కూలిన ప్రహరీ, మృతులు హామియాబేగం, సహన (ఫైల్)
సాక్షి, బెంగళూరు: డెంకణీకోట పట్టణంలోని ఉరుసు జాతరలో ఘోరం సంభవించింది. గోడ కూలడంతో ఓ పాప, మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. పట్టణంలోని యారబ్ దర్గాలో కొన్నిరోజులుగా ఉరుసు జరుగుతోంది. ఇందులో అసోం రాష్ట్రానికి చెందిన వారు అంగళ్లను ఏర్పాటు చేసుకొన్నారు. బుధవారం ఉరుసు ముగింపు సందర్భంగా అంగళ్లను ఖాళీ చేస్తుండగా పాత రాతి గోడ కూలిపోయింది.
రాళ్ల కింద చిక్కి అసోం రాష్ట్రానికి చెందిన హామియాబేగం (35), రబికుల్ ఇస్లాం (22), సాధ్ ఆలీ (35), డెంకణీకోట జైవీధికి చెందిన బాలాజీ కూతురు సహన (11), వెంకటేష్ కూతురు హేమావతి(12)లు చిక్కుకొన్నారు. వెంటనే స్థానికులు వారిని బయటకు తీసి చికిత్స కోసం డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా హామియాబేగం, సహన మృతి చెందారు. మిగతా ముగ్గురికి డెంకణీకోట ప్రభుత్వ ఆస్ఫత్రిలో చికిత్సలందజేస్తున్నారు. ఈ ఘటనపై డెంకణీకోట పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: బెంగళూరులో ఏకధాటిగా వర్షాలు.. 1989 తరువాత ఇదే తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment