weight lifting championship
-
ప్రీతిస్మిత ప్రపంచ రికార్డు..!
లిమా (పెరూ): ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి ప్రీతిస్మిత భోయ్ మూడు స్వర్ణ పతకాలు సాధించింది. ఈ క్రమంలో క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.మహిళల 40 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఒడిశాకు చెందిన 15 ఏళ్ల ప్రీతిస్మిత మొత్తం 133 కేజీలు (క్లీన్ అండ్ జెర్క్‌లో 76 కేజీలు+స్నాచ్‌లో 57 కేజీలు) బరువెత్తి విజేతగా నిలిచింది. మూడు విభాగాల్లో (క్లీన్ అండ్ జెర్క్+స్నాచ్+టోటల్) వేర్వేరుగా పతకాలు అందించగా... ఈ మూడింటిలోనూ ప్రీతిస్మిత అగ్రస్థానంలో నిలిచి మూడు పసిడి పతకాలను సొంతం చేసుకుంది.40 కేజీల విభాగంలోనే పోటీపడ్డ భారత లిఫ్టర్ జోష్నా సబర్ రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించింది. 45 కేజీల విభాగంలో పాయల్ ఒక రజతం, రెండు కాంస్యాలు గెలిచింది. పురుషుల 49 కేజీల విభాగంలో బాబూలాల్ రెండు కాంస్య పతకాలు దక్కించుకున్నాడు.ఇవి చదవండి: జ్యోతి సురేఖకు నిరాశ.. క్వార్టర్ ఫైనల్లో ఓటమి -
తెలంగాణ మాస్టర్స్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు.. గోల్డ్ మెడల్ సాధించిన సురేష్
వయసు పెరిగినా తమలో క్రీడా నైపుణ్యం తగ్గలేదని ఆ అథ్లెట్లు నిరూపించారు. 40 ఏళ్ల పైబడిన వయసులోనూ వెయిట్ లిఫ్టింగ్ లో అదరగొట్టారు. హైదరాబాద్‌లోని పోస్టల్ కన్వెన్షన్ హాల్ వేదికగా జరిగిన మొట్ట మొదటి మాస్టర్స్ స్టేట్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్షిప్, సౌత్ ఇండియా మాస్టర్స్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో పలు రాష్ట్రాల క్రీడాకారులు సత్తా చాటారు. తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఈ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్, రాష్ట్ర షిప్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ బాలరాజు యాదవ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కె.కిషోర్ గౌడ్ హాజరయ్యారు. ఐదు రాష్ట్రాల నుంచి మాస్టర్ అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పురుషుల, మహిళల విభాగాల్లో 30 నుంచి 80 వయస్సు కలిగిన అథ్లెట్లకు ఈ పోటీలు నిర్వహించారు. చాంపియన్స్‌గా సురేష్..శ్వేత పురుషుల విభాగంలో 9 కేటగిరీల్లోనూ, మహిళల విభాగంలో 10 కేటిగిరీల్లోనూ పోటీలు జరిగాయి. 30 ఏళ్ల వయస్సు తర్వాత కూడా క్రీడల్లో రాణించే అథ్లెట్లను ప్రోత్సహించేందుకే ఈ పోటీలను నిర్వహించినట్టు ఈవెంట్ నిర్వహకులు వెల్లడించారు.81 కిలోల పురుషుల విభాగంలో కే సురేష్ స్వర్ణం సాధించి ఛాంపియన్‌గా నిలిచాడు. మహిళల 76 కేజీల విభాగంలో శ్వేత స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. -
చరిత్ర సృష్టించిన భారత యువ వెయిట్ లిఫ్టర్
Harshada Sharad Garud First Indian To Win Gold At Junior World Weightlifting Championship: న్యూఢిల్లీ: గతంలో ఏ జూనియర్ భారతీయ వెయిట్‌లిఫ్టర్‌కు సాధ్యంకాని ఘనతను మహారాష్ట్ర అమ్మాయి హర్షద శరద్ గరుడ్ సొంతం చేసుకుంది. గ్రీస్‌లో జరుగుతున్న ప్రపంచ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల హర్షద మహిళల 45 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. తద్వారా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో పసిడి పతకం సాధించిన తొలి భారతీయ వెయిట్‌లిఫ్టర్‌గా ఈ పుణే అమ్మాయి గుర్తింపు పొందింది. Meet the first podium of the 2022 IWF Junior World Championships! It was fantastic to watch the W45kg Group A in Heraklion, Greece. Congratulations to the winners!🏋🏻♀️🇬🇷 🥇Sharad Garud Harshada (IND) 🥈Cansu Bektas (TUR) 🥉Teodora-Luminita Hincu (MDA) pic.twitter.com/vW1azofbNv — IWF (@iwfnet) May 2, 2022 2020 ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో స్వర్ణం, ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన హర్షద ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ మెరి సింది. స్నాచ్‌లో 70 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 83 కేజీలు బరువెత్తిన హర్షద ఓవరాల్‌గా 153 కేజీలతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. కాన్సు బెక్టాస్ (టర్కీ–150 కేజీలు) రజతం... హిన్కు లుమినిత (మాల్డోవా–149 కేజీలు) కాంస్యం నెగ్గారు. గతంలో భారత్ తరఫున ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో మీరాబాయి (2013 లో), జిలీ దలబెహెరా (2018లో) కాంస్యాలు... అచింత (2021లో) రజతం సాధించారు. #GreatNews 🥳 🇮🇳 begins campaign at IWF World Junior #Weightlifting Championships 2022 with a GOLD Harshada Garud Sharad 🏋️♀️clinches 🥇in Women's 45kg with a total lift of 153kg (Snatch- 70kg, Clean & Jerk- 83kg) Heartiest congratulations 🎊 👏 📽️ @iwfnet pic.twitter.com/lvMBJq061a — SAI Media (@Media_SAI) May 2, 2022 చదవండి: IPL 2022: ధోని ఉన్నాడుగా.. ఇది జరిగి తీరుతుంది: సెహ్వాగ్ -
భారత వెయిట్‌లిఫ్టర్ జెరెమీకి స్వర్ణం
కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ లిఫ్టర్ జెరెమీ లాల్రినుంగా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తాష్కెంట్లో జరుగుతున్న ఈ టోర్నీలో మిజోరం రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల జెరెమీ 67 కేజీల విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. జెరెమీ స్నాచ్‌లో 141 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 164 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 305 కేజీలతో బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. ఇదే వేదికపై జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో జెరెమీ ఏడో స్థానంలో నిలిచాడు. -
French Open: రామ్‌కుమార్ శుభారంభం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు రామ్‌కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పారిస్‌లో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 2–6, 7–6 (7/4), 6–3తో మైకేల్ మోమో (అమెరికా)పై నెగ్గి రెండో రౌండ్‌కు చేరాడు. మరోవైపు ప్రజ్నేశ్ 2–6, 2–6తో ఆస్కార్ ఒట్టె (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. Weight Lifting: స్నాచ్ విభాగంలో జెరెమీకి రజతం ప్రపంచ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో భారత క్రీడాకారుడు జెరెమీ లాల్రినుంగా స్నాచ్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించాడు. తాష్కెంట్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో మిజోరం లిఫ్టర్ జెరెమీ 67 కేజీల విభాగంలో ఓవరాల్‌గా 300 కేజీలు (స్నాచ్‌లో 135+క్లీన్ అండ్ జెర్క్‌లో 165) బరువెత్తి నాలుగో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఒజ్బెక్ (టర్కీ–317 కేజీలు), అక్మోల్డా (కజకిస్తాన్–308 కేజీలు), యూసుఫ్ (టర్కీ–308 కేజీలు) స్వర్ణ, రజత, కాంస్య పతకాలు నెగ్గారు. -
కరణం మల్లేశ్వరి బయోపిక్
క్రీడాకారుల జీవితాన్ని కథగా స్క్రీన్ మీద చూపించే ట్రెండ్ ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో కనిపిస్తోంది. తాజాగా ఓ బయోపిక్ రెడీ అవుతోంది. వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మన దేశానికి తొలి మెడల్ తీసుకొచ్చిన కరణం మల్లేశ్వరిపై ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. కోన వెంకట్, యంవీవీ సత్యనారాయణ నిర్మించనున్నారు. శ్రీకాకుళంలోని ఓ మారుమూల గ్రామం నుంచి దేశానికి తొలి ఒలింపిక్ పతాకాన్ని తీసుకొచ్చిన కరణం మల్లేశ్వరి కథ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చిత్రబృందం భావించిందట. సుమారు 50 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. ఈ సినిమాలో మల్లేశ్వరి పాత్రలో ఎవరు నటిస్తారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. -
గురు నాయుడుకు కాంస్య పతకం
సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: ఆసియా యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ ఎస్.గురు నాయుడు కాంస్య పతకాన్ని సాధించాడు. ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్లో విజయనగరం జిల్లా లిఫ్టర్ గురు నాయుడు యూత్ బాలుర 49 కేజీల విభాగంలో మూడో స్థానంలో నిలిచాడు. గురు నాయుడు మొత్తం 177 కేజీలు (స్నాచ్‌లో 77+క్లీన్ అండ్ జెర్క్‌లో 100) బరువెత్తాడు. -
తెలంగాణ లిఫ్టర్ల పతకాల పంట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర క్రీడాకారులు సత్తా చాటారు. నిజామాబాద్‌లో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 13 పతకాలను కైవసం చేసుకున్నారు. ఇందులో 6 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. అంతేకాకుండా జూనియర్ పురుషుల, యూత్ బాలికల విభాగాల్లో తెలంగాణ జట్లు ఓవరాల్ చాంపియన్లుగా నిలిచాయి. జూనియర్ పురుషుల విభాగంలో జి. కుమార స్వామి (178 కేజీలు), యశ్వంత్ (235 కేజీలు), చైతన్య హరి (158 కేజీలు), అఖిల్ (270 కేజీలు) బంగారు పతకాలు అందుకోగా... మహేశ్ (166 కేజీలు) రజతాన్ని, రోహిత్ కుమార్ (122 కేజీలు) కాంస్యాన్ని గెలుచుకున్నారు. యశ్వంత్ ‘ఉత్తమ లిఫ్టర్’ పురస్కారానికి ఎంపికయ్యాడు. యూత్ బాలికల విభాగంలో ఆర్తిక (72 కేజీలు), ప్రసన్న (62 కేజీలు) స్వర్ణాలతో మెరవగా... శేష సాయి (67 కేజీలు), శ్రీ హర్ష మిత (60 కేజీలు) రజతాలను గెలుచుకున్నారు. రోషిణి (59 కేజీలు), హర్ష మిత (59 కేజీలు), గాయత్రి (55 కేజీలు) కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. -
దీక్షితకు స్వర్ణం
హైదరాబాద్: జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ లిఫ్టర్ దీక్షిత సత్తా చాటింది. విశాఖపట్నంలో జరుగుతున్న ఈ టోర్నీలో స్వర్ణాన్ని సాధించింది. సీనియర్ మహిళల విభాగంలో దీక్షిత చాంపియన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ సంఘం అధ్యక్షుడు రామకోటేశ్వరరావు, హైదరాబాద్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ సంఘం కార్యదర్శి ఎన్. చంద్రశేఖర్ గౌడ్ అభినందించారు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. -
జయంత్ ‘హ్యాట్రిక్’
వరల్డ్ మాస్టర్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో మూడో స్వర్ణం న్యూఢిల్లీ: భారత లిఫ్టర్ సుధాకర్ జయంత్... ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్ మాస్టర్స్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడో ఏడాదీ స్వర్ణ పతకం గెలిచాడు. 62 కేజీల విభాగంలో జయంత్ 185 (స్నాచ్ 85+క్లీన్ అండ్ జర్క్ 100) కేజీల బరువు ఎత్తి ప్రథమ స్థానంలో నిలిచాడు. హుస్కోనెన్ జారీ (ఫిన్లాండ్-170 కేజీలు), ఫ్రెడెరిక్ రాబర్ట్ (ఫ్రాన్స్-145 కేజీలు) తర్వాతి రెండు స్థానాల్లో నిలిచి రజతం, కాంస్యం సొంతం చేసుకున్నారు. 2013లో ఇటలీలో జరిగిన పోటీల్లో జయంత్ 192 కేజీల బరువు ఎత్తి పసిడిని సాధించడంతో పాటు స్నాచ్‌లో 87 కేజీలతో గేమ్స్ రికార్డు నెలకొల్పాడు. 2012లో ఉక్రెయిన్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో కూడా జయంత్ స్వర్ణం గెలిచాడు. -
సింధుకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: నేషనల్ స్కూల్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బాలికలు సత్తా చాటారు. అండర్-17, అండర్-19 విభాగాల్లో పోటీ పడిన ఏపీ అమ్మాయిలు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు నెగ్గారు. అసోంలోని గువహటిలో గురువారం ఈ పోటీలు ముగిశాయి. అండర్-17 విభాగంలో రాష్ట్రానికి చెందిన జి. సింధు స్వర్ణం గెలుచుకుంది. 58 కేజీల కేటగిరీలో పోటీ పడిన సింధు మొత్తం 131 కిలోల (స్నాచ్ 56 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ 75 కేజీలు) బరువు ఎత్తింది. అండర్-17 విభాగంలోనే ఏపీకి మరో మూడు రజతాలు లభించాయి. 44 కేజీల కేటగిరీలో టి. ప్రియదర్శిని (మొత్తం 110 కేజీలు-స్నాచ్ 46, క్లీన్ అండ్ జర్క్ 64 ), 63 కేజీల కేటగిరీలో జి. లలిత (మొత్తం 127 కేజీలు - స్నాచ్ 55, క్లీన్ అండ్ జర్క్ 72), 69 కేజీల కేటగిరీలో డి. సీతామహాలక్ష్మి (126 కేజీలు - స్నాచ్ 58, క్లీన్ అండ్ జర్క్ 68) రజతాలు గెలుచుకున్నారు. అండర్-19 విభాగంలో ఎం. ఊహాసాయికి రజత పతకం లభించింది. 75 కేజీల కేటగిరీలో పోటీ పడిన ఊహ మొత్తం 142 కిలోల (స్నాచ్ 60 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ 82 కేజీలు) బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. -
రంగారెడ్డి జిల్లా ‘ట్రిపుల్’
సాక్షి, విజయనగరం: ఏపీ రాష్ట్ర స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ రంగారెడ్డి మహిళల జట్లు సత్తా చాటాయి. ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో మహిళల సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాలు మూడింటిలోనూ రంగారెడ్డి టీమ్ చాంపియన్‌షిప్‌లను గెలుచుకుంది. మహిళల కేటగిరీలో పై మూడు విభాగాల్లో తూర్పుగోదావరి జిల్లానే రన్నరప్‌గా నిలిచింది. పురుషుల విభాగంలో సీనియర్లో విజయనగరం, జూనియర్లో తూర్పు గోదావరి, సబ్ జూనియర్లో కర్నూలు జట్లు టీమ్ చాంపియన్‌షిప్‌లను కైవసం చేసుకోగా...జూనియర్లో కర్నూలు, సీనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో తూర్పు గోదావరి జట్లు రన్నరప్ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగం మూడు కేటగిరీల్లో ఎం. రామకృష్ణ, ఎస్. రామ్మోహన్రావు, పారపాటి రమేశ్‌లకు బెస్ట్ లిఫ్టర్ల అవార్డు దక్కింది. మహిళల విభాగంలో కె. వెంకటలక్ష్మి, కె. శిరీష, టి. ప్రియదర్శినిలు ఉత్తమ లిఫ్టర్లుగా నిలిచారు. -
చాంప్స్ శివకుమార్, రాహుల్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన లిఫ్టర్లు సత్తా చాటారు. సీనియర్ పురుషుల 56 కేజీ కేటగిరీలో శివకుమార్ (హైదరాబాద్), +105 కేజీ కేటగిరీలో రాహుల్ దర్శన్ (హైదరాబాద్), 105 కేజీ కేటగిరీలో చైతన్య (రంగారెడ్డి) స్వర్ణ పతకాలు గెలుపొందారు. పతకాలు నెగ్గిన హైదరాబాద్, రంగారెడ్డి లిఫ్టర్లు... సీనియర్ పురుషులు: 56 కేజీ కేటగిరీ: శివకుమార్ (హైదరాబాద్, స్వర్ణం); 62 కేజీ: వెంకటేశ్ (హైదరాబాద్, కాంస్యం); 105 కేజీ: చైతన్య (రంగారెడ్డి, స్వర్ణం); +105 కేజీ: రాహుల్ దర్శన్ (హైదరాబాద్, స్వర్ణం); జూనియర్ పురుషులు: 56 కేజీ: కోటేశ్వర్రావు (రంగారెడ్డి, కాంస్యం); 62 కేజీ: వెంకటేశ్ (హైదరాబాద్, రజతం); 69 కేజీ: వరుణ్ (రంగారెడ్డి, కాంస్యం); 105 కేజీ: చైతన్య (రంగారెడ్డి, స్వర్ణం); సబ్-జూనియర్ బాలురు: 56 కేజీ: కోటేశ్వర్ రావు (రంగారెడ్డి, స్వర్ణం); 62 కేజీ: మల్లేశ్ (హైదరాబాద్, రజతం); 69 కేజీ: వరుణ్ (రంగారెడ్డి, స్వర్ణం); 77 కేజీ కేటగిరీ: రాజు (రంగారెడ్డి, స్వర్ణం) సీనియర్ మహిళలు: 48 కేజీ కేటగిరీ: ప్రియదర్శిని (రంగారెడ్డి, రజతం); 53 కేజీ: ధనలక్ష్మి (స్వర్ణం); 58 కేజీ: సింధు (రంగారెడ్డి, రజతం), కృష్ణకళ (రంగారెడ్డి, కాంస్యం); 63 కేజీ: శిరీష (రంగారెడ్డి, స్వర్ణం), లలిత (రంగారెడ్డి, రజతం); 69 కేజీ: సీతామహాలక్ష్మి (రంగారెడ్డి, రజతం); జూనియర్ మహిళలు: 43 కేజీ: ప్రియదర్శిని (రంగారెడ్డి, స్వర్ణం); 53 కేజీ: ధనలక్ష్మి (రంగారెడ్డి, స్వర్ణం), లక్ష్మీప్రసన్న (రంగారెడ్డి, రజతం); 58 కేజీ: సింధు (రంగారెడ్డి, స్వర్ణం), కృష్ణకళ (రంగారెడ్డి, రజతం); 63 కేజీ: శిరీష (రంగారెడ్డి, స్వర్ణం), 2.లలిత (రంగారెడ్డి, రజతం); 69 కేజీ: సీతామహాలక్ష్మి (రంగారెడ్డి, రజతం); సబ్-జూనియర్ బాలికలు: 44 కేజీ: రమాదేవి (రంగారెడ్డి, స్వర్ణం); 48 కేజీ: ప్రియదర్శిని (రంగారెడ్డి, స్వర్ణం); 53 కేజీ: ధనలక్ష్మి (రంగారెడ్డి, స్వర్ణం), 2. లక్ష్మీప్రసన్న (రంగారెడ్డి, రజతం); 58 కేజీ: సింధు (రంగారెడ్డి, స్వర్ణం), కృష్ణకళ (రంగారెడ్డి, రజతం); 63 కేజీ: లలిత (రంగారెడ్డి, స్వర్ణం); 69 కేజీ: సీతామహాలక్ష్మి (రంగారెడ్డి, స్వర్ణం). -
శ్రీను, సంతోషిలకు కాంస్యాలు
గువాహటి: జాతీయ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్లు ఎన్.శ్రీను, మత్స సంతోషి సత్తా చాటారు. ఇద్దరు కాంస్య పతకాలు గెలుపొందారు. గురువారం ఇక్కడ జరిగిన ఈ పోటీల్లో బాలుర 56 కేజీ కేటగిరీలో శ్రీను రెండు కాంస్య పతకాలు చేజిక్కించుకున్నాడు. స్నాచ్‌లో 97 కేజీల బరువెత్తి మూడో స్థానంలో నిలిచిన శ్రీను... క్లీన్ అండ్ జర్క్‌లో 119 కేజీల బరువెత్తాడు. మొత్తం 216 కేజీల బరువుతో మరో కాంస్య పతకం గెలిచాడు. బాలికల 53 కేజీ కేటగిరీలో మత్స సంతోషి క్లీన్ అండ్ జర్క్‌లో కాంస్యం నెగ్గింది. స్నాచ్‌లో 69 కేజీల బరువెత్తిన ఆమె క్లీన్ అండ్ జర్క్‌లో 89 కేజీల బరువెత్తి తృతీయ స్థానంలో నిలిచింది. ఏపీ అమ్మాయి మొత్తం 158 కేజీల బరువెత్తింది. -
ఒకే రోజు భారత్‌కు 36 పతకాలు
న్యూఢిల్లీ: భారత వెయిట్‌లిఫ్టర్లు పతకాల పంట పండించారు. మలేసియాలో జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు భారత లిఫ్టర్లు ఏకంగా 36 పతకాలు గెల్చుకున్నారు. యూత్, జూనియర్, సీనియర్ విభాగాలలో ఈ పతకాలు వచ్చాయి. ఇందులో 19 స్వర్ణాలు, 11 రజతాలు, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి. సీనియర్ పురుషుల విభాగంలో సుఖెన్ డే (56 కేజీలు).... సీనియర్ మహిళల విభాగంలో మీరాబాయి చాను (48 కేజీలు) మూడేసి స్వర్ణాలు సొంతం చేసుకున్నారు. యూత్ బాలుర విభాగంలో టీబీసీ లాల్చన్హిమా (56 కేజీలు), లాలూ టాకూ (62 కేజీలు) మూడేసి పసిడి పతకాలు నెగ్గారు. యూత్ బాలికల విభాగలో చంద్రిక తరఫ్దార్ (44 కేజీలు), మోనాలిసా సోమోవాల్ (48 కేజీలు) కూడా మూడేసి బంగారు పతకాలు సాధించారు. భారత్ నుంచి సీనియర్, జూనియర్ విభాగాలలో 15 మంది చొప్పున, యూత్ విభాగంలో 11 మంది ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.