కారుబోల్తా పడి మహిళ.. | woman dies of car rolls | Sakshi
Sakshi News home page

కారుబోల్తా పడి మహిళ..

Published Fri, Sep 22 2017 10:44 PM | Last Updated on Fri, Sep 22 2017 11:13 PM

woman dies of car rolls

గోరంట్ల(సోమందేపల్లి): గోరంట్ల మండలం మిషన్‌ తండా వద్ద జాతీయ రహదారిపై కారుబోల్తాపడి చెన్నైకు చెందిన సావ్రితమ్మ(56) మృతిచెందింది. మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాల మేరకు... సావిత్రమ్మ కుమార్తె పద్మశ్రీ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కుమార్తెను చూడటానికి ఈమె కొద్దిరోజుల క్రితం చెన్నైనుంచి హైదరాబాద్‌కు వెళ్లింది.

దసరా సెలవులు కావడంతో కూతురు పద్మశ్రీ, అల్లుడు సూర్యప్రకాష్‌లను పిలుచుకుని సావిత్రమ్మ ఓ కారులో శుక్రవారం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు మీదుగా చెన్నై బయల్దేరింది. మిషన్‌ తండా వద్దకు రాగానే టైరు పంక్చర్‌ కావడంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో సావిత్రమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కూతురు, అల్లుడు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement