Naveen Chandra Got Best Actor At Dada Saheb Phalke Film Festival, Deets Inside | Sakshi
Sakshi News home page

Naveen Chandra : హీరో నవీన్‌ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం

May 1 2024 5:05 PM | Updated on May 1 2024 7:02 PM

Naveen Chandra Got Best Actor At Dada Saheb Phalke Film Festival

హీరో నవీన్‌ చంద్రకు అరుదైన గౌరవం దక్కింది. సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డు ఆయనను వరించింది. ఈ ఏడాది  దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. "మంత్ ఆఫ్ మధు" సినిమాలోని ఆయన అద్భుతమైన నటనకు గాను ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది.  భారతీయ సినిమా చరిత్రలో దిగ్గజాలైన దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్  పేరిట ఇవ్వబడే ఈ అవార్డు అందుకోవడం నవీన్ చంద్ర సత్తా ఏంటో నిరూపించింది. ఈ మంత్ అఫ్ మధు అమెజాన్ ప్రైమ్ అలాగే ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇది కేవలం అవార్డు మాత్రమే కాదు, నవీన్ చంద్ర టాలెంట్‌కు, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి గుర్తింపు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆల్రెడీ ఒక స్టార్ అయిన నవీన్ చంద్ర.. 2011లో "అందాల రాక్షసి" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కంటెంట్‌లో బలం ఉన్న కథలనే ఎంచుకుంటూ, తెలుగు సినిమా ఫీల్డ్‌ని ఏలారు. ప్రస్తుతం "గేమ్ ఛేంజర్" వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన "ఇన్స్పెక్టర్ రుషి" వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌ని కూడా షేక్ చేస్తున్నారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement