Ram Kumar
-
సాకేత్ జంట సంచలనం
సాక్షి, హైదరాబాద్: సియోల్ ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ సంచలన విజయంతో బోణీ చేసింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.తొలి రౌండ్లో సాకేత్–రామ్‌కుమార్ జంట 7–6 (7/5), 6–4తో రెండో సీడ్ క్రిస్టియన్ రోడ్రిగెజ్ (కొలంబియా)– రోమియోస్ (ఆస్ట్రేలియా) జోడీని కంగుతినిపించింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్ జంట ఐదు ఏస్‌లు సంధించింది. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది.అనిరుధ్ జోడీ ముందంజ ఇదే టోర్నీలో ఆడుతున్న హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ భారత్‌కే చెందిన తన భాగస్వామి నిక్కీ కలియంద పూనాచాతో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో మూడో సీడ్ అనిరుధ్–నిక్కీ ద్వయం 6–3, 7–5తో ఎస్కోఫియర్–బెనోట్ పెయిర్ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో దివిజ్ శరణ్ (భారత్)–ఇసారో (థాయ్‌లాండ్) జంట 3–6, 5–7తో మొరెనో (అమెరికా)–రూబిన్ స్థాతమ్ (న్యూజిలాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది.రిత్విక్ ద్వయం ముందంజసాక్షి, హైదరాబాద్: స్లొవాక్ ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–అర్జున్ ఖడే (భారత్) జోడీ ముందంజ వేసింది. స్లొవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్లో రిత్విక్–అర్జున్ ద్వయం 6–4, 6–4తో భారత్‌కే చెందిన జీవన్ నెడుంజెళియన్–విజయ్ సుందర్ ప్రశాంత్ జంటను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.ఇటీవల కజకిస్తాన్‌లో జరిగిన అల్మాటీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో టైటిల్ నెగ్గిన రిత్విక్–అర్జున్ ఈ మ్యాచ్‌లో కీలకదశలో పాయింట్లు గెలిచింది. తొలి సెట్లో ఒకసారి, రెండో సెట్లో ఒకసారి ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను బ్రేక్ చేసి తమ సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని దక్కించుకుంది. భారత్‌కే చెందిన శ్రీరామ్ బాలాజీ కూడా డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–గిడో ఆండ్రెజి (అర్జెంటీనా) ద్వయం 6–3, 6–7 (2/7), 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో ఫ్రాన్సిస్కో కబ్రాల్ (పోర్చుగల్)–మాట్వీ మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది.క్వార్టర్ ఫైనల్లో రష్మిక జోడీసాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 మహిళల టెన్నిస్ టోర్నమెంట్ లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో ఓడిపోయిన రష్మిక... డబుల్స్ విభాగంలో భారత్‌కే చెందిన తన భాగస్వామి వైదేహి చౌదరీతో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.ప్రపంచ 422వ ర్యాంకర్ గాబ్రియేలా డ సిల్వా ఫిక్ (ఆస్ట్రేలియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 300వ ర్యాంకర్ రష్మిక 5–7, 3–6తో ఓడిపోయింది. 88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక నాలుగు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక–వైదేహి జోడీ 7–6 (7/3), 6–4తో మూడో సీడ్ లీ యు యున్ (చైనీస్ తైపీ)–నీనా వర్గోవా (స్లొవేకియా) జంటపై సంచలన విజయం సాధించింది. -
సానియా జోడీ అవుట్
మహిళల డబుల్స్‌లో హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ తొలిరౌండ్లోనే కంగుతింది. సానియా–లూసీ హ్రాడెకా (చెక్ రిపబ్లిక్) జంట 6–4, 4–6, 2–6తో మగ్దలినా ఫ్రెచ్ (పోలండ్)–బియట్రోజ్ హదడ్ (బ్రెజిల్) ద్వయం చేతిలో ఓడింది. సానియా మిక్స్డ్ డబుల్స్‌లో మలె పవిక్ (క్రొయేషియా)తో బరిలోకి దిగనుంది. పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో రామ్‌కుమార్ రామనాథన్–బెర్కిక్ (బోస్నియా) ద్వయం 3–6, 6–7 (5/7), 6–7 (5/7)తో అమెరికా జోడీ మోన్రో– టామి పాల్ చేతిలో ఓడింది. చదవండి: Wimbledon 2022: స్వియాటెక్ ముందంజ -
పోరాడి ఓడిన రామ్‌కుమార్
ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ రామ్‌కుమార్ తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. కాలిఫోర్నియాలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 170వ ర్యాంకర్ రామ్2–6, 6–3, 4–6తో 124వ ర్యాంకర్ లియామ్ బ్రాడీ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు. గంటా 24 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రామ్ ఐదు ఏస్‌లు సంధించి, తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. -
Saketh Myneni: పోరాడి ఓడిన సాకేత్–రామ్‌కుమార్ జంట
Dubai Tennis Championships: దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ (భారత్) జంట తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన సాకేత్–రామ్ ద్వయం 82 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్లో 5–7, 5–7తో జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా)–పొలాసెక్ (స్లొవేకియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న (భారత్)–కరాత్సెవ్ (రష్యా) జంట 2–6, 6–3, 5–10తో టాప్ సీడ్ మెక్టిక్–పావిచ్ (క్రొయేషియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. క్వార్టర్స్‌లో నీతూ, అనామిక న్యూఢిల్లీ: స్ట్రాండ్జా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్లో భారత మహిళా బాక్సర్లు నీతూ (48 కేజీలు), అనామిక (50 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బల్గేరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో నీతూ 5–0తో ల్యూలియా (రష్యా)పై, అనామిక 4–1తో చుకనొవా(బల్గేరియా) పై గెలిచారు. 54 కేజీల బౌట్లో శిక్ష 0–5తో దినా జొలమన్ (కజకిస్తాన్) చేతిలో ... పురుషుల 67 కేజీల పోటీలో ఆకాశ్ 0–5తో క్రొటెర్ (జర్మనీ) చేతిలో ఓడిపోయారు. చదవండి: IND Vs SL T20 Series: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ.. గాయంతో సూర్యకుమార్ ఔట్ -
బోపన్న–రామ్‌కుమార్ సంచలన విజయం.. డబుల్స్ టైటిల్
Rohan Bopanna Ramkumar- పుణే: దక్షిణాసియాలో జరిగే ఏకైక ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్ టాటా ఓపెన్‌లో భారత సీనియర్ స్టార్ రోహన్ బోపన్న, యువతార రామ్‌కుమార్ రామనాథన్ మెరిశారు. వీరిద్దరు జతగా బరిలోకి దిగి టాటా ఓపెన్ డబుల్స్ విభాగంలో టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–రామ్‌కుమార్ ద్వయం 6–7 (10/12), 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ లూక్ సావిల్లె–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జోడీపై సంచలన విజయం సాధించింది. బోపన్న–రామ్ జంటకు 16,370 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 12 లక్షల 22 వేలు)లభించింది. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట ఏడు ఏస్‌లు సంధించి ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. ఈ ఏడాది బోపన్న–రామ్ జోడీకిది రెండో డబుల్స్ టైటిల్ కావడం విశేషం. గత నెలలో అడిలైడ్ ఓపెన్‌లోనూ బోపన్న–రామ్ జంట విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా బోపన్న కెరీర్లో ఇది 21వ డబుల్స్ టైటిల్‌కాగా రామ్ ఖాతాలో ఇది రెండో డబుల్స్ టైటిల్. చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
రాజ్‌కుమార్ ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్
దివంగత ప్రముఖ కన్నడ నటులు రాజ్‌కుమార్ మనవరాలు, కన్నడ యాక్టర్ రామ్‌కుమార్, పూర్ణిమ (రాజ్‌కుమార్ కూతురు)ల తనయ ధన్యా రామ్‌కుమార్ హీరోయిన్గా పరిచయం కానున్నారు. కన్నడ చిత్రం ‘నిన్నా సానిహకే’లో హీరోయిన్గా నటించారు ధన్య. కోవిడ్ వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఈలోపు కోలీవుడ్ నుంచి కాల్స్ అందుకుంటున్నారట ధన్య. ఇదిలా ఉంటే.. రాజ్‌కుమార్ కుటుంబం నుంచి చిత్రపరిశ్రమలోకి వస్తున్న తొలి హీరోయిన్ ధన్యా రామ్కుమార్నే కావడం విశేషం. ఈ సందర్భంగా ధన్య మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలోకి రావాలని ఆశపడే నా కుటుంబానికి చెందిన అమ్మాయిలకు, బయటివారికి నేనొక ఉదాహరణగా నిలవాలనుకుంటున్నాను. కారణాలు ఏమైనా మా ఫ్యామిలీ మహిళలు సినిమాల్లోకి రాలేదు. మా తాతగారు (రాజ్‌కుమార్) ఒప్పుకోకపోవడం వల్లే అని కొందరు అంటున్నారు. కానీ ఈ విషయం గురించి మా అమ్మని అడిగితే, ఏవో భద్రతాపరమైన కారణాలు అన్నట్లుగా చెప్పారు. ఇప్పుడు ‘మీటూ’ అంటూ నిర్భయంగా మాట్లాడుతున్నట్లు అప్పట్లో నటీమణులకు స్వేచ్ఛగా మాట్లాడే వీలు లేకపోయి ఉండొచ్చు. కానీ మా తాతగారు ఇప్పుడుంటే ఇండస్ట్రీలో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని నేను హీరోయిన్గా చేయడానికి ఒప్పుకునేవారు’’ అన్నారు. -
French Open: రామ్‌కుమార్ శుభారంభం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు రామ్‌కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పారిస్‌లో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 2–6, 7–6 (7/4), 6–3తో మైకేల్ మోమో (అమెరికా)పై నెగ్గి రెండో రౌండ్‌కు చేరాడు. మరోవైపు ప్రజ్నేశ్ 2–6, 2–6తో ఆస్కార్ ఒట్టె (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. Weight Lifting: స్నాచ్ విభాగంలో జెరెమీకి రజతం ప్రపంచ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో భారత క్రీడాకారుడు జెరెమీ లాల్రినుంగా స్నాచ్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించాడు. తాష్కెంట్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో మిజోరం లిఫ్టర్ జెరెమీ 67 కేజీల విభాగంలో ఓవరాల్‌గా 300 కేజీలు (స్నాచ్‌లో 135+క్లీన్ అండ్ జెర్క్‌లో 165) బరువెత్తి నాలుగో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఒజ్బెక్ (టర్కీ–317 కేజీలు), అక్మోల్డా (కజకిస్తాన్–308 కేజీలు), యూసుఫ్ (టర్కీ–308 కేజీలు) స్వర్ణ, రజత, కాంస్య పతకాలు నెగ్గారు. -
భారత్ ముందుకెళ్లేనా?
జాగ్రెబ్ (క్రొయేషియా): డేవిస్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్ బెర్త్‌పై కన్నేసిన భారత పురుషుల టెన్నిస్ జట్టుకు నేటి నుంచి కఠిన సవాల్ ఎదురుకానుంది. డేవిస్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా రెండు రోజుల పాటు సాగే ఈ పోరులో భారత్... 2014 యూఎస్ ఓపెన్ విజేత మారిన్ సిలిచ్‌తో కూడిన క్రొయేషియాను ఎదుర్కోనుంది. అయితే మారిన్ సిలిచ్ మినహా మిగతా క్రొయేషియా ఆటగాళ్లు చెప్పుకోదగ్గ స్థాయి ప్లేయర్లు కాకపోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం. సుమీత్ నాగల్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్, లియాండర్ పేస్, రోహన్ బొపన్న, రామ్‌కుమార్ రామనాథన్‌లతో కూడిన భారత్ ఈ మ్యాచ్‌లో అండర్ డాగ్స్‌గా బరిలో దిగనుంది. తన కెరీర్లో చివరి డేవిస్ కప్ సీజన్ ఆడుతున్న లియాండర్ పేస్ ఘనమైన ముగింపు పలకాలనే పట్టుదలతో ఉన్నాడు. రెండు సింగిల్స్... డబుల్స్... రెండు రివర్స్ సింగిల్స్ పద్ధతిన జరిగే ఈ పోరులో మూడు మ్యాచ్‌లను గెలిచిన జట్టు మాడ్రిడ్ వేదికగా నవంబర్‌లో జరిగే డేవిస్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తుంది. శుక్రవారం జరిగే రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్, రామ్‌కుమార్ రామనాథన్‌లు బరిలో దిగనున్నారు. భారత నంబర్‌వన్ సుమీత్ నాగల్‌కు అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. తొలి మ్యాచ్‌లో బోర్నా గోజోతో ప్రజ్నేశ్; రెండో మ్యాచ్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్ మారిన్ సిలిచ్‌తో రామ్‌కుమార్ తలపడతారు. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో మ్యాట్ పావిచ్–స్కుగోర్‌లతో లియాండర్ పేస్–రోహన్ బోపన్న... నాలుగో మ్యాచ్‌లో సిలిచ్‌తో ప్రజ్నేశ్; ఐదో మ్యాచ్‌లో గోజోతో రామ్‌కుమార్ ఆడతారు. చివరిసారిగా ఈ రెండు జట్లు 1995లో న్యూఢిల్లీ వేదికగా తలపడగా... అందులో భారత్ 3–2తో గెలుపొందింది. -
వైఎస్సార్సీపీలో చేరిన మాజీ సీఎం కుమారుడు
సాక్షి, పెందూర్తి : మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తనయుడు రామ్‌కుమార్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం విశాఖ జిల్లా పెందూర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కండువా కప్పి రామ్‌కుమార్‌ను, ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు. ఆ నమ్మకాన్ని వైఎస్ జగన్ నిలబెడతారు: రామ్ కుమార్ ప్రజలకు రాజకీయ నాయకులపై ఉండాల్సింది అభిమానం, నమ్మకమని ఇవి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి నెలకొల్పారని నేదురుమల్లి రామ్‌కుమార్ అన్నారు. మళ్లీ ప్రజలకు రాజకీయ నాయకులపై నమ్మకం రావాలంటే అది జననేత వైఎస్ జగన్‌తోనే సాధ్యమన్నారు. పార్టీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఉన్న రెండు ఆప్షన్స్‌లో ప్రజలు అనుభవం వైపు మొగ్గు చూపారన్నారు. కానీ ఈ నాలుగున్నరేళ్ల సీఎం చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, ఈ సారి వైఎస్ జగన్‌కు అవకాశమివ్వాలని యోచిస్తున్నారని అభిప్రాయపడ్డారు. దీంతోనే నేదురుమల్లి వర్గంతో మాట్లాడి పార్టీలో చేరడం జరిగిందన్నారు. జనార్థన్ రెడ్డి, వైఎస్సార్‌లు చాలా సన్నిహితంగా ఉండేవారని, వారి చాలా దగ్గరి నుంచి చూశానని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. జనార్థన్ రెడ్డి తన చివరి ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేశారని, లక్ష 75 వేల ఓట్లతో గెలుపొందారని తెలిపారు. నెల రోజుల క్రితమే పార్టీలో చేరాలనుకున్నా.. పాదయాత్ర విశాఖ చేరేవరకు ఎదురుచూశానని పేర్కొన్నారు. -
రామ్‌కుమార్ ఓటమి
న్యూఢిల్లీ: డెల్రే బీచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. క్వాలిఫయర్ హోదాలో పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో ఆడిన అతను తొలి రౌండ్లో 1–6, 2–6తో ప్రపంచ 75వ ర్యాంకర్ డొనాల్డ్ యంగ్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. మరోవైపు ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఓపెన్–13 ప్రావిన్స్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్లో బోపన్న–వాసెలిన్ ద్వయం 2–6, 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో కెన్ స్కప్‌స్కీ (బ్రిటన్)–స్టెఫానోస్ (గ్రీస్) జంటపై గెలిచింది. -
నా భార్య చిత్రహింసలు పెడుతోంది..
సాక్షి, విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ఓ భర్త గృహహింస చట్టం కింద కోర్టును ఆశ్రయించాడు. తన భార్య తనను చిత్ర హింసలు పెడుతుందంటూ రామ్‌కుమార్ అనే వ్యక్తి విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వివాహం జరిగి రెండు నెలలకే తన భార్య వేధింపులకు పాల్పడుతోందని విజయవాడ కంచికామకోటి నగర్‌కు చెందిన గోగు రామ్ కుమార్ అనే వ్యక్తి మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. విజయవాడ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ పిటీషన్‌ను స్వీకరించడంతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అప్పటికే వివాహమైన సదరు మహిళ .. ఆ సంగతి దాచి తనను మరో వివాహం చేసుకుందని పేర్కొన్నాడు. పెళ్లైన రెండు నెలల నుంచి తనను మానసికంగా, శారీరకంగా ఆమె హింసిస్తోందని రామ్‌కుమార్ ఆరోపిస్తున్నాడు. కాగా, రాష్ట్రంలో ఈ తరహా తొలి కేసు ఇదే కావటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరిగిన కాన్పులు
జూలూరుపాడు: కేసీఆర్ కిట్ల పంపిణీ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని మాతాశిశు సంక్షేమ జిల్లా ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డాక్టర్ రామ్‌కుమార్ అన్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెరిగాయన్నారు. మంగళవారం స్థానిక పీహెచ్‌సీని ఆయన సందర్శించారు. రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఆస్పత్రిలో జరిగిన కాన్పుల వివరాలను స్థానిక మెడికల్ ఆఫీసర్ ఎస్.గీతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, వైద్యసిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని ప్రతి గర్భిణి ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కార్పొరేట్‌స్థాయి వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జూలూరుపాడు పీహెచ్‌సీకి 35 కేసీఆర్ కిట్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు 25 కిట్లు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డీప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ సువర్ణ, మాస్ మీడియా ఆఫీసర్ చంద్రశేఖర్, మెడికల్ ఆఫీసర్ ఎస్.గీత, డాక్టర్ శ్రీధర్, సీహెచ్ఓ పాపయ్య, హెడ్‌నర్సు శశికళాదేవీ, స్టాఫ్‌నర్సు సునీత తదితరులు పాల్గొన్నారు. -
మన వంతు ఎప్పుడు?
♦ గ్రాండ్‌స్లామ్ టోర్నీల సింగిల్స్ విభాగాల్లో ♦పురోగతి లేని భారత ప్రదర్శన ♦ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడమే గొప్ప ఘనత ♦ డబుల్స్ ఫలితాలతోనే సంతృప్తి ఫెడరర్ ‘గ్రాండ్’ విజయాలకు ఉప్పొంగిపోతాం. సెరెనా ఘనతలకు సలామ్ కొడతాం. 20 లక్షల జనాభా కూడాలేని లాత్వియా లాంటి చిన్నదేశం నుంచి చాంపియన్‌గా అవతరిస్తే అబ్బురపడతాం. ఎప్పుడూ విదేశీ క్రీడాకారుల విజయాలకు సంబర పడే మనం సొంత ఆటగాళ్ల ‘గ్రాండ్’ విజయాల కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్నాం. తరాలు మారినా, ఆటలో మార్పులు వచ్చినా... సింగిల్స్ విభాగంలో మాత్రం భారత టెన్నిస్ క్రీడాకారుల ప్రదర్శనలో పురోగతి కనిపించడంలేదు. సాక్షి క్రీడావిభాగం రెండు దశాబ్దాలుగా డబుల్స్ విభాగాల్లో భారత క్రీడాకారులు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో టైటిల్స్ సాధిస్తూ వస్తున్నారు. 1997లో మహేశ్ భూపతి జపాన్ క్రీడాకారిణి రికా హిరాకితో కలిసి ఫ్రెంచ్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్‌లో టైటిల్ సాధించాడు. తద్వారా గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత లియాండర్ పేస్, సానియా మీర్జా, రోహన్ బోపన్న కూడా డబుల్స్ విభాగాల్లో గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను గెలిచారు. అయితే సింగిల్స్ విభాగానికొచ్చేసరికి భారత క్రీడాకారులు మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడమే గొప్ప ఘనతగా మారిపోయింది. ఒకవేళ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించినా రెండో రౌండ్‌ను కూడా దాటలేకపోతున్నారు. గత రెండు దశాబ్దాల్లో గ్రాండ్‌స్లామ్ టోర్నీల పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ అత్యుత్తమ ప్రదర్శన లియాండర్ పేస్‌దే కావడం గమనార్హం. 1997లో అతను యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఐదు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఆడినా రెండో రౌండ్‌ను దాటి ముందుకెళ్లలేదు. యూకీ బాంబ్రీ 2015, 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్లో, సాకేత్ మైనేని 2016 యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. ఇటీవలే రామ్‌కుమార్ రామనాథన్ అంటాల్యా ఓపెన్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఓడించి పెను సంచలనం సృష్టించాడు. అంతా అనుకున్నట్లు జరిగితే రామ్‌కుమార్ వచ్చే నెలలో జరిగే యూఎస్ ఓపెన్‌లో క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడే అవకాశముంది. జూనియర్స్‌లో మెరిసినా... కొన్నేళ్లుగా జూనియర్ స్థాయిలో భారత ఆటగాళ్ల ప్రదర్శన మెరుగ్గానే ఉంటుంది. లియాండర్ పేస్ 1990లో వింబుల్డన్, 1991లో యూఎస్ ఓపెన్, యూకీ బాంబ్రీ 2009 ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ బాలుర సింగిల్స్‌లో విజేతలుగా నిలిచారు. కానీ సీనియర్ స్థాయికొచ్చేసరికి మాత్రం అవే ఫలితాలు రావడంలేదు. భారత్‌లో నైపుణ్యమైన క్రీడాకారులకు కొదువ లేదు. అయితే వారిని సరైన దిశలో నడిపించే పక్కా వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. పేస్, మహేశ్ భూపతి, రోహన్ బోపన్న, సానియా మీర్జా సాధించిన విజయాలన్నీ వారి వ్యక్తిగత కృషి, ప్రతిభ ఆధారంగానే లభించాయనడంలో సందేహం లేదు. ఇక నుంచైనా నైపుణ్యమున్న జూనియర్ క్రీడాకారులను గుర్తించి వారికి విదేశాల్లో సుశిక్షితులైన కోచ్‌ల వద్ద దీర్ఘకాలిక శిక్షణ అందించాలి. ఇప్పుడు టెన్నిస్ ఎంతో ఖరీదైన క్రీడగా మారిపోయింది. జూనియర్ స్థాయిలోనే ఏడాది పొడువునా శిక్షణ తీసుకుంటూ, ఎంట్రీ ఫీజులు చెల్లిస్తూ, రానుపోను ఖర్చులు భరిస్తూ, వసతి సౌకర్యాల ఏర్పాటుకే కనీసం రూ. 25 లక్షల వరకు ఖర్చవుతుంది. దేశానికి ప్రాతినిధ్యం వహించే సమయంలో మినహా ప్రొఫెషనల్ స్థాయిలో క్రీడాకారులకు ప్రభుత్వపరంగా లభించే ఆర్థిక సహాయం అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయస్థాయిలో నిలకడగా ఆడాలంటే భారత క్రీడాకారులకు అంత సులువేం కాదు. ప్రభుత్వంతోపాటు పేరున్న కార్పొరేట్ సంస్థలు టెన్నిస్ క్రీడను దత్తత తీసుకొని పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకుసాగితే... వచ్చే పదేళ్లలో సింగిల్స్ విభాగంలో భారత ఆటగాళ్ల ప్రదర్శన పురోగతి సాధించే అవకాశాలున్నాయి. రామ్‌కుమార్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్ గతవారం వినెట్కా ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన రామ్‌కుమార్ రామనాథన్ తన కెరీర్లో బెస్ట్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. సోమవారం విడుదల చేసిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో రామ్‌కుమార్ 16 స్థానాలు మెరుగుపర్చుకొని 168వ ర్యాంక్‌ను సాధించాడు. దాంతో చెన్నైకు చెందిన 22 ఏళ్ల రామ్‌కుమార్ ప్రస్తుతం భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా నిలిచాడు. రామ్‌కుమార్ తర్వాత భారత్ నుంచి యూకీ బాంబ్రీ (212), ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (214), శ్రీరామ్ బాలాజీ (293), సుమీత్ నాగల్ (306) వరుస స్థానాల్లో ఉన్నారు. డబుల్స్‌లో రోహన్ బోపన్న 22వ ర్యాంక్‌లో ఉండగా... దివిజ్ శరణ్, పురవ్ రాజా వరుసగా 51వ, 52వ ర్యాంక్‌ల్లో నిలిచారు. లియాండర్ పేస్ 59వ ర్యాంక్‌లో, జీవన్ నెదున్‌చెజియాన్ 98వ ర్యాంక్‌లో ఉన్నారు. మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా మీర్జా తన ఏడో ర్యాంక్‌ను నిలబెట్టుకోగా... సింగిల్స్‌లో అంకితా రైనా 277వ ర్యాంక్‌లో, కర్మాన్‌కౌర్ థండి 400వ ర్యాంక్‌లో ఉన్నారు. ♦ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్లో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారుడు టైటిల్ సాధించి 19 ఏళ్లు గడిచిపోయాయి. చివరిసారి 1998లో లియాండర్ పేస్ న్యూపోర్ట్ ఓపెన్‌లో సింగిల్స్ విజేతగా నిలిచాడు. ♦ ఇక మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సర్క్యూట్లో భారత్ తరఫున ఏకైక సింగిల్స్ టైటిల్‌ను సానియా మీర్జా సాధించింది. 2005లో హైదరాబాద్ ఓపెన్‌లో సానియా చాంపియన్‌గా నిలిచింది. సానియా మీర్జా తర్వాత ఇప్పటివరకు మరే భారత క్రీడాకారిణి డబ్ల్యూటీఏ టోర్నీల్లో సింగిల్స్ విభాగంలో పాల్గొనే అర్హత సాధించలేదు. ♦ గ్రాండ్‌స్లామ్ టోర్నీ చరిత్రలో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అత్యుత్తమ ప్రదర్శన రామనాథన్ కృష్ణన్ ద్వారా వచ్చింది. ఆయన 1960, 1961 వింబుల్డన్ టోర్నీల్లో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత రామనాథన్ తనయుడు రమేశ్ కృష్ణన్ 1986 వింబుల్డన్ టోర్నీలో... 1981, 1987 యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్ ఆడారు. అనంతరం విజయ్ అమృత్‌రాజ్ వింబుల్డన్ (1973, 1981లో), యూఎస్ ఓపెన్ (1973, 1974) టోర్నీలలో రెండుసార్లు చొప్పున క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. ♦ సింగిల్స్ విభాగంలో 1973లో ఏటీపీ అధికారికంగా ర్యాంకింగ్స్‌ను ప్రవేశపెట్టగా... పురుషుల సింగిల్స్‌లో భారత్ తరఫున విజయ్ అమృత్‌రాజ్ (1980లో) అత్యున్నతంగా 16వ ర్యాంక్‌లో నిలిచారు. ఆ తర్వాత రమేశ్ కృష్ణన్ 23వ ర్యాంక్‌లో (1985లో), సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 62వ ర్యాంక్‌లో (2011లో) నిలిచారు. మహిళల సింగిల్స్‌లో సానియా మీర్జా 2007లో అత్యుత్తమంగా 27వ ర్యాంక్‌ను సాధించింది. -
‘రివర్స్’లో చెరొకటి
► రామ్‌కుమార్ గెలుపు... ప్రజ్నేశ్ ఓటమి ► ఉజ్బెకిస్తాన్‌పై భారత్ 4–1తో విజయం బెంగళూరు: డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత టెన్నిస్ జట్టు క్లీన్‌స్వీప్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. రివర్స్ సింగిల్స్‌లో భారత్, ఉజ్బెకిస్తాన్లు చెరో మ్యాచ్ గెలిచాయి. దీంతో భారత్ 4–1 గెలుపుతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన తొలి రివర్స్ సింగిల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్ గెలుపొంది భారత్ ఆధిపత్యాన్ని చాటాడు. రామ్‌కుమార్ 6–3, 6–2తో సంజార్ ఫెజీవ్ను కంగుతినిపించాడు. 67 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ప్రత్యర్థిపై రెండు సెట్లలోనూ రామ్‌కుమారే పైచేయి సాధించాడు. తర్వాత జరిగిన రెండో రివర్స్ సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 5–7, 3–6తో ఇస్మాయిలోవ్ చేతిలో పరాజయం చవిచూశాడు. ఈ విజయంతో ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్‌కు అర్హత పొందిన భారత్‌కు... సెప్టెంబర్‌లో జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో అర్జెంటీనా, జర్మనీ, చెక్ రిపబ్లిక్, స్విట్జర్లాండ్, జపాన్, కెనడా, రష్యా, క్రొయేషియా జట్లలో ఒక జట్టు ప్రత్యర్థిగా ఉండనుంది. -
రెండు సింగిల్స్ మనవే
⇒రామ్‌కుమార్, ప్రజ్నేశ్ విజయం ⇒ఉజ్బెకిస్తాన్‌పై 2–0తో ఆధిక్యం ⇒నేడు డబుల్స్ మ్యాచ్ గెలిస్తే వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు భారత్ అర్హత నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారత యువ ఆటగాళ్లు రామ్‌కుమార్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ అంచనాలకు అనుగుణంగా రాణించారు. కాస్త పోటీ ఎదురైనా... పట్టుదలతో పోరాడి విజయాలు అందుకున్నారు. ఫలితంగా ఉజ్బెకిస్తాన్‌తో మొదలైన ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్‌లో భారత్ శుభారంభం చేసింది. వరల్డ్ గ్రూప్‌నకు అర్హత సాధించేందుకు కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. బెంగళూరు: సొంతగడ్డపై భారత యువ ఆటగాళ్లు మెరిశారు. ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి భారత్‌ను 2–0తో ఆధిక్యంలో నిలిపారు. డేవిస్‌కప్ టెన్నిస్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్‌లో భాగంగా ఉజ్బెకిస్తాన్‌తో జరుగుతోన్న పోటీలో తొలి రోజు భారత్‌దే పైచేయిగా నిలిచింది. తొలి సింగిల్స్‌లో 22 ఏళ్ల రామ్‌కుమార్ రామనాథన్ 6–2, 5–7, 6–2, 7–5తో తెముర్ ఇసామిలోవ్పై గెలుపొందగా... రెండో సింగిల్స్‌లో డేవిస్‌కప్‌లో తన తొలి మ్యాచ్ ఆడుతున్న 26 ఏళ్ల ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 7–5, 3–6, 6–3, 6–4తో సంజార్ ఫెజీబ్ను ఓడించాడు. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో భారత్‌కు విజయం దక్కితే సెప్టెంబరులో జరిగే ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు బెర్త్ ఖాయమవుతుంది. ఈ పోటీలో తమ ఆశలు సజీవంగా ఉండాలంటే డబుల్స్‌లో ఉజ్బెకిస్తాన్ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఇసామిలోవ్తో 3 గంటల 14 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రామ్‌కుమార్‌కు రెండో సెట్, నాలుగో సెట్లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. డేవిస్‌కప్‌లో తన ఏడో మ్యాచ్ ఆడుతోన్న రామ్‌కుమార్ తొలి సెట్లో ఇసామిలోవ్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. రెండో సెట్లోని 12వ గేమ్‌లో రామ్‌కుమార్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఇసామిలోవ్ సెట్‌ను దక్కించుకున్నాడు. మూడో సెట్లో రామ్‌కుమార్ మళ్లీ విజృంభించి రెండు బ్రేక్ పాయింట్లు సంపాదించాడు. నాలుగో సెట్ హోరాహోరీగా సాగినా 11వ గేమ్‌లో ఇసామిలోవ్ సర్వీస్‌ను రామ్‌కుమార్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో రామ్‌కుమార్ 16 ఏస్‌లు సంధించి, 14 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఫెజీబ్తో 2 గంటల 24 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రజ్నేశ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. డేవిస్‌కప్‌లో తనకు లభించిన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎడంచేతి వాటం క్రీడాకారుడైన ప్రజ్నేశ్ మూడో సెట్లో 1–3తో వెనుకబడ్డా వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి సెట్‌ను దక్కించుకోవడం విశేషం. నాలుగో సెట్లోనూ ఈ చెన్నై ప్లేయర్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. -
స్వాతి హత్య కేసు అడ్డం తిరుగుతున్నదా?
సాక్షి, చెన్నై : ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో రామ్‌కుమార్‌ను రక్షించేందుకు తగ్గ వ్యూహ రచనల్లో నిందితుడి తరఫు న్యాయవాదులు నిమగ్నమైనట్టుంది. మీనాక్షి పురం గ్రామం అంతా రామ్‌కుమార్ వెంట ఉన్నట్టుగా చాటేపనిలో పడ్డట్టుంది. అరెస్టు జరిగిన రోజున రామ్‌కుమార్ గొంతును బలవంతంగానే కోసినట్టు ఆరోపిస్తూ, తెన్కాశి ఇన్స్పెక్టర్ బాలమురుగన్ బృందాన్ని కోర్టుకు లాగేం దుకు సిద్ధమయ్యారు. ఇందుకు తగ్గట్టుగా పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేరింది. అయితే, రామ్‌కుమార్ దోషి అని నిరూపించేందుకు తగ్గ ఆధారాల అన్వేషణను విచారణ బృందం వేగవంతం చేసింది. చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో గత నెల ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి దారు ణ హత్యకు గురైన విషయం తెలిసిందే. నిందితుడి గుర్తింపులో తీవ్ర కష్టాలు పడ్డ చెన్నై పోలీసులు చివరకు తిరునల్వేలి జిల్లా సెంగోట్టై సమీపంలోని మీనాక్షిపురానికి చెందిన రామ్‌కుమార్ హంతకుడిగా గుర్తిం చారు. తాము పట్టుకునే క్రమంలో నింది తుడు గొంతు కోసుకున్నట్టుగా పోలీసులు వాదించడమే కాదు, కేసూ పెట్టారు. నింది తుడు రామ్‌కుమార్ అన్నది తేలినా, సాక్ష్యాల సేకరణకు మరింత కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి. ఈ సమయంలో రామ్‌కుమార్ నిందితుడు కాదు అని, అమాయకుడని, ఎవర్నో రక్షించే యత్నంలో రామ్‌కుమార్‌ను బలిపశువు చేశారన్న ఆరోపణలు బయలు దేరాయి. ప్రధానంగా రామ్‌కుమార్ కుటుంబీకులు, మీనాక్షి పురం వాసు లు అయితే, రామ్‌కుమార్‌ను వెనకేసుకు వచ్చే రీతిలో వ్యవహరిస్తుండడం, అదే సమయంలో పలువురు న్యాయవాదులు రంగంలోకి దిగడం చోటుచేసుకున్నాయి. రామ్‌కుమార్ అమాయకుడిగా చాటేందు కు ఈ న్యాయవాదులు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారని చెప్పవచ్చు. ఈ పరిస్థితు ల్లో రామ్‌కుమార్ తండ్రి పరమశివం ద్వా రా ఆ రోజు రాత్రి ఏమి జరిగిందో...! అని వివరిస్తూ గొంతు కోసుకోలేదు...గొంతు కోశారు...అని చాటే రీతిలో సెంగోట్టై పోలీ సు స్టేషన్లో కేసు పెట్టించే పనిలో పడ్డారు. గొంతు కోశారు: బుధవారం రామ్‌కుమార్ తండ్రి పరమశివం సెంగోట్టై పోలీసు స్టేష న్లో ఓ ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఫిర్యాదును తీసుకునేందుకు స్టేషన్ సిబ్బంది నిరాకరించారు. చివరకు రామ్‌కుమార్‌గా అండగా ఉన్న న్యాయవాదులు రామరాజ్, రవికుమార్, మారికుట్టిలతో కలిసి పోలీసుస్టేషన్‌కు పరమశివం చేరుకున్నారు. ఇన్స్పెక్టర్ ప్రతాపన్లేని దృష్ట్యా, ఆయన వచ్చే వరకు వేచి ఉండక తప్పలేదు. ఇన్స్పెక్టర్ రాగానే, ఫిర్యాదును అందజేశారు. దానిని పరిశీలించిన ఇన్ స్పెక్టర్ ప్రతాపన్ పదిహేను రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి పంపించారు. అయితే, ఆ ఫిర్యాదులో గొంతు కోశారు అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించి ఉండడం గమనార్హం. తాను బీఎస్ఎన్ఎల్ లైన్మెన్గా పనిచేస్తున్నానని ఫిర్యాదులో పరమశివం గుర్తు చేశారు. తన కుమారుడు బీఈ చదివినట్టు, కొన్ని సబ్జెక్టులు తప్పినందున చెన్నైలో పనిచేస్తూ, చదువుకుంటూ వచ్చినట్టు వివరించారు.గత నెల 25న చెన్నై నుంచి రామ్‌కుమార్ తన ఇంటికి వచ్చాడని వివరిస్తూ, ఈనెల ఒకటో తేదీన అర్ధరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు మఫ్టీలో తన ఇంటి తలుపును కొట్టినట్టు పేర్కొన్నారు. తలుపుతీయగానే, తాము పోలీసుల మని పేర్కొంటూ లోనికి వచ్చే యత్నం చేశారని, అప్పటికే, వెనుక వైపు నుంచి మరో ఇద్దరు పోలీసులు పరుగున వచ్చి రామ్‌కుమార్ గొంతు కోసుకుని ఉన్నట్టుగా చెప్పడంతో ఆందోళనకు గురైనట్టే వివరించారు. వెనుక వైపు వెళ్లి చూడగా రక్తపు మడుగులో తన కుమారుడు ఉండడంతో కేకులు పెట్టానని, ఆ శబ్దానికి ఇరుగు పొరుగు వారు పరుగులు తీయడంతో, తెన్కాశి ఇన్స్పెక్టర్ బాల మురుగన్ తన సిబ్బందిని అరుస్తూ, రామ్‌కుమార్‌ను బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించి తీసుకెళ్లారని వివరించారు. అయితే, రామ్‌కుమార్ గొంతు కోసుకోలేదని, బలవంతంగా తెన్కాశి ఇన్స్పెక్టర్ బాల మురుగన్ కోసి నాటకం రచించారని ఆరోపించారు. బాలమురుగ న్‌తో పాటు, తన ఇంటికి వచ్చిన వారందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని విన్నవించారు. మీడియాతో న్యాయవాదులు, రామ్‌కుమార్ తండ్రి మాట్లాడుతూ పథకం ప్రకారం పోలీసులు విచారణ సాగించారని ఆరోపించారు. పథకం ప్రకారం రామ్‌కుమార్‌ను ఇరికించడంతో పాటు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి ఉన్నారని వివరించారు. మరో వైపు దోషిగా నిరూపించేందుకు తగ్గ ఆధారాల అన్వేషణలో విచారణ బృందం పరుగులు తీస్తున్నది. -
ప్రేమోన్మాదంతో స్వాతి ప్రాణాలు తీసిన మృగాడు
ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. మొత్తం పోలీస్‌శాఖను పరుగులు పెట్టించిన నిందితుడు రామ్‌కుమార్ తిరునెల్వేలి జిల్లాలోని అతని ఇంట్లో దాక్కుని ఉండగా శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆస్పత్రిలో చేర్పించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై శివారు పనూరులోని ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి (24) గత నెల 24వ తేదీ ఉదయం 6.30 గంటలకు నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో హత్యకు గురైన సంగతి పాఠకులకు విదితమే. నుంగంబాక్కం రైల్వే బుకింగ్ కమర్షియల్ మేనేజర్ రఘుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎగ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకే సవాల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది. విచారణను వేగవంతం చేయడంలో భాగంగా కేసు దర్యాప్తు బాధ్యతను గత నెల 27వ తేదీన చెన్నై పోలీస్ కమిషనర్‌కు అప్పగించబడింది. సుమారు పదికిపైగా ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుడి వేటలో పడ్డాయి. రాష్ట్రం నలుమూలలా పరుగులు పెట్టా శయి. స్వాతి పనిచేసిన బెంగళూరు కార్యాలయం ఉద్యోగులను విచారించాయి. స్వాతి నివాసం ఉంటున్న చెన్నైలోని చూలైమేడు, ఉద్యోగం చేస్తున్న మహేంద్రా గోల్డ్ సిటీ పరిసరాలు, తోటి ఉద్యోగులు, స్నేహితులు, బంధువులు, ఇరుగూపొరుగూ ఇలా ఎవ్వరినీ విడిచిపెట్టకుండా విచారణ సాగించారు. సుమారు ఐదు చోట్ల నుంచి సీసీ టీవీ కెమెరాల పుటేజీని సేకరించి పరిశీలించారు. హత్యచేసి పారిపోతున్నట్లుగా ఉండిన సీసీ టీవీల నుంచి సేకరించిన వీడియోలతో కేసు కొద్దిగా ముం దుకు సాగినా నిందితుడు పలానా అని తెలిసినా ఆచూకీ చిక్కకపోవడంతో పోలీసులు బిక్కచచ్చిపోయారు. సినీ పక్కీలో చిక్కాడిలా: నిందితుడి ఊహాచిత్రాన్ని తయారుచేసిన పోలీసులు చివరకు సినీ పక్కీలో వ్యూహం పన్ని నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడి ఫోటోలను చూపుతూ చెన్నై నగరం, శివార్లలోని హాస్టళ్లు, మేన్షన్లను తనిఖీ చేశారు. హత్య జరిగిన రోజు నుంచి ప్రతిరోజూ కేసు విచారణను ఛేదించుకుంటూ వచ్చారు. స్వాతి ఇంటికి సమీపంలో అనేక మేన్షన్‌లు ఉండగా వాటన్నిటిపైనా నిందితుడి ఫొటోను అతికించారు. దీంతో ఏఎస్ మేన్షన్‌లో నివసించే ఒక యువకుడు నిందితుడి ఫొటోను గు ర్తించి స్వాతి హత్య జరిగిన రోజు నుంచి ఇతను కని పించడం లేదని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మేన్షన్ వాచ్‌మన్‌ను విచారించగా ఓ మోస్తరు గుర్తుపట్టినట్లు తెలిపాడు. మేన్షన్కు అమర్చిన సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా హత్య జరిగిన రోజున వేసుకున్న దుస్తులతో అతను తిరిగిన వీడియో రికార్డయింది. దీంతో అనుమానం బలపడిన పోలీసులు నిందితుడు బస చేసిన రూము తాళాలు పగులగొట్టి సూట్‌కేసులు తనిఖీ చేయగా హత్య చేసినపుడు వేసుకున్న దుస్తులు రక్తపు మరకలతో దొరికాయి. దీంతో అతడే నిందితుడని మరింతగా నిర్దార ణ అయింది. ఇదిలా ఉండగా క్లోనింగ్ ద్వారా డూప్లికేట్ సిమ్‌కార్డును సిద్ధం చేసుకున్న పోలీసులకు నిందితుడు రామ్‌కుమార్ శుక్రవారం సాయంత్రం తన సెల్‌ఫోన్ ఆన్‌చేసి వాట్సాప్‌ల ద్వారా స్నేహితులతో మాట్లాడాడు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రామ్‌కుమార్ ఎక్కడ ఉన్నది పోలీసులకు తెలిసిపోయింది. తిరునెల్వేలి జిల్లా చెంగోట్టైకి సమీపం మీనాక్షిపురం అంబేద్కర్ నగర్ చెందిన పరమశివన్ అనే వ్యక్తి కుమారుడు రామ్‌కుమార్‌ను హంతకుడిగా ఈనెల 1వ తేదీన నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని తిరునెల్వేలి జిల్లా ఎస్పీ విక్రమన్‌కు చెన్నై నుంచి ప్రత్యేక పోలీసులు శుక్రవారం రాత్రి 11 గంటలకు సమాచారం ఇచ్చారు. తిరునెల్వేలి పోలీసులు మారు వేషం వేసుకుని శుక్రవారం రాత్రి మీనాక్షిపురంలో తిరిగి నిందితుడు ఇంట్లో ఉన్నట్లు ఖరారు చేసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల తరువాత రామ్‌కుమార్ ఇంటిని చుట్టుముట్టారు. పోలీసుల రాకను గ్రహించిన అతని తాత వెంటనే కేకలు వేసి ఇంట్లోని వ్యక్తులను అప్రమత్తం చేశాడు. ఇంటి వెలుపల ఉన్న పశువుల కొట్టంలో పడుకుని ఉన్న రామ్‌కుమార్ పోలీసులను చూడగానే షేవింగ్ చేసుకునే బ్లేడుతో గొంతుకోసుకున్నాడు. సరిగ్గా అప్పుడే రామ్‌కుమార్‌ను సమీపించిన పోలీసులు వెంటనే తిరునెల్వేలిఆసుపత్రిలో చేర్పించగా గొంతుపై 18 కుట్లు వేశారు. అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. -
ఆన్లైన్లో భవన నిర్మాణ అనుమతులు
విజయనగరం మున్సిపాలిటీ: ఈ నెల 15 వ తేదీ నుంచి ఆన్లైన్లోనే నూతన భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయనున్నట్లు మున్సిపల్ రీజినల్ డిప్యూటీ డెరైక్టర్ రామ్‌కుమార్ తెలిపారు. గురువారం ఆయన విజయనగరంలో విలేకరులతో మాట్లాడారు. పెద్ద సంఖ్యలో పేరుకు పోయిన బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) దరఖాస్తులను నెల రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
బస్సు ఢీకొని వ్యక్తి మృతి
వరంగల్ పట్ణణంలోని చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి రహదారిలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. రామ్‌కుమార్, వంశీ బైక్‌పై వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. రామ్‌కుమార్ తీవ్ర గాయాలతో అక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వంశీని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.