నటనపై విమర్శలు చేస్తే స్వీకరిస్తా కానీ.. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పర్సనల్ విషయాలపై ఇష్టం వచ్చినట్లు కథనాలు ప్రసారం తట్టుకోవడం కష్టంగా ఉంటుంది అని హీరోయిన్ స్వాతి అన్నారు. నవీన్ చంద్ర, స్వాతి జంటగా నటించిన తాజా చిత్రం మంత్ ఆఫ్ మధు. శుక్రవారం (అక్టోబర్ 6) విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్‌పై దర్శకుడు అసహనం వ్యక్తం చేశారు.
‘మా సినిమా చూసి కొంతమంది మంచి రివ్యూలు రాశారు. మా వర్క్ ఎక్కడ బాగుంది? ఎక్కడ బాలేదు అనేది చక్కగా వివరించారు. కానీ కొంతమంది మాత్రం విమర్శలు చేస్తూ రాశారు. లైఫ్‌లో ఎవరైతే ఓపెన్‌గా ఉండరో మా సినిమా వాళ్ల కోసం కాదు. అలాంటి వాళ్లు దయ చేసి మా సినిమాకు రావొద్దు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొవాలి అనే వాళ్ల కోసమే ఈ సినిమా’ అని దర్శకుడు అన్నారు.
ఇదే ప్రెస్ మీట్‌లో స్వాతి మాట్లాడుతూ.. కొంతమంది జర్నలిస్టులు నా గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారు. అవి చదివి ఎంతగానో బాధపడ్డా. ముఖ్యంగా కొన్ని కథనాలు చదివి చాలా కుమిలిపోయా. నా గురించి తెలియని వాళ్లు ఆ వార్తలు చదివి అదే నిజం అనుకుంటారు. చాలా మంది నమ్మారు కూడా. ఒక నటిగా నేను విమర్శలు తీసుకుంటా. ఎందుకంటే అది నా వృత్తి కాబట్టి. దానిపై మీరు(జర్నలిస్టులు)విమర్శకులు చేయొచ్చు. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రాస్తే తట్టుకోవడం కష్టంగా ఉంది’అని స్వాతి చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment