Month of Madhu Movie
-
హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం
హీరో నవీన్ చంద్రకు అరుదైన గౌరవం దక్కింది. సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డు ఆయనను వరించింది. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. "మంత్ ఆఫ్ మధు" సినిమాలోని ఆయన అద్భుతమైన నటనకు గాను ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది. భారతీయ సినిమా చరిత్రలో దిగ్గజాలైన దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ పేరిట ఇవ్వబడే ఈ అవార్డు అందుకోవడం నవీన్ చంద్ర సత్తా ఏంటో నిరూపించింది. ఈ మంత్ అఫ్ మధు అమెజాన్ ప్రైమ్ అలాగే ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది.ఇది కేవలం అవార్డు మాత్రమే కాదు, నవీన్ చంద్ర టాలెంట్‌కు, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి గుర్తింపు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆల్రెడీ ఒక స్టార్ అయిన నవీన్ చంద్ర.. 2011లో "అందాల రాక్షసి" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కంటెంట్‌లో బలం ఉన్న కథలనే ఎంచుకుంటూ, తెలుగు సినిమా ఫీల్డ్‌ని ఏలారు. ప్రస్తుతం "గేమ్ ఛేంజర్" వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన "ఇన్స్పెక్టర్ రుషి" వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌ని కూడా షేక్ చేస్తున్నారు -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ.. అక్కడే స్ట్రీమింగ్..
అష్టాచెమ్మా సినిమాలో తెగ హడావుడి చేస్తూ భలే హుషారుగా కనిపిస్తూ ఉంటుంది కలర్స్ స్వాతి. ఈ మూవీతో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ గోల్కొండ హైస్కూల్, స్వామి రారా, కార్తికేయ సినిమాలతో జనాలకు దగ్గరైంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసిన స్వాతి ఈ మధ్య స్పీడు తగ్గించింది. ఈ ఏడాది ఆమె నటించిన ఒకే ఒక్క సినిమా మంత్ ఆఫ్ మధు. నవీన్ చంద్ర హీరోగా నటించగా, శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించారు. ఈ మూవీ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్ల వద్ద అంతంత మాత్రమే ఆదరణ అందుకున్న ఈ సినిమా ఆ మధ్య ఓ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజైంది. తాజాగా మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చేసిందీ చిత్రం. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా శుక్రవారం నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. కేవలం తెలుగు భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. సినిమా కథేంటంటే? మధుసూదన్ రావు (నవీన్ చంద్ర) ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకుంటాడు. మరోవైపు విడాకుల కేసు పెట్టిన భార్య లేఖ (స్వాతి రెడ్డి) ఎప్పటికైనా తన దగ్గరకు తిరిగొస్తుందని ఆశతో ఎదురుచూస్తుంటాడు. మద్యానికి బానిసవుతాడు. మరోవైపు మధుమతి (శ్రియ నవిలే) బంధువుల ఇంట్లో పెళ్లి కోసం అమెరికా నుంచి వైజాగ్ వస్తుంది. ఈ సందర్భంలో ఆమెకు హీరో పరిచయం అవడంతో అతడి ఫ్లాష్‌బ్యాక్ తెలుసుకుంటుంది. మరి తర్వాత ఏమైంది? మధుసూదన్- లేఖ కలిసిపోయారా? విడిపోయారా? అనేది తెలియాలంటే ఓటీటీలో చూసేయండి.. If you've ever loved someone, this is a movie you will love ❤️ Watch #MonthOfMadhu today ❤️🔥 Now streaming on @PrimeVideoIN 💥 - https://t.co/LI1dFUBPLH@Naveenc212 #Swathi @srikanthnagothi @shreya_navile @ravikanthperepu @Yashmulukutla @harshachemudu @ragz46 @Rajaraveendar pic.twitter.com/X6L1v2DHom — Krishiv Productions (@KrishivOfficial) December 8, 2023 చదవండి: ఆ హీరో సీరియల్ కిస్సర్.. కానీ మా మధ్య కెమిస్ట్రీ లేకపోవడం వల్ల.. -
నాపై రాసిన ఆ వార్తలు చదివి కుమిలిపోయా: స్వాతి
నటనపై విమర్శలు చేస్తే స్వీకరిస్తా కానీ.. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పర్సనల్ విషయాలపై ఇష్టం వచ్చినట్లు కథనాలు ప్రసారం తట్టుకోవడం కష్టంగా ఉంటుంది అని హీరోయిన్ స్వాతి అన్నారు. నవీన్ చంద్ర, స్వాతి జంటగా నటించిన తాజా చిత్రం మంత్ ఆఫ్ మధు. శుక్రవారం (అక్టోబర్ 6) విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్‌పై దర్శకుడు అసహనం వ్యక్తం చేశారు. ‘మా సినిమా చూసి కొంతమంది మంచి రివ్యూలు రాశారు. మా వర్క్ ఎక్కడ బాగుంది? ఎక్కడ బాలేదు అనేది చక్కగా వివరించారు. కానీ కొంతమంది మాత్రం విమర్శలు చేస్తూ రాశారు. లైఫ్‌లో ఎవరైతే ఓపెన్‌గా ఉండరో మా సినిమా వాళ్ల కోసం కాదు. అలాంటి వాళ్లు దయ చేసి మా సినిమాకు రావొద్దు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొవాలి అనే వాళ్ల కోసమే ఈ సినిమా’ అని దర్శకుడు అన్నారు. ఇదే ప్రెస్ మీట్లో స్వాతి మాట్లాడుతూ.. కొంతమంది జర్నలిస్టులు నా గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారు. అవి చదివి ఎంతగానో బాధపడ్డా. ముఖ్యంగా కొన్ని కథనాలు చదివి చాలా కుమిలిపోయా. నా గురించి తెలియని వాళ్లు ఆ వార్తలు చదివి అదే నిజం అనుకుంటారు. చాలా మంది నమ్మారు కూడా. ఒక నటిగా నేను విమర్శలు తీసుకుంటా. ఎందుకంటే అది నా వృత్తి కాబట్టి. దానిపై మీరు(జర్నలిస్టులు)విమర్శకులు చేయొచ్చు. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రాస్తే తట్టుకోవడం కష్టంగా ఉంది’అని స్వాతి చెప్పుకొచ్చింది. -
'మంత్ ఆఫ్ మధు' రివ్యూ
టైటిల్: మంత్ ఆఫ్ మధు నటీనటులు: స్వాతి, నవీన్ చంద్ర, మంజుల, వైవా హర్ష తదితరులు మ్యూజిక్: అచ్చు రాజమణి సినిమాటోగ్రఫీ: రాజీవ్ ధరావత్ డైరెక్టర్: శ్రీకాంత్ నాగోతి ప్రొడ్యూసర్: యశ్వంత్ ములుకుట్ల నిడివి: 2h 20m కథేంటి? అది వైజాగ్. మధుసూధన్ రావు(నవీన్ చంద్ర) ఉన్న గవర్నమెంట్ ఉద్యోగం పోగొట్టుకుంటాడు. మరోవైపు విడాకుల కేసు పెట్టిన భార్య లేఖ (స్వాతి రెడ్డి).. ఎప్పటికైనా తన దగ్గరకు మళ్ళీ తిరిగి వస్తుందని ఆశతో ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మద్యానికి బానిస అయిపోతాడు. వీళ్లకు ఫ్లాష్ బ్యాక్ లో ఓ లవ్ స్టోరీ. మరోవైపు మధుమతి(శ్రియ నవిలే).. బంధువుల ఇంట్లో పెళ్లికోసం అమెరికా నుంచి వైజాగ్ వస్తుంది. ఓ సందర్భంలో ఈమెకి హీరో మధు పరిచయం అవుతాడు. మాటల సందర్భంలో అతడి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది? చివరకు మధుసూదన్- లేఖ కలిశారా? లేదా అనేది స్టోరీ. ఎలా ఉందంటే? మంత్ ఆఫ్ మధు సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన మధు అనే ఓ అమ్మాయి.. వైజాగ్ లో నెల రోజుల్లో ఫేస్ చేసిన అనుభవాలే. ఇన్నాళ్లు తమిళ్, మలయాళంలో నేచురల్ సినిమాలు చూసి.. అయ్యో ఇలాంటివి మన తెలుగులో వస్తే బాగున్ను కదా అని చాలామంది అనుకున్నారు. అలాంటి ప్రయత్నమే ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. బార్ లో మందు తాగుతున్న హీరోని కొందరు వ్యక్తులు ఎలా పడితే అలా చితక్కొట్టే సీన్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. 2003 వైజాగ్ కి చెందిన ఓ కుర్రాడు మధుసూధన్. కాలేజీ చదివే అమ్మాయి లేఖ. ఇద్దరు డీప్ లవ్ లో ఉంటారు. ఏకాంతంగా కలవడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని తీయించుకోవడానికి ఓ క్లినిక్ కి వెళ్తారు. ఆ తర్వాత వీళ్లు, వాళ్ల చుట్టూ ఉండే పాత్రలు పరిచయం చేస్తూ వెళ్ళారు. మరి ఈ కథ కంచికి చేరింది లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. అయితే సినిమాని చాలా నేచురల్ గా తీశారు. 2003 వైజాగ్ పరిస్థితుల్ని చాలా చక్కగా చూపించారు. అయితే సినిమాలో అసలు స్టోరీ ఏంటనేది సినిమా మొదలై చాలాసేపు అయిన ఓ పట్టానా అర్థం కాదు. తెరపై పాత్రలు వస్తుంటాయి, పోతుంటాయి కానీ ఒక్క సీన్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోతం. భార్య - భర్త, వాళ్ళ మధ్య మనస్పర్ధలు, బాధ, ప్రేమ, విరహం, ఒక్కటి కావాలనే తపన ఇలా చాలా పాయింట్స్ ఉంటాయి. ఇందులో అలాంటివి ఉన్నా సరే వాటిని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అలానే టైటిల్ రోల్ చేసిన మధు అనే అమ్మాయి పాత్ర, ఆమె మాట్లాడే అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లీష్ చిరాకు తెప్పిస్తుంది. సినిమాలో స్వాతి, నవీన్ చంద్ర, మంజుల, వైవా హర్ష తప్ప మరో తెలిసిన ముఖం కనిపించదు! ఎవరెలా చేశారు? మధుసూధన్ రావు పాత్ర చేసిన నవీన్ చంద్ర, లేఖ పాత్ర చేసిన స్వాతి బాగానే చేశారు. కానీ వీళ్ళ పాత్రల్లో డెప్త్ మిస్ కావడంతో ఎంత నేచురల్ గా తీసినా అవి తేలిపోయాయి. మహేష్ సోదరి మంజుల ఓ నాలుగైదు సీన్స్ లో కనిపించింది. వైవా హర్ష అక్కడక్కడ కనిపించి కాస్త నవ్వించాడు. మధుమతిగా చేసిన శ్రియ నవిలే.. ఆ పాత్రకి అసలు సూట్ కాలేదనిపించింది. అయితే యోగ టీచర్ వాసుకిగా చేసిన జ్ఞానేశ్వరి మాత్రం చూడ్డానికి చాలా బాగుంది. మిగతా వాళ్లంతా ఓకే అనిపించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే.. పాటలు పెద్దగా గుర్తుండవ్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. అయితే సినిమాలో రెండు ర్యాప్ సాంగ్స్ ఉంటాయి. అవి సింక్ లేకుండా ఎందుకు పెట్టారో అర్థం కాదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్ గా చెప్పుకుంటే 'మంత్ ఆఫ్ మధు' రెగ్యులర్ ఆడియెన్స్ కి నచ్చడం కష్టమే! - చందు, సాక్షి వెబ్ డెస్క్ చదవండి: క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 మూవీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..