కలర్స్‌ స్వాతితో పెళ్లి.. అసలు విషయం చెప్పేసిన నవీన్ చంద్ర! | Month Of madhu Actor Naveen Chandra Clarity Marriage With Swathi | Sakshi
Sakshi News home page

Naveen Chandra: కలర్స్‌ స్వాతితో పెళ్లి.. అసలు కారణమిదేనన్న నవీన్ చంద్ర!

Published Mon, Sep 25 2023 7:24 PM | Last Updated on Mon, Sep 25 2023 7:45 PM

Month Of madhu Actor Naveen Chandra Clarity Marriage With Swathi - Sakshi

నవీన్‌ చంద్ర, కలర్స్‌ స్వాతి కలిసి నటిస్తోన్న తాజా చిత్రం మంత్‌ ఆఫ్‌ మధు. ఈ చిత్రానికి శ్రీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్‌ కాగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గతంలో వీరిద్దరూ త్రిపుర చిత్రంలో జంటగా కనిపించారు. మరోసారి వెండితెరపై జంటగా ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు చిత్రబృందం. తాజాగా ప్రమోషన్స్‌కు హాజరైన నవీన్ చంద్ర ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు.  అయితే గతంలో స్వాతిని పెళ్లి చేసుకున్నానంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. ఈ రూమర్స్ రావడానికి గల కారణాలను వెల్లడించారు. 

(ఇది చదవండి: సినిమా అగ్రిమెంట్‌ సంతకం పెట్టాక కాస్టింగ్‌ కౌచ్‌కు తెరలేపేవారు)

నవీన్ చంద్ర మాట్లాడుతూ..'త్రిపుర సినిమా కోసం మొదటిసారి స్వాతితో కలిసి నటించా. ఆమె మంచి వ్యక్తి. మా ఇద్దరి ఫ్యామిలీస్‌కు మంచి రిలేషన్ ఉంది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే చిత్రబృందం మొదట ఓ ఫొటో రిలీజ్ చేసింది. అందులో నేను, స్వాతి పెళ్లి దుస్తుల్లో కనిపించాం. దీంతో ఆ ఫొటో సోషల్‌మీడియాలో కాస్తా వైరలైంది. అది చూసి చాలామంది నిజంగానే పెళ్లైందని భావించారు. కొన్ని రోజులకే మా చిత్రబృందం అదే ఫొటోని పోస్టర్‌గా రిలీజ్‌ చేసింది. ఆ తర్వాత కొంతమందికి క్లారిటీ వచ్చింది. ఆ ఫొటో వచ్చిన సమయంలో చాలామంది మీరు స్వాతిని పెళ్లి చేసుకున్నారా? అని నన్ను డైరెక్ట్‌గా అడిగారు. కానీ ఈ విషయాన్ని మేమిద్దరం సీరియస్‌గా తీసుకోలేదు.' అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన మంత్ ఆఫ్ మధు  అక్టోబర్‌ 6న విడుదల కానుంది. 

(ఇది చదవండి: నేను శరత్‌బాబును రెండో పెళ్లి చేసుకోలేదు.. క్లారిటీ ఇచ్చిన నటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement