సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ.. అక్కడే స్ట్రీమింగ్‌.. | Month of Madhu Streaming On This OTT Platform | Sakshi
Sakshi News home page

Month of Madhu Movie: రెండు నెలల తర్వాత సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు చిత్రం!

Published Sat, Dec 9 2023 11:58 AM | Last Updated on Sat, Dec 9 2023 12:10 PM

Month of Madhu Streaming on This OTT Platform - Sakshi

అష్టాచెమ్మా సినిమాలో తెగ హడావుడి చేస్తూ భలే హుషారుగా కనిపిస్తూ ఉంటుంది కలర్స్‌ స్వాతి. ఈ మూవీతో బోలెడంత క్రేజ్‌ తెచ్చుకున్న ఈ బ్యూటీ గోల్కొండ హైస్కూల్‌, స్వామి రారా, కార్తికేయ సినిమాలతో జనాలకు దగ్గరైంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసిన స్వాతి ఈ మధ్య స్పీడు తగ్గించింది. ఈ ఏడాది ఆమె నటించిన ఒకే ఒక్క సినిమా మంత్‌ ఆఫ్‌ మధు. నవీన్‌ చంద్ర హీరోగా నటించగా, శ్రీకాంత్‌ నాగోతి దర్శకత్వం వహించారు. ఈ మూవీ అక్టోబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

థియేటర్ల వద్ద అంతంత మాత్రమే ఆదరణ అందుకున్న ఈ సినిమా ఆ మధ్య ఓ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజైంది. తాజాగా మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చేసిందీ చిత్రం. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా శుక్రవారం నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజైంది. కేవలం తెలుగు భాషలో మాత్రమే స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ అధికారికంగా వెల్లడించింది.

సినిమా కథేంటంటే?
మధుసూదన్‌ రావు (నవీన్‌ చంద్ర) ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకుంటాడు. మరోవైపు విడాకుల కేసు పెట్టిన భార్య లేఖ (స్వాతి రెడ్డి) ఎప్పటికైనా తన దగ్గరకు తిరిగొస్తుందని ఆశతో ఎదురుచూస్తుంటాడు. మద్యానికి బానిసవుతాడు. మరోవైపు మధుమతి (శ్రియ నవిలే) బంధువుల ఇంట్లో పెళ్లి కోసం అమెరికా నుంచి వైజాగ్‌ వస్తుంది. ఈ సందర్భంలో ఆమెకు హీరో పరిచయం అవడంతో అతడి ఫ్లాష్‌బ్యాక్‌ తెలుసుకుంటుంది. మరి తర్వాత ఏమైంది? మధుసూదన్‌- లేఖ కలిసిపోయారా? విడిపోయారా? అనేది తెలియాలంటే ఓటీటీలో చూసేయండి..

చదవండి: ఆ హీరో సీరియల్‌ కిస్సర్‌.. కానీ మా మధ్య కెమిస్ట్రీ లేకపోవడం వల్ల..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement