హిందూపురం రూరల్: మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌళూరు గ్రామ సమీపంలోని మంగళవారం జరిగిన ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. రూరల్ ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం గౌరిబిదనూరు రూరల్ తాలూకాలోని నడువలహళ్లి చెందిన నరసిహమూర్తి(28), కుందేనహళ్లికి చెందిన రాజు (35) చౌళూరుకు ద్విచక్రవాహనంలో వచ్చారు.
తిరుగు ప్రయాణంలో చౌళూరు గ్రామ సమీపంలో చెరువు కట్ట మీద ఆగి ఉన్న నీటి ట్యాంకర్‌ను ద్విచక్రవానం ఢీ కొంది ప్రమాదంలో నరసింహప్పకు తలకు తీవ్రంగా గాయాలు కాగా రాజుకి స్వల్పగాయాలయ్యయి. గ్రామస్తులు వారిని 108 సహాయంతో హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నరసింహప్ప పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగుళూరుకు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమ«ధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
Published Tue, Aug 15 2017 10:58 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
Advertisement
Advertisement