dada saheb phalke award
-
నటుడు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
-
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్, తబితా సుకుమార్ దంపతుల కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డిని ఉత్తమబాల నటిగా దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు చిత్రంలో ఉత్తమనటనకు ఈ అవార్డును అందజేశారు. ఢీల్లిలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును ఆమెకు అందజేశారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో గ్రేడ్-8 అభ్యసిస్తున్న సుకృతి వేణి బండ్రెడ్డి నటించిన ఈ చిత్రం గతంలో కూడా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు.ఈ చిత్రంలో సుకృతి నటనకు ప్రశంసలతో పాటు పలు అవార్డులను గెలుచుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇండియన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ తొలి సినిమా బాలనటిగా సుకృతి వేణికి అవార్డులు వరించాయి. 11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా.. న్యూఢిల్లి ఫిల్మ్ ఫెస్టివల్లో జూరీ బెస్ట్ ఫిలింగా.. ఉత్త ప్రాంతీయ చిత్రంగా అవార్డులు అందుకుంది. జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ జ్యూరీ ఫిలింగా గాంధీ తాత చెట్టు అవార్డులు అందుకోవడం విశేషం.ఇవి కాకుండా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ నుండి ఈ చిత్రానికి ఆహ్వానాలు అందుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంగా తెరకెక్కిన ఈ సందేశాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో పాటు గోపీ టాకీస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, శేష సింధు రావులు నిర్మాతలుగా వ్యవహరించారు. పద్మావతి మల్లాది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తబితా సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరించారు. -
హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం
హీరో నవీన్ చంద్రకు అరుదైన గౌరవం దక్కింది. సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డు ఆయనను వరించింది. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. "మంత్ ఆఫ్ మధు" సినిమాలోని ఆయన అద్భుతమైన నటనకు గాను ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది. భారతీయ సినిమా చరిత్రలో దిగ్గజాలైన దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ పేరిట ఇవ్వబడే ఈ అవార్డు అందుకోవడం నవీన్ చంద్ర సత్తా ఏంటో నిరూపించింది. ఈ మంత్ అఫ్ మధు అమెజాన్ ప్రైమ్ అలాగే ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది.ఇది కేవలం అవార్డు మాత్రమే కాదు, నవీన్ చంద్ర టాలెంట్‌కు, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి గుర్తింపు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆల్రెడీ ఒక స్టార్ అయిన నవీన్ చంద్ర.. 2011లో "అందాల రాక్షసి" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కంటెంట్‌లో బలం ఉన్న కథలనే ఎంచుకుంటూ, తెలుగు సినిమా ఫీల్డ్‌ని ఏలారు. ప్రస్తుతం "గేమ్ ఛేంజర్" వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన "ఇన్స్పెక్టర్ రుషి" వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌ని కూడా షేక్ చేస్తున్నారు -
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రదానోత్సవం.. ఆ రెండు సినిమాలదే హవా
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రదానోత్సవం.. మంగళవారం రాత్రి ముంబయిలో అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్ సినీ ప్రముఖులు చాలామంది ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అయితే అవార్డ్స్ సొంతం చేసుకునే విషయంలో 'జవాన్', 'యానిమల్' చిత్రాలు పోటీ పడ్డాయి. పలు విభాగాల్లో విజేతలుగా నిలిచాయి. ఇంతకీ ఎవరెవరికి ఏయే అవార్డులు వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: బాలీవుడ్లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి) దాదా సాహెబ్ ఫాల్కే-2024 అవార్డ్స్ లిస్ట్ ఉత్తమ నటుడు - షారుక్ ఖాన్ (జవాన్) ఉత్తమ నటి- నయనతార (జవాన్) ఉత్తమ దర్శకుడు - సందీప్ రెడ్డి వంగా (యానిమల్) ఉత్తమ నటుడు (నెగిటివ్ రోల్) - బాబీ డియోల్ (యానిమల్) క్రిటిక్స్ ఉత్తమ నటుడు - విక్కీ కౌశల్ (సామ్ బహదూర్) ఉత్తమ సంగీత దర్శకుడు - అనిరుధ్ రవిచందర్ (జవాన్) ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (పురుషులు) - వరుణ్ జైన్ ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (మహిళలు) - శిల్పా రావు ఉత్తమ గీత రచయిత - జావేద్ అక్తర్ (నిక్లే ది కభి హమ్ ఘర్సే దున్కీ) ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ - యేసుదాసు ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ - మౌషుమీ ఛటర్జీ టీవీ కేటగిరీ టీవీ సిరీస్ ఆఫ్ ది ఇయర్ - ఘమ్ హై కిసీకే ప్యార్ మెయిన్ ఉత్తమ నటుడు - నీల్ భట్ (ఘమ్ హై కిసీకే ప్యార్ మెయిన్) ఉత్తమ నటి - రూపా గంగూలీ (అనుపమ) ఓటీటీ క్రిటిక్స్ ఉత్తమ నటి - కరిష్మా తన్నా (స్కూప్ సిరీస్) (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న 'కల్కి' హీరోయిన్? పెళ్లయిన ఆరేళ్లకు ఇలా!) Congratulations @iamsrk on winning the Best Actor Award for Jawan at the #DadasahebPhalkeAward pic.twitter.com/w1FVRL1UOt — Shah Rukh Khan Fc - Pune ( SRK Fc Pune ) (@SRKFC_PUNE) February 20, 2024 Nayanthara at Dadasaheb Phalke International Film Festival Awards 2024 💛🏆✨#Nayanthara #DadasahebPhalkeAward pic.twitter.com/xdKzunByQF — WV - Media (@wvmediaa) February 21, 2024 -
మనోడికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
తెనాలి: తెలుగు సినిమా రేంజ్ పెరిగింది.. పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. అందివచ్చిన టెక్నాలజీతో దర్శక నిర్మాతలు వెండితెరపై అద్భుతాల్ని ఆవిష్కరిస్తున్నారు. అదే బాటలో నవతరం సత్తాను చాటుతోంది. వినూత్న ఆలోచనలు, సరికొత్త ప్రయోగాలతో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. అవార్డుల పోటీలోనూ ముందంజలో ఉంటున్నారు. ‘గతం’ సినిమా మేకర్స్ దీనికి నిదర్శనం. డార్క్ మిస్టరీ థ్రిల్లర్‌గా తీసిన ‘ఐడీ’తో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డును గెలుచుకున్నారు. సినిమా నిర్మాతల్లో ఒకరైన హర్ష ప్రతాపనేని తెలుగు వాడు...తెనాలి వాడు కావడం విశేషం! విడుదల కాకముందే అవార్డు ఓటీటీ బ్లాక్ బస్టర్ మూవీ ‘గతం’ మేకర్స్ రూపొందించిన రెండో తెలుగు సినిమా ‘ఐడీ’. టాలీవుడ్, హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేశారు. చిత్రోమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తీసిన సినిమాకు కిరణ్‌రెడ్డి కొండమడుగుల దర్శకత్వం వహించారు. హర్ష ప్రతాపనేని, సృజన్ యరబోలుతో కలసి సుభాష్ రావాడ, భార్గవ పోలుదాసు నిర్మాతలుగా వ్యవహరించారు. భార్గవ పోలుదాసు, రాకేట్ గలేటే ప్రధాన పాత్రల్లో నటించారు. ‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాల ఫేం శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. హాలీవుడ్ డీపీ హోరాసియో మార్టినెజ్ సినిమాటోగ్రఫీ అందించగా, కాటెరినా ఫిక్కార్డో ప్రొడక్షన్ డిజైన్ పనులను పర్యవేక్షించగా, ఛోటా కె.ప్రసాద్ ఎడిటింగ్ చేశారు. విడుదల కాకముందే ఈ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో అత్యున్నత గౌరవాన్ని అందుకుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన కన్నడ చిత్రం ‘చార్లీ 777’ను వెనక్కునెట్టి, ‘బలగం’, ‘సీతారామం’ వంటి తెలుగు సినిమాలకు దీటుగా ‘ఐడీ’ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకుంది. మరోవైపు ఫిల్మ్ ఫెస్టివల్ సర్క్యూట్లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 37 అవార్డుల్ని అందుకుంది. 31 అఫీషియల్ సెలక్షన్స్‌ను సాధించి, 5 ఆనరబుల్ మెన్షన్స్‌ను అందుకుంది. నాలుగు నామినేషన్లను పొందింది. త్వరలో కెనడీయన్ స్క్రీన్ అవార్డు (ఆస్కార్ తరహాలో)లకు క్వాలిఫైయింగ్ ఫెస్టివల్ అయిన ప్రముఖ ఓక్విల్లే ఫెస్టివల్స్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఆర్ట్‌లో ప్రదర్శించనున్నారు. అంతర్జాతీయ అవార్డు వేడుకల్లో సత్తా చాటిన ‘బలగం’ సినిమా దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఉత్తమ సంగీతం’ అవార్డును అందుకోగా, ‘సీతారామం’ సినిమా ‘ఉత్తమ చిత్రం’గా అవార్డును అందుకుంది. ఐడీ చిత్రం ‘ఉత్తమ ఎడిటింగ్’అవార్డును గెలుచుకుంది. వినూత్న కథాంశం ‘మీరు ఒక రోజు నిద్రలేచాక, మిమ్మల్ని ఎవరూ గుర్తించకపోతే...’అనే విచిత్రమైన ఆలోచన ఐడీ సినిమా కథాంశం. సహ నిర్మాతగా వ్యవహరించిన హర్ష ప్రతాపనేని తండ్రి పి.వి. గణేష్ స్వస్థలం తెనాలి సమీపంలోని జంపని. ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా ఖమ్మంలో చేస్తున్నారు. తల్లి మంజులాదేవి గృహిణి. తండ్రి ఉద్యోగం కారణంగా వివిధ ప్రదేశాల్లో చదివిన హర్ష, హైదరాబాద్‌లో బీటెక్ చేశాడు. ఒక్లహామా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసి, అమెరికాలోని ప్రతిష్టాత్మక జేపీ మోర్గాన్స్ ఛేజ్ బ్యాంక్‌లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీరుగా చేస్తున్నారు. చదివే రోజుల్లో క్లాస్మేట్ కిరణ్‌తో కలసి లఘుచిత్రాలు తీసిన హర్ష, ఉద్యోగంలో కొనసాగుతూనే కిరణ్‌తో కలిసి ‘గతం’ సినిమా తీశారు. సహ నిర్మాత, సహ దర్శకుడు, సహ రచయితగా వ్యవహరించాడు. గతం విజయంతో ఇప్పుడు ‘ఐడీ’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. -
పుట్టినరోజుకి ముందు అవార్డు అందుకున్నాను: నటి ఆశా పారేఖ్
68వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అవార్డులను ప్రదానం చేశారు. 2020కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును నటి ఆశా పారేఖ్ అందుకున్నారు. ‘‘నా 80వ పుట్టినరోజుకు ముందు ఈ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఆశా పారేఖ్. జాతీయ ఉత్తమ నటులుగా సూర్య (‘సూరరై పోట్రు’), అజయ్ దేవగన్ (తన్హాజీ) అవార్డులు అందుకున్నారు. తమిళ ‘సూరరై పోట్రు’ ఉత్తమ సినిమా అవార్డుతో పాటు ఐదు అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును ఈ చిత్రదర్శకురాలు సుధ కొంగర, బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవార్డును జీవీ ప్రకాష్ కుమార్, ఉత్తమ నటిగా అపర్ణా బాలమురళి అవార్డులు అందుకున్నారు. ‘అల వైకుంఠపురములో..’కి గాను జాతీయ ఉత్తమ సంగీతదర్శకుడిగా ఎస్ఎస్ తమన్, బెస్ట్ తెలుగు ఫిలిం ‘కలర్ ఫొటో’కు దర్శకుడు అంగిరేకుల సందీప్ రాజు, నిర్మాత సాయి రాజేశ్ అవార్డులు అందుకున్నారు. ‘నాట్యం’ సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డును నటి సంధ్యారాజు, బెస్ట్ మేకప్ ఆరి్టస్ట్ అవార్డును రాంబాబు అందుకున్నారు. ⇔ సినీ రంగంలో ప్రస్తుతం సృజనాత్మకతకు స్వేచ్ఛ ఉంది. సినీ నిర్మాణం, కథా రచయితలు సినిమాను చూసే విధానానికి ఇది స్వర్ణ యుగంలాంటిది -సుధ కొంగర ⇔ ‘అల వైకుంఠపురములో..’ అనుకున్న మొదటి రోజు నుంచి త్రివిక్రమ్, బన్నీ (అల్లు అర్జున్) ఇచి్చన ఎనర్జీ వల్లే ఈ అవార్డు సాధ్యమైంది. ఈరోజు ఇక్కడ అవార్డు అందుకోవడం గ్రేట్‌గా అనిపిస్తోంది. ఇదంతా దేవుడి దయ- ఎస్.ఎస్. తమన్ ⇔ వర్ణ వివక్ష గురించి తీసిన మా ‘కలర్ ఫొటో’కు అవార్డు రావడం ఆనందంగా ఉంది. కోవిడ్ వల్ల థియేటర్లలో సినిమా విడుదల చేయలేదు. ఆ బాధ ఈ జాతీయ అవార్డు రావడంతో పోయింది -నీలం సాయి రాజేష్ ⇔ ప్రతీ మూడు నెలలకోసారి మా సినిమాకు ఏదో ఒక రూపంలో అవార్డులు రావడం హ్యాపీగా ఉంది. – సందీప్ రాజు ⇔ లాక్డౌన్ కారణంగా రెండేళ్లు సినిమా కోసం కష్టపడ్డాం. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. – రాంబాబు -
నటి ఆశా పారేఖ్ గురించిన ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
‘కటీ పతంగ్’ ‘జబ్ ప్యార్ కిసీసే హోతా హై’ ‘తీస్రీ మంజిల్’, ‘కారవాన్’... ఆశా పారేఖ్‌ను గుర్తు చేసుకుంటే ఈ సూపర్ హిట్స్ అన్నీ గుర్తుకొస్తాయి. ‘జూబ్లీ గర్ల్’ ‘హిట్ గర్ల్’ ఆశా బిరుదులు. ఆమె నటిస్తే సినిమాకు శకునం బాగుంటుందని నమ్మేవారు. ఐదు దశాబ్దాలు సినిమా రంగంలో ఉన్నా కాంట్రవర్సీలు లేవు. సినిమా రంగంలో సుదీర్ఘమైన ఆమె కృషికి నేడు ‘దాదాసాహెబ్ ఫాల్కే’ దక్కింది. కేంద్ర సెన్సార్‌బోర్డుకు తొలి మహిళా చైర్మన్‌గా పని చేసిన ఆశా పారేఖ్ దాదాసాహెబ్ ఫాల్కేతో సినిమా రంగంలో తన ఖ్యాతిని సంపూర్ణం చేసుకుంది. ముంబై శాంటా క్రజ్‌లో ఆశా పారేఖ్ నడిపే హాస్పిటల్ ఉంది. వంద పడకల హాస్పిటల్ అది. పేదవారికి తక్కువ ఫీజుతో, కట్టగలిగే వారికి మామూలు ఫీజుతో వైద్యం చేస్తారక్కడ. జనంలో ఆ హాస్పిటల్‌కు మంచి పేరు ఉంది. ఎందుకంటే ఆశా పారేఖ్ దాని వ్యవహారాలు శ్రద్ధగా పట్టించుకుంటుంది. చిన్నప్పుడు పారేఖ్‌కు డాక్టర్ కావాలని ఉండేది. కాని హైస్కూల్లో చదివేప్పుడు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ చూసి అక్కడంతా రక్తం పారి ఉంటే డాక్టర్ అయితే ఇంత రక్తం చూడాలి కదా అని ఆ ఆలోచన విరమించుకుంది. డాన్స్ అన్నా ఆమెకు బాగా ఇష్టం. కథక్, భరత నాట్యం, ఒడిస్సీ నేర్చుకుంది. సినిమాల్లోకి వెళ్లాలని లేదు. కాని సినిమా వాళ్లు ఆమెలోని వెలుగును కనిపెట్టకుండా పోలేదు. ⇔ శాంటాక్రజ్‌లో రెండు డబ్బున్న కుటుంబాలు ఉండేవి. ఒక బోహ్రా ముస్లిం కుటుంబం. మరొకటి గుజరాతీ కుటుంబం. గుజరాతీ కుటుంబంలోని అబ్బాయి– బచ్చుభాయ్ పారేఖ్ ముస్లిం కుటుంబంలోని అమ్మాయి సల్మా లఖ్ఖడ్వాలాను ప్రేమించాడు. సల్మా ఆ రోజుల్లోనే పూణె వెళ్లి చదువుకునేది. ఆమెను కలవడానికి ప్రతి ఆదివారం బచ్చుభాయ్ పూణె వెళ్లేవాడు. వీళ్ల ప్రేమ దాగలేదు. వారూ దాచదల్చలేదు. ఇద్దరూ పెద్దల అనుమతి లేకుండా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత సల్మా పేరు సుధా అయ్యింది. వారికి 1942 అక్టోబర్ 2న ఆశా పుట్టింది. ⇔ వీళ్లు ఉంటున్న ఇంటి పక్కనే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఉంటే సినిమా వాళ్లు టాక్స్ లావాదేవీల కోసం వచ్చి అక్కడే తిరిగే ఆశాను చూశారు. కాలేజ్‌కు వచ్చిన ఆశా మెరుస్తూ ఉండేది. ‘గూంజ్ ఉఠీ షెహనాయి’ సినిమా కోసం ఆశాను బుక్ చేసి రెండ్రోజులు షూటింగ్ చేసి ‘నీలో హీరోయిన్ అయ్యే లక్షణాలు లేవు’ అని పంపించేశారు. మొదటి దెబ్బ. ఎవరైనా విలవిలలాడతారు. అది జరిగిన పది రోజులకు దర్శకుడు నాసిర్ హుసేన్ ‘దిల్ దేకే దేఖో’ (1959)లో హీరోయిన్గా బుక్ చేశాడు. ‘ఒక సినిమాలో పెట్టి తీసేశారు’ అని నాసిర్ హుసేన్‌కు చెప్పినా ‘నాకు కావాల్సింది స్వచ్ఛంగా నవ్వే అమ్మాయి.ఆమె హాయిగా నవ్వితే చాలు’ అని బుక్ చేశాడు. డాన్సులు, డైలాగులు ఆశాకు ఇబ్బంది కాలేదు. మొదటి సినిమా. నాసిర్ హుసేన్‌కు పాటలు ముఖ్యం. ఆ పాటల్లో లిప్ సింక్ చేయడం ఆశాకు వచ్చేది కాదు. షమ్మీ కపూర్ ఆమెకు పాటల్లో ఎలా చేయాలో చూపించాడు. తొలి గురువు. ఆ తర్వాత ఆశా పాటలకు పెట్టింది పేరు అయ్యింది. షమ్మీను ఆశా ‘చాచా’ (చిన్నాన్న) అని పిలిచేది. ‘దిల్ దేకే దేశ్’లో ‘దిల్ దేకే దేఖో దిల్ దేకే దేఖో దిల్ దేకే దేఖోజీ... దిల్ లేనే వాలో దిల్ దేనా సీఖోజీ’ పాట పెద్ద హిట్. ⇔ ఆశా పారేఖ్ నటనను తీర్చిదిద్దిన మరో దర్శకుడు విజయ్ ఆనంద్. ఆమె రెండో సినిమా ‘జబ్ ప్యార్ కిసీసే హోతాహై’కి దర్శకుడు అతడే. దేవ్ ఆనంద్ తమ్ముడు. ఆ సినిమాకు దేవ్ ఆనంద్ హీరో. అప్పటి వరకూ దర్శకుడుగా ఉన్న నాసిర్ హుసేన్ ఈ సినిమాతో నిర్మాతగా మారాడు. ‘సౌసాల్ పెహెలే ముఝే తుమ్ సే ప్యార్ థా’ పాట అందులోదే. దేవ్ ఆనంద్ వంటి సీనియర్ పక్కన ఆశా నిభాయించుకుని రాగలిగింది. దీని తర్వాత నాసిర్ హుసేన్ ‘ఫిర్ వహీ దిల్ లాయాహూ’ తీశాడు. 11 ఇందులో జాయ్ ముఖర్జీ హీరో. ఆశా పారేఖ్ హీరోయిన్. సినిమా పెద్ద హిట్ అయ్యింది. కాని ఆశా పారేఖ్ ‘స్టార్డమ్’కు చేరుకున్నది మాత్రం ‘తీస్రీ మంజిల్’తోనే. దీనికి నిర్మాత నాసిర్ హుసేన్. దర్శకుడు విజయ్ ఆనంద్. హీరో షమ్మీ కపూర్. మర్డర్ మిస్టరీ అయిన ఈ సినిమా సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. షమ్మీ కపూర్‌తో ఆశా జంట పూర్తిగా పండింది. ‘ఓ మేరే సోనరే సోనరే సోనరే’ పాటతో ఆశా పారేఖ్ సినిమా రంగానికి బంగారం అని స్థిరపడింది. ⇔ ఆశా పారేఖ్ బ్లాక్ అండ్ వైట్ కాలంలో హిట్స్ ఇచ్చింది. కలర్ వచ్చాక హిట్స్ ఇచ్చింది. మహిళా అభిమానులు విపరీతంగా ఉన్న దేవ్ ఆనంద్‌తో నటించింది. ఆ తర్వాత అంతకు మించిన ఫ్యాన్స్‌ను చూసిన రాజేశ్ ఖన్నాతో నటించింది. రాజేశ్ ఖన్నాతో కలిసి ఆశా నటించిన ‘బహారోంకే సప్నే’, ‘ఆన్ మిలో సజ్నా’, ‘కటీ పతంగ్’ సూపర్ హిట్స్ అయ్యాయి. ‘కటీ పతంగ్’ లో వితంతువుగా నటిస్తూ తన ప్రేమను వ్యక్తపరచలేక సతమతమయ్యే ఆశా పారేఖ్‌ను ప్రేక్షకులు మెచ్చారు. రాజేశ్ ఖన్నాతో ఆశా పాడిన ‘ఆజా పియా తుజే ప్యార్ దూ’, ‘అచ్ఛా తో హమ్ చల్తే హై’... ఎవరూ మరువలేదు. ⇔ ఆశా పారేఖ్‌ను ప్రతి హీరోతో చేసింది– దిలీప్ కుమార్‌తో తప్ప. ధర్మేంద్రతో నటించిన ‘ఆయే దిన్ బహార్ కే’, ‘ఆయా సావన్ ఝూమ్ కే’ సూపర్హిట్లు. తాగి షూటింగ్ చేస్తే సెట్స్‌కు రాను అని ధర్మేంద్రకు వార్నింగ్ ఇచ్చి మరీ నటించింది ఆశా. మనోజ్ కుమార్‌తో చేసిన ‘ఉప్కార్’, జితేంద్రతో చేసిన ‘కారవాన్’, శశి కపూర్‌తో ‘ప్యార్ కా మౌసమ్’ పెద్ద హిట్లయ్యాయి. అలాగని అన్నీ తేలిక పాత్రలే ఆశా చేయలేదు. ‘మై తులసీ తేరే ఆంగన్ మే’, ‘చిరాగ్’ వంటి సినిమాలలో గట్టి పాత్రలు చేసింది. ఆశా పారేఖ్ సినిమాల్లోకి వచ్చినప్పుడు సాయిరా బాను, వహీదా రెహమాన్, నూతన్, మాలా సిన్హా వంటి వారు పోటీకి వచ్చేవారు. కలర్ సినిమాలు వచ్చాక గ్లామర్ పాత్రలు చేసే ముంతాజ్, హేమమాలిని వచ్చి గట్టి పోటీ ఇచ్చారు. అయినా సరే ఆశా తన వాటా సినిమాలతో దర్జాగా కొనసాగింది. ⇔ ఆ తర్వాత కేరెక్టర్లు చేసినా మర్యాదగా వాటినీ విరమించింది. ఆశా పారేఖ్ సినిమా రంగంలో నటిగా లేకపోయినా డిస్ట్రిబ్యూటర్‌గా, సినిమా నటుల అసోసియేషన్‌కు నాయకురాలిగా, టీవీ ప్రొడ్యూసర్‌గా ఎప్పుడూ సినిమా రంగంలోనే ఉంది. వహీదా రెహమాన్, హెలెన్ ఈమెకు మంచి స్నేహితులు. వహీదా రెహమాన్‌తో కలిసి అలాస్కా వెళ్లి ఆ గడ్డకట్టే మంచులో ఆ మధ్య 21 రోజులు ఉండి వచ్చింది. అప్పుడప్పుడు ఈ సీనియర్ నటీమణులంతా యాట్ మాట్లాడుకుని సముద్రంలో రోజుల తరబడి గడుపుతుంటారు. ఏ వెలితీ లేకుండా ఆమె జీవిస్తోంది. పెళ్లి చేసుకోకపోవడం వెలితి అని ఆమె భావించడం లేదు. ఒక గ్లామర్ హీరోయిన్‌కి ‘దాదాసాహెబ్ ఫాల్కే’ దక్కడం వినోద రంగమైన సినిమాకు సబబైన గౌరవమే. ఆశా పారేఖ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే సుప్రసిద్ధ సినీ నటి ఆశా పారేఖ్‌కు 2020 సంవత్సరానికి సినిమా రంగానికి సంబంధించిన సర్వోన్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే ప్రకటించారు. ఈమేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలియజేశారు. ఆశా పారేఖ్ (79)కు ఈ పురస్కారం రాబోయే శుక్రవారం నాటి 68వ జాతీయ పురస్కారాల ప్రదాన సభలో అందజేస్తారు. అవార్డుకు ఎంపిక చేసిన కమిటీలో ఆశా భోంస్లే, హేమమాలిని, పూనమ్ థిల్లాన్, ఉదిత్ నారాయణ్, టి.ఎస్. నాగాభరణ ఉన్నారు. 2019 సంవత్సరానికి రజనీకాంత్ ఈ పురస్కారం అందుకున్నారు. ఆశా టాప్ టెన్ సినిమాలు 1. దిల్ దేకే దేఖో 2. జబ్ ప్యార్ కిసీసే హోతాహై 3.జిద్దీ 4. దో బదన్ 5.లవ్ ఇన్ టోక్యో 6.తీస్రీ మంజిల్ 7.ఉప్కార్ 8.కటీ పతంగ్ 9.కారవాన్ 10.మై తులసీ తేరే ఆంగన్ మే ఆశా టాప్ టెన్ పాటలు 1. జాయియే ఆప్ కహా జాయేంగే (మేరే సనమ్) 2. సాయొనారా సాయొనారా (లవ్ ఇన్ టోక్యో) 3. పర్దే మే రెహెనే దో (షికార్) 4. అచ్ఛా తో హమ్ చల్తే హై (ఆన్ మిలో సజ్నా) 5. నా కోయి ఉమంగ్ హై (కటీ పతంగ్) 6. నిసుల్తానా రే (ప్యార్ కా మౌసమ్) 7. ఆయా సావన్ ఝూమ్ కే (ఆయా సావన్ ఝూమ్ కే) 8. కిత్ నా ప్యారా వాదా హై (కారవాన్) 9. ఆంఖోసే జో ఉత్రీ హై దిల్ మే (ఫిర్ వహీ దిల్ లాయా హూ) 10. తేరే ఆంఖోంకే సివా దునియామే రఖ్ఖా క్యా హై (చిరాగ్) -
నటి ఆశా పరేఖ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
-
కండక్టర్ టు కథానాయకుడు ఒరు నల్ల ప్రయాణం
‘‘బాబాయ్... జీవితంలో ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. కష్టపడందే ఏదీ రాదు. కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు.’’ ‘నరసింహా’ సినిమాలో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్ రజనీ జీవితానికి అద్దం పడుతుంది. అనుకున్నది సాధించడానికి రజనీ చాలా కష్టపడ్డారు. సాధించినదాన్ని నిలుపుకోవడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. కష్టం... రజనీ... వేరు వేరు కాదు. అలవాటైపోయిన కష్టం రజనీకి ఎంతో ఇష్టమైపోయింది. సాదాసీదా కండక్టర్ నుంచి సూపర్‌స్టార్ వరకు... రజనీది ఒక మంచి ప్రయాణం. ఎన్నో అవార్డులూ, రివార్డులు... ఇప్పుడు ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం. ఇదు ఒరు నల్ల ప్రయాణం! అంటే.. ఇది ఒక మంచి ప్రయాణం!! అమ్మానాన్న.. అక్క.. ఇద్దరు అన్నయ్యలు.. చిన్నప్పుడు రజనీకాంత్ జీవితం వీళ్ల చుట్టూనే. అమ్మానాన్న పెట్టిన పేరు శివాజీరావ్ గైక్వాడ్. మైసూరులో మరాఠీ కుటుంబంలో పుట్టాడు శివాజీ. తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్. శివాజీకి తొమ్మిదేళ్ల వయసున్నప్పుడే తల్లి చనిపోయారు. అలాగే ఒక అన్నయ్య కూడా తిరిగి రాని లోకాలకు వెళ్లారు. ఇక నాన్న, అన్నయ్య సత్యనారాయణలే శివాజీ లోకం. శివాజీ చురుకైనవాడు. ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, క్రికెట్ అంటే ఇష్టం. ఈ మూడేనా? యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టం. ఆ ఇష్టం పెరిగిపోవడానికి ఒక కారణం ‘రామకృష్ణ మఠం’. స్కూల్ అయిపోగానే అన్నయ్యతో కలిసి శివాజీ ఆ మఠానికి వెళ్లేవాడు. వేద మంత్రాలు నేర్చుకున్నాడు. బోలెడన్ని సేవలు చేసేవాడు. భవిష్యత్తులో రజనీ దారి ఆధ్యాత్మిక దారి అని రాసిపెట్టి ఉందనడానికి ఇదొక నిదర్శనం. అలాగే భవిష్యత్తులో నటుడు కావడానికి ఓ దారి రామకృష్ణ మఠం. అక్కడ ఏడాదికోసారి డ్రామాలు వేసేవారు. వాటిలో శివాజీ ఉత్సాహంగా పాల్గొనేవాడు. మెల్లిగా నటన మీద ఆసక్తి పెరిగిపోయింది. మఠంలోనే కాకుండా విడిగా స్టేజ్ నాటకాల్లో నటించడం మొదలుపెట్టాడు. చదువు బ్యాక్ సీట్ తీసుకుంది... నటన ఫ్రంట్ సీట్కొచ్చేసింది. మనసును పూర్తిగా నటన ఆక్రమించేసింది. కాలేజీకి వెళ్లి, బుద్ధిగా చదువుకుందామంటే మనసు కుదురుగా ఉండనివ్వలేదు. ఆలోచనలన్నీ నటనవైపే! ఇక లాభం లేదనుకుని, తెలిసినవాళ్ల ద్వారా శివాజీని కండక్టర్‌గా చేర్పించారు సత్యనారాయణ. బస్సు టికెట్లు తెంచుతున్నప్పటికీ సినిమా టికెట్ల మీదే ధ్యాస. టికెట్లు కొనాలని కాదు... తన సినిమా టికెట్ అందరూ కొనాలని! ఇలాంటి కలల్లో ఉన్న శివాజీని ‘నీ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి.. సినిమాల్లోకి వెళ్లొచ్చుగా’ అన్నారు స్నేహితులు. రెండంటే రెండేళ్లు కండక్టర్‌గా చేసి, కలను నెరవేర్చుకోవడానికి మైసూర్ టు మద్రాస్ ప్రయాణం అయ్యాడు శివాజీ. మద్రాసులో ఫిలిమ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. ఈ ప్రయాణానికి సహాయపడిన ఎవరినీ శివాజీ మరచిపోలేదు. ‘‘నేను కండక్టర్‌గా పనిచేసే రోజుల్లోనే నాలో నటుడున్నాడని గుర్తించిన ఆ బస్సు డ్రైవర్, నాకు అండగా నిలిచిన నా స్నేహితుడు రాజ బహుదూర్, నన్ను నటుణ్ణి చేయడానికి ఎన్నో త్యాగాలు చేసిన మా అన్నయ్య సత్యనారాయణ... వీళ్లందరికీ నా కృతజ్ఞతలు’’ అన్నారు రజనీకాంత్‌గా మారిన శివాజీ. దాదాసాహెబ్ ఫాల్కే ప్రకటన వచ్చిన తర్వాత రజనీ విడుదల చేసిన ప్రకటనలో ఈ ముగ్గురి ప్రస్తావన ఉంది. ఈ ముగ్గురేనా? ఊహూ.. ఈ సందర్భంగా రజనీ చాలామందిని గుర్తు చేసుకున్నారు. ‘రజనీకాంత్’ అని నామకరణం చేసి, ‘అపూర్వ రాగంగళ్’ (1975) చిత్రం ద్వారా నటుణ్ణి చేసిన దర్శకుడు కె. బాలచందర్ పేరుని, హీరో నుంచి సూపర్ స్టార్‌గా ఎదగడానికి అవకాశం ఇచ్చిన ఇతర దర్శక–నిర్మాతలు, టెక్నీషియన్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, చివరకు తన స్నేహితుడు కమలహాసన్ – ఇలా అందరికీ కృతజ్ఞతలు తెలిపి, తనను ఇంతటివాడిని చేసిన ప్రజాదేవుళ్లు, అభిమానులు... అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే.. నేను శివాజీని..! సినిమా హీరో అంటే తెల్లగా ఉండాలా? అక్కర్లేదు.. నల్లగా ఉన్నా ‘నల్ల (మంచి) కథానాయకుడు’ అవగలుగుతారు. అందుకు మంచి ఉదాహరణ రజనీకాంత్. ఇంతకీ తనలో ఏం నచ్చి బాలచందర్ నటుణ్ణి చేయాలనుకున్నారంటే... నడకలో వేగం, కళ్లల్లో తీక్షణత, స్టయిల్ చూసి! నిజానికి బాలచందర్ కళ్లల్లో శివాజీ పడినప్పుడు అతను వేరే నటుణ్ణి అనుకరించే పని మీద ఉన్నాడు. ఎవరా నటుడంటే ప్రముఖ నటుడు శివాజీ గణేశన్. ‘అబ్బాయ్! నువ్వెందుకు శివాజీలా నటిస్తున్నావ్’ అని బాలచందర్ అడిగితే, ‘ఎందుకంటే నేను కూడా శివాజీనే కదా’ అని తడుముకోకుండా బదులిచ్చాడు శివాజీ. ‘చురుకైనవాడివే’ అన్నారు బాలచందర్. ‘అపూర్వ రాగంగళ్’లో రజనీకి ఆయన ఇచ్చినది చిన్న పాత్రే అయినా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కన్నడంలో రజనీ నటించిన ‘కథా సంగమ’ విడుదలైంది. అదే ఏడాది (1976) తెలుగుకి పరిచయం అయ్యారు రజనీ. తమిళంలో తాను తెరకెక్కించిన ‘అవళ్ ఒరు తొడర్ కదై’ సినిమాను తెలుగులో ‘అంతులేని కథ’గా రీమేక్ చేస్తూ, కీలక పాత్రకు రజనీని తీసుకున్నారు బాలచందర్. అందులో తాగుబోతు అన్నయ్యగా రజనీ అద్భుతంగా నటించారు. నెగటివ్ షేడ్ క్యారెక్టర్ అయినప్పటికీ నటనకు పాజిటివ్ రివ్యూ వచ్చింది. రజనీలోని పూర్తి స్టయిల్ని చూపించిన చిత్రం ‘మూండ్రు ముడిచ్చు’ (1976). ఈ సినిమాలో రజనీ స్టయిల్‌గా సిగరెట్ ఎగరేసి, పట్టుకోవడం అందరికీ నచ్చేసింది. ‘ఏం స్టయిల్..’ అంటూ అభిమానులు చప్పట్లు కొట్టారు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో ఆకట్టుకుంటూ, దూసుకెళుతున్న రజనీకి వెనక్కి తిరిగి చూసుకునే పనిలేకుండాపోయింది. 1978లో చేసిన ‘భైరవి’ ద్వారా హీరోగా మారారు. ఒక్క 1977లోనే ఆయనవి దాదాపు 15 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో తెలుగులో లీడ్ యాక్టర్‌గా చేసిన తొలి సినిమా ‘చిలకమ్మ చెప్పింది’ ఒకటి. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం... ఇలా దక్షిణాదిన నాలుగు భాషల్లోనూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్న రజనీకాంత్ హిందీలో చేసిన తొలి చిత్రం ‘అంధా కానూన్’ (1983). ఇందులో అమితాబ్ అతిథి పాత్ర చేశారు. అది సూపర్ డూపర్ హిట్. పదేళ్లల్లో వంద సినిమాలు 1975 నుంచి 1985 వరకూ రజనీ 100 సినిమాల్లో నటించారు. వందో సినిమాగా ‘శ్రీరాఘవేంద్ర’ (1985) చేశారు. నిజజీవితంలో రజనీకాంత్ రాఘవేంద్ర స్వామి భక్తుడు. ఇందులో రాఘవేంద్ర స్వామిగా నటించారు. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోయినా అప్పటివరకూ మాస్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చిన రజనీ... దేవుడి పాత్రలో ఒదిగిపోయిన వైనం భేష్ అనిపించుకుంది. మళ్లీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన రజనీ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘దళపతి’ (’91) ఒకటి. ఆ తర్వాత రజనీ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిన చిత్రం సురేష్ కృష్ణ ‘బాషా’ (1995). సాదాసీదా జీవితం గడిపే ఆటో డ్రైవర్ బాషా నిజానికి డాన్ అనే కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు కథావస్తువుగా ఉపయోగపడింది. ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే’ అని ఆ సినిమాలో రజనీ చెప్పిన డైలాగ్, ఆయన స్టయిల్‌కు తగ్గట్లు ‘స్టయిలు స్టయిలులే..’ పాట – మొత్తంగా సినిమా అంతా చాలా బాగుంటుంది. ఆ తర్వాత చేసిన ‘ముత్తు’, ‘అరుణాచలం’, ‘నరసింహా’.. వంటివన్నీ హిట్ బాటలో వెళ్లాయి. ‘లకలకలక...’ అంటూ ‘చంద్రముఖి’లో చేసిన సందడిని సూపర్ అన్నారు ఫ్యాన్స్. ‘నాన్నా.. పందులే గుంపు గా వస్తాయి. సింహం సింగిల్‌గా వస్తుంది’ అని ‘శివాజీ’లో చెప్పిన డైలాగ్, అదే సినిమాలో ఆయన తెల్లబడడానికి చేసే ప్రయత్నాలు, విలన్ని ఎదుర్కొనే సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘రోబో’ది ఓ డిఫరెంట్ రూట్. కొంచెం వయసు మీద పడ్డ ‘కబాలీ’గా, ‘కాలా’గా రజనీ మెరిశారు. ప్రస్తుతం ‘అన్నాత్తే’లో నటిస్తున్నారు. సినిమాలకు తమ అభిమాన హీరో ఫుల్స్టాప్ పెడితే? ఈ భయం ఫ్యాన్స్కెప్పుడూ ఉంటుంది. రజనీకాంత్ రిటైర్మెంట్ ప్రకటిస్తే తట్టుకోగలరా? ఊహూ... రజనీకి ఇప్పట్లో ఆ ఆలోచన లేదు. రజనీ ‘నల్ల’ (మంచి) నటుడు. వివాదాలు లేని ‘నల్ల’ మనిషి. ‘కబాలీ’లో రజనీ... ‘మంచిది’ అని తనదైన స్టయిల్లో డైలాగ్ చెబుతారు. కండక్టర్ టు కథానాయకుడు... రజనీది ఒక మంచి ప్రయాణం. మంచిది. ఇప్పుడు... రజనీ ‘దాదా’. మరీ మంచిది. ఆయన భవిష్యత్తులో మరెన్నో విజయాలు చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరీ మరీ మంచిది. తమిళ... అమితాబ్ రజనీకాంత్‌కి అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం. ప్లాన్ చేసింది కాదు కానీ అమితాబ్ నటించిన పలు హిందీ చిత్రాల తమిళ రీమేక్స్‌లో నటించారు రజనీ. హిందీలో అమితాబ్ చేసిన ‘అమర్ –అక్బర్ –ఆంథోనీ’ తమిళ రీమేక్ ‘శంకర్ –సలీమ్ –సైమన్’లో రజనీ నటించారు. అలాగే ‘మజ్బూర్’ (నాన్ వాళవైప్పేన్), ‘డాన్’ (బిల్లా), ‘త్రిశూల్’ (మిస్టర్ భారత్), ‘దీవార్’ (తీ) వంటి రీమేక్స్‌లోనూ చేశారు. చూపులు కలిసిన శుభవేళ 1981 ఫిబ్రవరి 26న లతను పెళ్లాడారు రజనీకాంత్. చెన్నైలోని ప్రసిద్ధ యతిరాజ్ కాలేజీ స్టూడెంట్ లత. క్యాలేజీ మ్యాగజైన్‌కి సంబంధించిన ఇంటర్వ్యూ కోసం రజనీని కలిశారు లత. ఆ ఇంటర్వ్యూ కలిపింది ఇద్దర్నీ అనాలి. పెద్దల సమక్షంలో తిరుపతిలో లత మెడలో మూడు ముడులు వేశారు రజనీ. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఐశ్వర్య, సౌందర్య. ధనుష్, శ్రుతీహాసన్‌తో తెరకెక్కించిన ‘3’ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమయ్యారు ఐశ్వర్య. తండ్రితో ‘కొచ్చాడయాన్’ (తెలుగులో ‘విక్రమసింహ’) సినిమా తెరకెక్కించారు సౌందర్య. తమిళ హీరో ధనుష్‌తో ఐశ్వర్య పెళ్లయింది. వీరికి ఇద్దరు కుమారులు. అశ్విన్‌కుమార్‌తో సౌందర్య వివాహం అయింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అశ్విన్ నుంచి సౌందర్య విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత వ్యాపారవేత్త విశాగన్ వనంగాముడిని పెళ్లాడారామె. ఎదిగినా... ఒదిగే! సినిమాల్లో ఆర్భాటంగా కనిపించే రజనీ నిజజీవితంలో మాత్రం సింపుల్ లైఫ్‌ని ఇష్టపడతారు. చిన్నప్పుడు రామకృష్ణ మఠంలో సేవలు చేసిన రజనీ కొన్నేళ్లుగా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు. హిమాలయాలకు వెళతారు. ధ్యానంలో మునిగిపోతారు. ఒక గుడికి రజనీ సాధారణ బట్టల్లో చాలా సాదాసీదాగా వెళ్లారు. దర్శనం అయ్యాక ఒక పిల్లర్ దగ్గర కూర్చుని ఉన్న ఆయనను బిచ్చ గాడు అనుకున్న ఒకావిడ పది రూపాయలు ఇచ్చింది. ఆ తర్వాత గుర్తుపట్టి రజనీని క్షమించమని కోరింది. ‘‘ఇదంతా ఆ దేవుడి లీల. ‘నువ్వు సూపర్స్టార్వి కాదు... ఇది శాశ్వతం కాదు’ అని చెప్పడానికే దేవుడు ఇలా చేస్తుంటాడు’’ అని ఆమెతో రజనీకాంత్ అన్నారు. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగే ఉండాలనే విషయానికి రజనీకాంత్ ఓ ప్రతీక. 51వ దాదాసాహెబ్ పురస్కారాన్ని 2019వ సంవత్సరానికి గాను ఐదుగురు సభ్యులు గల జ్యూరీ రజనీకాంత్‌కు సిఫారసు చేయగా కేంద్రం ఆమోదించినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ వెల్లడించారు. ‘‘ఆశాభోంస్లే, మోహన్ లాల్, విశ్వజిత్ ఛటర్జీ, శంకర్ మహదేవన్, సుభాష్ ఘయ్‌లతో కూడిన జ్యూరీ ఈ పురస్కారం ఎంపికలో ఏకగ్రీవంగా రజనీ పేరును ప్రతిపాదించింది. కేంద్రం ఆమోదించింది. రజనీ 50 ఏళ్లుగా సినీరంగంలో బాద్షాగా నిలిచారు. వచ్చే మే 3న జాతీయ చలనచిత్ర అవార్డు ల ప్రదానోత్సవంలో ఈ పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. అనేక తరాల ఆదరణకు పాత్రుడైన, చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యమయ్యే కృషి చేసిన, వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన, సమ్మోహితులను చేసే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి రజనీకాంత్. ‘తలైవా’కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించడం అంతులేని ఆనందాన్ని అందించే విషయం. – ప్రధాని నరేంద్ర మోదీ 40ఏళ్లుగా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలకు జీవం పోసిన రజనీకాంత్‌కు ఈ పురస్కారం ద్వారా తగిన గుర్తింపు లభించింది. – ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సినీరంగానికి రజనీకాంత్ చేసిన సేవలకు తగిన గుర్తింపు లభించింది. కర్నాటకలో జన్మించిన మరాఠా వ్యక్తి.. స్టైలిష్ తమిళ్ సూపర్ స్టార్‌గా ఎదిగిన శివాజీరావు గైక్వాడ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన మేనరిజం, ప్రతిభతో వెండితెరపై గణనీయమైన ప్రభావాన్ని చూపారు. – ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నటుడిగా దశాబ్దాలపాటు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకుంటూ, నేటికీ దేశ విదేశాల్లో కోట్లాదిమంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజనీకాంత్‌కు ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయం. – తెలంగాణ సీఎం కేసీఆర్ నా మిత్రుడు రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. ఇలాంటి పురస్కారాలు మరెన్నో రజనీకాంత్‌కు రావాలి. – మోహన్‌బాబు రజనీకాంత్‌గారిని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించినందుకు చాలా సంతోషంగా ఉంది. నా శుభాకాంక్షలు. ఆయనకు మంచి గుర్తింపు లభించింది. – మోహన్‌లాల్ నా స్నేహితుడు రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డుకు రజనీకాంత్ నిజంగా అర్హత కలిగినవాడు. ఫిల్మ్ ఇండస్ట్రీకి రజనీ చాలా కంట్రిబ్యూట్ చేశారు. నీకు (రజనీ) నా హృదయపూర్వక శుభాకాంక్షలు. – చిరంజీవి -డి.జి. భవాని -
అత్యున్నత పురస్కారం: తలైవా భావోద్వేగం
సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. 2020 సంవత్సరానికిగాను తనను అత్యుత్తమ పురస్కారానికి ఎంపిక చేయడంపై తలైవా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనగురువు, సోదరుడుతోపాటు సినీ పరిశ్రమలోని పెద్దా చిన్నా, కేంద్ర, రాష్ట్ర రాజకీయ నేతలతోపాటు, స్నేహితులు, అభిమానులు అందరికీ పేరు పేరునా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. (రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు) ముఖ్యంగా తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినందుకుగాను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, జ్యూరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన స్నేహితుడు రాజ్ బహదూర్, తనలోని నటనా నైపుణ్యాన్ని గుర్తించిన బస్ డ్రైవర్, తన ఉన్నతికి కారణమైన సోదరుడు రావు గైక్వాడ్‌తో పాటు తనను రజనీకాంత్‌గా సినీ పరిశ్రమకు పరిచయం చేసిన గురువు కే బాలచందర్ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు తన దర్శకులు,నిర్మాతలు, టెక్నీషియన్లు, మీడియాకు, తమిళ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ అవార్డు అంకితమని రజనీ ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, అలాగే ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్, తన సహ నటుడు కమల్‌హాసన్, ఇతర రాజకీయ నాయకులు, హితులు, సన్నిహితులందరికీ ఆయన స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. కాగా భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతీసంవత్సరం ఇచ్చే పురస్కారాన్ని రజనీకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. రజనీకి ఈ అవార్డును ఇవ్వాలన్న జ్యూరీ నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించిందని కేంద్రమంత్రి ప్రకాష్ జవడేకర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ, ఇతర రంగ ప్రముఖుల నుంచి ఆయనకు అభినందనల వెల్లువ కురుస్తోంది. భారతీయ సినిమా పితామహుడుగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో 1963లో ఈ అవార్డును ప్రారంభించారు. అయితే దివంగత పాపులర్ నటుడు శివాజీ గణేషన్, దర్శకుడు కె.బాలచందర్ తర్వాత ఈప్రతిష్టాత్మక అవార్డును పొందిన తమిళ సినీ రంగానికి చెందిన మూడవ వ్యక్తిగా రజనీకాంత్ నిలిచారు. My heart is so full! 😊 @rajinikanth sir♥️#DadasahebPhalkeAward pic.twitter.com/YrNbq26rZM — Nivetha Thomas (@i_nivethathomas) April 1, 2021 -
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
-
రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి ఏడాది ఇచ్చే దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 2020 సంవత్సరానికిగాను సూపర్ స్టార్ రజనీకాంత్‌ని వరించింది. రజనీకాంత్‌కు 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందించనున్నట్లు తాజాగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఈ పురస్కారంతో గౌరవిస్తారు. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే జన్మ శతి సందర్భంగా 1963లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి ఏడాది చివర్లో ఇచ్చే జాతీయ సినిమా అవార్డులతో పాటు ఇస్తారు. తాజాగా ఈ అవార్డ్ ను రజని కాంత్ అందుకోవడం విశేషం. అయితే తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీ ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్‌కు కేంద్రం అవార్డు ప్రకటించడం ఎలక్షన్ స్టంట్ అని విపక్షాలు నేతలు విమర్శిస్తున్నారు. రజని కాంత్ పార్టీ పెట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నందుకు గిఫ్ట్‌గా ఈ అవార్డు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు: రజనీకాంత్ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నందుకు గాను ఆయనకు పలువును సినీ రాజయకీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రజనీకి శుభాకాంక్షలు తెలిపారు. -
‘ఫాల్కే’ అందుకున్న బిగ్‌బీ
న్యూఢిల్లీ: బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో కోవింద్ ఈ అవార్డును ప్రదానం చేశారు. వాస్తవంగా బిగ్‌బీ ఈ అవార్డును కొద్ది రోజుల క్రితమే అందుకోవాల్సి ఉన్నా అనారోగ్య కారణాల రీత్యా కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. దీంతో ఆదివారం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో బిగ్‌బీకి అవార్డు అందిస్తామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇటీవల ప్రకటించారు. జాతీయ సినీ పురస్కారాలు అందుకున్న నటులకు రాష్ట్రపతి తన నివాసంలో ఆదివారం తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమితాబ్‌కు అవార్డు అందజేశారు. భారతీయ సినీ రంగానికి విశిష్ట సేవలు అందించినందుకు గానూ.. బిగ్‌బీకి ఈ పురస్కారం లభించింది. భారతీయ సినిమాలో ఇది అత్యున్నత పురస్కారం. ఈ అవార్డు కింద రూ.10 లక్షలతో పాటు స్వర్ణ కమలం అందజేస్తారు. కాగా.. ఈ అవార్డుకు అర్హుడిగా తనను ఎంపిక చేసిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ సభ్యులకు, కేంద్ర ప్రభుత్వం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలకు అమితాబ్ కృతజ్ఞతలు తెలిపారు. తనతో సినిమాలు తీసిన నిర్మాతలు, దర్శకులు, తోటి కళాకారులు, తనను ఆరాధిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ సతీమణి, ఎంపీ జయా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ సినిమా పితామహుడు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే పేరు మీదుగా 1969 నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందజేస్తున్నారు. అదే ఏడాది అమితాబ్ ‘సాత్ హిందుస్తానీ’అనే హిందీ సినిమాతో అరంగేట్రం చేశారు. -
అమితానందం
బాలీవుడ్ బిగ్ బి, ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్‌కు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాలో చిరంజీవి పాత్ర నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ – ‘‘లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. 1969లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన అమితాబ్ బచ్చన్ స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. గడిచిన 50 ఏళ్లలో చరిత్రలో నిలిచిపోయే చిత్రాలే ఎన్నింటిలోనూ అమితాబ్ బచ్చన్ నటించి, మెప్పించారు. యుక్త వయసులో యాంగ్రీ యంగ్‌మేన్ అనిపించుకున్న అమితాబ్ జీ. ఇప్పుడు వైవిధ్యంతో కూడుకున్న సినిమాల్లో నటిస్తున్నారు. మా అబ్బాయి రామ్‌చరణ్ నిర్మించిన ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలోనూ నా గురువు గోసాయి వెంకన్న పాత్రను ఆయన పోషించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది’’ అన్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మించిన ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. -
బిగ్ బీకి ‘దాదా సాహెబ్ ఫాల్కే’
న్యూఢిల్లీ: బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌ను ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. సినీ రంగంలో ఇచ్చే ఈ అత్యున్నత పురస్కారానికి బిగ్ బీని ఎంపిక చేసినట్లు కేంద్రం మంగళవారం సాయంత్రం ప్రకటించింది. ‘రెండు తరాల ప్రేక్షకులను అలరించి, స్ఫూర్తిదాయకంగా నిలిచిన దిగ్గజం అమితాబ్‌ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేశాం. దీనిపై దేశంతోపాటు అంతర్జాతీయ సమాజం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. ఆయనకు మా శుభాభినందనలు’అని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్ జవడేకర్ ట్విట్టర్లో ప్రకటించారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్న తన సినీ జీవితంలో ఆయన ఒక్కో మెట్టూ ఎదిగి ప్రపంచ సినీ వేదికపై ఎంతో కీర్తి సంపాదించుకున్నారు. ‘సాత్ హిందూస్తానీ’తో సినీ ప్రస్థానం ప్రారంభించిన బిగ్ బీ.. రాజేశ్ ఖన్నా హీరోగా నటించిన ‘ఆనంద్’లోనూ ఉన్నారు. అయితే, 1973లో జంజీర్ సినిమాతో యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా ఆయన పేరు దేశమంతటా మారుమోగిపోయింది. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. ఆయన అన్ని రకాల పాత్రలు పోషించి జనాన్ని మెప్పించారు. దీవార్, జంజీర్, డాన్, షోలే లాంటివి కొందరికి నచ్చితే, బ్లాక్, పా, పికూ వంటివి మరికొందరి మెప్పు పొందాయి. స్టార్డమ్తో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆయన.. ఒక దశలో వైఫల్యాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇటీవల విడుదలైన ఆయన థ్రిల్లర్ సినిమా ‘బద్లా’కలెక్షన్ల పరంగా సూపర్‌హిట్ అయింది. ఆయన నటించిన చిత్రాలు చెహ్రే, గులాబో సితాబో, సైరా నరసింహారెడ్డి, బ్రహ్మాస్త్ర, ఆంఖే–2 వంటివి విడుదల కావాల్సి ఉంది. అమితాబ్‌ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించడంపై చిత్ర నిర్మాతలు కరణ్ జోహార్, మధుర్ భండార్కర్ తదితర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు సాక్షి, అమరావతి: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సినిమాను కొత్త పుంతలు తొక్కించిన గొప్ప కళాకారుడైన అమితాబ్‌ను ఫాల్కే అవార్డుకు ఎంపిక చేయడం సముచితమైనదని జగన్ అభిప్రాయపడ్డారు. ఆయన తన యాక్షన్ సినిమాలతో గంభీరమైన గళంతో వీక్షకులను సమ్మోహన పరిచారని కొనియాడారు. చదవండి : దాదా.. షెహెన్షా బచ్చన్ సాహెబ్ -
దాదా.. షెహెన్షా
షోలేలో వీరూకి అతడు ‘జయ్’. ‘దీవార్’లో శశికపూర్‌కి ‘భాయ్’. కొందరికి ప్రేమగా ‘లంబూజీ’. మరికొందరికి చనువుగా ‘బడే మియా’. ఇండస్ట్రీకి ఏమో ‘బిగ్ బీ’. బాలీవుడ్‌కు ఏ కొత్త హీరో వచ్చినా ఆయన డైలాగ్ ఒక్కటే ‘రిష్తే మే హమ్ తుమ్హారే బాప్ హోతే హై. నామ్ హై షెహెన్ షా’.. ‘వరుసకు నీ అబ్బనవుతాను. పేరు షెహెన్షా’. దశాబ్దాలుగా తెర మీద ఆ రూపం తనివి తీరనివ్వలేదు. ఆ పుర్రచేతి వాటం మురిసిపోనీకుండా ఆపలేదు. అమితాబ్.. అమితాబ్.. సూపర్‌స్టార్ అమితాబ్. కమర్షియల్ కందకాలను దాటుకుని తనలోని నటుడికి దారి ఇచ్చి ‘స్టార్’ నుంచి ‘యాక్టర్’ అయి గౌరవం అందుకుంటున్నాడు. అవార్డులు కొంతమందికి శోభను తెస్తాయి. ఫాల్కేకు అమితాబే అతిపెద్ద శోభ. ‘కొంతమంది అందంగా ఉండటం వల్ల సిని మాలలో రాణిస్తారు. కొంతమంది డిఫరెంట్‌గా చేయ డం వల్ల అందలం ఎక్కుతారు. అమితాబ్ అందంగా ఉంటాడు. డిఫరెంట్‌గా కూడా చేస్తాడు. అందుకే అతడు సూపర్‌స్టార్ అయ్యాడు’ అని శతృఘ్నసిన్హా ఒకసారి అన్నాడు. అమితాబ్ తన రూపంతో మాత్రమే కాదు టాలెంట్‌తో కూడా ఉపఖండం ప్రజ లనే కాదు ప్రపంచం యావత్తు ఉన్న సినిమా అభిమా నులకు ఆరాధ్య దైవం అయ్యాడు. ‘పండిత పుత్రుడు దేనికీ కొరగాడు’ అని పెద్దలు అంటారు గాని అమితాబ్ ఆ వాడుకను తప్పుగా నిరూపించాడు. తండ్రి హరివంశరాయ్ బచ్చన్ గొప్ప కవి. ప్రొఫెసర్. ఆయనకు పెద్ద కుమారుడిగా జన్మించిన అమితాబ్ కాలేజీ రోజుల నుంచే నటుడిగా తన ఆసక్తిని నిర్మించు కున్నాడు. అయితే ఆ కెరీర్లో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక కలకత్తాలో సేల్స్ ఉద్యోగం చేసుకునేవాడు. అతని తమ్ముడు అజిత్ అతని ఫొటోలు సినిమా ఆఫీసులకు పంపుతూ అమితాబ్ నటుడు అవడానికి ప్రేరేపణ ఇచ్చాడు. ఇందిరాగాంధీ రికమండేషన్ లెటర్ నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, అమితాబ్ తల్లి తేజీ బచ్చన్ స్నేహితులు. తేజీ చాలా తరచు ఇందిరా గాంధీ ఇంటికి వెళుతుండేవారు. ‘మా పెద్దాడికి సినిమా ఆసక్తి’ అని చెప్తే ఆమె తనకు పరిచయం ఉన్న జర్నలిస్ట్, రచయిత, సినిమా దర్శకుడు కె.ఎ.అబ్బాస్‌కు సిఫార్సు ఉత్తరం రాసి అమితాబ్‌ను బొంబాయి (ముంబై) పంపించారు. అలా అమి తాబ్కు ‘సాత్ హిందుస్తానీ’లో మొదటిసారి అవ కాశం వచ్చింది. ఆ తర్వాత ముంబైలో గది తీసుకుని అవస్థలుపడుతున్న అమితాబ్‌ను కమెడియన్ మెహమూద్ దగ్గరకు తీశాడు. ‘బాంబే టు గోవా’లో హీరోగా అవకాశం ఇచ్చాడు. అందులో ‘దేఖా నా హాయ్‌రే’ పాటకు స్టెప్పులేయలేక, స్టెప్పులు తెలియక అమితాబ్ ఏడుస్తూ ఉంటే మెహమూదే ధైర్యం చెప్పి పాట చేయించాడు. ఆ తర్వాత అమితాబ్ నాటి ‘భగవాన్ దాదా’ స్టయిల్లో చేతులెత్తి చేసే స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. జంజీర్.. అమితాబ్ కెరీర్‌ను అతని పట్ల ప్రేమ పెంచుకున్న జయా బచ్చన్ మలుపు తిప్పింది. సలీమ్ జావెద్ రాసిన ‘జంజీర్’ స్క్రిప్ట్ అమితాబ్‌కు వచ్చేలా చేయడంలో ఆమె కూడా పాత్ర వహించింది. రొమాంటిక్ హీరోల ఆనాటి ధోరణిని అమితాబ్ ‘జంజీర్’లో యాంగ్రీ యంగ్‌మెన్ ఇమేజ్‌తో చావబాదాడు. ఆ సినిమా సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. షేర్ ఖాన్ అయిన ప్రాణ్ను పోలీస్ స్టేషన్లో ‘షరాఫత్ సే ఖడే రహో... ఏ స్టేషన్ హై... కోయీ తుమ్హారా బాప్ కా జగా నహీ’ (మర్యాదగా నిలబడి ఉండు.. ఇది స్టేషన్... నీ బాబుగాడి చోటు కాదు) డైలాగ్‌తో అమితాబ్ స్టార్‌గా అవతరించాడు. ఆ తర్వాత షోలే, దీవార్ అతణ్ణి సూపర్‌స్టార్‌ని చేశాయి. సూపర్హిట్లు ‘డాన్’, ‘అమర్ అక్బర్ ఆంథోని’, ‘నసీబ్’, ‘లావారీస్’, ‘మొకద్దర్ కా సికిందర్’... ఇలా అమితాబ్ కెరీర్లో వరుస సూపర్ హిట్లు వచ్చాయి. దర్శకులు ప్రకాష్ మెహ్రా, మన్ మోహన్ దేశాయ్ అతడి కెరీర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. యశ్ చోప్రా లాంటి రొమాంటిక్ దర్శకులు ‘కభీ కభీ’, ‘సిల్ సిలా’ వంటి హిట్స్ ఇచ్చారు. అమితాబ్ ఇంత కమర్షియల్ మూసలో కూడా తనను తాను కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రద్ధపెట్టాడు. యాక్షన్ సినిమాలలో కామెడీ చేయడం అతడికే చెల్లింది. ‘నమక్ హలాల్’, ‘చుప్కే చుప్కే’, ‘నట్వర్లాల్’ వంటి కామెడీ పాత్రలు అతణ్ణి ప్రేక్షకులకు చేరువ చేశాయి. రేఖాతో కలిసి అతడికి చుట్టూ వ్యాపించిన పుకార్లు మహిళా ప్రేక్షకులకు హాట్ టాపిక్స్ అయ్యాయి. పడి లేచిన తరంగం కొత్త హీరోల రాక వల్ల, సొంత సంస్థ ఏబిసీఎల్ నష్టాల వల్ల అమితాబ్ దాదాపు దివాలా తీసే స్థితికి చేరుకున్నాడు. ఏ పాత్ర వస్తే ఆ పాత్ర చేసే దిగువ శ్రేణికి జారిపోయాడు. ఆ సమయంలో తిరిగి యశ్‌చోప్రా అతడికి ‘మొహబ్బతే’లో మంచి వేషం వేసి నిలబెట్టాడు. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో అమితాబ్‌ను ఇంటింటికి చేర్చింది. కొత్త దర్శకులతో కలిసి పని చేయడానికి అమితాబ్ సిద్ధం కావడంతో కొత్త కొత్త కథలు అతడి వద్దకు వచ్చాయి. ‘చీనీ కమ్’, ‘పా’, ‘బాగ్బన్’, ‘సర్కార్’, ‘దేవ్’, ‘పింక్’, ‘బద్లా’, ‘పికూ’... ఇలా అమితాబ్ గొప్పగొప్ప పాత్రలతో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు. పాత్రను నమ్మని నటుడు, పాత్రను అమాయకంగా పోషించని నటుడు కృతకంగా మారిపోయి ప్రేక్షకులకు దూరం అవుతాడు. కాని అమితాబ్ తాను రివాల్వర్‌ను చేతిలో పట్టుకుంటే నిజమైన రివాల్వర్‌ను పట్టుకున్నట్టే నిలుస్తాడు. రౌడీ కడుపులో ముష్టిఘాతం కురిపించే సమయంలో నిజమైన గుద్దు గుద్దినట్టే కనిపిస్తాడు. కెమెరా ముందు రిలాక్స్ కావడం అమితాబ్ కలలు కూడా చేయని పని. అందుకే ఆయన ఈనాటికీ సూపర్‌స్టార్‌గా నిలిచి ఉన్నాడు. కొత్తతరం పాత తరాన్ని గేలి చేయడం సర్వసాధారణం. కాని ఎందరు సమర్థ కొత్త నటులు వచ్చినా అమితాబ్ స్టేజీ మీదకు రాగానే ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇస్తారు. ఇప్పుడు ఆయనకు ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు వచ్చింది. ఈ క్షణంలో ప్రపంచంలో ఉన్న ఆయన అభిమానులు, సినీ ప్రేక్షకులంతా ఆయనకు ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇస్తున్నారు. అమితాబ్ మరో నూరేళ్లు నటిస్తూ ఉండాలని కోరుకుందాం. -
‘విశ్వదర్శనం’కి దాదాసాహెబ్ పురస్కారం
‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘విశ్వదర్శనం’. ‘వెండితెర చెప్పిన బంగారు దర్శకుని కథ’ అన్నది ఈ సినిమా ట్యాగ్‌లైన్. కె.విశ్వనాథ్ లీడ్ రోల్లో పీపుల్స్ మీడియా పతాకంపై టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు జనార్థన మహర్షి దర్శకుడు. ఇటీవల ‘సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2019’లో డాక్యుమెంటరీ విభాగంలో (పనోరమ సెక్షన్) ‘విశ్వదర్శనం’ ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. దాదాసాహెబ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రత్యేక జ్యూరీ విభాగంలో ఈ చిత్రానికి పురస్కారం లభించింది. ఢిల్లీలో ఈ అవార్డు అందుకున్న జనార్థన మహర్షి మాట్లాడుతూ– ‘నా జీవితంలో నేను సాధించిన విజయాల్లో ఇది మరపు రానిది. కె. విశ్వనాథ్‌గారి జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రానికి ఈ పురస్కారం రావడంతో నా ఆనందానికి అవధులు లేవు. ఈ చిత్రం మరెన్నో జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఇక నుంచి ప్రదర్శించబడుతుంది’ అని తెలిపారు. -
పిన్న వయసులోనే దాదా సాహెబ్ పాల్కే అవార్డు
సినిమా: పిన్న వయసులోనే ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ పాల్కే అవార్డును అందుకుంది నటి డిగంగనా సూర్యవంశీ. ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. నటి, గాయని, రచయిత్రి అంటూ పలు రంగాల్లో పేరు తెచ్చుకుంటోంది. తన ఏడవ ఏటనే బాలనటిగా రంగప్రవేశం చేసిన డిగంగనా సూర్యవంశీ పలు హిందీ సిరీస్‌లో నటిస్తూ ప్రాచుర్యం పొంది గత ఏడాది సినీ నటిగానూ రంగప్రవేశం చేసింది. ఈమె నటించిన ఏక్ వీర్ కీ అర్ధాస్ వీర్ సిరీస్ హిందీతో పాటు తమిళం, తెలుగు, మలయాళం అంటూ పలు భాషల్లో అనువాదమై విశేష ప్రేక్షకాదరణను చూరగొంది. ఫ్రైడే అనే హిందీ చిత్రంతో నాయకిగా పరిచయం అయ్యింది. ప్రస్తుతం హిప్పీ అనే చిత్రంతో నాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. కుటుంబ సభ్యులతో తెలుగులో సంచలన విజయం సాధించిన ఆర్ఎక్స్ 100 చిత్రం ఫేమ్ కార్తికేయ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను తన వీ క్రియేషన్స్ పతాకంపై తమిళం, తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్నారు. దీనికి జల్లన్ను ఒరు కాదల్, నెండుంశాలై చిత్రాల ఫేమ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర నాయకి డిగంగనా సూర్యవంశీని ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ పాల్కే అవార్డు వరిరించింది. సినిమాకు ఆద్యుడు, పితామహుడు అయిన దాదాసాహెబ్ పాల్కే స్మారకార్థం ఆయన శతాబ్ది సందర్భంగా 1969లో ఆయన పేరుతో నెలకొల్పబడిన అవార్డు ఇది. సినీ రంగంలో సాధించిన వారికి ఈ అవార్డును భారత ప్రభుత్వం ప్రదానం చేసి సత్కరిస్తుంది. కాగా డిగంగనా సూర్యవంశీ గత ఏడాదిలో వరుసగా మూడు చిత్రాల్లో నటించడంతో పాటు, తన సహజ నటనతో అద్భుత ప్రతిభను చాటడంతో ఈ అవార్డును బుధవారం అందుకుంది. అలాంటి గొప్ప అవార్డు గ్రహీత డగంగనా సూర్యవంశీ త్వరలో హిప్పీ చిత్రం ద్వారా తమిళ తెరపైకి రానుంది. -
ఫాల్కే అవార్డు అందుకున్న కళాతపస్వి
-
ఫాల్కే అవార్డు అందుకున్న కళాతపస్వి
64వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సాక్షి, న్యూడిల్లీ: భారతదేశ సినీ రంగంలో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కళాతపస్వి కె. విశ్వనాథ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బుధవారం 64వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను గ్రహీతలకు రాష్ట్రపతి ప్రదానం చేశారు. కన్నుల పండువగా సాగిన ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, స్వర్ణ కమలం, ప్రశంసాపత్రం అందుకున్నారు. ఉత్తమ నటుడిగా అక్షయ్ కుమార్, ఉత్తమ నటిగా సురభి అవార్డులు అందుకున్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన ‘పెళ్లిచూపులు’ చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి, దర్శకుడు తరుణ్ భాస్కర్లకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రజత కమలం, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఉత్తమ సంభాషణల కేటగిరీ అవార్డును తరుణ్ భాస్కర్, ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డును జనతా గ్యారేజ్ సినిమాకు రాజు సుందరం అందుకున్నారు. ఉత్తమ ప్రజాదరణ చిత్రం కేటగిరీ కింద ‘శతమానం భవతి’ సినిమాకు గాను దర్శకుడు సతీష్, నిర్మాత వి. వెంకటరమణారెడ్డి(దిల్‌రాజు)లకు స్వర్ణ కమలం, ప్రశంసాపత్రాలు రాష్ట్రపతి ప్రదానం చేశారు. నాన్ ఫీచర్ చిత్రాల విభాగంలో ఉత్తమ సాహసోపేతమైన అం«శాలపై ‘మతిత్లి కుస్తి’ నిర్మాత మాధవి రెడ్డి రజత కమలం, ప్రశంసా పత్రం.. ఉత్తమ నాన్ ఫీచర్ చిత్రంగా ‘ఫైర్ ఫ్లైస్ ఇన్ ది ఎబిసిస్’ చిత్ర నిర్మాత, దర్శకుడు చంద్రశేఖర్ రెడ్డి స్వర్ణకమలం, ప్రశంసాపత్రాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముందు కె.విశ్వనాథ్‌పై రూపొందించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ఫాల్కే అవార్డు అందుకున్న అనంతరం కె.విశ్వనాథ్ మాట్లాడారు. ‘ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంటున్న ఈ శుభ సందర్భంగా పైన ఉన్న నా తల్లిదండ్రులకు, అంతటా ఉన్న భగవంతుడికి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, జ్యూరీ సభ్యులు, అభిమానులకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినోభవంతు’ అంటూ సంక్షిప్తంగా ముగించారు. విశ్వనాథ్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా ప్రశంసించారు. విలువలు, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా చిత్రాలను రూపొందించారని కొనియాడారు. అనుమానాల్లో నిజం లేకపోలేదు.. గతంలో వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన మంచి చిత్రాలకు జాతీయ అవార్డులు లభించకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు కలిగేవని కళాతపస్వి కె.విశ్వనాథ్ అన్నారు. కొన్ని మంచి చిత్రాలకు అవార్డులు రానప్పుడు తమ చిత్ర పరిశ్రమను చిన్న చూపు చూస్తున్నారన్న అనుమానాలు వచ్చేవని, ఇందులో నిజం లేకపోలేదని చెప్పారు. రాష్ట్రపతి చేతుల మీదుగా బుధవారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంటున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సైకిల్ కూడా ఊహించని వాడికి రోల్స్æరాయిస్ ఇస్తే ఎలా ఉంటుందో... ప్రస్తుతం తన పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. ఈ పురస్కారాన్ని తనకు ప్రదానం చేస్తుండడం పట్ల ఆశ్చర్యకరంగా ఉందని చెప్పారు. ఇకపై జాతీయ స్థాయిలో తెలుగు చిత్రాల హవా కొనసాగుతుందని జాతీయ చలనచిత్ర అవార్డు కమిటీలోని జ్యూరీ సభ్యులు సీవీ రెడ్డి, పీసీ రెడ్డిలు అభిప్రాయపడ్డారు. గత ఏడాది బాహుబలి చిత్రంతో ప్రారంభమైన ఈ గుర్తింపు భవిష్యతులో కూడా కొనసాగుతుందని చెప్పారు. ఈ ఏడాది జాతీయ చలన చిత్ర అవార్డులకు ఎంపికైన శతమానం భవతి, పెళ్లిచూపులు, జనతాగ్యారేజ్ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయన్నారు. మంచి చిత్రాన్ని తీస్తే ప్రాంతీయ భేదం లేకుండా ప్రజలు ఆదరిస్తారని శతమానం భవతి చిత్ర దర్శకుడు సతీశ్ వేగేశ్న పేర్కొన్నారు. చిన్న చిత్రంగా తెరకెక్కిన తమ సినిమా జాతీయ స్థాయిలో పెద్ద గుర్తింపును సొంతం చేసుకుందని ‘పెళ్లిచూపులు’ నిర్మాతలు రాజ్ కందుకూరి, యష్ రాగినేని పేర్కొన్నారు. -
అనుమానాల్లో నిజం లేకపోలేదు..
మంచి చిత్రాలను అవార్డులు రాకపోవడంపై కళాతపస్వి కె. విశ్వనాథ్ దాదా సాహెబ్ పురస్కారాన్ని అందుకోవడం అశ్యర్యం ఉంది సాక్షి, న్యూఢిల్లీ : గతంలో వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన మంచి చిత్రాలకు జాతీయ అవార్డులు లభించకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు కలిగేవని కళాతపస్వి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహిత కె. విశ్వనాథ్ పేర్కొన్నారు. పలు చిత్ర పరిశ్రమలను జాతీయ అవార్డు కమిటీ సభ్యులు చిన్నచూపు చూస్తారన్న భావన ప్రజల్లో ఉండేదన్నారు. కొన్ని పరిశ్రమలకు చెందిన చిత్రాలు బాగా లేకున్నా జ్యూరీ సభ్యులు ఎంపిక సందర్భంగా వాటిని చివరి వరకూ వీక్షించి అవార్డులకు ఎంపిక చేస్తున్నారని, మంచి చిత్రాలను సగం రీలే చూసి వాటిని పక్కనపెట్టేస్తారన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. కొన్ని పరిశ్రమలకు చెందిన మంచి చిత్రాలకు అవార్డులు రానప్పుడు తమ చిత్ర పరిశ్రమను చిన్న చూపు చూస్తున్నారన్న అనుమానాలు తప్పవన్నారు. ఇందులో నిజం లేకపోలేదని ఆయన చెప్పారు. రాష్ట్రపతి చేతుల మీదుగా బుధవారం చిత్ర పరిశ్రమలో అత్యున్నత పుస్కారాన్ని అందుకుంటున్న సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సైకిల్ కూడా ఊహించని వాడికి రోల్స్‌రాయిస్ ఇస్తే ఎలా భ్రమలో ఉంటాడో.. ప్రస్తుతం తన పరిస్థితి కూడా అలాగే ఉందని ఆయన అన్నారు. ఈ పుస్కారాన్ని తనకు ప్రదానం చేస్తుండడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పారు. అవార్డు స్వీకరిస్తున్న సందర్భంగా తన తల్లిదండ్రులను స్మరించుకుంటున్నట్టు చెప్పారు. ఈ పురస్కారాన్ని తనకే అంకితం ఇచ్చుకుంటున్నట్టు చెప్పారు. తాను ఏ నిబద్ధతతో దర్శకత్వం ప్రారంభించానో.. అదే నిబద్ధతతో అందరూ మెచ్చే ఆరోగ్యకరమైన చిత్రాలు తీసిన దర్శకునిగా మాత్రమే వైదొలుగుతానని చెప్పారు. తన తీరుకు అనుగుణంగా చిత్రాలు తీయండలో నిర్మాతలు ఎంతగానో సహకరించారని, తప్పులేవైనా ఉంటే అది తన బాధ్యతేనని ఆయన చెప్పారు. తెలుగు చిత్రాల హవా కొనసాగుతుంది ఇక నుంచి జాతీయ స్థాయిలో తెలుగు చిత్రాల హవా కొనసాగుతుందని జాతీయ చలనచిత్ర అవార్డు కమిటీలోని జ్యూరీ సభ్యులు సీవీ రెడ్డి, పీసీ రెడ్డిలు అభిప్రాయపడ్డారు. గత ఏడాది బాహుబలి చిత్రంతో ప్రారంభమైన ఈ గుర్తింపు భవిష్యతులో కూడా కొనసాగుతుందని చెప్పారు. ఈ ఏడాది జాతీయ చలన చిత్ర అవార్డులకు ఎంపికైన శతమానం భవతి, పెళ్లిచూపులు, జనతాగ్యారేజ్ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయన్నారు. తెలుగు చిత్రాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కేలా బాహుబలి కృషి చేసిందన్నారు. మంచి చిత్రాన్ని ప్రాంతీయ భేదం లేకుండా ఆదరిస్తారు మంచి చిత్రాన్ని తీస్తే ప్రాంతీయ భేదం లేకుండా ప్రజలు ఆదరిస్తారని శతమానం భవతి చిత్ర దర్శకుడు సతీస్ వేగ్నేష్ పేర్కొన్నారు. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన తమ చిత్రాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం శుభపరిణామమన్నారు. ప్రేక్షకులు కూడా మంచి చిత్రాలు వస్తే ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అవార్డు వచ్చే చిత్రాలకు డబ్బురావు, డబ్బులు వచ్చే చిత్రానికి అవార్డు రావు అన్న అభిప్రాయానికి ప్రస్తుతం కాలం చెల్లిందన్నారు. ప్రస్తుత తరుణంలో మంచి చిత్రాలు తీస్తే అవార్డులతో పాటు కలెక్షన్లు కూడా వస్తాయని పేర్కొన్నారు. చిన్న చిత్రం.. పెద్ద గుర్తింపు చిన్న చిత్రంగా తెరకెక్కిన తమ సినిమా జాతీయ స్థాయిలో పెద్ద గుర్తింపును సొంతం చేసుకుందని పెళ్లిచూపుల నిర్మాతలు రాజ్ కందుకూరి, యష్ రాగినేని పేర్కొన్నారు. తమ మొదటి చిత్రానికి జాతీయ అవార్డు అందుకోనుండడంపై వారు అనందాన్ని వ్యక్తం చేశారు. భవిష్యతులో మరిన్ని మంచి చిత్రాలు నిర్మిస్తామని వారు తెలిపారు. -
కె.విశ్వనాథ్‌కు ఫాల్కే అవార్డు ప్రదానం
న్యూఢిల్లీ: భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారమైన ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్టు’ను దర్శకుడు కె.విశ్వనాథ్ బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదగా అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ఈ అవార్డును విశ్వనాథ్‌కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విశ్వనాథ్...‘ఎందరో మహానుభావులు..అందరికీ ధన్యవాదాలు అంటూ’ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రపంచంలో ఎక్కడ అభిమానులు ఉన్నా వారందరికీ నా ధన్యవాదాలు అని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు... విశ్వనాథ్‌కు అభినందనలు తెలిపారు. ఆయన చిత్రాలలో హింస, అశ్లీలత ఉండదని ప్రశంసించారు. గతంలో విశ్వనాథ్ రూపొందించిన 'శంఖరాభరణం' సినిమాకు జాతీయ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. అలాగే పది ఫిల్మ్‌ఫేర్, అయిదు నేషనల్ ఫిల్మ్‌పేర్, ఆరు నంది అవార్డులను అందుకున్నారు. కాగా దేశ సినిమా పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందజేస్తారు. దీన్ని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 1969లో ఏర్పాటు చేసింది. ఈ బహుమతి కింద స్వర్ణ కమలం,శాలువా, రూ. పది లక్షలు ఇస్తారు. -
కె.విశ్వనాథ్‌కు ఫాల్కే అవార్డు ప్రదానం
-
సాహెబ్ విశ్వనాథ్
నదిలో ప్రవాహం ఉంటుంది. కథలో ప్రవాహం ఉంటుంది.క్షణం ముందు ముట్టుకున్న నీటి బొట్టును మళ్లీ ముట్టుకోలేం. అలాంటి ఎన్నో కన్నీటి బొట్లు, ఆనందభాష్పాలతో మనల్నిఅలరించిన విశ్వనాథ్‌గారు ప్రేక్షక తపస్వి. సరస్సులో చలనం ఉండదు, ఆవేశం ఉండదు. స్థిరత్వం ఉంటుంది. దాని ఒడ్డున కూర్చున్న తపస్వి ప్రతిబింబం ఉంటుంది. విశ్వనాథ్‌గారి సినిమాల్లో మన ప్రతిబింబం ఉంటుంది. ప్రవాహం, ప్రతిబింబం కలబోసిన కళా తపస్వి, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత కాశీనాథుని విశ్వనాథ్‌గారితో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ... ► స్వప్న: ‘కళా తపస్వి’ గారికి నమస్కారం! విశ్వనాథ్: ‘కళా తపస్వి’ అని ఎందుకు? విశ్వనాథ్‌గారు అనొచ్చు కదా! అలా పిలిస్తేనే నాకు హాయిగా ఉంటుంది. ► ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు వచ్చిన సందర్భంగా మీ ఆనందాన్ని మాతో పంచుకుంటారా? విశ్వనాథ్: ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను... వినగలుగుతున్నాను... మాట్లాడగలుగుతున్నాను. ఈ స్టేజిలో అవార్డు ఇచ్చినందుకు ఆనందపడాలి. ఎందుకంటే... నేను ‘పద్మశ్రీ’ అవీ తీసుకున్న రోజుల్లో అలాంటి పురస్కారాలు దక్కించుకున్నవాళ్లలో చూడలేనివాళ్లు, నడవలేనివాళ్లు, వినపడనివాళ్లు ఉన్నారు. అవార్డు వచ్చిన ఆనందాన్ని నేను అనుభవించడం కంటే కూడా నా వీరాభిమానులందరూ తమ ఆనందాన్ని వెలిబుచ్చుతున్న తీరు చూస్తుంటే... నా వెనక ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందనే ఆనందం ఎక్కువగా కలుగుతోంది. ► ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డును అత్యున్నత పురస్కారంగా సినీ పరిశ్రమకు చెందినవారు భావిస్తారు. ఈ అవార్డు అంటే మీ మనసులో కలిగే భావన ఏంటి? విశ్వనాథ్: కాశీలో ఓ దేవుడు ఉన్నాడు. ఆయన గురించి అందరూ అనుకున్నట్లుగానే నేనూ అనుకుంటాను. శిరిడీలో సాయిబాబా ఉన్నాడు. మీ ఉద్దేశంలో సాయిబాబా అంటే? అనడిగితే... నేను గొప్ప భక్తుణ్ణి లేదా భక్తుణ్ణి అని చెబుతా. అలాగే, శాంతారామ్, సత్యజిత్ రే, దాదా సాహెబ్ ఫాల్కే వంటి కొందరు ఓ కేటగిరీలో ఉన్నారు. ఇప్పుడు ఒకరు ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ పేరుతో అవార్డు స్థాపించారు. దానికి ఒక విలువ ఏర్పడింది. జనాలు ఏదైతే మంచి, గొప్ప అనుకుంటున్నారో.. నేనూ దాన్నే ఫాలో అవుతా. భవిష్యత్తులో సత్యజిత్‌రే పేరుతో అవార్డు ఇచ్చినా అంతే. ఐయామ్ హ్యాపీ. ► దర్శకుడిగా చిత్రపరిశ్రమకు మీరెంతో సేవ చేశారు. అసలు మీ ఉద్దేశంలో గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ అంటే? విశ్వనాథ్: దర్శకుడిగా నేనేదో చేశానని ఎప్పుడూ అనుకోను. ఒకవేళ నేను టీచర్‌ను అయ్యుంటే పిల్లలకు బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ టీచ్ చేయడం నా డ్యూటీ. ఒకవేళ డాక్టర్ అయితే నా పేషెంట్స్ ఎక్కువ రోజులు బతికేలా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలాగే, దర్శకుడిగా నేను ఫాలో కావాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. సమాజానికి మంచి చేయకపోయినా, చెడు చేయకుండా ఉండడం కూడా కొంతవరకూ మేలే కదా. అలా అనుకుంటాను తప్ప నేనేదో మేలు చేశాననుకోను. మంచి సినిమాలు తీయడం నా బాధ్యత. సినిమాల్లో అనేక రకాలుంటాయి. నేను సంగీత, సాహిత్యాలను ఎంచుకున్నాను. మహానుభావులు త్యాగరాజస్వామి వంటివారు సంగీత, సాహిత్యాలను కాపాడడానికి తమ జీవితాలు ధారపోశారు. వాళ్ల తర్వాతే మనమంతా. ఈ తరం ప్రేక్షకులకు వాటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేనేం చేయగలను? వాట్ ఈజ్ మై కంట్రిబ్యూషన్? అని ఆలోచిస్తా. అంతే తప్ప... ‘నేనేదో గొప్ప చేశా, ఇండస్ట్రీలో కళలను కాపాడా’ వంటి మాటలు చెప్పను. ► సినిమా ఇండస్ట్రీ అంతా ఓ పోకడలో కొట్టుకుపోతూ, ప్రవాహంలో వెళ్తున్న టైమ్‌లో అడ్డుకట్ట వేసి మళ్లీ మీరు దాన్ని వెనక్కి తెచ్చారనే భావన మీ అభిమానుల్లో ఉంది... విశ్వనాథ్: నిజమే. ‘పాశ్చాత్య సంగీతపు పెను తుఫానులో రెపరెపలాడుతున్న సత్సంప్రదాయ సంగీతపు జ్యోతిని కాపు కాయడానికి తన చేతులు అడ్డు పెట్టిన వారందరికీ పాదాభివందనం చేస్తున్నా’ అని ‘శంకరాభరణం’లో శంకరశాస్త్రి డైలాగ్ చెబుతాడు. నేను అలా చేశానని నాకు పాదాభివందనం చేయమని కాదు. అభిమానుల అభిప్రాయాన్ని నేను ఒప్పుకుంటాను. ఇప్పటికీ ఒప్పుకోకపోతే నేను మూగవాణ్ణి అయిపోతా. నా బుద్ధి మేరకు నేను నిజంగానే చేశాను. క్లాసికల్ మ్యూజిక్, డ్యాన్స్ పెట్టి సినిమాలు చేస్తే ఎవరు ఆదరిస్తారు? ఇది కమర్షియల్ ఆర్ట్ కదా? మీ సినిమాలకు డబ్బు వస్తుందా? నిర్మాత ఏమవుతాడు? అన్నదానికి విరుద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. దాని ఫలితమే నాకు వచ్చిన అవార్డులు... ఈ రోజు వచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా! ► మీలో ఆధ్యాత్మిక కోణం, పూర్తి లౌకిక కోణం, ప్రపంచాన్ని ప్రేమించే ఓ కోణం కనిపించాయి. మీలోని జీవం ఈ మూడు పాత్రల్లో ఎక్కడుంది? విశ్వనాథ్: (నవ్వుతూ..) కిచిడీలాగా అన్నీ కలిపి ఉంటాయేమో! ఎందుకంటే... ఏ కథకైనా ఇవన్నీ ముఖ్యమైన పార్శా్వలే. దాంట్లో శృంగారం, ఆధ్యాత్మిక చింతన, మరొకటి, మరొకటి ఉండాలి. చిన్న సందేశం కూడా జోడించి ఉండాలని నా నమ్మకం. సినిమా కావొచ్చు... నాటకం కావొచ్చు... మరొకటి కావొచ్చు... ఈ కోణాలన్నీ ఉండాలి. వీటిని ఎవరికి తగ్గట్టుగా వాళ్ల మోతాదుల్లో చూపిస్తారు. నేను శృంగారం చూపిస్తే లో–కీలో ఉన్నట్టు ఉంటుంది. కానీ, ప్రేక్షకులను అది తప్పకుండా ఎగ్జయిట్ చేస్తుంది. బహుశా... కొన్ని పాత్రలను వాటి పరిమితుల్లో డీసెన్సీగా చూపడంలో నేను స్పెషలిస్ట్ అనుకుంటా! ఆడ, మగ.. ఒకరినొకరు ఇష్టపడ్డారంటే... పబ్లిగ్గా ఊటీ లేదా కొడైకెనాల్లో 600 మంది డ్యాన్సర్ల మధ్యలో ‘నేను నిన్ను ప్రేమిస్తున్నా’నని చెప్పవలసిన అవసరం ఉందా? లేదా? అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. లేదు, మనిద్దరం ఏ నది ఒడ్డునో, కొండల చాటునో ఉండి... ‘ఐ డోంట్ నో, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు మి. ఐ లైక్ యు’ అని కృత్రిమంగా కాకుండా హృదయం లోతుల్లో ఉన్న ప్రేమను ముఖ కవళికలతో, మాటల్లో చెబితే.. అక్కడుండే పవిత్రత ఎవర్గ్రీన్. కొన్నిటిని గుంబనంగా అట్టిపెడితేనే పదే పదే చూడాలనే ఆశ కలుగుతుంది. ► ‘మనసు పలికే మౌనగీతం’ పాటలో, ‘సిరివెన్నెల’ సినిమాలో ప్రేమను మీరు చూపించిన విధానం... విశ్వనాథ్: (ప్రశ్న మధ్యలోనే) ఒక్క సినిమా అని కాదు, ప్రతి సినిమాలోనూ అంతే. ‘సాగర సంగమం’లో కమల్‌హాసన్, జయప్రదల పాత్రల మధ్య అనుబంధం అలాగే ఉంటుంది. ‘స్వయంకృషి’లో మోటుగా ఉండే చిరంజీవి, చెప్పులు అట్టిపెట్టుకుని దేవాలయంలో చీటీలు ఇచ్చే విజయశాంతి మధ్య అనుబంధం అయినా అలాగే ఉంటుంది. ► ఇప్పుడు మీరు మీ సినిమాలన్నీ తలచుకుంటూ వాటిని అందమైన జ్ఞాపకాలుగా భావిస్తారా? ఇంకా ఏమైనా చేయాలనే తపన పడతారా? విశ్వనాథ్: నాకు ఏ తపనా లేదంటే సంతృప్తి వచ్చేసిందా? లేకపోతే బ్రెయిన్ పని చేయట్లేదు కాబట్టి తపన లేదంటున్నాడా? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. క్రియేటివిటీకి వయో పరిమితులు ఏమీ లేవని నా అభిప్రాయం. చివరి శ్వాస వరకు ఆలోచిస్తూనే ఉంటాం. అలాగని గతమంతా తలచుకుంటూ ఆనందపడిపోయి నేను చేయవలసింది ఏమీ లేదని కాదు. యాక్టర్, సింగర్, పెయింటర్... ఏ క్రియేటివ్ ఆర్టిస్ట్ అయినా ఇది కాదు ఇంకేదో ఉందనుకుంటాడు. ‘నువ్వు చాలా గొప్పగా నటించిన సినిమా ఏది?’ అని ఎవరినైనా అడిగితే... ఠక్కున ఒకటి చెప్పేస్తే అది కరెక్ట్ కాదు. అప్పటికి ఓకే. కానీ, మనసు మాత్రం ఇంకా ఎంతో ఉందని చెబుతుంది. అప్పుడే మనుగడ. నేను అలాంటి నమ్మకం ఉన్నవాణ్ణి. ఇవి చాలా డెలికేటెడ్ ఇష్యూస్. ఎప్పుడైనా ఎవ్వరూ లేనప్పుడు నాలుగు గోడలే నా ప్రేక్షకులు అనుకుని నా సినిమాలు నేను చూసుకున్నప్పుడు విపరీతమైన ఆనందం కలుగుతుంది. ఎందుకంటే అప్పుడు మనకీ ఆలోచన ఎలా వచ్చింది? అనిపిస్తుంటుంది. దురదృష్టం ఏంటంటే... అన్ని విషయాలనూ అందరితో పంచుకోలేం. కొన్నింటిని మాత్రమే క్లోజ్ ఫ్రెండ్స్‌తో పంచుకోగలం. అలా అని పాతవన్నీ తలుచుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నానని కాదు. ► నిజజీవిత, వాస్తవిక కథలు మిమ్మల్ని ఆకర్షించలేదా? విశ్వనాథ్: లేకేం! ఒకప్పుడు నాకు ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మిగారి పేరిట ‘విదుషీమణి’ అని సినిమా చేయాలనే ఒక కోరిక వచ్చింది. బయోపిక్స్ అనేవి ఒళ్లు దగ్గరపెట్టుకుని చేయాల్సినవి. ధృవీకరించిన విషయాలను చెప్పాలి. వాస్తవికంగా ఉండాలి. కల్పనగా ఉండకూడదు. అలా ఎప్పుడైతే చేయాలనుకుంటామో అప్పుడు భయం వేస్తుంది. అందుకే నేను బయోపిక్స్ జోలికి పోలేదు. ఇప్పుడు ‘శంకరాభరణం’ ఉంది. రాత్రికి రాత్రి శంకరశాస్త్రిగారి పాత్రలో మార్పులు చేయగలను. నన్నెవరూ అడగరు. అదొక ఫిక్షన్. సినిమా ఒక ఎఫెక్షన్. నా సినిమాలన్నీ, కథలన్నీ ఎప్పటికప్పుడు సొంతంగా ఆలోచించుకుని, అప్పటికప్పుడు విశ్వామిత్రుని సృష్టిలా.. ఇంచ్ బై ఇంచ్ పెంచుకుంటూ పోయి, దానిపేరు ‘సిరివెన్నెల’ అనో ‘స్వర్ణకమలం’ అనో ‘సూత్రధారులు’ అనో పేరు పెట్టుకుంటూ పోయి.. నా వస్తువులనే నమ్ముకుంటూ, వాటి మీద శ్రద్ధ పెట్టి కథలను తీర్చిదిద్దాను. ► రామ్‌గోపాల్ వర్మ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు విశ్వనాథ్‌గారికి తక్కువ.. విశ్వనాథ్‌గారు ఆయన కంటే గొప్పవారు అన్నారు. మీరేమంటారు? విశ్వనాథ్: అతని అభిప్రాయం అతనిది. అంతవరకే. నా మీద గౌరవం కానివ్వండి... లవ్ కానివ్వండి.. అందుకే ఆయన అలాంటి మాటలు అన్నారు.. నన్ను పొగడడానికి. ► మీరు తీసిన సినిమాల్లో మిమ్మల్ని కష్టపెట్టిన సినిమా? విశ్వనాథ్: నన్ను మానసికంగా బాగా ఇబ్బంది పెట్టి, బాగా చిత్రవధ చేసేసి, రాత్రీపగలూ ‘ఎందుకు ఈ సబ్జెక్ట్ తీసుకున్నాం. మధ్యలో వదల్లేం. కంటిన్యూ చేయలేం, మార్గం కనిపించడం లేదు’ అని బాధ పెట్టిన సినిమా ‘సిరివెన్నెల’. అసలు ఒక మూగ అమ్మాయి ఏంటి? ఒక గుడ్డివాడు ఏంటి? వారిద్దరి మధ్యనా కనెక్షన్ ఏంటి? లిటికేషన్ ఏంటి? కథకుడిని నేనే కదా... దారిని సుగమంగా చేసుకోవచ్చు కదా. ఏదేమైనా అలాంటి క్లిష్టమైన సినిమాలు తీసినందుకు ఇప్పటికీ గర్వంగా ఉంటుంది. ► మీరెంతో మందితో సినిమాలు తీశారు. వాళ్లల్లో మీ ఫేవరట్ యాక్టర్? విశ్వనాథ్: అలా నాకు ఏ భేదం లేదు. ఆ సినిమా అయ్యేంత వరకు చిరంజీవిగారితో చేస్తుంటే నేను ఆయనకు సొంతం. ఆయన నాకు సొంతమైపోయి నటిస్తారు. అయిపోయింది వదిలేసుకుంటున్నాం అంటే అది అలాగే ఉంటుంది. ఇంట్లో కూడా నేను కొన్ని విషయాలను సీరియస్‌గా ఆలోచించకపోవచ్చు. అమ్మాయి సంబంధానికి కూడా నేను అంత ఇదిగా ఆలోచించకపోయి ఉండవచ్చు. కానీ, ఈ పాత్ర ఇక్కడ ఏం చేస్తుంది? ఎలా వ్యవహరిస్తుంది? అని నేను పడుతున్న బాధను ఒక ఆర్టిస్టుకు ట్రాన్స్‌లేట్ చేసి చెప్పడం, ఆ ఆర్టిస్టు దాన్ని తన నటన ద్వారా చూపించడం... రెండూ సరిగ్గా కుదరడం ముఖ్యం. సీన్స్‌ని ఆర్టిస్టుకి వివరిస్తాను. మేం మా అభిప్రాయాలను పంచుకుంటాం. ఈ సినిమా పూరైన తర్వాత ఆయన ఎవరో? నేనెవరో? అంతే కదా. అయినా ఆ కాసేపు అతను నావాడు. నా మనిషి.. అంతే! ఆ అయిదు సినిమాలు బాగా నచ్చాయి విశ్వనాథ్‌గారి సినిమాల్లో నాకు అన్నీ ఇష్టమే. బాగా మనసుకి నచ్చిన ఐదు సినిమాలంటే శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, స్వర్ణకమలం. వీటిలో ‘సిరివెన్నెల’ నా ఇంటి పేరుగా మారిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ విశ్వనాథ్‌గారు సినిమాలు తీశారు. -సిరివెన్నెల సీతారామశాస్త్రి శంకరాభరణం: శంకర శాస్త్రి గొప్ప సంగీత విద్వాంసుడు. ఊరంతా వెలివేసిన వేశ్య తులసికి మానవీయ దృక్పథంతో ఆశ్రయం కల్పిస్తాడాయన. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న శాస్త్రిని ఆదుకోవడానికి ఆయనకు తెలియకుండానే ఓ సంగీత కచేరీ ఏర్పాటు చేస్తుంది తులసి. ఆ వేదికపై తులసి కొడుకుని తన సంగీతవారసుడిగా ప్రకటించి, కన్నుమూస్తాడు శంకరశాస్త్రి. అతని పాదాల దగ్గరే ఆమె కన్ను మూస్తుంది. ‘మాస్’ చిత్రాల హవా సాగుతున్న టైమ్‌లో విశ్వనాథ్ తీసిన ఈ మ్యూజికల్ మూవీ మేజిక్ చేసింది. సాగర సంగమం: పెళ్లయ్యి, భర్తకు దూరంగా ఉంటుంది మాధవి. నాట్యాన్ని ఇష్టపడే బాలూని ప్రోత్సహించాలనుకుంటుంది. ఒకరి పట్ల మరొకరికి ఆరా«ధన మొదలవుతుంది. ఈలోగా మాధవి భర్త రావడంతో ఇద్దరూ దూరమవుతారు. మద్యానికి బానిస అయిన బాలు కొన్నేళ్లకు మాధవికి తారసపడతాడు. ఆమె కూతురికి నాట్యం నేర్పిస్తాడు. చివరికి మాధవి సమక్షంలోనే తుది శ్వాస వదులుతాడు. ఆ ఇద్దరి గుండెల్లో దాగున్న ప్రేమ ప్రేక్షకుల హృదయాన్ని మెలిపెడుతుంది. స్వాతిముత్యం: పెద్దలను ఎదిరించి ప్రేమించి, పెళ్లి చేసుకున్న లలిత భర్త చనిపోవడంతో ఒంటరిదవుతుంది. ఆమెకు సహాయం చేయాలంటే పెళ్లి చేసుకోవాలనుకుని, మూడు ముళ్లూ వేసేస్తాడు అమాయకుడు శివయ్య. అప్పటివరకూ పనీపాటా లేకుండా తిరిగిన శివయ్య లలితనూ, ఆమె కొడుకునీ పోషించడానికి గుడిలో ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ తర్వాత జరిగే అనేక మలుపులతో ఎమోషనల్‌గా సాగే ఈ చిత్రం ఓ ఆణిముత్యం. సిరివెన్నెల: అంధుడైన వేణువు విద్వాంసుడు, మూగ చిత్రకారిణి చుట్టూ తిరిగే ప్రేమకథ ‘సిరివెన్నెల’. ప్రేమకు మాట రాకపోయినా, చూపు లేకపోయినా మనసు ఉంటే చాలని చెప్పే సినిమా. ‘విధాత తలపున ప్రభవించినది..’, ‘ఈ గాలి ఈ నేల..’, ‘ఆది భిక్షువు వాడినేమి కోరేది..’ వంటి హిట్ పాటలతో ప్రేక్షకుల హృదయాలను మీటిన చిత్రం ఇది. స్వర్ణకమలం: కూచిపూడి నృత్యం నేర్చుకున్న మీనాక్షికి ఈ కళలు కడుపు నింపవనే భావన . విలాసవంతమైన జీవితం గడపాలనుకుంటుంది. మీనాక్షి నాట్యం చూసి చంద్రశేఖర్ అభిమానించి, ఓ నృత్యప్రదర్శన ఏర్పాటు చేయిస్తాడు. మీనాక్షికి ఇది నచ్చదు. ఆ తర్వాత అమెరికాలో ఉన్న ఓ భారతీయ నర్తకి సహాయంతో మీనాక్షికి అక్కడికెళ్లే ఏర్పాటు చేస్తాడు. ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన క్షణం నుంచి చంద్రశేఖర్‌కి తన పట్ల ఉన్న ప్రేమ అర్థమవుతుంది. మనసు మార్చుకుని అమెరికా వెళ్లకుండానే వెనుదిరుగుతుంది మీనాక్షి. ఈ చిత్రం ఓ స్వర్ణకమలం. ► సంపూర్ణమైన జీవితానికి కావాల్సిన అంశాలన్నీ చాలా సున్నితంగా స్పృశిస్తూ, మీ ప్రయాణం సాగింది. ఇది మీరు సంకల్పించుకోకపోయినా... మీకు ఓ బాట ఏర్పడిపోయింది. ఇది దైవేచ్ఛ అంటారా? విశ్వనాథ్‌గారి ఇచ్ఛ అంటారా? విశ్వనాథ్: నాకు ఇచ్ఛ ఉంటే ఉండొచ్చు. అది నెరవేరాలంటే దైవేచ్ఛ ఉండాలి. నాకు ఓ రోల్స్ రాయిస్ కారు కావాలని కలగనొచ్చు. అది తప్పు కాదు. టు గెట్ దట్ రోల్స్ రాయిస్ కార్ అండ్ ఎంజాయ్.... నాకు దేవుడి సహాయం కావాలి. మంచి అవార్డు రావాలి. నా సినిమా చూసి ప్రతివాడు ‘ఇది ఫలానా వాడి సినిమా, ఇది అతని స్టాంప్’ అనుకోవాలని లోపల తప్పకుండా నాకు కోరిక ఉంటుంది. అందుకోసమే అహర్నిశలు నేను ప్రయత్నిస్తా. అది బయటకు చెప్పను. కానీ, నా లక్ష్యం అదే. దానికోసం పనిచేస్తాను. దేవుడు నాకు అవకాశం కల్పించాలని వెయిట్ చేస్తాను. ‘పని చేస్తా. ఫలితం గురించి ఆలోచించను’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతా. – స్వప్న, ‘సాక్షి’ టీవీ -
ఇది తెలుగు జాతికి ఇచ్చిన పురస్కారం
హైదరాబాద్ : కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి, దర్శకుడు కె. విశ్వనాథ్‌ను హైదరాబాద్‌లో కలిసి సత్కరించారు. చలన చిత్ర పరిశ్రమలో 6 దశాబ్దాలుగా ఎన్నో గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించి, క్రమశిక్షణకు మారుపేరు అయిన విశ్వనాథ్‌ని కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేయడం ప్రతి తెలుగువారు గర్వంగా భావిస్తున్నారని కేతిరెడ్డి అన్నారు. ఈ అవార్డు తెలుగు జాతికి వచ్చిన అవార్డుగా ఆయన అభివర్ణించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను తన సినిమాల ద్వారా ప్రపంచానికి తెలియజేసిన కళాతపస్వికి గతంలో ఎన్నో పురస్కారాలు దక్కాయని కేతిరెడ్డి అన్నారు. ఈ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఇవ్వడం తెలుగు వారందరికి దక్కిన గౌరవమని తెలిపారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు మాత్రమే కాకుండా కుటుంబ విలువలు, మంచి సందేశాలు ఆయన చిత్రాల్లో ఉంటాయన్నారు. స్వయం కృషి, శుభలేఖ, జీవనజ్యోతి, సిరిసిరిమువ్వ, చిన్ననాటి స్నేహితులు లాంటి ఎన్నో చిత్రాలు అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను తెరకెక్కించిన కళాతపస్వి విశ్వనాథ్ భూమి, ఆకాశం ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని తెలిపారు.