క్వార్టర్స్‌లో రామ్‌కుమార్ జోడి | Ramkumar team reched in quarter finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో రామ్‌కుమార్ జోడి

Published Thu, Jan 2 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM

క్వార్టర్స్‌లో రామ్‌కుమార్ జోడి

క్వార్టర్స్‌లో రామ్‌కుమార్ జోడి

చెన్నై: సింగిల్స్ తొలి రౌండ్‌లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌పై సంచలన విజయం సాధించిన భారత యువతార రామ్‌కుమార్ రామనాథన్ డబుల్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. సహచరుడు శ్రీరామ్ బాలాజీతో కలిసి బరిలోకి దిగిన రామ్‌కుమార్ చెన్నై ఓపెన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్‌లో రామ్‌కుమార్-శ్రీరామ్ బాలాజీ జంట 7-5, 6-3తో స్కాట్ లిప్‌స్కీ-రాజీవ్ రామ్ (అమెరికా) జోడిపై గెలిచింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట ఏడు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి జంట సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు రెండో సీడ్ లియాండర్ పేస్ (భారత్)-ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ) జంట గాయం కారణంగా చివరి నిమిషంలో వైదొలిగింది.
 
 వావ్రింకా ముందంజ
 పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్‌లో వావ్రింకా 6-3, 6-1తో బెంజిమిన్ బెకర్ (జర్మనీ)పై గెలిచాడు. డూడీ సెలా (ఇజ్రాయెల్)తో జరిగిన మరో మ్యాచ్‌లో రెండో సీడ్ యూజ్నీ (రష్యా) 1-3తో వెనుకంజలో ఉన్నపుడు కడుపు నొప్పి కారణంగా వైదొలిగాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement