రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు | Husband dies, wife injured in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు

Mar 1 2017 4:56 PM | Updated on Aug 30 2018 4:10 PM

బైక్‌పై వెళుతున్న భార్యాభర్తలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. జగిత్యాల మండలంలో జరిగిన ఈ ప్రమాదంలో మాల్యాల మండలం నూకపల్లికి చెందిన దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి.

జగిత్యాల: బైక్‌పై వెళుతున్న భార్యాభర్తలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. జగిత్యాల మండలంలో  జరిగిన ఈ ప్రమాదంలో మాల్యాల మండలం నూకపల్లికి చెందిన దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. 

క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే భర్త  మృతిచెందాడు. భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.  బైక్‌పై ధర్మపురికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement