క్వార్టర్‌ ఫైనల్లో సాకేత్‌ జోడీ  | Dallas Open ATP 250 Saketh Myneni Yuki Bhambri Reach Quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో సాకేత్‌ జోడీ 

Published Thu, Feb 9 2023 8:39 AM | Last Updated on Thu, Feb 9 2023 12:49 PM

Dallas Open ATP 250 Saketh Myneni Yuki Bhambri Reach Quarters - Sakshi

Saketh Myneni- Yuki Bhambri: డాలస్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో సాకేత్‌ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్‌) జోడీ శుభారంభం చేసింది. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాకేత్‌–యూకీ ద్వయం 5–7, 7–6 (7/3), 10–3తో క్రిస్టోఫర్‌ యుబ్యాంక్స్‌–మార్కస్‌ జిరోన్‌ (అమెరికా) జోడీపై గెలిచింది.

గంటా 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్‌–యూకీ మూడు ఏస్‌లు సంధించారు. క్వార్టర్‌ ఫైనల్లో జూలియన్‌ క్యాష్‌–హెన్రీ ప్యాటర్న్‌ (బ్రిటన్‌)లతో సాకేత్‌–యూకీ ఆడతారు.    
చదవండి: Zim Vs WI 1st Test: జింబాబ్వే- వెస్టిండీస్‌టెస్టు ‘డ్రా’.. విండీస్‌ ఓపెనర్ల అరుదైన ఘనత
T20 WC 2023: సిక్సర్ల మోత మోగించిన రిచా.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement