
అదృశ్యమైన ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి
బ్రసెల్స్: బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఉగ్రదాడుల తర్వాత అదృశ్యమైన భారతీయుడు రాఘవేంద్ర గణేశన్ మృతిచెందారు. ఇన్ఫోసిస్ ఉద్యోగి అయిన రాఘవేంద్ర గణేశన్ మృతి చెందినట్టు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఉగ్రదాడుల అనంతరం బెంగళూరుకు చెందిన గణేశన్ ఆచూకీ గల్లంతయింది. అతడు చివరిసారిగా బ్రసెల్స్‌లోని ఓ మెట్రో రైలు నుంచి కాల్ చేసినట్లు అధికారులు తెలిపారు. అతడి ఆచూకీ కనుక్కొనేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.