Myneni Saketh: సెమీస్‌లో పోరాడి ఓడిన సాకేత్‌ జోడీ | Myneni Saketh Yuki Bhambri Pair Lost In ATP 250 Dallas Open Semi Final | Sakshi
Sakshi News home page

Dallas Open: సెమీస్‌లో పోరాడి ఓడిన సాకేత్‌ జోడీ

Published Mon, Feb 13 2023 7:52 AM | Last Updated on Mon, Feb 13 2023 7:58 AM

Myneni Saketh Yuki Bhambri Pair Lost In ATP 250 Dallas Open Semi Final - Sakshi

ATP 250 Dallas Open: డాలస్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో సాకేత్‌ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్‌) జోడీ సెమీఫైనల్లో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో సాకేత్‌–యూకీ ద్వయం 6–7 (11/13), 5–7తో లామోన్స్‌–విత్రో (అమెరికా) జోడీ చేతిలో ఓడింది.

గంటా 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్‌–యూకీ మూడుసార్లు బ్రేక్‌ పాయింట్‌ అవకాశాలను వృథా చేసుకున్నారు. సాకేత్‌–యూకీలకు 12,230 డాలర్ల (రూ. 10 లక్షలు) ప్రైజ్‌మనీ, 90 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.     

చదవండి: రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర, బెంగాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement