సాక్షి, నాగర్‌కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భర్త సుధాకర్‌రెడ్డి హత్యకేసులో నిందితురాలైన స్వాతి రెడ్డిని పోలీసులు నిన్న (మంగళవారం) అరెస్ట్ చేశారు. కొంతకాలంగా కోర్టు కేసు వాయిదాలకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి ఇటీవల స్వాతికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. కాగా, నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన స్వాతిరెడ్డి ...కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి 2017 నవంబర్‌లో దారుణంగా హతమార్చింది. ఈ కేసులో ఆమెను పోలీసులు అరెస్ట్ చేయగా కొంతకాలం జైలులో ఉంది. (స్వాతికి జామీను ఉపసంహరణ)
2018 జూలైలో బెయిల్‌పై వచ్చిన స్వాతి మహబూబ్‌నగర్ స్టేట్ హోంకు తరలించారు. కేసు విచారణలో భాగంగా నాగర్‌కర్నూల్‌జిల్లా కోర్టులో వాయిదాలకు ఆమె హాజరు కాకపోవడంతో జిల్లా నాలుగో తరగతి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి రవికుమార్ నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో స్టేట్ హోంలో ఉన్న ఆమెను అరెస్ట్ చేసి నిన్న కోర్టులో హాజరు పరిచారు. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment