Dubai Tennis Championships: దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ (భారత్) జంట తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన సాకేత్–రామ్ ద్వయం 82 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్‌లో 5–7, 5–7తో జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా)–పొలాసెక్ (స్లొవేకియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న (భారత్)–కరాత్సెవ్ (రష్యా) జంట 2–6, 6–3, 5–10తో టాప్ సీడ్ మెక్‌టిక్–పావిచ్ (క్రొయేషియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది.
క్వార్టర్స్‌లో నీతూ, అనామిక
న్యూఢిల్లీ: స్ట్రాండ్‌జా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత మహిళా బాక్సర్లు నీతూ (48 కేజీలు), అనామిక (50 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బల్గేరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో నీతూ 5–0తో ల్యూలియా (రష్యా)పై, అనామిక 4–1తో చుకనొవా(బల్గేరియా) పై గెలిచారు. 54 కేజీల బౌట్‌లో శిక్ష 0–5తో దినా జొలమన్ (కజకిస్తాన్) చేతిలో ... పురుషుల 67 కేజీల పోటీలో ఆకాశ్ 0–5తో క్రొటెర్ (జర్మనీ) చేతిలో ఓడిపోయారు.
చదవండి: IND Vs SL T20 Series: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ.. గాయంతో సూర్యకుమార్ ఔట్
Comments
Please login to add a commentAdd a comment