భారతదేశ సినీ రంగంలో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కళాతపస్వి కె. విశ్వనాథ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో బుధవారం 64వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను గ్రహీతలకు రాష్ట్రపతి ప్రదానం చేశారు.