chowluru
-
పురం’పై వైఎస్సార్ సీపీ జెండా ఎగరాలి
హిందూపురం: ‘చౌళూరు రామకృష్ణారెడ్డికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంటే ఎనలేని గౌరవం. జగనన్న అంటే అపార అభిమానం. అందుకే కెనడాలో చదువుకున్న ఆయన, మంచి ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. హిందూపురంలో వైఎస్సార్ సీపీ జెండా కట్టి పార్టీకి పునాదులు వేశారు. పురంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేయాలన్నదే ఆయన ఆశయం. అందువల్ల కార్యకర్తలంతా కలిసి 2024లో హిందూపురంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసి ఆయనకు ఆత్మకుశాంతి కలిగించాలి’ అని చౌళూరు సతీమణి జ్యోత్స్న, సోదరి మధుమతి, బావ నాగభూషణంరెడ్డి, ఇతర కుటుంబసభ్యులు పిలుపునిచ్చారు. శుక్రవారం హిందూపురంలోని ఈడిగ ఫంక్షన్‌హాలులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రామకృష్ణారెడ్డి సంతాపసభ జరిగింది. ముందుగా రామకృష్ణారెడ్డి చిత్రపటానికి కుటుంబీకులతో పాటు ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి పార్టీ ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులరి్పంచి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం రామకృష్ణారెడ్డి సతీమణి, సోదరి, ఇతర కుటుంబీకులు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని, తప్పకుండా న్యాయం జరుగుతుందన్న దృఢ విశ్వాసం ఉందన్నారు. దోషులు ఎంతటివారైనా వారికి శిక్షపడాలన్నారు. ఐక్యంగా పోరాడదాం.. చౌళూరు హత్య కేసులో అనుమానాలు ఉన్నాయని ఏపీ అగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ అన్నారు. ఆయన ఇంటి ముందే చౌళూరును దారుణంగా హత్య చేశారంటే, హంతకుల వెనుక ఎవరో పెద్దలున్నారనిపిస్తోందన్నారు. హత్య కేసులోని అనుమానితుల్లో కొందరిని ఎందుకు అరెస్టు చేయడం లేదన్నారు. రామకృష్ణారెడ్డి ఏ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారో, ఎందుకోసం కష్టపడ్డారో దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇకపై పిడికిలి బిగించి అందరం ఒక్కటై రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించినప్పుడే రామకృష్ణారెడ్డి ఆత్మకుశాంతి, నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బలరామిరెడ్డి, ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, రత్నమ్మ, మార్కెట్ యార్డు చైర్మన్ కొండూరు మల్లికార్జున, కౌన్సిలర్లు ఆసీఫ్‌వుల్లా, రామచంద్రా, షాజియా, డైరెక్టర్లు లక్ష్మీనారాయణ, జనార్దన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కొటిపి హనుమంతరెడ్డి, నాగరాజు, హబీబ్, చంద్ర, మహేశ్, దాదు, నక్కలపల్లి శ్రీరాములు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (చదవండి: చౌళూరు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది ) -
చౌళూరు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది
హిందూపురం: చౌళూరు రామకృష్ణారెడ్డి హత్యకేసు దర్యాప్తులో ఎలాంటి ఒత్తిళ్లకూ తావుండదని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఎవరైనా అలాచేస్తే ముఖ్యమంత్రి, తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. పోలీసులను మభ్యపెట్టి చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని, ఈ కేసు పురోగతిని స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. రామకృష్ణారెడ్డి కుటుంబానికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. హిందూపురం నియోజకవర్గం చౌళూరులో ఇటీవల హత్యకు గురైన నియోజకవర్గ వైఎస్సార్ సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులను మంగళవారం ఆయన పరామర్శించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. తనకు, తన కుమారుడు మిథున్‌రెడ్డికి వ్యక్తిగతంగా కూడా కావాల్సిన వ్యక్తి రామకృష్ణారెడ్డి అని చెప్పారు. రామకృష్ణారెడ్డిని కోల్పోవడం పార్టీకి నష్టమని చెప్పారు. దోషులు ఎవరైనా వదిలేది లేదని, అందుకు తాను హామీ అని వారికి మంత్రి భరోసా ఇచ్చారు. రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శంకర్‌నారాయణ, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, సిద్ధారెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ నవీన్‌నిశ్చల్ ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
హిందూపురం రూరల్: మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌళూరు గ్రామ సమీపంలోని మంగళవారం జరిగిన ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. రూరల్ ఎస్ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం గౌరిబిదనూరు రూరల్ తాలూకాలోని నడువలహళ్లి చెందిన నరసిహమూర్తి(28), కుందేనహళ్లికి చెందిన రాజు (35) చౌళూరుకు ద్విచక్రవాహనంలో వచ్చారు. తిరుగు ప్రయాణంలో చౌళూరు గ్రామ సమీపంలో చెరువు కట్ట మీద ఆగి ఉన్న నీటి ట్యాంకర్‌ను ద్విచక్రవానం ఢీ కొంది ప్రమాదంలో నరసింహప్పకు తలకు తీవ్రంగా గాయాలు కాగా రాజుకి స్వల్పగాయాలయ్యయి. గ్రామస్తులు వారిని 108 సహాయంతో హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నరసింహప్ప పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగుళూరుకు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమ«ధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.