![Siddu Jonnalagadda Talks On Month Of Madhu Pre Release Event - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/3/Month-of-Madhu.jpg.webp?itok=m5X-euSg)
సిద్ధు జొన్నలగడ్డ, నవీన్ చంద్ర, స్వాతి
‘‘ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి ట్రైలర్‌లో ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రం బెస్ట్. అన్ని సినిమాలు వేరు.. ఈ సినిమా వేరని ట్రైలర్‌లోనే తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ అవుతుంది’’ అని హీరో సిద్ధు జొన్నలగడ్డ అన్నారు. నవీన్ చంద్ర, స్వాతీ రెడ్డి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో యశ్వంత్ ములుకుట్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘‘మంత్ ఆఫ్ మధు’ ట్రైలర్ బాగుంది’’ అన్నారు కీరవాణి. ‘‘ఇలాంటి సినిమాలు, ఇందులోనిపాత్రలు అరుదుగా వస్తుంటాయి’’ అన్నారు నవీన్ చంద్ర. ‘‘ఈ మూవీని ΄్యాషన్‌తో తీశాం.. ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు శ్రీకాంత్ నాగోతి, యశ్వంత్ ములుకుట్ల.
Comments
Please login to add a commentAdd a comment