
సాక్షి, ఏలూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో టీడీపీ నేతలు పలుచోట్ల ఓవరాక్షన్‌కు దిగుతున్నారు. అధికారంలో తామే ఉన్నామని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే సొంగా రోషన్ పోలీసు స్టేషన్‌లో హల్ చల్ చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే సొంగా రోషన్ తడికలపూడి పోలీసు స్టేషన్‌లో ఓవరాక్షన్‌కు దిగారు. స్టేషన్‌లోని ఎస్‌ఐ కుర్చీలో కూర్చుని ఎమ్మెల్యే టిఫిన్ చేశారు. అంతటితో ఆగకుండా సినిమా స్టైల్‌లో స్టేషన్‌లో ఉన్న పోలీసులకు హుకుం జారీ చేశారు. అధికారంలో ఉన్నారని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఏకంగా పోలీసు స్టేషన్‌నే సెటిల్‌మెంట్లకు అడ్డాగా మార్చేశారు.
మరోవైపు.. పచ్చ పార్టీ ఎమ్మెల్యే సొంగా రోషన్ పోలీసు స్టేషన్‌లో చేసిన హంగామాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సందర్బంగా ఎమ్మెల్యేల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అయినంత మాత్రాని పోలీస్ స్టేషన్‌లో సెటిల్‌మెంట్లు చేస్తారా? అని మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్': సుప్రీంకోర్టు
Comments
Please login to add a commentAdd a comment