![Saketh Myneni And Yuki Bhambri Won ATP 2022 Challenger Doubles Title - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/4/saket-pair.jpg.webp?itok=6stnQ8iz)
సాక్షి, హైదరాబాద్: భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్‌లో 11వ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. చెక్ రిపబ్లిక్‌లోని ప్రోస్తెజోవ్ పట్టణంలో శుక్రవారం జరిగిన చెక్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ 6–3, 7–5తో రెండో సీడ్ రోమన్ జెబవీ (చెక్ రిపబ్లిక్)–ఆంద్రెజ్ మార్టిన్ (స్లొవేకియా) జంటపై నెగ్గింది.
సెమీఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 6–4, 6–4తో టాప్ సీడ్ ఎర్లెర్–మెడ్లెర్ (ఆస్ట్రియా) జంటను... క్వార్టర్ ఫైనల్లో 7–6 (7/4), 3–6, 13–11తో మూడో సీడ్ మొల్చ నోవ్ (ఉక్రెయిన్)–ఫ్రాంకో స్కుగోర్ (క్రొయే షియా) జోడీని ఓడించడం విశేషం. విజేతగా నిలిచిన సాకేత్–యూకీ జోడీకి 5,250 యూరో ల (రూ. 4 లక్షల 37 వేలు) ప్రైజ్‌మనీ తోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment