పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు రామ్‌కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పారిస్‌లో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 2–6, 7–6 (7/4), 6–3తో మైకేల్ మోమో (అమెరికా)పై నెగ్గి రెండో రౌండ్‌కు చేరాడు. మరోవైపు ప్రజ్నేశ్ 2–6, 2–6తో ఆస్కార్ ఒట్టె (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు.
Weight Lifting: స్నాచ్ విభాగంలో జెరెమీకి రజతం
ప్రపంచ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో భారత క్రీడాకారుడు జెరెమీ లాల్‌రినుంగా స్నాచ్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించాడు. తాష్కెంట్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో మిజోరం లిఫ్టర్ జెరెమీ 67 కేజీల విభాగంలో ఓవరాల్‌గా 300 కేజీలు (స్నాచ్‌లో 135+క్లీన్ అండ్ జెర్క్‌లో 165) బరువెత్తి నాలుగో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఒజ్బెక్ (టర్కీ–317 కేజీలు), అక్మోల్డా (కజకిస్తాన్–308 కేజీలు), యూసుఫ్ (టర్కీ–308 కేజీలు) స్వర్ణ, రజత, కాంస్య పతకాలు నెగ్గారు.
French Open: రామ్‌కుమార్ శుభారంభం
Published Wed, May 26 2021 8:46 AM | Last Updated on Wed, May 26 2021 12:15 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment