కారు బోల్తా.. ఒకరి మృతి | car rolls and one dies | Sakshi
Sakshi News home page

కారు బోల్తా.. ఒకరి మృతి

Published Sat, Sep 16 2017 9:22 PM | Last Updated on Tue, Sep 19 2017 4:39 PM

కారు బోల్తా.. ఒకరి మృతి

కారు బోల్తా.. ఒకరి మృతి

ఉరవకొండ రూరల్‌: నిద్రమత్తులో డ్రైవింగ్‌ చేయడంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని కొప్పల్‌ జిల్లాకు చెందిన వసంతప్ప (45), శశిధర్‌, డ్రైవర్‌ అప్పన్నలు వేరొక వాహనం రిపేరీ సామాన్లు కొనడానికి శనివారం తెల్లవారుజామున బళ్లారి నుంచి కారులో బయల్దేరారు.

నిద్రమత్తులో ఉన్న డ్రైవర్‌ ఉరవకొండ మండలం బూదగవి వద్ద తూగడంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. వసంతప్ప అక్కడికక్కడే మృతిచెందాడు. శశిధర్‌, అప్పన్నలు గాయపడగా.. వీరిని ప్రభుత్వ అంబులెన్స్‌లో ఉరవకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement