
కోటబొమ్మాళి: మండలంలోని చిన్నబమ్మిడి–వాండ్రాడ గ్రామాల మధ్య జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో సంతబొమ్మాళి మండలం వడ్డివాడ గ్రామానికి చెందిన యువకుడు కొర్ను హేమారావు (23) మృతిచెందాడు. డిఫెన్సు పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నాడు. మోటారు సైకిల్‌పై టెక్కలి నుంచి నరసన్నపేట వైపు వెళుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొనడంతో అక్కడకక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. కోటబొమ్మాళి ఎస్‌ఐ ఎన్. లక్ష్మణ్ కేసు సమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హేమారావు తండ్రి చిన్నారావు, తల్లి కృష్ణవేణి, సోదరి లక్ష్మి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment