Sriram Balaji
-
భారత్ 0 స్వీడన్ 2
స్టాక్‌హోమ్: డేవిస్‌కప్ టీమ్ టెన్నిస్ టోర్నీ వరల్డ్ గ్రూప్–1లో భాగంగా స్వీడన్ జట్టుతో శనివారం మొదలైన మ్యాచ్‌లో తొలి రోజు భారత్‌కు నిరాశ ఎదురైంది. ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ భారత క్రీడాకారులకు ఓటమి ఎదురైంది. 2–0తో ఆధిక్యంలోకి వెళ్లిన స్వీడన్ నేడు జరిగే ఒక డబుల్స్ మ్యాచ్, రెండు రివర్స్ సింగిల్స్‌లలో ఒక విజయం సాధిస్తే గెలుపును ఖరారు చేసుకుంటుంది. వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు కూడా అర్హత సాధిస్తుంది. తొలి సింగిల్స్‌లో ‘డబుల్స్ స్పెషలిస్ట్’ శ్రీరామ్ బాలాజీ 4–6, 2–6తో ప్రపంచ 238వ ర్యాంకర్ ఇలియాస్ యెమెర్ చేతిలో ఓడిపోగా... రెండో సింగిల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్ 3–6, 3–6తో లియో బోర్గ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ వెన్నునొప్పితో స్వీడన్‌తో పోరు నుంచి వైదొలిగాడు. దాంతో సుమిత్ స్థానంలో శ్రీరామ్‌ను ఆడించాల్సి వచ్చింది. నేడు జరిగే మూడు మ్యాచ్‌ల్లో భారత్ గెలిస్తేనే వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు అర్హత పొందుతుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి... ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందడం రెండుసార్లు (2010లో బ్రెజిల్‌పై, 2018లో చైనాపై) మాత్రమే జరిగింది. -
రన్నరప్ శ్రీరామ్ బాలాజీ జోడీ
ఈ ఏడాది రెండో ఏటీపీ చాలెంజర్ టూర్ డబుల్స్ టైటిల్‌ను సాధించాలని ఆశించిన భారత అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ శ్రీరామ్ బాలాజీకి నిరాశ ఎదురైంది. డొమినికన్ రిపబ్లిక్లో జరిగిన సాంటో డొమింగో ఓపెన్ టోర్నీలో శ్రీరామ్ బాలాజీ (భారత్)–ఫెర్నాండో రొంబోలి (బ్రెజిల్) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బాలాజీ–రొంబోలి జోడీ 7–6 (7/2), 4–6, 16–18తో హిడాల్గో–వరేలా (మెక్సికో) జంట చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్లో బాలాజీ కాగ్లియారి ఓపెన్‌లో విజేతగా నిలిచి... పెరూగ్లా, బ్రాన్్చవీగ్ టోరీ్నల్లో రన్నరప్‌గా నిలిచాడు. -
నిరాశపరిచిన బోపన్న-బాలాజీ జోడీ.. తొలి రౌండ్లోనే ఔట్
ప్యారిస్ ఒలింపిక్స్-2024 టెన్నిస్‌లో భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ జోడీ మొదటి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. సోమవారం జరిగిన తొలి రౌండ్లో ఫ్రాన్స్‌కు చెందిన గేల్ మోన్ఫిల్స్, ఎడ్వర్డ్ రోజర్-వాసెలిన్ జోడీ చేతిలో 7-5, 6-2 తేడాతో బోపన్న-శ్రీరామ్ జంట ఓటమి పాలైంది.టెన్నిస్ మెన్స్ సింగిల్స్‌లో సుమిత్ నాగల్ తొలి రౌండ్లో నిష్క్రమించడంతో అందరి ఆశలు రోహన్ బోపన్న, శ్రీరామ్‌లపై ఉండేవి. ఇప్పుడు వీరిద్దరూ కూడా వరుస సెట్లలో ఓడిపోయి నిరాశపరిచారు. తొలి సెట్లో ఫ్రెంచ్ జోడీకి బోపన్న, బాలాజీ గట్టిపోటీని అందించగా.. రెండో సెట్ లో భారత జోడీ ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. -
Wimbledon: బాంబ్రీ జోడీ ముందంజ.. తొలి రౌండ్లో ఘన విజయం
వింబుల్డన్ టోర్నీ-2024లో భారత టెన్నిస్ స్టార్ యుకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. మెన్స్ డబుల్స్‌లో బాంబ్రీ, అల్బనే ఒలివెట్టి జోడీ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన తొలి రౌండ్లో డెన్మార్క్ జంట అలెగ్జాండర్ బుబ్లిక్ అలెగ్జాండర్ షెవ్చెంకోలను 6-4, 6-4 వరుస సెట్లలో బాంబ్రీ, ఒలివెట్టి జోడీ జోడించింది.‘బర్త్ డే బాయ్’ బాంబ్రీ గ్రాస్ కోర్టులో సంచలన ప్రదర్శన చేశాడు. అద్భుతమైన షాట్లతో బాంబ్రీ ప్రత్యర్ధులను ఉక్కిరి బిక్కిరి చేశాడు. భంబ్రీ, ఒలివెట్టి తమ రెండో రౌండీలో జర్మన్ జోడీ కెవిన్ క్రావిట్జ్ టిమ్ పుయెట్జ్‌తో తలపడనున్నారు.మరో భారత టెన్నిస్ ఆటగాడు ఎన్ శ్రీరామ్ బాలాజీ తొలి రౌండ్లోనే ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. శ్రీరామ్ బాలాజీ, ల్యూక్ జాన్సన్ జోడీ.. డబుల్స్ మొదటి రౌండ్లో నాల్గవ సీడ్ మార్సెలో అరెవాలో , మేట్ పావిక్ చేతిలో 4-6, 5-7 తేడాతో ఓటమి పాలయ్యారు. -
విష్ణు–బాలాజీ జంట ఓటమి
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ– 250 టెన్నిస్ టోర్నీ డబుల్స్ విభాగంలో విష్ణు వర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో విష్ణు–బాలాజీ ద్వయం 2–6, 4–6తో టాప్ సీడ్ ల్యూక్ స్మిత్–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడింది. 61 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తమ సర్వీస్‌ను మూడు సార్లు కోల్పోయింది. నేడు సాదియో –ఫాబియన్ (ఫ్రాన్స్); రోహన్ బోపన్న–రామ్ కుమార్ (భారత్) జోడీల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో రేపు జరిగే ఫైనల్లో ల్యూక్–జాన్ ప్యాట్రిక్ జంట ఆడుతుంది. సుహానా సైనీకి కాంస్యం ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) యూత్ కంటెండర్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణి సుహానా సైనీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ట్యూనిషియా రాజధాని ట్యూనిస్లో శుక్రవారం జరిగిన అండర్–19 బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో సుహానా 11–9, 9–11, 10–12, 11–13తో ప్రపంచ నంబర్‌వన్ ఎలీనా జహారియా (రొమేనియా) చేతిలో ఓడింది. -
బాలాజీ జంటకు టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ డబుల్స్ ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ కెరీర్లో ఆరో ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్‌ను సాధించాడు. చైనీస్ తైపీలో ఆదివారం ముగిసిన సాంతైజి ఓపెన్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–జొనాథన్ ఎల్రిచ్ (ఇజ్రాయెల్) ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో బాలాజీ–ఎల్రిచ్ జోడీ 6–3, 6–2తో సాండెర్ ఆరెండ్స్ (నెదర్లాండ్స్)–వీస్‌బార్న్ (ఆస్ట్రియా) జంటపై విజయం సాధించింది. టైటిల్ నెగ్గిన బాలాజీ జోడీకి 9,300 డాలర్ల (రూ. 6 లక్షల 43 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 125 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ విజయంతో బాలాజీ ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్–100లోకి వచ్చే అవకాశముంది. -
ఒక్క గెలుపు లేకుండానే...
క్రాల్‌జివో (సెర్బియా): డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భారత్ పరాజయం పరిపూర్ణమైంది. రివర్స్ సింగిల్స్‌లోనూ ఓటమే ఎదురవడంతో భారత్ 0–4తో ఆతిథ్య సెర్బియా చేతిలో ఓడిపోయింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ 3–6, 1–6తో వరుస సెట్లలో పెజ క్రిస్టిన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. శనివారమే పరాజయం ఖాయం కావడంతో రివర్స్ సింగిల్స్ పోటీలు నామమాత్రమయ్యాయి. ఇరు జట్ల సమ్మతితో మరో నామమాత్రమైన ఐదో సింగిల్స్ మ్యాచ్‌ను నిర్వహించలేదు. కొత్త డేవిస్ కప్ నిబంధనల ప్రకారం ఇప్పటికిప్పుడు భారత్ ఆసియా ఓసియానియా గ్రూప్ దశకు పడిపోయే అవకాశం లేదు. అయితే 24 జట్లు ఇంటా, బయటా ఆడే క్వాలిఫయింగ్ టోర్నీలో తలపడాల్సి ఉంటుంది. వచ్చే ఫిబ్రవరిలో ఈ పోటీలు ప్రారంభమవుతాయి. -
మెయిన్ ‘డ్రా’కు విష్ణు–బాలాజీ జంట
లండన్: కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆడేందుకు హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్, చెన్నైకు చెందిన శ్రీరామ్ బాలాజీ సిద్ధమయ్యారు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం పురుషుల డబుల్స్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన డబుల్స్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్ మ్యాచ్‌లో విష్ణు–బాలాజీ జోడీ 6–3, 6–4తో టాప్ సీడ్ డెనిస్ మొల్చనోవ్ (ఉక్రెయిన్)–ఇగోర్ జెలెనె (స్లొవేనియా) జంటపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో జీవన్ నెడున్‌చెజియాన్ (భారత్)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జోడీ 7–6 (7/5), 6–3తో ఎడ్వర్డ్ కోరి–లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్) జంటను ఓడించి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందింది. మరోవైపు మహిళల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనాకు నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో అంకిత 2–6, 7–5, 4–6తో వితాలియా దియాత్‌చెంకో (రష్యా) చేతిలో పోరాడి ఓడింది. వింబుల్డన్ ప్రధాన టోర్నమెంట్ జూలై 2న ప్రారంభమవుతుంది. -
ప్రపంచ గ్రూప్ ప్లేఆఫ్‌కు భారత్
► డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న–బాలాజీ జంట విజయం ► ఉజ్బెకిస్తాన్‌పై భారత్‌కు 3–0 ఆధిక్యం బెంగళూరు: అనుభవజ్ఞుడైన రోహన్ బోపన్న... అరంగేట్రం చేసిన శ్రీరామ్ బాలాజీ జోడీ కుదిరింది. వీరిద్దరూ ఆద్యంతం సమన్వయంతో రాణించి అదరగొట్టారు. ఫలితంగా ఉజ్బెకిస్తాన్‌తో జరుగుతున్న డేవిస్ కప్ టెన్నిస్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 రెండో రౌండ్ పోటీలో భారత్ 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. తద్వారా వరుసగా నాలుగో ఏడాది ప్రపంచకప్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత సాధిం చింది. ఈ ఏడాది సెప్టెంబరులో వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ జరుగుతుంది. శనివారం ఏకపక్షంగా జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న–బాలాజీ ద్వయం 6–2, 6–4, 6–1తో దస్తోవ్–ఫెజీవ్ జంటపై గెలిచింది. తమ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన డబుల్స్ మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌కు నిరాశే ఎదురైంది. మ్యాచ్‌లో ఏ దశలోనూ భారత జంటకు పోటీ ఎదురుకాలేదు. తన కెరీర్లో తొలి డేవిస్ కప్ మ్యాచ్ ఆడిన బాలాజీ సర్వీస్ అద్భుతంగా చేయడంతోపాటు నెట్ వద్ద అప్రమత్తంగా ఉన్నాడు. మరో వైపు అపార అనుభవజ్ఞుడైన బోపన్న శక్తివంతమైన సర్వీస్‌లు చేయడంతోపాటు సింగిల్ హ్యాండెడ్ రిటర్న్ షాట్లతో అలరించాడు. మ్యాచ్ మొత్తంలో భారత జంట 16 ఏస్‌లు సంధించడం విశేషం. ఆదివారం రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. -
విష్ణు జంటకు డబుల్స్ టైటిల్
చండీగఢ్: హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్-1 టోర్నమెంట్లో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో విష్ణువర్ధన్-శ్రీరామ్ బాలాజీ (భారత్) ద్వయం 6-1, 6-4తో యుచి ఇటో-షో కటయామ (జపాన్) జోడీపై విజయం సాధించింది. విష్ణు కెరీర్లో ఇది 25వ ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. మరోవైపు సింగిల్స్ విభాగంలోనూ విష్ణువర్ధన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీస్‌లో విష్ణు 6-1, 7-6 (7/5)తో షో కటయామ (జపాన్)పై గెలిచాడు. -
టెన్నిస్ లో మరో యువ కెరటం
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ చరిత్రలో మరో యువ కెరటం వచ్చి చేరింది. ఫెనెస్టా ఓపెన్ లో భాగంగా ఇక్కడ ఆర్కే ఖన్నా స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఎన్ శ్రీరామ్ బాలాజీ సరికొత్త జాతీయ చాంపియన్ గా అవతరించాడు. టాప్ సీడ్ గా బరిలోకి దిగిన బాలాజీ తుది పోరులో సెకెండ్ సీడ్ విష్ణు వర్ధన్ ను బోల్తా కొట్టించాడు. హోరాహోరీగా సాగిన పోరులో బాలాజీ 7-5, 6-3 తేడాతో విష్ణు వర్ధన్ పై గెలిచాడు. దీంతో 2016 లో జరిగే ఢిల్లీ ఓపెన్ లో బాలాజీకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. గత ఆరు సంవత్సరాల నుంచి జాతీయస్థాయిలో ఆడుతున్న బాలాజీ చాంపియన్ గా నిలవాలన్న కలను ఎట్టకేలకు సాకారం చేసుకున్నాడు. ఇప్పటికే తన సహచరుడు వీఎమ్ రంజిత్ తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్ ను సాధించిన బాలాజీ.. సింగిల్స్ లో కూడా తన సత్తాను నిరూపించుకున్నాడు. ఇదిలా ఉండగా మహిళల సింగిల్స్ టైటిల్ ను డిఫెండింగ్ చాంపియన్ పెర్నా బాంబ్రీ నిలబెట్టుకుంది. తుది సమరంలో సమితా సాయి చమర్తిని కంగుతినిపించి టైటిల్ ను కాపాడుకుంది. -
క్వార్టర్స్‌లో రామ్‌కుమార్ జోడి
చెన్నై: సింగిల్స్ తొలి రౌండ్లో సోమ్‌దేవ్ దేవ్వర్మన్పై సంచలన విజయం సాధించిన భారత యువతార రామ్‌కుమార్ రామనాథన్ డబుల్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. సహచరుడు శ్రీరామ్ బాలాజీతో కలిసి బరిలోకి దిగిన రామ్‌కుమార్ చెన్నై ఓపెన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో రామ్‌కుమార్-శ్రీరామ్ బాలాజీ జంట 7-5, 6-3తో స్కాట్ లిప్స్కీ-రాజీవ్ రామ్ (అమెరికా) జోడిపై గెలిచింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట ఏడు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి జంట సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు రెండో సీడ్ లియాండర్ పేస్ (భారత్)-ఫాబియో ఫాగ్నిని (ఇటలీ) జంట గాయం కారణంగా చివరి నిమిషంలో వైదొలిగింది. వావ్రింకా ముందంజ పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో వావ్రింకా 6-3, 6-1తో బెంజిమిన్ బెకర్ (జర్మనీ)పై గెలిచాడు. డూడీ సెలా (ఇజ్రాయెల్)తో జరిగిన మరో మ్యాచ్‌లో రెండో సీడ్ యూజ్నీ (రష్యా) 1-3తో వెనుకంజలో ఉన్నపుడు కడుపు నొప్పి కారణంగా వైదొలిగాడు. -
పోరాడి ఓడిన విష్ణు
న్యూఢిల్లీ: తొలి మూడు మ్యాచ్‌ల్లో అలవోక విజయాలు సాధించి జోరు మీదున్న విష్ణువర్ధన్‌కు సెమీఫైనల్లో బ్రేక్ పడింది. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడి పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో విష్ణు 7-5, 3-6, 6-7 (4/7)తో శ్రీరామ్ బాలాజీ (భారత్) చేతిలో ఓటమి చవిచూశాడు. 3 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో విష్ణు కీలకదశలో తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. అవకాశం దొరికినపుడల్లా బాలాజీ నెట్‌వద్దకు దూసుకొచ్చి పాయింట్లు సాధించాడు. భారీ సర్వీస్‌లకు పెట్టింది పేరైన విష్ణు బ్యాక్‌హ్యాండ్ షాట్లు, బేస్‌లైన్ ఆటతో బాలాజీని నియంత్రించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మరో సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్) 6-3, 6-1తో వీటోస్కా (జర్మనీ)పై గెలిచి శనివారం జరిగే ఫైనల్లో బాలాజీతో అమీతుమీకి సిద్ధమయ్యాడు. డబుల్స్ విభాగంలో ఏపీ ఆట గాడు అశ్విన్ విజయరాఘవన్ రన్నరప్‌గా నిలి చాడు. ఫైనల్లో అశ్విన్-రామ్‌కుమార్ (భారత్) జంట 6-7 (3/7), 3-6తో శ్రీరామ్ బాలాజీ- రంజిత్ (భారత్) జోడి చేతిలో ఓడిపోయింది.