స్వాతి కంటే కలర్స్ స్వాతి అంటేనే ఠక్కున గుర్తు పట్టేస్తారు. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన వారిలో స్వాతిరెడ్డి ఒకరు. కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి.. ఆ తర్వాత నటిగా రాణించింది. ఎలాంటి పాత్రను ఇచ్చినా అవలీలగా చేస్తూ ఉంటుంది తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో తనదైన నటనతో మెప్పించింది.
(ఇది చదవండి: పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోతుందని చెప్పారు: శివ బాలాజీ)
స్వాతి మొదటి చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్. 2008లో వచ్చిన అష్టాచెమ్మా చిత్రం ఆమెకు మంచి ఫేమ్ తీసుకొచ్చింది. ఈ సినిమాకు ఆమెకు నంది పురస్కారం లభించింది. ఆ తర్వాతనే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన స్వాతి కెరీర్‌లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.
(ఇది చదవండి: 'ది కేరళ స్టోరీ' ప్రభంజనం.. ఆలియా భట్ సినిమా రికార్డ్ బ్రేక్!)
స్వాతి మాట్లాడుతూ.. 'నా కెరీర్‌లో నేను చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. ఎప్పటికప్పుడు ఒక సినిమా తరువాత మరో సినిమా అవకాశం రాదనుకునేదాన్ని.'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' సినిమాలో వెంకటేశ్‌కు మరదలు రోల్ చేశా. ఆ చిత్రం నాకు మంచి గుర్తింపే తీసుకొచ్చింది. కానీ ఆ తర్వాత అన్నీ మరదలు పాత్రలే వచ్చాయి. అవీ చేయడానికి నేను ఇష్టపడలేదు. నా గ్రాఫ్ పడిపోతుందనుకున్న ప్రతిసారి ఏదో ఒక హిట్ పడేది. అలా ఈ రోజున నేను చెప్పుకోవడానికి కొన్ని హిట్లు ఉన్నాయి. 'స్వామి రారా' .. 'సుబ్రమణ్యపురం' 'కార్తికేయ' అలాంటివే. నా కెరియర్‌లో 'డేంజర్' సినిమా సమయంలో చాలా రూమర్స్ వచ్చాయి. కానీ వాటిని నేను పెద్దగా పట్టించుకోలేదు.' అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. ప్రస్తుతం మంత్ ఆఫ్ మధు అనే చిత్రంలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment