
కలర్స్ స్వాతి.. డేంజర్ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైంది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో పూజ పాత్రతో మెరిసింది. అష్టా చమ్మా మూవీతో హీరోయిన్‌గా మారింది. అలా తెలుగులో హీరోయిన్‌గా అనేక సినిమాలు చేసింది. ఈ మధ్యే సినిమాల స్పీడు తగ్గించేసింది. గతేడాది మంత్ ఆఫ్ మధు సినిమాతో పలకరించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా పెద్ద యాక్టివ్‌గా ఉండదు.

ఇష్టారీతిన కామెంట్
ఎప్పుడో ఒకసారి కానీ పోస్టులు చేయదు. తాజాగా ఆమె తన కుటుంబసభ్యులను పరిచయం చేస్తూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఇది చూసిన ఓ ఆకతాయి నెటిజన్.. ఛీ నీ బతుకు.. అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ చదివాక దానికి కౌంటర్ ఇవ్వాల్సిందేనని నిర్ణయించుకుంది.
థాంక్యూ నా బుజ్జి బతుకు
సదరు కామెంట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ.. కొన్నిసార్లు నాక్కూడా అలాగే అనిపిస్తుంది.. అని సెటైర్ వేసింది. కానీ అప్పుడే మళ్లీ ముందుకు వెళ్లాలని ఆలోచిస్తుంటాను.. థాంక్యూ నా బుజ్జి బతుకు.. ఈ బతుక్కి దిష్టి తగలకూడదన్నట్లుగా నో దిష్టి అనే సింబల్‌ను జత చేసింది.
Comments
Please login to add a commentAdd a comment