రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన రోషన్‌కుమార్(27) స్థానిక సంస్కృతి టౌన్‌షిప్‌లోని ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగి అయిన అతడు మంగళవారం రాత్రి తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం గమనించిన వాచ్‌మెన్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గదిని పరిశీలించగా 'తన మృతికి ఎవరూ కారణం కాదు' అని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీఐ ప్రకాశ్ సంఘటన స్థలిని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.