Colors Swathi Divorce Rumours Goes Viral In Social Media - Sakshi
Sakshi News home page

Colours Swathi: విడాకుల బాటలో కలర్స్ స్వాతి.. మళ్లీ అదే ప్రచారం

Published Tue, Jul 18 2023 8:10 AM | Last Updated on Tue, Jul 18 2023 10:38 AM

Colours Swathi Divorce Rumors Viral In Social Media - Sakshi

బుల్లితెర నుంచి తన సరదా మాటలతో ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత వెండితెరపై మెరిసింది కలర్స్ స్వాతి. తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషల్లో తనదైన నటనతో మెప్పించింది.   ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ లో వెంకటేష్‌కు మరదలిగా నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత స్వామిరారా,కార్తికేయ్‌ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలతో మంచి ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్‌ చేసుకుంది.  హీరో నాని సరసన ‘అష్టా చమ్మా’లో అద్భుతమైన నటనతో కలర్స్‌ స్వాతి ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు నంది అవార్డును కూడా ఆమె సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

(ఇదీ చదవండి: 50 దాటేసిన వరలక్ష్మి  శరత్‌ కుమార్‌ ... అప్పట్లో ఈ బ్లాక్‌ బస్టర్‌ సినిమా చేసుంటేనా?)

తాజాగా స్వాతి గురించి ఒక వార్త సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కొద్దిరోజుల నుంచి తన భర్త వికాస్‌కు దూరంగా ఉంటున్నట్లు ఒక వార్త వైరల్‌ అవుతుంది. ఈ ప్రచారానికి ప్రధాన కారణం తన భర్త ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి స్వాతి తొలగించడమే అని చెప్పుకొస్తున్నారు. గతంలో సమంత కూడా నాగ చైతన్యతో విడిపోతున్నప్పుడు తన సోషల్‌ మీడియా ఖాతాలో అక్కినేని అనే ఇంటి పేరుతో పాటు వారిద్దరూ ఉన్న ఫోటోలను కూడా  తొలగించింది. ఈ మధ్యే విడాకులు తీసుకున్న నిహారిక-చైతన్య విషయంలో కూడా ఇలాగే జరిగింది.

దీంతో తాజాగా కలర్స్‌ స్వాతి కూడా తన భర్త ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తొలగించిందని, తను కూడా విడాకులు తీసుకోబోతుందని పలు యూట్యూబ్‌ చానల్స్‌తో పాటు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. స్వాతి విషయంలో ఇలాంటి ప్రచారం జరగడం ఇది కొత్తేమి కాదు. సుమారు రెండేళ్ల క్రితం కూడా తన వివాహబంధం విషయంలో ఇలాంటి ప్రచారమే జరిగింది. 

విడాకుల విషయంపై గతంలో స్వాతి ఇచ్చిన వివరణ
సుమారు రెండేళ్ల క్రితం కూడా స్వాతి విడాకులు తీసుకోబోతుందని ప్రచారం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్త ఫోటోలు ఎందుకు లేవో కూడా కారణం అప్పట్లోనే ఇలా తెలిపింది.  భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఆర్కివ్స్ లో దాచుకున్నానని చెబుతూ.. తన ఫోన్‌లో ఉన్న వాటిని చూపించింది. అంతేకాదు వాటిన్నంటిని ఓ చిన్న వీడియోగా తీసి అప్పట్లోనే పోస్ట్ చేసింది. దీంతో ఆ సమయంలో విడాకుల పుకార్లు ఆగిపోయాయి.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి ఈ జంట ఎంట్రీ ఖాయం.. వాళ్లకు బిగ్‌ సపోర్ట్‌ ఎవరో తెలిస్తే)

తాజాగా ఎందుకోగాని మళ్లీ స్వాతి విషయంలో మళ్లీ ఇదే ప్రచారం జరుగుతుంది. 2018లో మలయాళీ కుటుంబానికి చెందిన పైలెట్ వికాస్ వాసును స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ థాయ్‌ల్యాండ్‌లో సెటిల్‌ అయ్యారు. అప్పట్లో సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన స్వాతి మళ్లీ 2019లో మళయాలంలో త్రిశూరపురం అనే సినిమాలో నటించింది. తెలుగులో కూడా పంచతంత్రంతో పాటు మరో రెండు సినిమాలు చేసింది. ఇప్పుడు సినిమాలు చేస్తూ హైదరాబాద్‌లోనే స్వాతి ఉంటుందని, భర్త వికాస్‌ మాత్రం థాయ్‌ల్యాండ్‌లోనే ఉంటున్నారని ప్రచారం జరుగుతుంది.  ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, గతంలో మాదిరే మళ్లీ తను రియాక్ట్‌ అయి ఇలాంటి వార్తలు ప్రచారం చేసే వారికి సమాధానం చెబుతుందేమో తెలియాల్సి ఉంది.

విడాకుల ప్రచారంపై గతంలో స్వాతి షేర్‌ చేసిన వీడియో


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement