Swathi Reddy
-
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
కలర్స్ స్వాతి.. డేంజర్ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైంది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో పూజ పాత్రతో మెరిసింది. అష్టా చమ్మా మూవీతో హీరోయిన్గా మారింది. అలా తెలుగులో హీరోయిన్గా అనేక సినిమాలు చేసింది. ఈ మధ్యే సినిమాల స్పీడు తగ్గించేసింది. గతేడాది మంత్ ఆఫ్ మధు సినిమాతో పలకరించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా పెద్ద యాక్టివ్‌గా ఉండదు.ఇష్టారీతిన కామెంట్ఎప్పుడో ఒకసారి కానీ పోస్టులు చేయదు. తాజాగా ఆమె తన కుటుంబసభ్యులను పరిచయం చేస్తూ ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఇది చూసిన ఓ ఆకతాయి నెటిజన్.. ఛీ నీ బతుకు.. అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ చదివాక దానికి కౌంటర్ ఇవ్వాల్సిందేనని నిర్ణయించుకుంది. థాంక్యూ నా బుజ్జి బతుకుసదరు కామెంట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ.. కొన్నిసార్లు నాక్కూడా అలాగే అనిపిస్తుంది.. అని సెటైర్ వేసింది. కానీ అప్పుడే మళ్లీ ముందుకు వెళ్లాలని ఆలోచిస్తుంటాను.. థాంక్యూ నా బుజ్జి బతుకు.. ఈ బతుక్కి దిష్టి తగలకూడదన్నట్లుగా నో దిష్టి అనే సింబల్‌ను జత చేసింది.చదవండి: వైరల్ ఫోటో: కట్టప్పతో ఉన్న ఈ హీరోను గుర్తుపట్టారా? -
ప్రధాన కారణం ఆ ఇద్దరే..!
-
సాయి ధరమ్ తేజ్ 'సత్య' ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ.. అక్కడే స్ట్రీమింగ్..
అష్టాచెమ్మా సినిమాలో తెగ హడావుడి చేస్తూ భలే హుషారుగా కనిపిస్తూ ఉంటుంది కలర్స్ స్వాతి. ఈ మూవీతో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ గోల్కొండ హైస్కూల్, స్వామి రారా, కార్తికేయ సినిమాలతో జనాలకు దగ్గరైంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసిన స్వాతి ఈ మధ్య స్పీడు తగ్గించింది. ఈ ఏడాది ఆమె నటించిన ఒకే ఒక్క సినిమా మంత్ ఆఫ్ మధు. నవీన్ చంద్ర హీరోగా నటించగా, శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించారు. ఈ మూవీ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్ల వద్ద అంతంత మాత్రమే ఆదరణ అందుకున్న ఈ సినిమా ఆ మధ్య ఓ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజైంది. తాజాగా మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చేసిందీ చిత్రం. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా శుక్రవారం నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. కేవలం తెలుగు భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. సినిమా కథేంటంటే? మధుసూదన్ రావు (నవీన్ చంద్ర) ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకుంటాడు. మరోవైపు విడాకుల కేసు పెట్టిన భార్య లేఖ (స్వాతి రెడ్డి) ఎప్పటికైనా తన దగ్గరకు తిరిగొస్తుందని ఆశతో ఎదురుచూస్తుంటాడు. మద్యానికి బానిసవుతాడు. మరోవైపు మధుమతి (శ్రియ నవిలే) బంధువుల ఇంట్లో పెళ్లి కోసం అమెరికా నుంచి వైజాగ్ వస్తుంది. ఈ సందర్భంలో ఆమెకు హీరో పరిచయం అవడంతో అతడి ఫ్లాష్‌బ్యాక్ తెలుసుకుంటుంది. మరి తర్వాత ఏమైంది? మధుసూదన్- లేఖ కలిసిపోయారా? విడిపోయారా? అనేది తెలియాలంటే ఓటీటీలో చూసేయండి.. If you've ever loved someone, this is a movie you will love ❤️ Watch #MonthOfMadhu today ❤️🔥 Now streaming on @PrimeVideoIN 💥 - https://t.co/LI1dFUBPLH@Naveenc212 #Swathi @srikanthnagothi @shreya_navile @ravikanthperepu @Yashmulukutla @harshachemudu @ragz46 @Rajaraveendar pic.twitter.com/X6L1v2DHom — Krishiv Productions (@KrishivOfficial) December 8, 2023 చదవండి: ఆ హీరో సీరియల్ కిస్సర్.. కానీ మా మధ్య కెమిస్ట్రీ లేకపోవడం వల్ల.. -
స్నేహానికి వ్యాపారాన్ని ముడిపెట్టలేను
పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమర్ ప్రధాన పాత్రధారులుగా, నందితా శ్వేత, దివ్యా పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మంగళవారం’. అజయ్ భూపతికి చెందిన ‘ఏ’ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్‌పై స్వాతీరెడ్డి గునుపాటి (వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె), ఎం. సురేష్ వర్మ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ చిత్రనిర్మాతలు మాట్లాడారు. స్వాతీరెడ్డి గునుపాటి మాట్లాడుతూ – ‘‘అజయ్ భూపతిగారు చెప్పిన ‘మంగళవారం’ కథ విని, ఈ సినిమా చేస్తే బాగుంటుందనిపించి చేశాను. ఓ సెన్సిటివ్ ఇష్యూని ఆయన సందేశాత్మకంగా చెప్పిన విధానం నాకు నచ్చింది. పాయల్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడింది. అజనీష్ మ్యూజిక్ బాగుంటుంది. ఇండస్ట్రీలో నాకు అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇలా అగ్రతారలతో పరిచయం ఉంది. నేను అడిగితే వారు నాతో సినిమాలు చేస్తారు. కానీ నిర్మాతగా ముందు నన్ను నేను నిరూపించుకోవాలి. వాళ్ల స్థాయికి తగ్గ సినిమాలను నిర్మించే అవకాశం ఉన్నప్పుడు వారితో నేను సినిమాలు చేస్తాను. ఎందుకంటే స్నేహాన్ని, వ్యాపారాన్ని ముడిపెట్టడం ఇష్టం లేదు’’ అన్నారు. మరో నిర్మాత సురేష్ వర్మ మాట్లాడుతూ– ‘‘మంగళవారం’ సినిమాలో లవ్, కామెడీ, యాక్షన్.. ఇలా అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయి. ఈ సినిమా తొలి రోజు నుంచే అల్లు అర్జున్‌గారు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక చిన్నతనం నుంచి చిరంజీవిగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన మా ట్రైలర్‌ను విడుదల చేయడం మర్చిపోలేని అనుభూతి’’ అన్నారు. -
పెళ్లాన్ని వదిలేసి.. స్వాతిరెడ్డితో వివాహం.. కట్ చేస్తే ఇంట్లో విగతజీవిగా
గుంటూరు ఈస్ట్: ఇంట్లో ఒంటరిగా ఉన్న ఫిజియోథెరపిస్టు హత్యకు గురైన ఘటనపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పల్నాడు జిల్లా బెల్లంకొండకు చెందిన సత్తెనపల్లి సీతారామాంజనేయులు (36) గుంటూరులోని ఓ ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నాడు. సీతారామాంజనేయులు గతంలో తన సోదరి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అయితే భార్యను బెల్లంకొండలోనే వదిలేసి గుంటూరులోని గుంటూరువారితోట 5వ లైనులో నివాసం ఉంటున్నాడు. తాను పనిచేసే ఆస్పత్రిలోనే ఫార్మాసిస్టు అయిన స్వాతిరెడ్డిని రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే వీరి వివాహం స్వాతిరెడ్డి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. స్వాతిరెడ్డి సంవత్సరన్నర క్రితం యూఎస్‌లో ఎం ఫార్మసీ చేసేందుకు వెళ్లింది. సీతారామాంజనేయులు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. రోజూ విధులకు వెళ్లి వస్తుంటాడు. నవంబరు 1న స్వాతిరెడ్డి యూఎస్ఏ నుంచి గుంటూరు రానుంది. స్వాతిరెడ్డి తండ్రి పి.శ్రీనివాసరెడ్డి ఆర్టీసీ ఉద్యోగి. శ్రీనివాసరెడ్డి ఆదివారం రాత్రి సీతారామాంజనేయులు ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్లినట్లు సమాచారం. సోమవారం ఉదయం సీతారామాంజనేయులు అసిస్టెంట్ వచ్చేటప్పటికి అతను విగత జీవుడై రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దీంతో అసిస్టెంట్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీతారామాంజనేయులు తలకు బలమైన గాయమైంది. ఈస్ట్ అడిషనల్ ఎస్పీ నచికేత్ షల్కి, కొత్తపేట ఎస్హెచ్ఓ షేక్ అన్వర్‌బాషా ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. -
'మంత్ ఆఫ్ మధు' రివ్యూ
టైటిల్: మంత్ ఆఫ్ మధు నటీనటులు: స్వాతి, నవీన్ చంద్ర, మంజుల, వైవా హర్ష తదితరులు మ్యూజిక్: అచ్చు రాజమణి సినిమాటోగ్రఫీ: రాజీవ్ ధరావత్ డైరెక్టర్: శ్రీకాంత్ నాగోతి ప్రొడ్యూసర్: యశ్వంత్ ములుకుట్ల నిడివి: 2h 20m కథేంటి? అది వైజాగ్. మధుసూధన్ రావు(నవీన్ చంద్ర) ఉన్న గవర్నమెంట్ ఉద్యోగం పోగొట్టుకుంటాడు. మరోవైపు విడాకుల కేసు పెట్టిన భార్య లేఖ (స్వాతి రెడ్డి).. ఎప్పటికైనా తన దగ్గరకు మళ్ళీ తిరిగి వస్తుందని ఆశతో ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మద్యానికి బానిస అయిపోతాడు. వీళ్లకు ఫ్లాష్ బ్యాక్ లో ఓ లవ్ స్టోరీ. మరోవైపు మధుమతి(శ్రియ నవిలే).. బంధువుల ఇంట్లో పెళ్లికోసం అమెరికా నుంచి వైజాగ్ వస్తుంది. ఓ సందర్భంలో ఈమెకి హీరో మధు పరిచయం అవుతాడు. మాటల సందర్భంలో అతడి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది? చివరకు మధుసూదన్- లేఖ కలిశారా? లేదా అనేది స్టోరీ. ఎలా ఉందంటే? మంత్ ఆఫ్ మధు సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన మధు అనే ఓ అమ్మాయి.. వైజాగ్ లో నెల రోజుల్లో ఫేస్ చేసిన అనుభవాలే. ఇన్నాళ్లు తమిళ్, మలయాళంలో నేచురల్ సినిమాలు చూసి.. అయ్యో ఇలాంటివి మన తెలుగులో వస్తే బాగున్ను కదా అని చాలామంది అనుకున్నారు. అలాంటి ప్రయత్నమే ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. బార్ లో మందు తాగుతున్న హీరోని కొందరు వ్యక్తులు ఎలా పడితే అలా చితక్కొట్టే సీన్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. 2003 వైజాగ్ కి చెందిన ఓ కుర్రాడు మధుసూధన్. కాలేజీ చదివే అమ్మాయి లేఖ. ఇద్దరు డీప్ లవ్ లో ఉంటారు. ఏకాంతంగా కలవడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని తీయించుకోవడానికి ఓ క్లినిక్ కి వెళ్తారు. ఆ తర్వాత వీళ్లు, వాళ్ల చుట్టూ ఉండే పాత్రలు పరిచయం చేస్తూ వెళ్ళారు. మరి ఈ కథ కంచికి చేరింది లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. అయితే సినిమాని చాలా నేచురల్ గా తీశారు. 2003 వైజాగ్ పరిస్థితుల్ని చాలా చక్కగా చూపించారు. అయితే సినిమాలో అసలు స్టోరీ ఏంటనేది సినిమా మొదలై చాలాసేపు అయిన ఓ పట్టానా అర్థం కాదు. తెరపై పాత్రలు వస్తుంటాయి, పోతుంటాయి కానీ ఒక్క సీన్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోతం. భార్య - భర్త, వాళ్ళ మధ్య మనస్పర్ధలు, బాధ, ప్రేమ, విరహం, ఒక్కటి కావాలనే తపన ఇలా చాలా పాయింట్స్ ఉంటాయి. ఇందులో అలాంటివి ఉన్నా సరే వాటిని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అలానే టైటిల్ రోల్ చేసిన మధు అనే అమ్మాయి పాత్ర, ఆమె మాట్లాడే అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లీష్ చిరాకు తెప్పిస్తుంది. సినిమాలో స్వాతి, నవీన్ చంద్ర, మంజుల, వైవా హర్ష తప్ప మరో తెలిసిన ముఖం కనిపించదు! ఎవరెలా చేశారు? మధుసూధన్ రావు పాత్ర చేసిన నవీన్ చంద్ర, లేఖ పాత్ర చేసిన స్వాతి బాగానే చేశారు. కానీ వీళ్ళ పాత్రల్లో డెప్త్ మిస్ కావడంతో ఎంత నేచురల్ గా తీసినా అవి తేలిపోయాయి. మహేష్ సోదరి మంజుల ఓ నాలుగైదు సీన్స్ లో కనిపించింది. వైవా హర్ష అక్కడక్కడ కనిపించి కాస్త నవ్వించాడు. మధుమతిగా చేసిన శ్రియ నవిలే.. ఆ పాత్రకి అసలు సూట్ కాలేదనిపించింది. అయితే యోగ టీచర్ వాసుకిగా చేసిన జ్ఞానేశ్వరి మాత్రం చూడ్డానికి చాలా బాగుంది. మిగతా వాళ్లంతా ఓకే అనిపించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే.. పాటలు పెద్దగా గుర్తుండవ్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. అయితే సినిమాలో రెండు ర్యాప్ సాంగ్స్ ఉంటాయి. అవి సింక్ లేకుండా ఎందుకు పెట్టారో అర్థం కాదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్ గా చెప్పుకుంటే 'మంత్ ఆఫ్ మధు' రెగ్యులర్ ఆడియెన్స్ కి నచ్చడం కష్టమే! - చందు, సాక్షి వెబ్ డెస్క్ చదవండి: క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 మూవీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
వేదికపైనే బోరున ఏడ్చేసిన కలర్స్ స్వాతి.. ఎందుకంటే?
నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి కలిసి నటిస్తోన్న తాజా చిత్రం మంత్ ఆఫ్ మధు. ఈ చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గతంలో వీరిద్దరూ త్రిపుర చిత్రంలో జంటగా కనిపించారు. మరోసారి వెండితెరపై జంటగా ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రబృందం. మూవీ ప్రమోషన్లలో భాగంగా నవీన్ చంద్ర, స్వాతి వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రెస్ మీట్లో స్వాతిపై నవీన్ చంద్ర ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో అతని మాటలు విన్న కలర్స్ స్వాతి ఫుల్ ఎమోషనలయ్యారు. (ఇది చదవండి: కలర్స్ స్వాతితో పెళ్లి.. అసలు విషయం చెప్పేసిన నవీన్ చంద్ర!) నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ' ఈ సినిమాలో లేఖ అనే క్యారెక్టర్ చేయడానికి చాలా గడుసు కావాలి. మా సిస్టర్ జాబ్ చేస్తుంటారు. తాను బస్సు, ఆటో, మెట్రోలో రోజు ప్రయాణం చేయాలి. తన కుటుంబం కోసం కష్టపడాలి. అలాగే స్వాతి కూడా చాలా హార్డ్ వర్క్ పర్సన్. తనను నేను మా ఫ్యామిలీ మెంబర్‌గానే చూస్తాను. తను కష్టపడడమే కాకుండా.. తనతో పనిచేసే వారిలో నమ్మకం కలిగిస్తుంది. ఆ దేవుడిని ఇంతకంటే ఏమీ అడగలేను. అందుకే తను నా బెస్ట్ ఫ్రెండ్. భవిష్యత్తులోనూ ఏదైనా అవకాశమొస్తే మేమిద్దరం కలిసి నటిస్తాం. మేం మంచినటులం. మీ అందరు మా జోడీని ఇంత బాగా గుర్తిస్తున్నందుకు చాలా థ్యాంక్స్.' అని అన్నారు. అయితే నవీన్ చంద్ర మాటలకు స్వాతి వేదికపైనే ఏడ్చేసింది. నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్ అంటూ స్వాతి ఫుల్ ఎమోషనలయ్యారు. కాగా.. ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అన్ని సినిమాలు వేరు.. ఈ సినిమా వేరు
‘‘ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి ట్రైలర్లో ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రం బెస్ట్. అన్ని సినిమాలు వేరు.. ఈ సినిమా వేరని ట్రైలర్లోనే తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ అవుతుంది’’ అని హీరో సిద్ధు జొన్నలగడ్డ అన్నారు. నవీన్ చంద్ర, స్వాతీ రెడ్డి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో యశ్వంత్ ములుకుట్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘‘మంత్ ఆఫ్ మధు’ ట్రైలర్ బాగుంది’’ అన్నారు కీరవాణి. ‘‘ఇలాంటి సినిమాలు, ఇందులోనిపాత్రలు అరుదుగా వస్తుంటాయి’’ అన్నారు నవీన్ చంద్ర. ‘‘ఈ మూవీని ΄్యాషన్‌తో తీశాం.. ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు శ్రీకాంత్ నాగోతి, యశ్వంత్ ములుకుట్ల. -
కలర్స్ స్వాతి 'మంత్ ఆఫ్ మధు' ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'అమెరికాలో అందరూ ఇండియన్ అని అనుకుంటున్నారు'.. ఆసక్తిగా ట్రైలర్!
కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర జంటగా నటించిన చిత్రం మంత్ ఆఫ్ మధు. ఈ చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిపుర సినిమాలో జంటగా నటించిన వీరిద్దరు మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే భార్య, భర్తల మధ్య జరిగే గొడవలే కథాశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సరికొత్త కాన్సెప్ట్ కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో శ్రేయ నవిలే, మంజుల ఘట్టమనేని, హర్ష చెముడు, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, రాజా చెంబోలు, రాజా రవీంద్ర, రుద్ర రాఘవ్, రుచితా సాదినేని, మౌర్య సిద్దవరం, కంచెరపాలెం కిషోర్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. మంత్ ఆఫ్ మధు అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సాయితేజ్-స్వాతి.. ఆ విషయం ఇప్పుడు బయటపెట్టారు!
మెగాహీరో సాయిధరమ్ తేజ్‌ని హీరోయిన్ స్వాతి స్టేజీపై ముద్దుపెట్టుకుంది. అయితే వీళ్లిద్దరూ యాక్టర్స్ అని, టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారని చాలామందికి తెలుసు. కలిసి కూడా ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ ఈవెంట్లో తమ బాండింగ్ గురించి చెబుతూనే ఎవరికీ తెలియని ఓ విషయాన్ని బయటపెట్టారు. ఇప్పుడు ఇది ఆసక్తి కలిగిస్తోంది. కలర్స్ టాక్ షోతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్వాతి.. 'అష్టాచమ్మా' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. కొన్నాళ్ల పాటు పలు చిత్రాలు చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని, నటనకు కాస్త బ్రేక్ ఇచ్చింది. కొన్నాళ్ల ముందే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టేసింది. ఈమె హీరోయిన్గా నటించిన 'మంత్ ఆఫ్ మధు' మూవీ అక్టోబరు 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ వేడుకని మంగళవారం నిర్వహించారు. దీనికి గెస్ట్‌గా వచ్చిన మెగాహీరో సాయితేజ్.. స్వాతి గురించి పలు విషయాలు రివీల్ చేశాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 37 సినిమాలు) 'స్వాతి గురించి చెప్పాలంటే మీ అందరికీ కలర్స్ స్వాతి. కానీ నాకు మాత్రం స్వాతిగాడు. ఎందుకంటే కాలేజీ రోజుల నుంచే స్వాతి నాకు బెస్ట్ ఫ్రెండ్. కలర్స్ స్వాతిగా మొదలై స్వాతి అయింది. ఆ తర్వాత స్వాతిగాడు అయింది. ఈ మూవీ స్వాతికి మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్త్ స్వాతి' అని సాయిధరమ్ తేజ్ చెప్పాడు. ఆ వెంటనే ఇతడిని హగ్ చేసుకున్న స్వాతి బుగ్గపై ముద్దుపెట్టింది. ఇక స్వాతి మాట్లాడుతూ.. 'మేం ఇద్దరం కలిసి చదువుకున్నాం. సినిమాల్లోకి నేను ముందే వచ్చేశాను కాబట్టి తనకంటే పెద్దదాన్ని అని మీరందరూ అనుకుంటున్నారేమో. కానీ మా ఇద్దరికీ ఒకే ఏజ్(వయసు). ఒకే కాలేజీలో డిగ్రీ చేశాం. ఎగ్జామ్స్ లో నేను చూపిస్తేనే పాసయ్యాడు(నవ్వుతూ). ఏడాదిగా కలిసి 'సత్య' అనే ప్రాజెక్ట్ చేశాం. తేజూ నా జీవితంలో ఎప్పుడూ సపోర్ట్ సిస్టంలా ఉంటూ వస్తున్నాడు. థాంక్యూ తేజు' అని అతడితో బాండింగ్ గురించి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: కలర్స్ స్వాతి విడాకుల రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!) -
కలర్స్ స్వాతి విడాకుల రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!
కలర్స్ స్వాతి తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. డేంజర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన తెలుగమ్మాయి.. ఆడవారికి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో ఫేమస్ అయింది. ఆ తర్వాత అష్టా చెమ్మా, త్రిపుర, కలవరమాయే మదిలో, మిరపకాయ్ చిత్రాల్లో నటించింది. తాజాగా మంత్ ఆఫ్ మధు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రంలో త్రిపురలో కలిసి నటించిన నవీన్ చంద్రతో మరోసారి కనిపించనుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానాలిచ్చింది. (ఇది చదవండి: వహీదా రెహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే..) ఈవెంట్లో పాల్గొన్న కలర్స్ స్వాతికి ఆసక్తికర ప్రశ్నలు వేశారు. మీపై ఇటీవల డైవర్స్ తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి కదా.. వీటిపై మీ సమాధానమేంటి అని అడిగారు. అయితే దీనికి స్వాతి సైతం అదే రీతిలో స్పందించింది. ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇలాంటి వాటికి నేను సమాధానం కూడా ఇవ్వను అంటూ తెగేసి చెప్పింది. స్వాతి మాట్లాడుతూ..' నేను కలర్స్ ప్రోగ్రామ్‌లో చేస్తున్నప్పుడు నా వయసు కేవలం పదహారేళ్లు. అప్పట్లో అయితే సోషల్ మీడియా కూడా లేదు. నన్ను నేను ఎలా ప్రజెంట్ చేసుకోవాలో కూడా నాకు తెలియదు. అప్పుడు కనుక సోషల్ మీడియా ఉండి ఉంటే నన్ను ఫుట్ బాల్ ఆడేసేవారేమో అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడేలా హ్యాండిల్ చేస్తున్నారే తెలియదు. ఒక యాక్టర్‌గా నాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి కదా. అందుకే ఈ విషయం గురించి నేను చెప్పను.' అని అన్నారు. కాగా.. ప్రస్తుతం కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర జంటగా నటించిన మంత్ ఆఫ్ మధు అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇది చదవండి: 40 ఏళ్లలో సంపాదించిన ఆస్తి, నగలు.. అన్నీ పోగొట్టుకున్నా: నటి) -
కలర్స్ స్వాతితో పెళ్లి.. అసలు విషయం చెప్పేసిన నవీన్ చంద్ర!
నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి కలిసి నటిస్తోన్న తాజా చిత్రం మంత్ ఆఫ్ మధు. ఈ చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ కాగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గతంలో వీరిద్దరూ త్రిపుర చిత్రంలో జంటగా కనిపించారు. మరోసారి వెండితెరపై జంటగా ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు చిత్రబృందం. తాజాగా ప్రమోషన్స్‌కు హాజరైన నవీన్ చంద్ర ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అయితే గతంలో స్వాతిని పెళ్లి చేసుకున్నానంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. ఈ రూమర్స్ రావడానికి గల కారణాలను వెల్లడించారు. (ఇది చదవండి: సినిమా అగ్రిమెంట్ సంతకం పెట్టాక కాస్టింగ్ కౌచ్‌కు తెరలేపేవారు) నవీన్ చంద్ర మాట్లాడుతూ..'త్రిపుర సినిమా కోసం మొదటిసారి స్వాతితో కలిసి నటించా. ఆమె మంచి వ్యక్తి. మా ఇద్దరి ఫ్యామిలీస్‌కు మంచి రిలేషన్ ఉంది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే చిత్రబృందం మొదట ఓ ఫొటో రిలీజ్ చేసింది. అందులో నేను, స్వాతి పెళ్లి దుస్తుల్లో కనిపించాం. దీంతో ఆ ఫొటో సోషల్‌మీడియాలో కాస్తా వైరలైంది. అది చూసి చాలామంది నిజంగానే పెళ్లైందని భావించారు. కొన్ని రోజులకే మా చిత్రబృందం అదే ఫొటోని పోస్టర్‌గా రిలీజ్ చేసింది. ఆ తర్వాత కొంతమందికి క్లారిటీ వచ్చింది. ఆ ఫొటో వచ్చిన సమయంలో చాలామంది మీరు స్వాతిని పెళ్లి చేసుకున్నారా? అని నన్ను డైరెక్ట్‌గా అడిగారు. కానీ ఈ విషయాన్ని మేమిద్దరం సీరియస్‌గా తీసుకోలేదు.' అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన మంత్ ఆఫ్ మధు అక్టోబర్ 6న విడుదల కానుంది. (ఇది చదవండి: నేను శరత్‌బాబును రెండో పెళ్లి చేసుకోలేదు.. క్లారిటీ ఇచ్చిన నటి) -
నిజాన్ని నిజాయితీగా చెప్పాం
‘‘మంత్ ఆఫ్ మధు’లో మాకు తెలిసిన నిజాన్ని నిజాయితీగా చెప్పాం. శ్రీకాంత్‌గారు అద్భుతంగా తీశారు. ఇది ఫీమేల్ సెంట్రిక్ సినిమా కాదు’’ అని స్వాతి రెడ్డి అన్నారు. నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి జంటగా శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. యశ్వంత్ ములుకుట్ల నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రెస్మీట్లో శ్రీకాంత్ నాగోతి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని మేమెంత ΄్యాషనేట్‌గా తీశామో.. ప్రేక్షకులకు కూడా అంతే చక్కగా చేరువవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘‘ఈ చిత్రం 90 శాతం షూటింగ్‌ని వైజాగ్‌లో చేశాం’’ అన్నారు యశ్వంత్ ములుకుట్ల. -
సాయిధరమ్ తేజ్ ‘ది సోల్ ఆఫ్ సత్య’ సాంగ్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
విడాకుల బాటలో కలర్స్ స్వాతి.. నిహారిక,సమంత మాదిరే క్లూ ఇచ్చేసిందంటూ..
బుల్లితెర నుంచి తన సరదా మాటలతో ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత వెండితెరపై మెరిసింది కలర్స్ స్వాతి. తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషల్లో తనదైన నటనతో మెప్పించింది. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ లో వెంకటేష్‌కు మరదలిగా నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత స్వామిరారా,కార్తికేయ్ వంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది. హీరో నాని సరసన ‘అష్టా చమ్మా’లో అద్భుతమైన నటనతో కలర్స్ స్వాతి ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు నంది అవార్డును కూడా ఆమె సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: 50 దాటేసిన వరలక్ష్మి శరత్ కుమార్ ... అప్పట్లో ఈ బ్లాక్ బస్టర్ సినిమా చేసుంటేనా?) తాజాగా స్వాతి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కొద్దిరోజుల నుంచి తన భర్త వికాస్‌కు దూరంగా ఉంటున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ ప్రచారానికి ప్రధాన కారణం తన భర్త ఫోటోలను ఇన్స్టాగ్రామ్ నుంచి స్వాతి తొలగించడమే అని చెప్పుకొస్తున్నారు. గతంలో సమంత కూడా నాగ చైతన్యతో విడిపోతున్నప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో అక్కినేని అనే ఇంటి పేరుతో పాటు వారిద్దరూ ఉన్న ఫోటోలను కూడా తొలగించింది. ఈ మధ్యే విడాకులు తీసుకున్న నిహారిక-చైతన్య విషయంలో కూడా ఇలాగే జరిగింది. దీంతో తాజాగా కలర్స్ స్వాతి కూడా తన భర్త ఫోటోలను ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించిందని, తను కూడా విడాకులు తీసుకోబోతుందని పలు యూట్యూబ్ చానల్స్‌తో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్వాతి విషయంలో ఇలాంటి ప్రచారం జరగడం ఇది కొత్తేమి కాదు. సుమారు రెండేళ్ల క్రితం కూడా తన వివాహబంధం విషయంలో ఇలాంటి ప్రచారమే జరిగింది. విడాకుల విషయంపై గతంలో స్వాతి ఇచ్చిన వివరణ సుమారు రెండేళ్ల క్రితం కూడా స్వాతి విడాకులు తీసుకోబోతుందని ప్రచారం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్త ఫోటోలు ఎందుకు లేవో కూడా కారణం అప్పట్లోనే ఇలా తెలిపింది. భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఆర్కివ్స్ లో దాచుకున్నానని చెబుతూ.. తన ఫోన్లో ఉన్న వాటిని చూపించింది. అంతేకాదు వాటిన్నంటిని ఓ చిన్న వీడియోగా తీసి అప్పట్లోనే పోస్ట్ చేసింది. దీంతో ఆ సమయంలో విడాకుల పుకార్లు ఆగిపోయాయి. (ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి ఈ జంట ఎంట్రీ ఖాయం.. వాళ్లకు బిగ్ సపోర్ట్ ఎవరో తెలిస్తే) తాజాగా ఎందుకోగాని మళ్లీ స్వాతి విషయంలో మళ్లీ ఇదే ప్రచారం జరుగుతుంది. 2018లో మలయాళీ కుటుంబానికి చెందిన పైలెట్ వికాస్ వాసును స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ థాయ్‌ల్యాండ్‌లో సెటిల్ అయ్యారు. అప్పట్లో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన స్వాతి మళ్లీ 2019లో మళయాలంలో త్రిశూరపురం అనే సినిమాలో నటించింది. తెలుగులో కూడా పంచతంత్రంతో పాటు మరో రెండు సినిమాలు చేసింది. ఇప్పుడు సినిమాలు చేస్తూ హైదరాబాద్‌లోనే స్వాతి ఉంటుందని, భర్త వికాస్ మాత్రం థాయ్‌ల్యాండ్‌లోనే ఉంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, గతంలో మాదిరే మళ్లీ తను రియాక్ట్ అయి ఇలాంటి వార్తలు ప్రచారం చేసే వారికి సమాధానం చెబుతుందేమో తెలియాల్సి ఉంది. విడాకుల ప్రచారంపై గతంలో స్వాతి షేర్ చేసిన వీడియో View this post on Instagram A post shared by Swathi (@swati194) -
బీసీ మహిళంటూ బాబు బుకాయింపు!
సాక్షి, అమరావతి: కళ్లార్పకుండా అబద్ధాలను వల్లించడంలో తాను గోబెల్స్‌ను మించిపోయిన విషయాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి రుజువు చేసుకున్నారు! టీడీపీ అనుబంధ విభాగం ఐ–టీడీపీని వికృత పోస్టులకు అడ్డాగా మార్చేసిన ఆయన అసభ్యకర పోస్టులు పెట్టే శ్వేతా చౌదరి అలియాస్ స్వాతిరెడ్డిని నిస్సిగ్గుగా సమర్థించడం విస్మయం కలిగిస్తోంది. పైగా ఆమె బీసీ మహిళా అంటూ బుకాయించడం గమనార్హం. స్వాతి రెడ్డి ఎందుకు అయ్యారంటే... కమ్మ సామాజిక వర్గానికి చెందిన కోట శ్వేతాచౌదరి మారుపేరుతో స్వాతిరెడ్డినంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం వెనుక టీడీపీ పక్కా పన్నాగం దాగుంది. తిరుపతికి చెందిన ఆమె నర్సింగ్ కోర్సు చేసి హాస్పిటల్ మేనేజ్మెంట్ చదివేందుకు స్టూడెంట్ వీసాపై లండన్‌లో ఉంది. ఐ–టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తోంది. కువైట్ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగంలో క్రియాశీలకంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్, ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగతంగా అసభ్యకర పోస్టులను సోషల్ మీడియాలో వైరల్ చేయడమే లక్ష్యంగా ఐ–టీడీపీ ఆమె పేరు, సామాజికవర్గం పేరును మార్చేసింది. శ్వేతా చౌదరిని ఏకంగా స్వాతి రెడ్డిగా మార్చి సోషల్ మీడియాలో అకౌంట్ తెరిచింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా కించపరుస్తూ అసభ్యకర రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. ఆమెను నిస్సిగ్గుగా వెనకేసుకు రావడం ద్వారా ఈ కుట్ర వెనుక తాను ఉన్నట్లు చంద్రబాబు చెప్పకనే చెప్పారు! ఆమె కుటుంబానికీ సంక్షేమ పథకాలు.. ముఖ్యమంత్రి జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్న శ్వేతా చౌదరి అలియాస్ స్వాతి రెడ్డి కుటుంబానికి కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోంది. ఆమె తండ్రి కోట విశ్వనాథ్ ప్రస్తుతం ఆ కుటుంబానికి దూరంగా మదనపల్లిలో మరో మహిళతో కలసి జీవిస్తున్నారు. వారిద్దరికీ రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు– పేదలు అందరికీ ఇళ్లు’ పథకం కింద విడివిడిగా ఇళ్లను మంజూరు చేసింది. అయితే వారిద్దరూ తమకు పక్కపక్కనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని కోరుతున్నారు. శ్వేతాచౌదరి తండ్రి జీవించి ఉన్నప్పటికీ తిరుపతిలో నివసిస్తున్న ఆమె తల్లి లలిత వితంతు పింఛన్ పొందుతున్నారు. -
ఆ సినిమాతో నన్ను మరదలిగా ఫిక్స్ అయిపోయారు: స్వాతి రెడ్డి
స్వాతి కంటే కలర్స్ స్వాతి అంటేనే ఠక్కున గుర్తు పట్టేస్తారు. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన వారిలో స్వాతిరెడ్డి ఒకరు. కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి.. ఆ తర్వాత నటిగా రాణించింది. ఎలాంటి పాత్రను ఇచ్చినా అవలీలగా చేస్తూ ఉంటుంది తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో తనదైన నటనతో మెప్పించింది. (ఇది చదవండి: పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోతుందని చెప్పారు: శివ బాలాజీ) స్వాతి మొదటి చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్. 2008లో వచ్చిన అష్టాచెమ్మా చిత్రం ఆమెకు మంచి ఫేమ్ తీసుకొచ్చింది. ఈ సినిమాకు ఆమెకు నంది పురస్కారం లభించింది. ఆ తర్వాతనే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన స్వాతి కెరీర్లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. (ఇది చదవండి: 'ది కేరళ స్టోరీ' ప్రభంజనం.. ఆలియా భట్ సినిమా రికార్డ్ బ్రేక్!) స్వాతి మాట్లాడుతూ.. 'నా కెరీర్లో నేను చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. ఎప్పటికప్పుడు ఒక సినిమా తరువాత మరో సినిమా అవకాశం రాదనుకునేదాన్ని.'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' సినిమాలో వెంకటేశ్‌కు మరదలు రోల్ చేశా. ఆ చిత్రం నాకు మంచి గుర్తింపే తీసుకొచ్చింది. కానీ ఆ తర్వాత అన్నీ మరదలు పాత్రలే వచ్చాయి. అవీ చేయడానికి నేను ఇష్టపడలేదు. నా గ్రాఫ్ పడిపోతుందనుకున్న ప్రతిసారి ఏదో ఒక హిట్ పడేది. అలా ఈ రోజున నేను చెప్పుకోవడానికి కొన్ని హిట్లు ఉన్నాయి. 'స్వామి రారా' .. 'సుబ్రమణ్యపురం' 'కార్తికేయ' అలాంటివే. నా కెరియర్లో 'డేంజర్' సినిమా సమయంలో చాలా రూమర్స్ వచ్చాయి. కానీ వాటిని నేను పెద్దగా పట్టించుకోలేదు.' అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. ప్రస్తుతం మంత్ ఆఫ్ మధు అనే చిత్రంలో నటిస్తున్నారు. -
అందువల్లే స్వాతిరెడ్డి కోర్టుకు హాజరుకాలేకపోయింది
మహబూబ్‌నగర్ క్రైం: సరిగ్గా రెండేళ్ల తర్వాత స్వాతిరెడ్డి పేరు మళ్లీ ప్రచారంలోకి వచ్చింది. ఈ కేసులో రెండేళ్ల కిందట ప్రియుడితో కలిసి భర్తను అత్యంత కిరాతంగా హత్య చేయడంతో అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించింది. భర్తను హత్య చేసినందుకు స్వాతిరెడ్డికి అప్పట్లో కోర్టు జైలు శిక్ష విధించింది. అనంతరం బెయిల్‌పై స్వాతిని 2018 జూలై 27న విడుదల చేశారు. అయితే, ఆమెను తీసుకువెళ్లేందుకు వారి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో కలెక్టర్, న్యాయసేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా జైలు అధికారులు స్వాతిని జైలు నుంచి నేరుగా పట్టణంలోని మెట్టుగడ్డ దగ్గర ఉన్న రాష్ట్ర సదనంకు తరలించారు. అయితే ఈ కేసులో నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టుకు వాయిదాల కోసం వెళ్లాల్సి ఉండగా మూడు సార్లు ఆమె కోర్టుకు హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి స్వాతిరెడ్డిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో నాగర్‌కర్నూల్ పోలీసులు ఆమెను మంగళవారం అరెస్టు చేసి జిల్లా జైలుకు తరలించారు. రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఆమె జైలులో 14రోజుల పాటు శిక్ష అనుభవించనుంది. ఇదిలాఉండగా, స్టేట్‌హోం నుంచి నాగర్‌కర్నూల్ కోర్టుకు వెళ్లడానికి సరైన భద్రత, స్థానిక సిబ్బంది నుంచి సరైన సహకారం లేకపోవడం వల్లే ఆమె కోర్టుకు హాజరుకాకపోవడానికి కారణాలుగా తెలుస్తోంది. -
స్వాతిరెడ్డి అరెస్ట్, జైలుకు తరలింపు
సాక్షి, నాగర్‌కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భర్త సుధాకర్‌రెడ్డి హత్యకేసులో నిందితురాలైన స్వాతి రెడ్డిని పోలీసులు నిన్న (మంగళవారం) అరెస్ట్ చేశారు. కొంతకాలంగా కోర్టు కేసు వాయిదాలకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి ఇటీవల స్వాతికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. కాగా, నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన స్వాతిరెడ్డి ...కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి 2017 నవంబర్‌లో దారుణంగా హతమార్చింది. ఈ కేసులో ఆమెను పోలీసులు అరెస్ట్ చేయగా కొంతకాలం జైలులో ఉంది. (స్వాతికి జామీను ఉపసంహరణ) 2018 జూలైలో బెయిల్‌పై వచ్చిన స్వాతి మహబూబ్‌నగర్ స్టేట్ హోంకు తరలించారు. కేసు విచారణలో భాగంగా నాగర్‌కర్నూల్‌జిల్లా కోర్టులో వాయిదాలకు ఆమె హాజరు కాకపోవడంతో జిల్లా నాలుగో తరగతి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి రవికుమార్ నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో స్టేట్ హోంలో ఉన్న ఆమెను అరెస్ట్ చేసి నిన్న కోర్టులో హాజరు పరిచారు. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తరలించారు. -
ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లా : స్వాతిరెడ్డి
సాక్షి,సిటీబ్యూరో: కష్టాలు ఎదురైనా...కన్నీళ్లను దిగమింగుకొని...ఒకానొక దశలో పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకునేంత వరకు వెళ్లి నేడు మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగారు ఎస్ఎస్ శ్రీఫుడ్స్ బిస్కెట్ కంపెనీ నిర్వాహకురాలు స్వాతిరెడ్డి. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా బ్యాంక్ రుణంతో ఏడాదికి కోటి రూపాయల వ్యాపారం చేసే స్థాయికి తీసుకువచ్చానని చెబుతున్నారు. మాది కరీంనగర్.. నా 16వ ఏటానే రాజేశ్వర్‌రెడ్డితో వివాహమైంది. ఒక పాప, బాబు సంతానం. 2008లో హైదరాబాద్‌కు వచ్చాం. తొలినాళ్లలో చీరల వ్యాపారం మొదలెట్టా. 2013 నుంచి ఆన్లైన్లోనే చీరలు అమ్ముతూ ఇంటిఖర్చులు వెళ్లదీశా. బంధువులతో కలిసి 2016 జూన్‌లో బిస్కెట్ వ్యాపారంలోకి అడుగుపెట్టా. అయి తే భేదాభిప్రాయాలు రావడంతో రూ.ఎనిమిది లక్షల నష్టం చేకూర్చారంటూ భాగస్వామ్యులు పక్కకు తప్పించారు. 2017 జూలైలో దాదాపు రెండు వారాల పాటు భర్త కరీంనగర్‌కు వెళుతున్నానని చెప్పి కనీసం సెల్ఫోన్లో కూడా అందుబాటులో లేకపోవడంతో ఏమీ చేయాలో తెలియలేదు. అప్పుల వాళ్లు ఇంటికి వచ్చి వెళుతుండటంతో పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనే స్థాయికి వెళ్లా. మరో మూడేళ్లు చదివితే నేనే ఉద్యోగం చేస్తానంటూ పాప అన్న మాట కదిలించింది. బంగారు ఆభరణాలను తనఖాపెట్టి ఫీజులు చెల్లించా. ఓ స్వచ్ఛందసేవా సంస్థ తరఫున సేవా కార్యక్రమాలు చేస్తున్న సమయంలో ఓ అబ్బాయి బిస్కెట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడతానంటూ ముందుకురావడం ఆనందం కలిగించింది. అంతలోనే వెనక్కి వెళ్లడంతో బ్యాంక్ నుంచి రూ.24 లక్షల రుణం తీసుకున్నా. 2018లో ఐడీపీఎల్‌లో ఎస్ఎస్ బిస్కెట్ కంపెనీ ప్రారంభించా. ప్రస్తుతం 30 మంది సిబ్బందితో ఎస్ఎస్ బిస్కెట్లను మార్కెట్లో అతితక్కువ కాలంలో అందరి నోళ్లలో నానేలా చేశాం. 12 మంది మహిళలకు ఉద్యోగాలిచ్చా. -
నిరాడంబరంగా కలర్స్ స్వాతి వివాహం
-
స్వాతిరెడ్డిని విచారించిన పోలీసులు
నాగర్‌కర్నూల్ క్రైం: ఇటీవల ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన ఘటనలో నిందితురాలిగా ఉన్న స్వాతిరెడ్డిని శనివారం పోలీసులు విచా రించారు. ఆమె విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకునేలా అనుమతి ఇవ్వాలని నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు రెండు రోజుల క్రితం అక్కడి కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు శుక్రవారం అను మతి లభించడంతో.. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి ఆమెను నాగర్ కర్నూల్ తీసుకొచ్చారు. తొలుత ఆమెను పోలీస్‌స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు కొంత సమాచారం సేకరించేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత సుధాకర్‌రెడ్డి హత్య జరిగిన ఇంటికి తీసుకువెళ్లారు. ఇంట్లో పడిన రక్తపు మరకలను తుడి చిన బట్టలు, సుధాకర్‌రెడ్డి ధరించిన దుస్తులు, హత్య సమయంలో స్వాతి, రాజేష్ ధరించిన బట్టల విషయమై వారిని పోలీసులు గతంలో ప్రశ్నిస్తే.. తనకేమీ తెలియదని, స్వాతిరెడ్డికే తెలుసని చెప్పిన విషయం విదితమే. దీంతో ఇంటికి స్వాతిరెడ్డిని తీసుకు వెళ్లగా బీరువా కింద దాచి ఉం చిన బట్టలను స్వాతి పోలీసులకు అందజేసింది. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీ సులు.. స్వాతిని తిరిగి కోర్టులో హాజరుపర్చారు. ఆమెను రిమాండ్‌కు తరలించాలన్న న్యాయమూర్తి ఆదేశాలతో తిరిగి మహబూబ్‌నగర్ జైలుకు తీసుకువెళ్లారు. -
స్వాతి పొలంలోనే నరేశ్‌ను చంపేశారు
- భువనగిరి ప్రేమగాథ విషాదాంతం - నరేశ్‌ను స్వాతి తండ్రే హత్యచేశాడని పోలీసుల వెల్లడి - కొద్ది రోజుల కిందటే ఆత్మహత్య చేసుకున్న స్వాతి భువనగిరి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నరేశ్ అదృశ్యం కేసు ఊహించిన మలుపే తిరిగింది. స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డే నరేశ్‌ను కిరాతకంగా హత్యచేసినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పోలీసులు శనివారం ఉదయం శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేశారు. శ్రీనివాస రెడ్డి సోదరుడు, సోదరుడి కుమారుల పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. మే 1 నుంచి నరేశ్ అదృశ్యంకాగా, అతని ప్రియురాలు స్వాతి మే 16న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆద్యంతం మలుపులతో కూడిన ప్రేమగాథ చివరికి తీవ్రవిషాదాంతంగా ముగిసినట్లయింది. స్వాతి పొలంలోనే చంపేశారు.. స్వాతి- నరేశ్‌ల ప్రేమ వ్యవహారంపై మొదటి నుంచీ విముఖత ప్రదర్శించిన శ్రీనివాసరెడ్డి.. తమను కాదని స్వాతి.. నరేశ్ వెళ్లడంతో కోపం పెంచుకున్నారు. పథకం ప్రకారమే ముంబై నుంచి స్వాతి-నరేశ్‌లను ఊరికి రప్పించారు. వివాహం జరిపిస్తామని కూతురిని నమ్మించిన శ్రీనివాసరెడ్డి.. ఆమె చేతే ఫోన్ చేయించి నరేశ్‌ను పిలిపించాడు. స్వాతి పేరుమీద ఉన్న పొలంలోనే నరేశ్‌ను అతికిరాతకంగా హత్యచేశారు. అనంతరం శవాన్ని టైర్లతో కాల్చేసి, బూడిదను మూసి నదిలో కలిపారు. పోలీసుల విచారణలో స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి, ఇతర నిందితులు ఈ మేరకు నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. కోర్టు జోక్యంతో కదిలిన డొంక.. అంబోజి నరేశ్ అదృశ్యం విషయంలో అతని తల్లిదండ్రులు, దళిత సంఘాలు వ్యక్తపరిచిన అనుమానమే నిజమైంది. మే 1 నుంచి కనిపించకుండాపోయిన నరేశ్‌ను స్వాతి కుటుంబీకులే ఏదైనా చేసి ఉంటారని సర్వత్రా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పోలీసులు మాత్రం ఆ దిశగా దర్యాప్తు జరపకపోవడంతో బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించింది. స్పందించిన కోర్టు.. జూన్ 1 లోగా నరేశ్ ఆచూకీ కనిపెట్టాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు గడువు సమీపిస్తుండటంతో చేసేదేమీలేక అసలు నిందితులను అరెస్ట్‌చేశారు. ఈ కేసులో పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఎలా మొదలైంది? పల్లెర్ల గ్రామానికి చెందిన అంబోజు నరేష్‌తో ఫేస్బుక్ ద్వారా రెండు సంవత్సరాల క్రితం స్వాతి పరిచయం ఏర్పడింది. నరేష్ తల్లిదండ్రులు ముంబై లో ఉంటున్నారు. నరేష్ పల్లెర్లలో తాత వద్ద ఉంటూ భువనగిరిలో డిగ్రీ పూర్తి చేశాడు. స్వాతి వలిగొండలో ప్రగతి కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఫేస్బుక్లో ఏర్పడిన ఈ ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో గత మార్చి 25న ముంబై వెళ్లి వివాహం చేసుకున్నారు. నెల రోజుల క్రితం అమ్మాయి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఇరువురిని ముంబై నుంచి పిలిపించారు. మన కుటుంబాల మధ్య గొడవలు ఉండవద్దు మంచిగా ఉండాలని వారికి సూచిం చారు. అయినా నరేష్–స్వాతి తిరిగి ముంబైకి వెళ్లారు. 15 రోజుల క్రితం ఇద్దరికి వివాహం జరిపిస్తానంటూ.. స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి చెప్పడంతో ఈనెల 11న తిరిగి భువనగిరికి వచ్చారు. అక్కడే ఉన్న శ్రీనివాస్‌రెడ్డి తన కూతురును తీసుకెళ్లాడు. అప్పటి నుంచి అంబోజు నరేష్ కనిపించడం లేదు. ఈ విషయంపై నరేష్ తండ్రి అంబోజు వెంకటయ్య హోంమంత్రి, డీసీపీలకు ఇటీవలనే హైకోర్టులోనూ ఫిటిషన్ దాఖలు చేశాడు. దీంతో మే 18న స్వాతితో పాటు ఆమె తండ్రి శ్రీని వాస్‌రెడ్డి, కిడ్నాప్‌కు గురైన నరేష్‌లను కోర్టులో హాజరు పర్చాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలోనే స్వాతి ఆత్మహత్య చేసుకోవడం, అది ఆత్మహత్యా లేక హత్యా అనే అనుమానాలు వ్యక్తం కావడం, అంతలోనే ఇవాళ నరేశ్ హత్యకు గురైన విషయం వెల్లడికావడంతో వీరి ప్రేమగాథ విషాదాంతంగా ముగిసినట్లయింది.