డిగంగనా సూర్యవంశీ
సినిమా: పిన్న వయసులోనే ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ పాల్కే అవార్డును అందుకుంది నటి డిగంగనా సూర్యవంశీ. ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. నటి, గాయని, రచయిత్రి అంటూ పలు రంగాల్లో పేరు తెచ్చుకుంటోంది. తన ఏడవ ఏటనే బాలనటిగా రంగప్రవేశం చేసిన డిగంగనా సూర్యవంశీ పలు హిందీ సిరీస్‌లో నటిస్తూ ప్రాచుర్యం పొంది గత ఏడాది సినీ నటిగానూ రంగప్రవేశం చేసింది. ఈమె నటించిన ఏక్ వీర్ కీ అర్ధాస్ వీర్ సిరీస్ హిందీతో పాటు తమిళం, తెలుగు, మలయాళం అంటూ పలు భాషల్లో అనువాదమై విశేష ప్రేక్షకాదరణను చూరగొంది. ఫ్రైడే అనే హిందీ చిత్రంతో నాయకిగా పరిచయం అయ్యింది. ప్రస్తుతం హిప్పీ అనే చిత్రంతో నాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది.
కుటుంబ సభ్యులతో
తెలుగులో సంచలన విజయం సాధించిన ఆర్‌ఎక్స్ 100 చిత్రం ఫేమ్ కార్తికేయ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను తన వీ క్రియేషన్స్ పతాకంపై తమిళం, తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్నారు. దీనికి జల్లన్ను ఒరు కాదల్, నెండుంశాలై చిత్రాల ఫేమ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర నాయకి డిగంగనా సూర్యవంశీని ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ పాల్కే అవార్డు వరిరించింది. సినిమాకు ఆద్యుడు, పితామహుడు అయిన దాదాసాహెబ్ పాల్కే స్మారకార్థం ఆయన శతాబ్ది సందర్భంగా 1969లో ఆయన పేరుతో నెలకొల్పబడిన అవార్డు ఇది. సినీ రంగంలో సాధించిన వారికి ఈ అవార్డును భారత ప్రభుత్వం ప్రదానం చేసి సత్కరిస్తుంది. కాగా డిగంగనా సూర్యవంశీ గత ఏడాదిలో వరుసగా మూడు చిత్రాల్లో నటించడంతో పాటు, తన సహజ నటనతో అద్భుత ప్రతిభను చాటడంతో ఈ అవార్డును బుధవారం అందుకుంది. అలాంటి గొప్ప అవార్డు గ్రహీత డగంగనా సూర్యవంశీ త్వరలో హిప్పీ చిత్రం ద్వారా తమిళ తెరపైకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment