roshan kumar
-
రెడ్ బుక్ రాజ్యాంగం.. పీఎస్‌లో టీడీపీ ఎమ్మెల్యే సెటిల్మెంట్స్!
సాక్షి, ఏలూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో టీడీపీ నేతలు పలుచోట్ల ఓవరాక్షన్‌కు దిగుతున్నారు. అధికారంలో తామే ఉన్నామని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే సొంగా రోషన్ పోలీసు స్టేషన్లో హల్ చల్ చేశారు.టీడీపీ ఎమ్మెల్యే సొంగా రోషన్ తడికలపూడి పోలీసు స్టేషన్లో ఓవరాక్షన్‌కు దిగారు. స్టేషన్‌లోని ఎస్ఐ కుర్చీలో కూర్చుని ఎమ్మెల్యే టిఫిన్ చేశారు. అంతటితో ఆగకుండా సినిమా స్టైల్లో స్టేషన్లో ఉన్న పోలీసులకు హుకుం జారీ చేశారు. అధికారంలో ఉన్నారని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఏకంగా పోలీసు స్టేషన్‌నే సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చేశారు.మరోవైపు.. పచ్చ పార్టీ ఎమ్మెల్యే సొంగా రోషన్ పోలీసు స్టేషన్లో చేసిన హంగామాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సందర్బంగా ఎమ్మెల్యేల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అయినంత మాత్రాని పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేస్తారా? అని మండిపడుతున్నారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్': సుప్రీంకోర్టు -
త్రుటిలో తప్పిన ప్రమాదం
చిలమత్తూరు : మండలంలోని 44వ జాతీయ రహదారి అంజనీ తండా సమీపంలో ఆదివారం సాయంత్రం కారు బోల్తా పడింది. అయితే అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు బెంగళూర్ నుంచి రోషన్‌కుమార్ తన సొంత కారులో (కేఏ51ఎంజీ 9628) హైదరాబాద్ వైపు వెళ్తుండగా అంజనీ తండా సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. కాగా డ్రైవర్ సీటు బెల్టు వేసుకోవడంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కానిస్టేబుళ్లు సురేష్, ఎం.సురేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన రోషన్‌కుమార్(27) స్థానిక సంస్కృతి టౌన్‌షిప్‌లోని ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగి అయిన అతడు మంగళవారం రాత్రి తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం గమనించిన వాచ్మెన్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గదిని పరిశీలించగా 'తన మృతికి ఎవరూ కారణం కాదు' అని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీఐ ప్రకాశ్ సంఘటన స్థలిని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. -
రైడ్ ఫర్ ఫీస్
ప్రపంచ శాంతిని కోరుతూ బెంగళూరుకు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రోషన్ కుమార్ సోలో బైక్‌థాన్ యాత్రను చేపట్టాడు. గత బుధవారం బెంగళూర్ నుంచి హైదరాబాద్ వరకు బైక్‌పై ఒంటరిగా వచ్చాడు. తన యాత్ర వెనకున్న ఉద్దేశాన్ని దారి పొడవునా వివరించాడు. డాక్టర్‌గానే కాదు బెంగళూరులోని ‘హ్యాపీ టు హెల్ప్’ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్‌గానూ సామాజిక బాధ్యత భుజానికెత్తుకున్న రోషన్ కుమార్.. యాత్రవెనకున్న ఉద్దేశాన్ని సిటీప్లస్కు వివరించాడు. - వీఎస్ ప్రపంచాన్ని టైజం వణికిస్తోంది. ఇటీవల పెషావర్ ఘటన కలచివేసింది. ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నా వంతుగా ప్రపంచ శాంతి కోరుతూ బైక్ రైడ్ చేయాలనుకున్నా. నా ఆలోచనను మా ఫౌండేషన్ సభ్యులతో పంచుకన్నాను. వారి ప్రోత్సాహంతో బెంగళూర్ నుంచి హైదరాబాద్‌కు సోలో బైక్‌థాన్ చేశాను. ఉదయం ఆరు గంటలకు మొదలైన నా రైడ్ వివిధ పట్టణాల మీదుగా.. భాగ్యనగరానికి చేరుకుంది. ఆత్మీయంగా ఆదరించారు... బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు రోడ్ చాలా బాగుంది. దారి పొడవునా ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. నాకు సహకారంగా ఉండేందుకు పైలట్ కారులో వచ్చిన ఐదుగురు సభ్యులు అన్ని ప్రాంతాల్లో కరపత్రాలు ఇచ్చారు. మా మెసేజ్‌ను పూర్తి స్థాయిలో తీసుకెళ్లగలిగామని భావిస్తున్నా. 46 ఏళ్ల వయసున్నా సామాజిక అవగాహన కల్పించాలన్న సంకల్పమే నన్ను ముందుకు సాగేలా చేసింది. సామాజిక సేవలో యువతను భాగస్వాములను చేసేందుకే బైక్‌ను ఎంచుకున్నాను. హైదరాబాద్‌లోనూ సేవలు... ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా happy2help foundation సేవలందిస్తోంది. పేద విద్యార్థుల చదువుతో పాటు ఆర్థికంగా వెనుకబడి ఉన్న క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్యంతో పాటు మందులు అందిస్తున్నాం. ‘ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్’ పేరిట మరణానికి దగ్గరలో ఉన్నవారికి పూర్తి స్థాయిలో వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నాం. చివరి రోజుల్లో వారు మంచిగా, ఆనందంగా ఉండేలా చూసుకుంటున్నాం. ఈ సేవలను త్వరలో హైదరాబాద్‌లో కూడా విస్తరించాలనుకుంటున్నాం. ఇక్కడి వైద్యులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారని ఆశిస్తున్నాను. నా రైడ్ ద్వారా సమకూరిన నిధులను ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలకు ఉపయోగిస్తాం. సామాజిక సేవలో యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా నా కార్యక్రమాలు ఉంటాయి. ‘2015 జనవరి 26న బెంగళూరు నుంచి పుణేకు కొంతమంది సభ్యులతో కలిసి బైక్ యాత్ర చేపట్టనున్నామని’ వివరించాడు.