మరికొన్ని గంటల్లోనే ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పెళ్లి.. కానీ ఇంతలోనే అతడు శవమై కనిపించాడు.
చెన్నై: మరికొన్ని గంటల్లోనే ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పెళ్లి.. కానీ ఇంతలోనే అతడు శవమై కనిపించాడు. ఈ సంఘటన తమిళనాడులోని సేలంలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడుకు చెందిన రామ్ కుమార్ అనే యువకుడు బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. అయితే మరో మూడు రోజుల్లో వివాహం ఉండగా నిన్న బెంగళూరు నుంచి తమిళనాడులోని తన స్వగ్రామం వడుకపట్టికి బయలుదేరాడు.
ఇంటికి వస్తున్నానని చెప్పిన కుమారుడు ఎంతకు రాకపోవడంతో ఇంజినీర్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్నిగంటల్లోనే పోలీసులు రామ్ కుమార్ జాడను గుర్తించారు. హంకగిరి గ్రామంలో ఓ బావిలో శవమై తేలాడని పోలీసులు వెల్లడించారు. శుక్రవారం అతని పెళ్లి ఉండగా ఈ సమయంలో చనిపోవడంతో ఇది ఆత్మహత్య అని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టనున్నట్లు వివరించారు.