ప్రేమోన్మాదంతో స్వాతి ప్రాణాలు తీసిన మృగాడు | Chennai Infosys techie murder: Twitter reacts to much-delayed arrest of Swathi's killer | Sakshi
Sakshi News home page

ప్రేమోన్మాదంతో స్వాతి ప్రాణాలు తీసిన మృగాడు

Published Sun, Jul 3 2016 2:54 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

ప్రేమోన్మాదంతో స్వాతి ప్రాణాలు తీసిన మృగాడు - Sakshi

ప్రేమోన్మాదంతో స్వాతి ప్రాణాలు తీసిన మృగాడు

ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. మొత్తం పోలీస్‌శాఖను పరుగులు పెట్టించిన నిందితుడు రామ్‌కుమార్ తిరునెల్వేలి జిల్లాలోని అతని ఇంట్లో దాక్కుని ఉండగా శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆస్పత్రిలో చేర్పించారు.
 
సాక్షి ప్రతినిధి, చెన్నై:  చెన్నై శివారు పనూరులోని ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి (24) గత నెల 24వ తేదీ ఉదయం 6.30 గంటలకు నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో హత్యకు గురైన సంగతి పాఠకులకు విదితమే. నుంగంబాక్కం రైల్వే బుకింగ్ కమర్షియల్ మేనేజర్ రఘుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎగ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 
 పోలీసులకే సవాల్:

  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది. విచారణను వేగవంతం చేయడంలో భాగంగా కేసు దర్యాప్తు బాధ్యతను గత నెల 27వ తేదీన చెన్నై పోలీస్ కమిషనర్‌కు అప్పగించబడింది. సుమారు పదికిపైగా ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుడి వేటలో పడ్డాయి. రాష్ట్రం నలుమూలలా పరుగులు పెట్టా శయి. స్వాతి పనిచేసిన బెంగళూరు కార్యాలయం ఉద్యోగులను విచారించాయి.
 
  స్వాతి నివాసం ఉంటున్న చెన్నైలోని చూలైమేడు, ఉద్యోగం చేస్తున్న మహేంద్రా గోల్డ్ సిటీ పరిసరాలు, తోటి ఉద్యోగులు, స్నేహితులు, బంధువులు, ఇరుగూపొరుగూ ఇలా ఎవ్వరినీ విడిచిపెట్టకుండా విచారణ సాగించారు. సుమారు ఐదు చోట్ల నుంచి సీసీ టీవీ కెమెరాల పుటేజీని సేకరించి పరిశీలించారు. హత్యచేసి పారిపోతున్నట్లుగా ఉండిన సీసీ టీవీల నుంచి సేకరించిన వీడియోలతో కేసు కొద్దిగా ముం దుకు సాగినా నిందితుడు పలానా అని తెలిసినా ఆచూకీ చిక్కకపోవడంతో పోలీసులు బిక్కచచ్చిపోయారు.
 
 సినీ పక్కీలో చిక్కాడిలా:
 నిందితుడి ఊహాచిత్రాన్ని తయారుచేసిన పోలీసులు చివరకు సినీ పక్కీలో వ్యూహం పన్ని నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడి ఫోటోలను చూపుతూ చెన్నై నగరం, శివార్లలోని హాస్టళ్లు, మేన్షన్లను తనిఖీ చేశారు. హత్య జరిగిన రోజు నుంచి ప్రతిరోజూ కేసు విచారణను ఛేదించుకుంటూ వచ్చారు. స్వాతి ఇంటికి సమీపంలో అనేక మేన్షన్లు ఉండగా వాటన్నిటిపైనా నిందితుడి ఫొటోను అతికించారు.
 
దీంతో ఏఎస్ మేన్షన్‌లో నివసించే ఒక యువకుడు నిందితుడి ఫొటోను గు ర్తించి స్వాతి హత్య జరిగిన రోజు నుంచి ఇతను కని పించడం లేదని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మేన్షన్ వాచ్‌మన్‌ను విచారించగా ఓ మోస్తరు గుర్తుపట్టినట్లు తెలిపాడు. మేన్షన్‌కు అమర్చిన సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా హత్య జరిగిన రోజున వేసుకున్న దుస్తులతో అతను తిరిగిన వీడియో రికార్డయింది. దీంతో అనుమానం బలపడిన పోలీసులు నిందితుడు బస చేసిన రూము తాళాలు పగులగొట్టి సూట్‌కేసులు తనిఖీ చేయగా హత్య చేసినపుడు వేసుకున్న దుస్తులు రక్తపు మరకలతో దొరికాయి.
 
 దీంతో అతడే నిందితుడని మరింతగా నిర్దార ణ అయింది. ఇదిలా ఉండగా క్లోనింగ్ ద్వారా డూప్లికేట్ సిమ్‌కార్డును సిద్ధం చేసుకున్న పోలీసులకు నిందితుడు రామ్‌కుమార్ శుక్రవారం సాయంత్రం తన సెల్‌ఫోన్ ఆన్‌చేసి వాట్సాప్‌ల ద్వారా స్నేహితులతో మాట్లాడాడు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రామ్‌కుమార్ ఎక్కడ ఉన్నది పోలీసులకు తెలిసిపోయింది.
 
తిరునెల్వేలి జిల్లా చెంగోట్టైకి సమీపం మీనాక్షిపురం అంబేద్కర్ నగర్ చెందిన  పరమశివన్ అనే వ్యక్తి కుమారుడు రామ్‌కుమార్‌ను హంతకుడిగా ఈనెల 1వ తేదీన నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని తిరునెల్వేలి జిల్లా ఎస్పీ విక్రమన్‌కు చెన్నై నుంచి ప్రత్యేక పోలీసులు శుక్రవారం రాత్రి 11 గంటలకు సమాచారం ఇచ్చారు. తిరునెల్వేలి పోలీసులు మారు వేషం వేసుకుని శుక్రవారం రాత్రి మీనాక్షిపురంలో తిరిగి నిందితుడు ఇంట్లో ఉన్నట్లు ఖరారు చేసుకున్నారు.
 
అర్ధరాత్రి 12 గంటల తరువాత రామ్‌కుమార్ ఇంటిని చుట్టుముట్టారు. పోలీసుల రాకను గ్రహించిన అతని తాత వెంటనే కేకలు వేసి ఇంట్లోని వ్యక్తులను అప్రమత్తం చేశాడు. ఇంటి వెలుపల ఉన్న పశువుల కొట్టంలో పడుకుని ఉన్న రామ్‌కుమార్ పోలీసులను చూడగానే షేవింగ్ చేసుకునే బ్లేడుతో గొంతుకోసుకున్నాడు. సరిగ్గా అప్పుడే రామ్‌కుమార్‌ను సమీపించిన పోలీసులు వెంటనే తిరునెల్వేలిఆసుపత్రిలో చేర్పించగా గొంతుపై 18 కుట్లు వేశారు. అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement