సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య | Software engineer ends life by jumping from building | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

Published Mon, Dec 2 2013 2:29 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

Software engineer ends life by jumping from building

ఘట్‌కేసర్, న్యూస్‌లైన్: భవనం పైనుంచి దూకి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్ణాటక రాష్ట్రం హుబ్లీకి చెందిన దీపక్ అబీబ్ (33) ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ..  రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండల పరిధిలోని సంస్కృతి టౌన్‌షిప్ లో నివాసముంటున్నారు. ఎముకల వ్యాధితో బాధపడుతున్న దీపక్, తరచూ నొప్పి నివారణ మందులు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున టౌన్‌షిప్‌లో పెద్ద శబ్దం రావడంతో వాచ్ మెన్ వెళ్లి చూడగా దీపక్ కొన ఊపిరితో కనిపించాడు. 108 సిబ్బంది పరీక్షించేసరికి మృతి చెందాడు. తొలుత చేతికి గాయం చేసుకుని తర్వాత మూడో అం తస్తు నుంచి కిందికి దూకి ఉంటాడని అనుమానిస్తున్నారు. హుబ్లీ నుండి అతడి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత దీపక్ ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉందని సీఐ చలపతి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement