నా పెళ్లి వార్తలు రూమర్లే: 'కలర్స్' స్వాతి
నా పెళ్లి వార్తలు రూమర్లే: 'కలర్స్' స్వాతి
Published Sun, May 25 2014 1:48 PM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM
చెన్నై: మీడియాలో తన పెళ్లిపై వస్తున్న వార్తలన్ని రూమర్లని టాలీవుడ్ తార స్వాతిరెడ్డి అన్నారు. ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచన లేదని, కెరీర్ ను చక్కదిద్దుకోవడమే ప్రధాన ధ్యేయమని స్వాతి అన్నారు.
పెళ్లి రూమర్లను విని, చూసి నవ్వుకున్నాను అని స్వాతి ఓ వార్తా ఏజెన్సీకిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరిన్ని చిత్రాల్లో నటించడానికి దృష్టిపెడుతున్నానని స్వాతి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. తాను ఎవ్వరిని చూడలేదని, పెళ్లి ఇప్పట్లో లేదని ఆమె స్పష్టం చేశారు.
ఓ టెలివిజన్ చానెల్ లో 'కలర్స్' తెలుగు వారికి సుపరిచితులైన స్వాతిరెడ్డి తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి.. ఇటీవల కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో కార్తీకేయ, తమిళంలో వడకర్రీ అనే చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
Advertisement
Advertisement