హైదరాబాద్ నగర శివారు ఘట్కేసర్లోని అన్నోజిగూడలో సింగపూర్ టౌన్షిప్లో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీపక్ ఫకీర్ హబీబ్ ఈ రోజు ఉదయం పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.
మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్లో దీపక్ పని చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. ఇటీవల అతడు బెంగళూరు నుంచి బదిలీపై హైదరాబాద్ వచ్చాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.