త్రుటిలో తప్పిన ప్రమాదం
చిలమత్తూరు : మండలంలోని 44వ జాతీయ రహదారి అంజనీ తండా సమీపంలో ఆదివారం సాయంత్రం కారు బోల్తా పడింది. అయితే అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు బెంగళూర్ నుంచి రోషన్‌కుమార్ తన సొంత కారులో (కేఏ51ఎంజీ 9628) హైదరాబాద్ వైపు వెళ్తుండగా అంజనీ తండా సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది.
కాగా డ్రైవర్ సీటు బెల్టు వేసుకోవడంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కానిస్టేబుళ్లు సురేష్, ఎం.సురేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.