని లేదు..ఈ జీవితం నాకు వద్దు. నాన్న నన్ను క్షమించు..’ అని రోషన్‌కుమార్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోషన్‌కుమార్ ఆత్మహత్య ఘటనపై అతడి కుటుంబీకులకు సమాచారం అందజేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన రోషన్‌కుమార్(27) స్థానిక సంస్కృతి టౌన్‌షిప్‌లోని ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగి అయిన అతడు మంగళవారం రాత్రి తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం గమనించిన వాచ్మెన్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గదిని పరిశీలించగా 'తన మృతికి ఎవరూ కారణం కాదు' అని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీఐ ప్రకాశ్ సంఘటన స్థలిని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. -
అదృశ్యమైన ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి
బ్రసెల్స్: బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఉగ్రదాడుల తర్వాత అదృశ్యమైన భారతీయుడు రాఘవేంద్ర గణేశన్ మృతిచెందారు. ఇన్ఫోసిస్ ఉద్యోగి అయిన రాఘవేంద్ర గణేశన్ మృతి చెందినట్టు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఉగ్రదాడుల అనంతరం బెంగళూరుకు చెందిన గణేశన్ ఆచూకీ గల్లంతయింది. అతడు చివరిసారిగా బ్రసెల్స్‌లోని ఓ మెట్రో రైలు నుంచి కాల్ చేసినట్లు అధికారులు తెలిపారు. అతడి ఆచూకీ కనుక్కొనేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. -
'ఈత సరదా ఇన్ఫోసిస్ ఉద్యోగి ప్రాణం తీసింది'
బషీరాబాద్: ఈత సరదా ఓ ఇన్ఫోసిస్ ఉద్యోగి ప్రాణం తీసింది. బంధువులతో కలిసి కాగ్నా నదిలో దిగిన అతడు నీటమునిగి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డిజిల్లా బషీరాబాద్ మండల పరిధిలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బషీరాబాద్ మండల కేంద్రానికి చెందిన షాబుద్దీన్, జకీయాబేగం దంపతులు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వీరి చిన్న కుమారుడు మహ్మద్ యూసుఫ్‌ఖాన్(26) ఇంజినీరింగ్ పూర్తి చేసి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. బషీరాబాద్‌లో బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో యూసూఫ్‌ఖాన్ కుటుంబసభ్యులతో కలిసి వచ్చాడు. ఆదివారం అతడు బంధువులు, స్నేహితులతో కలిసి నవాంద్గి సమీపంలో ఉన్న కాగ్నానదిలోకి ఈతకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో యూసుఫ్‌ఖాన్ నీటిలో మునిగి పోయాడు. స్నేహితులు, బంధువులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. స్థానికుల సాయం తో నదిలో గాలించగా సాయంత్రం 5 గంటలకు యూసుఫ్‌ఖాన్ మృతదేహం లభ్యమైంది. చేతికి అందివచ్చిన కొడుకు నదిలో మునిగి చనిపోవడంతో షాబుద్దీన్, జకీయాబేగం దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడు అవివాహితుడు. కాగా, యూసుఫ్‌ఖాన్ మృతిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
రోడ్డు ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి
-
రోడ్డు ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి
హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి చెందింది. ఈ సంఘటన శంషాబాద్ సమీపంలోని హిమాయత్‌సాగర్ సమీపంలో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. నజియా సుల్తానా అనే ఇన్ఫోసిస్ ఉద్యోగిని కారులో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేందుకు విమానాశ్రయానికి వెళుతుండగా మార్గమధ్యలోనే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దాంతో నజియా సుల్తానా అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు కాగా కారు డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. -
సిడ్నీలో ‘ఉగ్ర’టెన్షన్ సుఖాంతం
-
సిడ్నీలో ‘ఉగ్ర’టెన్షన్!
* కఫేలో పలువురిని బందీలుగా పట్టుకున్న సాయుధుడు * కమెండో ఆపరేషన్‌తో వారిని విడిపించిన పోలీసులు * సురక్షితంగా బయటపడిన వారిలో తెలుగువాడు * పోలీసుల ఆపరేషన్‌లో ఇద్దరు మృతి!.. ఆస్ట్రేలియాలో హైఅలర్ట్ సిడ్నీ: సిడ్నీలో సోమవారం ఉదయం 9.30 గంటలు.. నగరంలోని ప్రధాన వాణిజ్య కేంద్రం మార్టిన్ప్లేస్.. అక్కడి లింట్ చాక్లెట్ కఫేలోకి షాట్‌గన్, మందుగుండు సామగ్రితో ప్రవేశించిన దుండగుడు.. కఫే ద్వారాలు మూసేసి తుపాకీతో బెదిరించి అందులోని దాదాపు 15 మందిని నిర్బంధించాడు. వారిలో తెలుగువాడైన ఇన్ఫోసిస్ ఉద్యోగి అంకిరెడ్డి విశ్వకాంత్‌రెడ్డి, మరో భారతీయుడు పుష్పేందుఘోష్ ఉన్నారు. మంగళవారం తెల్లవారుజాము 2.30 (సిడ్నీ కాలమానం).. ఉగ్రవాద ఘటనలపై స్పందించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన టాస్క్‌ఫోర్స్ కమెండోలు పూర్తి రక్షణతో అత్యాధునిక ఆయుధాలతో ఆ కఫేలోకి దూసుకెళ్లారు. కాసేపు భారీ శబ్దాలు, తుపాకీ కాల్పుల ధ్వనులు.. అనంతరం బందీలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన కమెండోలు. అయితే, పోలీస్ ఆపరేషన్ కన్నా ముందే విశ్వకాంత్ తప్పించుకోవడం కొసమెరుపు. 17 గంటలకు పైగా బందీలు, వారి బంధువులను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారని, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. అయితే పోలీసులు నిర్ధారించలేదు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని మాత్రం ప్రకటించారు. విశ్వకాంతతో పాటు బందీగా ఉన్న మరో భారతీయుడు పుష్పేందు కూడా సురక్షితంగా బయటపడ్డాడు. ఈ దుశ్చర్యకు పాల్పడింది ఇరాన్ దేశస్తుడైన, తనకు తాను ముస్లిం మతపెద్దగా ప్రకటించుకున్న హరోన్ మోనిస్(50) అని తెలుస్తోంది. ఆయన 1996లో శరణార్థిగాఆస్ట్రేలియా వచ్చాడు. తన మాజీ భార్యను దారుణంగా హత్య చేశాడని గత సంవత్సరం.. ఒక మహిళను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అఫ్గానిస్తాన్‌లో విధులు నిర్వర్తిస్తూ చనిపోయిన ఆస్ట్రేలియా సైనికులను హంతకులని దూషిస్తూ వారి కుటుంబాలకు లేఖలు రాసేవాడు. తాను ఆధ్యాత్మిక సూచనలిస్తానని పత్రికల్లో ప్రకటనలిచ్చేవాడు. ఈ దుశ్చర్యకు పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది అన్న వార్తలు వచ్చాయి కానీ వాటిని ఎవరూ నిర్ధారించలేదు. అయితే, ఇస్లామిక్ స్టేట్ జెండాను కఫేలోకి పంపించాలని, ఆస్ట్రేలియా ప్రధాని అబ్బాట్‌తో మాట్లాడించాలని హరోన్ డిమాండ్ చేశాడని సమాచారం. హరోన్ మోనిస్‌ను ప్రాణాలతో పట్టుకున్నారా? లేక ఎదురుకాల్పుల్లో మరణించాడా? అనే విషయాన్ని కూడా పోలీసులు వెల్లడించడంలేదు. హరోన్తో పాటు ఒక బందీ చనిపోయాడని, ముగ్గురు గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. సిడ్నీ సహా ఆస్ట్రేలియా అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ కఫేలోని అద్దాల కిటీకీల గుండా చేతులు పెకైత్తి నిలుచున్న కొందరు బందీలు, అరబిక్ భాషలో ప్రార్థనాగీతం రాసి ఉన్న నలుపురంగు జెండా కనిపించాయని ఓ చానల్ పేర్కొంది. ఉగ్రవాద ఘటనల సమయంలో స్పందించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన టాస్క్‌ఫోర్స్ ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆ కఫే ఉన్న భవనంలో ఎస్బీఐ, బరోడా బ్యాంకుల శాఖలు కూడా ఉన్నాయి. ఈ ఘటన నేపథ్యంలో ఆ కఫేకు కేవలం 300-400 మీటర్ల దూరంలో ఉన్న భారతీయ కాన్సులేట్ ఉద్యోగులను పంపించేశారు. కాగా, సిడ్నీలో మా ప్రతాపం చూశారుగా తర్వాత లక్ష్యం బెంగళూరే అంటూ ఇస్లామిక్ స్టేట్ మీడియా పేరుతో ఉన్న ట్వీటర్ అకౌంట్ ద్వారా బెంగళూరు పోలీసులకు బెదిరింపులు వచ్చాయి. గుంటూరువాసి సురక్షితం సాక్షి, గుంటూరు/హైదరాబాద్: సిడ్నీ ఘటనలో బందీగా ఉన్న తెలుగువాడైన విశ్వకాంత్‌రెడ్డి అంకిరెడ్డి సురక్షితంగా బయటపడటంతో అంతా సంతోషం వ్యక్తం చేశారు. గుంటూరుకు చెందిన విశ్వకాంత్ ఇన్ఫోసిస్‌లో పనిచేస్తూ ఏడేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. విశ్వకాంత్ ఈ ఘటనలో చిక్కుకుపోవడంతో భయాందోళనలకు గురైన ఆయన తండ్రి ఈశ్వర్‌రెడ్డి.. కుమారుడి క్షేమ సమాచారం విని ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 10 గంటలకు ఆఫీస్‌కు బయల్దేరిన తన కుమారుడు మార్గమధ్యంలో కఫేకు వెళ్లాడని, అక్కడే తన కుమారుడితో పాటు మరో 29 మందిని దుండగుడు నిర్బంధంలోకి తీసుకున్నాడని ఆయన వివరించారు. బందీలకు ఎలాంటి హానీ చేయలేదని, ఆహారం కూడా ఇచ్చారని తెలిసిందన్నారు. బిట్స్ పిలానీలో చదువు పూర్తి చేసిన విశ్వకాంత్ మొదట యూఎస్‌లో ఉద్యోగం చేశారు. అనంతరం ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం రావడంతో ఆస్ట్రేలియా వెళ్లారు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
ఘట్కేసర్, న్యూస్‌లైన్: భవనం పైనుంచి దూకి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్ణాటక రాష్ట్రం హుబ్లీకి చెందిన దీపక్ అబీబ్ (33) ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండల పరిధిలోని సంస్కృతి టౌన్షిప్ లో నివాసముంటున్నారు. ఎముకల వ్యాధితో బాధపడుతున్న దీపక్, తరచూ నొప్పి నివారణ మందులు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున టౌన్షిప్లో పెద్ద శబ్దం రావడంతో వాచ్ మెన్ వెళ్లి చూడగా దీపక్ కొన ఊపిరితో కనిపించాడు. 108 సిబ్బంది పరీక్షించేసరికి మృతి చెందాడు. తొలుత చేతికి గాయం చేసుకుని తర్వాత మూడో అం తస్తు నుంచి కిందికి దూకి ఉంటాడని అనుమానిస్తున్నారు. హుబ్లీ నుండి అతడి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత దీపక్ ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉందని సీఐ చలపతి తెలిపారు. -
బిల్డింగ్‌పై నుంచి పడి ఇన్పోసిస్ ఉద్యోగి మృతి
హైదరాబాద్ నగర శివారు ఘట్కేసర్లోని అన్నోజిగూడలో సింగపూర్ టౌన్షిప్లో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీపక్ ఫకీర్ హబీబ్ ఈ రోజు ఉదయం పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్‌లో దీపక్ పని చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. ఇటీవల అతడు బెంగళూరు నుంచి బదిలీపై హైదరాబాద్ వచ్చాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.