జూలూరుపాడు: కేసీఆర్ కిట్ల పంపిణీ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని మాతాశిశు సంక్షేమ జిల్లా ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డాక్టర్ రామ్‌కుమార్ అన్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెరిగాయన్నారు. మంగళవారం స్థానిక పీహెచ్‌సీని ఆయన సందర్శించారు. రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఆస్పత్రిలో జరిగిన కాన్పుల వివరాలను స్థానిక మెడికల్ ఆఫీసర్ ఎస్.గీతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, వైద్యసిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
మండలంలోని ప్రతి గర్భిణి ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కార్పొరేట్‌స్థాయి వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జూలూరుపాడు పీహెచ్‌సీకి 35 కేసీఆర్ కిట్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు 25 కిట్లు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డీప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ సువర్ణ, మాస్ మీడియా ఆఫీసర్ చంద్రశేఖర్, మెడికల్ ఆఫీసర్ ఎస్.గీత, డాక్టర్ శ్రీధర్, సీహెచ్‌ఓ పాపయ్య, హెడ్‌నర్సు శశికళాదేవీ, స్టాఫ్‌నర్సు సునీత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment